స్త్రీ యాత్రికులు

              ఫ్రెంచివారి ఆధీనంలో ఉండే కాంగో ప్రాంతాల్లో ‘ఫాన్‌’ అనే ఆఫ్రికన్‌ జాతి ఉంది. ఆ పరిసరాల్ని ఫాన్‌ గ్రామం అని పిలుస్తారు. వారు పులిని పట్టినప్పుడు దాన్ని జాగ్రత్తగా ఎదుర్కొని, దాని వంటిమీద గాయాలు కాకుండా జాగ్రత్తగా చంపుతారు. దానికో మార్గం కనిపెట్టారు వాళ్ళు. పట్టిన పులిని ఐదారు రోజుల పాటు ఆకలితో ఉంచుతారు. ఆతరువాత అది సహజంగానే నీరసించి మరణిస్తుంది. ఆ తరవాత దాని తోలు గాయాలు కాకుండా ఒలవటం సులభం.   

                ఒకసారి అలాగా కట్టివేసిన పులి అరుపులు విన్న మేరీ ఆ గుంట దగ్గరకి వెళ్ళి జాగ్రత్తగా దాని కట్లు విప్పి వదలిపెడుతుంద్ష్మి అది తిరగబడు తుందని తెలిసికూడా. కానీ దాని బాధని చూడలేక అలాంటి సాహస కార్యానికి పూనుకొంటుంది మేరీ. ఒకసారి ఊగీనది మీద చేపల వేటకి బయలుదేరుతుంది. నదికి ఎగువగా ఉన్న ప్రాంతాల్లో ప్రమాదాలు ఉంటాయని ఊహించి తనకు తోడుగా ఎనిమిది మంది మంచి దృఢకాయులైన వేటగాళ్ళని మాట్లాడుకొని వారితోపాటుగా ప్రయాణం అవుతుంది.   

                 ఎగువకి వెళ్ళేకొద్దీ ఆ పడవ నడిపేవారికి భయం పుట్టసాగింది. ఎందుకంటే పై గ్రామాల్లో మనుషుల్ని తినేవారు ఉంటారని వారికి ఎవరో చెప్పారట. వారు పడవని వదిలి పారిపోగానే, మరో గ్రామంలో ఇగాల్వాస్‌ జాతివారు ఆమెకి తోడుగా రావటానికి సిద్ధపడతారు. ఆ దారిలో 800 కి.మీ. ముందుకి వెళితేగాని ఐరోపా జాతివారి స్థావరం రాదు. ఈ మధ్యలో వచ్చే స్థానికులతో చాలా జాగ్రత్తగా వస్తుమార్పిడి చేసుకొంటేనే తన ప్రయాణం సుఖంగా సాగుతుంది.  

                    ఊగీనది అంతా సుడిగుండాల మయం. మధ్యలో పెద్ద బండరాళ్ళు కుప్పలుగా ఎదురయ్యేవి. అలాంటి రాళ్ళు ఎదురైన ప్రతిసారి పడవ నడిపేవాళ్ళు పెద్దగా గోలపెట్టేవారు. అలాంటి కష్టాలు ఎలాగో సహించి కొండో-కొండో దీవికి చేరుకొంటారు. కొన్ని రోజులు అక్కడ ఉండి విశ్రాంతి తీసుకుందా మనుకొనేసరికి, ఆ గ్రామంలోని స్థానికులకి అన్ని మాంసాలకంటే మనిషి మాంసం చాలారుచిగా ఉంటుందని తెలియగానే, వారు కూడా ఒక్క సారిగా నదిలోకి పరుగెత్తి పడవ ఎక్కేస్తారు.మేరీ బృందానికి అజుంబా జాతికి చెందిన దంతపు వర్తకులు పరిచయమవ్వటంతో వారు ఆమెని క్షేమంగా గమ్యం చేరుస్తామని వాగ్దానం చేస్తారు. మేరీ వద్ద పొగాకు నిల్వలు బాగానే ఉన్నాయి. అంటే చాలా డబ్బు ఉన్నట్లే. అందువలన వారి మాటలు నమ్మక తప్పలేదు. ఆఫ్రికాలో పొగాకుని ఎవరూ వదలరు. బంగారం కంటే పొగాకునే ఎక్కువగా గౌరవిస్తారు.   

             ఆత్మవిశ్వాసం కల మేరీ అజుంబా వారి పడవ ఎక్కుతుంది. దారిలో ఒకరు ఎదురై ‘నీకొక మంచి వస్తువు ఇస్తానుగానీ, నాకు కాస్త పొగాకు ఇస్తావా?’ అని అడుగుతాడు. అదేదో లండన్‌ మ్యూజియంకి పనికి వస్తే మంచిదే అనుకుంటూ ‘అదేంటో చూపించు’ అనగానే ఆ వ్యక్తి తన సంచిలో నుండి చాలా జాగ్రత్తగా తీసి ‘ఇదిగో చూడండి! ఎంత బాగుందో’ అంటాడు. దాన్ని చూచిన మేరీకి, ఆ అజుంబా వారికి చెమట్లు పట్టాయి. అదొక కాల్చిన మనిషి తొడ.ఆ నరమాంస ప్రియుల్ని దాటుకుని మరో గ్రామం చేరిన అజుంబా వారు అక్కడ మేరీని దింపేసి, ‘మీరు ఇక్కడే ఉండండి, రెండురోజుల్లో మరలా ఇక్కడికే వస్తాం!’ అని చెప్పి తమ వ్యాపారానికి వెళతారు.  

                ఆ గ్రామం చాలా బాగుంది. పరిసరాల్లో ప్రకృతి వారిని ఆకర్షిస్తుంది. అక్కడ ఎలాంటి నరమాంస భక్షకుల గురించి వినలేదు. అందుకే మేరీకి ధైర్యంగా ఉంది. ఒక పూరిగుడిశెలో ఆమెకి బస ఏర్పాటు చేస్తారు. కానీ ఆరాత్రి ఒక నీటి ఏనుగు వచ్చి గ్రామంలో  గందరగోళాన్ని సృష్టిస్తుంది.   

                      స్థానికులే తనకి అన్నం పెడుతున్నారు. ప్రతిరోజూ కొంత పొగాకు తగ్గిపోతూనే ఉంది. అజుంబావారు తనని మర్చిపోయినట్లుగా భావించు కొంటుంది. ఈలోగా గ్రామస్థులు చెట్ల బెరడునుండి నిప్పు ఎలా తయారు చేయాలో, ఎండాకాలంలో చెట్ల నుండి నీళ్ళు ఎలా తీయాలో నేర్పిస్తారు మేరీకి.  

                        గ్రామస్థులు మేరీకి ఏనుగు దంతాలు, రబ్బరు ఆశ చూపిస్తూ తన వద్ద ఉన్న పొగాకు ఇవ్వమంటున్నారు. అవి మేరీకి అనవసరం. తన వద్ద పొగాకు అయిపోయిన మరుక్షణం మళ్ళీ అన్నీ దోచుకొంటారని తెలుసు. ఆ పొగాకుని, తనను వెనక్కి తీసుకెళ్ళటానికి టికెట్‌లాగా ఉపయోగించాలి అనుకొని, జాగ్రత్తపడుతుంది. కానీ వారు మేరీని ఎలాంటి బాధలూ పెట్టలేదు. అయినాసరే తన వద్ద ఉన్న పొగాకు మొత్తం ఖర్చయిపోతుంది. అజుంబా వారు ఎలాగూ తనను మర్చిపోయారు కాబట్టి ఆ గ్రామస్థులను తనకు తోడుగా రమ్మంటుంది. కానీ వారికి ఇవ్వటానికి తనవద్ద ఏమీలేద్ష్ము తన వంటిమీద బట్టలు తప్ప. తాను ధరించిన పొడవైన మేజోళ్ళు ఇవ్వమంటారు. అలాగే తీసి ఇస్తుంది. వాటిని తమ తలకి తగిలించుకొని, పాద భాగం వెనక్కి వచ్చేలా వేసుకుని అది పిలకలాగా ఊగుతుంటే అందరూ ఎగిరి గొప్ప ఆనందంతో గెంతులు వేస్తారు.   

                            ఇంకా ఏమన్నా ఇస్తే బాగుంటుందని కాలయాపన చేస్తుంటారే కాని పడవ తీయరు. తన పళ్ళుతోముకునే బ్రష్‌ మిగిలిపోయిందని ఎంతో ఎగతాళిగా గుర్తు చేస్తారు వాళ్ళు. సరిగ్గా అదే సమయానికి అజుంబా వారి బృందం తమ సరుకులతో రావటంతో తాను భయంతో ఊహించుకుంటున్న ‘మిగిలిన బట్టలు విప్పితీసే’ (ఐశిజీరిచీ-శిలిబిరీలి) పరిస్థితి తప్పుతుంది మేరీకి.   

                  ఇలాంటి ఇబ్బందికరమైన అనుభవాలు .ఎన్నెన్నో ఎదురవుతున్నా తన పట్టుదల మాత్రం వదలకుండా తన పనిలో నిమగ్నమయ్యేద్ష్మి బండ రాళ్ళమీద ప్రవహించే కాంగో నది మాదిరిగా.మరో సందర్భంలో నదిని దాటి వేరే గ్రామానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మెడలోతు బురదలో, పాచిపట్టిన రాళ్ళమీద జారుకుంటూ ఒక రోజంతా ప్రయాణం చేసి, నది అవతలి ఒడ్డుకి చేరుకొనేసరికి బాగా అలసిపోతారు. మేరీ బృందంలోని వారు దారిలో ఎదురైన ఒక పెద్ద పాముని చంపి, దాని మాంసంతో కడుపునింపుకొంటారు నది ఒడ్డుమీద ఉన్న ఒక గ్రామంలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకొంటుంది. ఆమె కోసం ఒక ఇల్లు శుభ్రం చేసి ఇస్తారు. నిద్రపోయే సమయానికి అక్కడకి వచ్చిన ఒక వింత వాసన మేరీని కలవరపరుస్తుంది. చివరకి ఆ గోడలకి తగిలించిన సంచుల్ని పరీక్షించి చూడగానే వాటిలో మనిషి చెయ్యి ఒకటి, కాలివేళ్ళు మూడు, నాలుక, రెండు చెవులు రక్తంలో నానుతూ కనిపిస్తాయి.   

                   కొన్ని  జాతులవారు తమ శత్రువులని చంపినప్పుడు, వారిని పూర్తిగా అక్కడే తినివేయకుండా, వారి విజయానికి గుర్తుగా కొన్ని భాగాలు తెచ్చుకొని ఆ మరుసటిరోజుకి దాచుకుని, తమ విజయాన్ని నెమరువేసు కొంటూ తింటారని తెలుసుకొంటుంది మేరీ. ఇలాంటి కంపరంపుట్టించే ఆఫ్రికా అనుభవాలు ఎన్నో ఎదుర్కొం టుంది మేరీ కింగ్‌స్లీ. అయినాసరే పట్టుదలతో మ్యూజియం కోసం చిత్రవిచిత్ర వస్తువులు, చేపలు సరఫరాచేస్తూనే ఉంది. ఆధునికత వలన క్షీణించిపోతున్న ఆదిమ సంస్కృతి ఆనవాళ్ళని, భవిష్యత్తు తరాలవారికి అందివ్వాలనే తపన ఆమెలో కనిపించేది.  

              ఇలాంటి సేవలు అందించిన కింగ్‌స్లీ 1894 వ సం|| ఆఖర్లో మరోసారి ఇంగ్లండుకి వెళ్ళి తన అనుభవాల్ని “Travels In West Africa” అనే పుస్తకంగా రాస్తుంది. ఆమె బ్రిటీషు మ్యూజియానికి అరవై ఐదు కొత్త రకాల చేపలను తెచ్చినందుకు గుర్తుగా ఈమె పేరు మూడు రకాల చేపలకి పెడతారు. 1897 వ సం||లో వెలుగుచూసిన ఈ అమూల్య గ్రంథం ఆనాటి ఇంగ్లండులో ఒక సంచలనాన్ని సృష్టించి, ఆఫ్రికా దేశాల నాగరికతపై ప్రపంచం దృష్టిపడేలా చేసింది. వారి సంస్కృతి పరిరక్షణకై అనేక వస్తు సంగ్రహాలయాల నిర్మాణానికి ఆమె రచనలు సహాయపడ్డాయి.   

                    తిరగటమే పనిగా పెట్టుకుని, అదే ఆనందం అనుకొంటూ ఉండే కింగ్‌స్లీ దక్షిణ ఆఫ్రికాలో ‘బోయర్‌ యుద్ధం’ (1899-1902) వచ్చినప్పుడు సైమన్స్‌ టౌన్‌కి వెళ్ళి, అక్కడ గాయపడిన సిపాయిలకి వైద్య సేవలు అందిస్తూ కొంతకాలం గడిపింది. కానీ విధివశాత్తూ ‘ఎంటరిక్‌ ఫీవర్‌’ అనే విషజ్వరం మేరీకి సోకటం వలన 1900 వ సం|| జూన్‌ మూడవ తేదీన తన రోగుల మధ్యనే మరణిస్తుంది. అప్పటికి మేరీ వయసు ముప్ఫైఎనిమిది సం||లు మాత్రమే. ఏదో శాపానికి గురైన వారిమాదిరిగా ఆ కుటుంబం అంతా అనారోగ్యాల వలన మరణించారు.    

                 మేరీ కింగ్‌స్లీ, ఇసాబెల్లా మాదిరిగా, ఎక్కువ దేశాలు తిరగలేదు. కానీ ఒకే ప్రదేశంలో లోతైన అధ్యయనం చేయగలిగింది. పరిశోధన ఆమెకి ప్రాణం. తన ఆటస్థలం అంతా పశ్చిమ ఆఫ్రికా చీకటిలోకాలే. ఆమె స్నేహితులందరూ ఆటవికులు, అనాగరికులే.   

                      జీవితంలో తాను ఎలాగూ పెళ్ళికి నోచుకోలేదు. తల్లి పైనా, తమ్ముడి పైనా ఎంతటి ప్రేమ చూపింద్ష్మో ప్రకృతి మీదా, తన ఊగీ, ఫాన్‌ జాతుల వారి మీద అంతటి ప్రేమనే చూపింది .

– ప్రొ .ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పురుషుల కోసం ప్రత్యేకం, యాత్రా సాహిత్యం, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో