ఆడదేఆధారం

 

“నాన్నగారండీ! మరండీ పరీక్ష ఫీజ్ కట్టను ఈరోజే చివరిరోజండీ ! ” భయం భయంగా ఒక మూలను నిలబడి అడిగింది వాణి, ఆమె ఏడోక్లాస్ చదువుతోంది  .

” నాన్నగారండీ ! నాకు పెన్ లేక పెన్సిల్ తో రాస్తున్నాననిఎండలోనిల్చోబెడుతున్నారుటీచరమ్మలు. కళ్ళుతిరుగుతున్నాయండీ! రేపట్నుండీ పరీక్షలు !  పెన్ కొంటారాండీ! ?” ప్రమద మాటలు, అవీ భయంగానే  ఒణుకుతున్న గొంతుకతో, అది ఐదోక్లాస్ .

” మరేమోనాన్నారండీ ! నాకు చెప్పుల్లేక కాళ్ళుకాలుతున్నాయండీ ! ఎండలో నడవటం కష్టంగా ఉందండీ!అమ్మేమో నాన్నారొచ్చాక అడుగు ఇట్టే కొనిపెట్టేస్తారనిచెప్పిందండీ!” అనితనమొరాలకించని   దేవునికి చెప్పుకున్నట్లు వినిపించుకోని తండ్రికి చెప్పుకుంది చిన్మై.అది చిన్నది కావడంతోభయపడ్డం  ఇంకా చేతకాలేదు.అదీ మూడోక్లాస్ . ముగ్గురూ చదువుల సరస్వతులు,  వాళ్ళక్లాసుల్లో ఎప్పుడు పరీక్షలు పెట్టినా వారికే ఫస్ట్ మార్క్ ! .

         అన్నీవింటున్నవాళ్ళనాన్నగారనబడే నాగరాజు తాగుతున్నసిగరెట్ నేలకేసి కొట్టి “వెధవసంత!  వెధవ సంతని! ఇంటికొస్తేచాలు,కోర్కెలపుట్టలు ! తిండితిన్నివ్వరు,కాఫీతాగనివ్వరు ! అవికొంటారా!ఇవి కొంటారా!అని వెధవగోల,ఆడముం..లు,వీళ్ళకు చదువు లెందుకు, అంట్లుతోమటంనేర్చుకుంటేచాలని

చెప్తే విని చావదు గా తల్లిముం..! ఉద్యోగాలుచేయాలా! ఊళ్ళేలాలా? ఈదిక్కుమాలిన ఆడసంత నంతా మేపనే నావల్లకాదంటే పైగా చదువులొకటా ! తలకొరివిపెట్టి,తద్దినాలు పెట్టనుకూడా పనికిరాని వెధవ సంత !” అంటూ పైకి లేచాడు.

దూరంగా ఒకమూలఒదిగినిల్చునున్నపిల్లల్నీ,మరోమూల ఇంకా ఒదిగొ దిగినిల్చు నున్న వాళ్లతల్లి, అదే సదరు నాగరాజు భార్యామణి! సావిత్రి, నిండుగర్భిణి! సతీసావిత్రంత గొప్పది ! అతగాడి లెక్కలో ఎందుకూ పనికిరాని ఇంటిఅంట్లముం…!వారందర్నీచూస్తూ మొలకున్న తోలుబెల్టు తీశాడు.

పిల్లలుముగ్గురూ..’ఓమ్మని’..అరుస్తూ చేతుల్చేతులుపట్టుకుని బయటికి పరుగెత్తారు,ఆదెబ్బలరుచి తెల్సివున్నవారికి, తండ్రి బెల్ట్ తీయగానే ఏంజరుగుతుందో తెల్సుగనుక, ఒక్క క్షణం అక్కడ ఆగలేదు. బయట పడలేని ‘సావిత్రి’ వళ్లప్పగించి నిల్చుండి పోయింది. ఓపికున్నదాకా ’ నిండుగర్భిణి’ అనికూడా

చూడక బెల్టుతో ఆమె వంటిమీద వాయించి, అలసిపోయి బెల్ట్ క్రింద పడేసి పెరట్లో కెళ్ళాడు. మరోపావు గంటలో ప్యాంటూ షర్టూ వేసుకుని తయారై బయటి కెళ్ళిపోయాడు ఆమగమహారాజు.

భార్యమూడు మార్లూ ఆడపిల్లల్నేకనిందని కోపం ,అతగాడికీ ,అతడిఅమ్మానాన్నలకూనూ! ఈమారు గర్భంలోఉన్నది ఎవరో తెలీక,తెల్సుకోలేక ఆడపిల్లే ఐఉంటుందనే కసితో ఉడికి పోతున్నాడు   ఏంచేస్తుంది సావిత్రిపాపం! నిజంగానే సావిత్రి!   ,భర్తప్రాణాలు యముడి నుండీ తేలేదు కానీ ..తన ప్రాణాలు మొగుడైన యములోడికప్పగిస్తుంటుంది, పాపం ఆడదికదా!

కొంత దూరంలో రోడ్డుపక్కనున్నపార్కులోని గుబుర్ల చాటున దాక్కునున్నముగ్గురుపిల్లలూ, తండ్రి నాగరాజు బయటి కెళ్ళటం గమనించి బయటి కొచ్చిపరుగు పరుగున ఇంట్లోకిదూకారు..శరీరమంతా రక్తం ఓడుతూ స్పృహ లేకుండా క్రిందపడి ఉన్నతల్లి సావిత్రిని చూసి ముగ్గురూ పెద్దగా ఏడ్వసాగారు. అందర్లోకీ కాస్త పెద్దదైన,వాణి ఏడ్పుఆపి”అమ్మా!అమ్మా!” అంటూఆమెను కుదిపి కుదిపి పిలిచింది . ఆమెలోచలనం లేదు. వెంటనే బయటికి పరుగెత్తింది .తమ స్కూకు కెళ్ళి క్లాస్ టీచర్ గారితోటీవిషయం చెప్పి ఆమె సాయంతో తల్లిని ఒకఆటోలోతెచ్చిపక్కనే ఉన్నస్కూల్ సంస్థ ఆస్పత్రిలో  చేర్పించింది.

          ” టీచర్ ! మాఅమ్మకేమైంది?” ఏడుస్తూ అడుగుతున్నపిల్లల్నిచూసి,”భయమేంలేదమ్మా! నేను డాక్టర్తో  మాట్లాడాను.  కాస్త  సేపయ్యాక  స్పృహ  రావచ్చు, మీరిద్దరూ క్లాసుల కెళ్ళండి ,అక్క నేను ఇక్కడుంటాం ” అని చిన్నపిల్లలిద్దర్నీ క్లాసులకు పంపింది టీచర్ సుధ.

 ఆసాయంకాలానికి సావిత్రి కి ‘సి సెక్షన్ ‘చేసి డెలివరీ చేశారు.అర్ధరాత్రికి స్పృహవచ్చినసావిత్రి నాల్గో మారూ ఆడపిల్లే పుట్టిందని చెప్పడంతో , ఆమె కంటికీ మంటికీ ఏకధారగా ఏడ్వసాగింది.

“అమ్మా!సావిత్రీ! పచ్చివళ్ళుతో ఏడ్వకూడదు, పండంటి బిడ్డ ! బంగారు తల్లిలాఉంది ! ఎందు కేడుస్తావ్?” అని అడిగిన డాక్టర్తో , ” డాక్టర్ ! మానాన్న ‘ఈ మారూ ఆడపిల్లపుడితే మీ ఐదుగుర్నీ పెట్రోల్పోసి కాల్చేస్తాను, లేదా విషం పెట్టిచంపు తాను , కత్తితో నరికేస్తాను. ఆడపిల్ల పుడితే ఇంటికి రాకు’ అనిచెప్పాడండీ! ఇది తెలిస్తే మాఅందర్నీ చంపేస్తాడు, అప్పుడే మాఅమ్మను బెల్టుతో తెగ కొట్టాడు. మమ్మల్నిమీరేకాపాడండి మానాన్ననుండీ, నేను చదువు మానేసి ఏదైనాపనిచేస్తాను టీచర్! ” అని వాణి కూడా ఏడ్వసాగింది.

 ఆస్కూల్ ఒక సేవాసంస్థ అధ్వర్యంలో నడుస్తున్నది, ఆసంస్థ పేదలకు ఉచితంగా వైద్య సేవలూ అంది స్తుంది.ఆసంస్థ ఇంచార్జ్ స్కూల్ టీచర్ల ద్వారా విషయంతెల్సు కుని, తల్లీ పిల్లల్ను దూరంగా మరో పట్టణం లోని తమ సంస్థ స్కూల్ కు పంపారు, బి.ఏ.చదివిన సావిత్రికి అక్కడి హాస్టల్ ఇంచార్జి పని అప్పగించారు.

      **                 **             **          **              **                 **           **             **         **

“డాక్టర్ ఎవరో స్పృహలేకుండా వీధిలోపడిఉంటే మన వాచ్మెన్ తెచ్చివరండాలో పడుకోబెట్టాడు,మీరు పర్మిషన్ ఇస్తేవార్డులోకి తెస్తాం “అనిచెప్పిన నర్స్ నళిని మాటలకు , పన్నెండేళ్ళక్రితపుతనబాల్యానికి  వెళ్ళిన ఆలోచనల్లోంచీ ప్రస్తుతానికి వచ్చింది , డా.వాణి.”సరే!లోపలికితెండి నే వచ్చిచూస్తాను.” అని చెప్పి మరోపదినిముషాల్లోవార్డులోకి వెళ్ళింది.

ఆపేషెంట్నుచూడగానేఆమెఆశ్చర్యంతోనిశ్చేష్టురాలైంది. అతడ్ని పరీక్షించి, అవసరమైన ముందు లిచ్చింది.

“నర్స్! . .సెలైన్ బాటిల్ పెట్టండి. ఇతడి పరిస్థితి అంత బాగా లేదు, ఒకరిక్కడే ఉండి స్పృహ రాగానే నాకు చెప్పండి,నేనురౌండ్స్ కెళ్ళివస్తాను.” అని బయటికి వచ్చిందే కానీ వాణిమనస్సుమనస్సులో లేదు.  ఆసాయంకాలానికి స్పృహవచ్చి,ఆపేషెంట్ ” నేనెక్కడున్నాను?” అనిఅడిగాడు.

నర్స్ డా.వాణికి కబురంపింది. వాణి ” అమ్మా! నాతోరా! హాస్పెటల్ దాకా “అనితల్లిని పిలిచింది డా.వాణి.

 సావిత్రమ్మ ” నాకు హాస్టల్ లో పనుందమ్మా! ఐనా ఏనాడూ లేనిది ఏమిటిలాపిలుస్తున్నావ్?!” ఆశ్చర్యంగా అడిగింది .

” ఏంలేదు ఓమారు నాతోరా , పది నిముషాల్లో నీవు వెళ్ళవచ్చు.” అనితల్లిని వెంటబెట్టుకుని వార్డులో కి వచ్చింది,డా.వాణి.అక్కడి పేషెంట్ను చూడగానే సావిత్రి విస్తుబోయింది. ఆమెను చూసిన ఆపేషెంటు కూడా  ” సావిత్రీ! నీవు బ్రతికే ఉన్నావా!పిల్లలేరీ ?” అని అడిగాడు.

సావిత్రి రోషంగా ” అంతా చచ్చిపోయాం ” అని వెనుదిరగబోగా , డా. వాణి ఆమెచేయి పట్టి ఆపింది.

“ మీకింకా భార్యపిల్లలూ గుర్తున్నారా! ఆనాడు నిండుగర్భిణి నైననన్ను వళ్ళు చిట్లేలా కొట్టి,‘ఈమారు  ఆడపిల్లపుడితే అందర్నీ పెట్రోలు పోసి కాల్చేస్తామనారుగా ! ’ ఆనాడే అంతా చచ్చి పోయాం.” అంది ఉద్రేకంగా .

” సావిత్రీ ! మన్నించు . నా మూర్ఖత్వం నన్నేమింగేసింది. నా తాగుడునా ఆరోగ్యాన్ని మింగేసింది. ఉద్యోగం ఊడింది. అంత కాలం నన్ను ఎగేసిన అమ్మానాన్నలు ,అన్నదమ్ములూ అండగా నిలుస్తా రనుకున్నాను, ఇంటి నుండీ తరిమేశారు. ఊర్లు పట్టుకు తిరుగుతూ , అడుక్కు తింటున్నాను. ఇప్పుడెవరో ఈహాస్పెటల్ కు తేగా,ఈ దేవత నాప్రాణాలు కాచింది.అమ్మా! డాక్టర్ గారూ నేను  మీ జాలికి తగను, దుర్మార్గుడ్ని,కసాయివాడ్ని”   అంటూ ఏడుస్తున్నఅతడ్నిచూసి సావిత్రి మనస్సు కరిగి పోయింది. ఎంతైనా  అతడు భర్తాయె! సావిత్రి పతివ్రతాయె!! భారత నారీరత్నమాయె! ! !

    “ ఆ దేవతే మనబిడ్డ వాణి! “  అంది గర్వంగా వాణిని చూస్తూ..

” ఏంటీ ఈడాక్టరమ్మ మన వాణా !? ” ఆశ్చర్యంగా అడిగాడతగాడు.

” ఔను మీరారోజు పరీక్ష ఫీజ్ కట్టమంటే బెల్ట్ తీశారే ఆమే ఈమె “

” పిల్లల్ని పెద్దవాళ్ళను చేసి చదివించి ప్రయోజకులను చేశావా? ఎంత గొప్పదానివి సావిత్రీ!”  అంటూ

పైకి లేచి డా. వాణి చేతులు పట్టుకుని ” అమ్మా! వాణీ!  క్షమించమని కోరే అర్హతలేనివాడ్ని. కన్న  బిడ్ద లని కూడా తలంచని క్రూరుడ్ని! నన్నుమన్నించకు, తరిమేయి.” అంటూ వాణి చేతులు పట్టు కోగా , ఆమె అతడి చేతులపై  తనచేతులుంచి నిమిరించి ప్రేమగా..అతడికళ్ళుజలపాతాలయ్యాయి.

                                                                           – ఆదూరి.హైమవతి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో