సుప్రసిద్ద తమిళ రచయిత్రి శివశంకరి నవల’ముక్కనాం కయిరు’- రామానుజరావు తెలుగు అనువాదం.

ప్రఖ్యాత తమిళ రచయిత్రి శివశంకరి 2002 వ సంవత్సరంలో రాసిన ” ముక్కనాం కయిరు ” నవలను “బిట్రేయిల్ అండ్ అదర్ స్టోరీస్” గా అమీత అగ్నిహోత్రి, మరియు గీతా రాధాకృష్ణలు ఆంగ్లంలోకి అనువదించగా , ఇప్పుడు టి.వి.యస్ రామానుజరావు విహంగ పాఠకులకోసం తెలుగులోకి తర్జుమా చేస్తున్నారు. ఇది ముకుతాడు పేరిట ధారావాహికంగా రాబోతున్నది. అనువాదకుడు రామానుజరావు ప్రాధమికంగా మంచి అభిరుచి వున్న పాఠకుడు .. సరదాకొద్దీ చాలా ఏళ్లక్రితం “అన్వేషణ” కవితా సంపుటి వేసినా, అప్పుడప్పుడు విపుల, ఆంధభూమి పత్రికలకు కధలు రాసినా గాని, అనువాదమే ఇష్టమయిన ప్రక్రియ.. వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. . పియర్సన్ ఎడ్యుకేషన్ ఇండియా తో రెండేళ్ళ క్రితం చేసుకున్న అనువాదిత ఒప్పందం ( ట్రాన్స్ లేషన్ ప్రాజెక్టు ) లో భాగంగా వీరు తర్జుమాచేసిన రూల్స్ ఆఫ్ లవ్, రూల్స్ ఆఫ్ లైఫ్, రూల్స్ ఆఫ్ మేనేజ్ మెంట్, రూల్స్ ఆఫ్ పేరెంటింగ్ లాంటివి ద్వితీయ ముద్రణతో మార్కెట్ లో వున్నాయి.
అవి ఇచ్చిన స్పూర్తి తోనే ఇప్పుడీ నవల అనువాదం విహంగ పాఠకుల ముందుకు తెస్తున్నారు.

        ముకుతాడు

సాహిత్యానికి ఎల్లలు లేవు. అది ఒక మహా నది. ఆ నదిని ఎవరి  గట్టు మీంచి వారు నాలుగు దోసిళ్ళు అందుకుని దప్పిక తీర్చుకొగలుగుతారు అంతే. గట్టుకొక ప్రవాహ వేగం, ఒరవడి కూడా వుండచ్చు. ఇతర భాషా సాహిత్యాన్ని తర్జుమాచేసి అందించిన తెలుగు రచయిత్రులు మనకు అనేక మంది వున్నారు. ఒక కధ తన మాతృక నుంచి ఆంగ్లంలోకి, తిరిగి  అటునుంచి మరొక దక్షణాది/ఉత్తరాది  భాషల్లోకి మారేసరికి ఎన్ని మార్పులకి గురవుతుందో మనకి తెలుసు. అది చిన్న పరిమితి మాత్రమే. పరిమితిని మినహాయించి కూడా సాహిత్యాన్ని చదవాల్సిన అవసరం వుంది.
ప్రఖ్యాత తమిళ రచయిత్రి శివశంకరి 2002 వ సంవత్సరంలో రాసిన ” ముక్కనాం కయిరు ”  నవలను  “బిట్రేయిల్ అండ్ అదర్ స్టోరీస్” గా  అమీత అగ్నిహోత్రి, మరియు గీతా రాధాకృష్ణలు ఆంగ్లంలోకి అనువదించగా , ఇప్పుడు టి.వి.యస్ రామానుజరావు  విహంగ పాఠకులకోసం తెలుగులోకి తర్జుమా చేస్తున్నారు. ఇది ముకుతాడు పేరిట ధారావాహికంగా రాబోతున్నది. అనువాదకుడు రామానుజరావు ప్రాధమికంగా మంచి అభిరుచి వున్న పాఠకుడు .. సరదాకొద్దీ చాలా ఏళ్లక్రితం “అన్వేషణ” కవితా సంపుటి వేసినా, అప్పుడప్పుడు విపుల, ఆంధభూమి పత్రికలకుకధలు రాసినా గాని, అనువాదమే ఇష్టమయిన ప్రక్రియ.. వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. . పియర్సన్ ఎడ్యుకేషన్ ఇండియా తో రెండేళ్ళ క్రితం చేసుకున్న అనువాదిత ఒప్పందం ( ట్రాన్స్ లేషన్ ప్రాజెక్టు ) లో భాగంగా వీరు తర్జుమాచేసిన రూల్స్ ఆఫ్ లవ్, రూల్స్ ఆఫ్ లైఫ్, రూల్స్ ఆఫ్ మేనేజ్ మెంట్, రూల్స్ ఆఫ్ పేరెంటింగ్ లాంటివి ద్వితీయ ముద్రణతో  మార్కెట్ లో వున్నాయి.
అవి ఇచ్చిన స్పూర్తి తోనే  ఇప్పుడీ నవల  అనువాదం విహంగ పాఠకుల ముందుకు తెస్తున్నారు.బిట్రేయల్ అనువదించడానికి ఒక ప్రధాన కారణం వుంది. మౌన పోరాటాలద్వారా ప్రేమించిన / పెళ్ళాడిన  మగవాడి ఇంటి ముందు బైఠాయించి ఒకసారి జరిగిన మోసానికి, మొత్తం జీవితాన్ని పణంగా పెట్టే ( అ )న్యాయం సాధించుకునే యువతులకు భిన్నంగా  ఈ నవల్లో కధానాయిక ఒక నిర్ణయం తీసుకుంటుంది. చెయ్యత్తకుండానే  చెంపదెబ్బకొట్టినట్టనిపించే ఈ ముగింపు మీద, నవల వచ్చిన కొత్తలో చాలా చర్చ కూడా జరిగింది. . కాబట్టి బిట్రేయల్ అనే పేరుని తెలుగులోకి అనువదించి “ద్రోహం” అనే శీర్షిక వుంచడం  కంటే “ముకుతాడు” అని తమిళ మాతృక  అర్ధమే సందర్భోచితంగా  వుంటుందనిపించింది.
శివ శంకరి గురించి పరిచయం చేసే సాహసం నేను తీసుకోను. ఆమె భారత దేశం గర్వించతగ్గ రచయిత్రి.ఆమె గురించి రాయడం అంటేనే అదొక పెద్ద నవల అవుతుంది

ముఫ్ఫైకి పైగా నవలలు,నలభైకి పైగా చిన్న కధలు,నవలికలు, పదమూడు ప్రయాణానుభావాలు,రెండు ఆత్మ కధలు ఆమె అమ్ముల పొదిలోంచి తీసిన బాణాలు. మాదక ద్రవ్యాల వాడకంపై ఆమె రాసిన “అవన్” నవల అనేక భారతీయ భాషలలతో పాటు, ఆంగ్ల, ఉక్రెయిన్ భాషల్లోకి తర్జుమా అయింది.. తాగుడు, మాదక ద్రవ్యాలు లాంటి దురలవాట్లపైన, వృద్దాప్యం లాంటి సామాజిక సమస్యల పైన ఆమె రాసిన అనేక కధలు జాతీయ, ప్రాంతీయ దృశ్య మాధ్యమాల్లో ధారావాహికంగా ప్రసారమయ్యాయి..
భాషాంతరాలు దాటిన ఆమె సృజన “అమ్మ సొన్నకథైగల్ _ (tales my mother told me) చిన్న పిల్లల కోసం   స్వయంగా రచించి స్వర పరచిన సిడిలు అందరినీ అలరిస్తున్నాయి. .  అంతర్జాతీయ స్త్రీల సమాఖ్య (International Women’s Association) నుంచి ” వుమన్ ఆఫ్ ది ఇయర్ 2000 అవార్డు అందుకున్నారు.
ఆగస్టు 2000 సంవత్సరం లో బై సెంటినియేల్ సెలబ్రేషన్ ఆఫ్ లైబ్రరీ సందర్భంగా యు ఎస్ లైబ్రరీ కాంగ్రెస్ ఆర్చివ్స్ కోసం పుస్తకాలను స్వంత గొంతుతో రికార్డు చేసిన నలుగురు రచయితలలో శివ శంకరి ఒకరు. రాష్ట్రీయ హిందీ అకాడమీ, కలకత్తా నుండి ” ప్రేమ చంద్ రాష్ట్రీయ సాహిత్య సమ్మాన్ “గౌరవాన్ని అందుకున్నారు.

శివ శంకరి గొప్ప సామాజిక కార్యకర్త. . చెన్నయ్ లోని వి.హెచ్.ఎస్ ఆస్పత్రిలో “రాజాజీ సెంటర్ ఫర్ డి అడిక్షన్ ” స్థాపించడం లో ఆమె పాత్ర కూడా వుంది. అగ్ని (అవేకేండ్ గ్రూప్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్) అనే సంస్థను స్థాపించి , సాహిత్యం ద్వారా సమాజంలో , యవతలో, స్త్రీలలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. అంతే కాదు, నిట్ ఇండియా త్రూ లిటరేచర్ “అనే ప్రాజెక్ట్ చేపట్టి  18 భారతీయ భాషల్లో ప్రసిద్ది చెందిన రచయితలను,వారి సంస్కృతిని పరిచయం చేస్తున్నారు.

అడిగిన వెంటనే ఆమె తన నవలికను అనువదించడానికి అంగీకరించడం విహంగ పాఠకులకు  దొరికిన ఒక మంచి అవకాశం.

వచ్చే సంచిక నుంచి ప్రారంభమయ్యే ‘ముకుతాడు ‘ని చదివి మీ అభిప్రాయాలు తెలియజేయండి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ధారావాహికలు, Permalink

One Response to సుప్రసిద్ద తమిళ రచయిత్రి శివశంకరి నవల’ముక్కనాం కయిరు’- రామానుజరావు తెలుగు అనువాదం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో