ఎనిమిదో అడుగు 2

అంతలో ఒక గర్భిణి స్త్రీ, ఆమె తల్లి వచ్చి చేతన పక్కన కూర్చున్నారు. ఆ తర్వాత నడివయసు దాటిన ఒక స్త్రీ తన భారీ కాయాన్ని మోసుకొస్తున్నట్లు మెల్ల, మెల్లగా కదులుతూ నడిచి వచ్చి ‘‘నాక్కాస్త చోటివ్వండి’’ అంటూ అదే బెంచీపై గర్భిణి స్త్రీ తల్లి పక్కన కూర్చుంది.

కూర్చోగానే సన్నగా మూలుగుతూ గర్భిణీ స్త్రీ తల్లివైపు పలకరింపుగా చూసి….’ ‘‘ఇదేం రోగమో ఎంత తిన్నా ఆకలి తీరడం లేదు.  ఎంత తాగినా దాహం తగ్గడం లేదు.  ఏ.సి.లో పడుకున్నా ఉక్కపోస్తుంది. 

కారులో తిరిగినా కాళ్లు లాగుతున్నాయ్‌. లిఫ్ట్ లో వెళ్లినా మోకాళ్లు నొప్పులొస్తున్నాయ్‌. మొక్కని దేవుడు లేడు. తిరగని హాస్పిటల్‌ లేదు.  ఏం చేయాలో అర్థం కావటం లేదు…’’ అంది కలిసింది అప్పుడే అయినా ఎంతో కాలంగా తెలిసిన దానిలా   అక్కడెవరు మాట్లాడలేదు. వింటున్నారు.           

 ‘‘నాకెందుకో నేను చచ్చిపోతాననిపిస్తోంది.  ఆ భయంతోనే రాత్రుళ్లు సరిగా నిద్రపట్టటం లేదు. యమ భటులు కూడా కన్పిస్తున్నారు.నన్ను వల్ల కాటికి మోసుకెళ్తున్నట్లు భగవద్గీత కూడ విన్పిస్తోంది’’ అంది.             

ఈసారి చేతనకి ఆమెపట్ల నిజంగానే జాలి అన్పించింది.  తనొక్కటి తప్ప ప్రపంచంలో అందరు బ్రతుకుతున్నట్లు ఆమె భావించి, బాధపడడం స్పష్టంగా తెలుస్తోంది.             

చేతన లేచి వెళ్ళి ఆమె పక్కన కూర్చోని, మీకో విషయం చెబుతానిప్పుడు అన్నట్లు ఆమె వైపు చూస్తూ…

‘‘చూడండి! ఆంటీ! రావడం, పోవడం అతి సహజమని తెలిసినా బాధపడటం మానవ స్వభావం… కారణం ఎవరు ముందో ఎవరు వెనుకో తెలియదు కాబట్టి…

ఇంతెందుకు ఇప్పుడు డాక్టర్‌ దగ్గరకి వెళ్ళాలంటే ముందు నేనే వెళ్ళాలని తొందరపడ్తారు. అదే యముడు దగ్గరకి వెళ్ళాలంటే అందరికన్నా నేనే వెనక వెళ్ళాలనుకుంటారు. ఒక్కరమే వెనక ఉండి ఏమి చేస్తాం? అని ఎవరూ ఆలోచించరు.             

 అంతేకాదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1500 వందల అగ్ని పర్వతాలు చురుగ్గా పనిచేస్తున్నాయట..

అవి ఎప్పుడైనా బద్ధలై లావాను విరజిమ్ముతాయట….ప్రపంచ జనాభాలో 50 కోట్ల మంది ఇలాంటి అగ్నిపర్వతాల సమీపంలోనే జీవిస్తున్నారట…అందుకే బాధపడకండి! మీకు ఉన్న ఈ జబ్బు ఆ అగ్ని పర్వతం ముందు ఇసుక రేణువు… సరేనా!’’ అంటూ నచ్చజెప్పింది.

‘‘కాలేజికి వెళ్తూ ` దారిలో హాస్పిటల్‌ వుంది కాబట్టి ఆయన్నక్కడ వదిలేసి వెళ్లావ్‌! అంతేకాని,స్నేహితుని తండ్రిని ఎంత బాధ్యతగా చూసుకోవాలో తెలుసుకోలేకపోయావ్‌! ఇలాంటి సందర్భాలే అవతలి మనిషేంటో తెలియజేస్తాయి హేమేంద్రా’’! అన్నాడు ప్రభాత్‌ సీరియస్‌గా.            

 అప్రతిభురాలైందామె ….ఒక్కరిమే కాక అందరము పోతామంటే అదో రిలీఫ్‌ మనిషికి… ఆయాసం తగ్గించుకొని చేతన వైపు అభినందనగా చూస్తూ…             

‘‘వయసు చిన్నదైనా చక్కగా చెప్పావమ్మాయ్‌! నీ వయసు పిల్లల్లో ఇంత ఆలోచన, ఇంత గంభీరత ఎక్కడుంది? ఎంత తిన్నామా? ఎంత తిరిగామా? ఎంత వంకరగా ఆలోచించామా! ఎంత వక్రంగా మాట్లాడామా! దానికి మళ్ళా స్టైల్‌ అనే పేరొకటి… కాలం మారిందనే సమర్థింపు.               

ముఖ్యంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ల వల్ల విజ్ఞానం కొంత వున్నా దాన్ని దుర్వినియోగం చేసుకొంటున్నారు. గంటల తరబడి దాని ముందు కూర్చొని మానసిక ఇబ్బందులకు గురై క్రమేణ తన వయసు వాళ్ళతో కలవలేక, మాటలు కలపలేక అప్పుడప్పుడు జుట్టు పీక్కోవడం, నుదుటి మీద కొట్టుకోవడం, చిన్న, చిన్న గాయాలు కూడా చేసుకొంటున్నారు కొంతమంది పిల్లలు…           

 మా బంధువుల్లో పిల్లలు కొందరు అలాగే ఉన్నారు. అదంతా గమనించే టైమ్‌ వాళ్ల తల్లిదండ్రులకు కూడా ఉండడం లేదు….

అంతేకాక ఈ మధ్యన మీ వయసు పిల్లల మీద స్ట్రైక్‌లు, నిరహారదీక్షల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది’’ అంటున్న ఆమె ఇప్పుడు మూలగడం లేదు. ఉత్సాహంగా కూడా ఉంది.ఇలాంటి వాళ్ళకి ఎ.సి. రూముల్లో పడుకోకుండా చేతినిండా పనివుంటే ఎలాంటి వ్యాధి ఉండదు కదా! అనుకొంది చేతన…            

చేతనకి కాలేజి గుర్తొచ్చింది.  ప్రభాత్‌ రాకపోవడంతో అసహనంగా కదిలి పక్కకెళ్లి అతనికి కాల్‌ చేసింది.            

‘‘హలో…ప్రభాత్‌ని మాట్లాడుతున్నా….’’ అన్నాడు  ప్రభాత్‌ అవతల వైపు నుండి            

‘‘నా పేరు చేతన, నేను హాస్పిటల్లో మీ నాన్న గారి దగ్గర వున్నాను. ఇప్పటికే నాకు చాలా ఆలస్యం అయింది. నేను కాలేజికి వెళ్లాలి తర్వగా రండి!’’ అంది.            

‘‘హేమేంద్ర ఇప్పడే చెప్పాడు.  నేను ఎం.జి.ఎం. హాస్పిటల్‌లో వున్నాను. వస్తున్నా…. మీరు అక్కడే వుండండి! ఫ్లీజ్‌! నాన్న గారికి ఎలా వుంది?’’ అన్నాడు.            

‘‘జ్వరం ఎక్కువగా వుంది.  డాక్టర్‌ గారింకా రాలేదు.’’ అంది.            

‘‘ వస్తున్నా…. బై… ’’ అంటూ కాల్‌ కట్‌ చేశాడు.           

‘‘ఉఫ్‌’’ అంటూ అసహనంగా అటు, ఇటు చూసింది చేతన.            

‘‘ ఏంటమ్మాయ్‌! అలా వున్నావు?’’ అంది గర్భిణి స్త్రీ తల్లి చేతన వైపు చూసి.             

‘‘ఇప్పుడే వీళ్ళబ్బాయితో మాట్లాడాను ఆంటీ! దారిలో వున్నాడట, నేను అర్జంట్‌గా కాలేజికి వెళ్లాలి.’’ అంటూ తన ఇబ్బందిని చెప్పింది చేతన.            

.‘‘సరే! వెళ్లు ఇక్కడ వుండి మాత్రం నువ్వేం చేస్తావ్‌! నిన్న అనగా నెంబరు తీసుకున్నాం. ఇంతవరకు డాక్టర్‌ గారే రాలేదు. మా నెంబర్లు ఎప్పుడు పిలుస్తారో ఏమో! ఎలాగూ వాళ్లబ్బాయి వస్తున్నాడు కదా!  అంతవరకు మేము చూస్తాములే ఆయన్ని…’’ అంటూ భరోసా ఇచ్చిందామె.            

‘‘థాంక్యూ! అంటీ!’’ అని ఆమెతో చెప్పి….‘‘సార్‌! సార్‌!’’ అంటూ ధనుంజయరావుని పిలిచింది చేతన. కళ్లు విప్పి చూశాడు కాని, మాట్లాడలేదు. నర్స్‌ వచ్చి జ్వరం చెక్‌ చేసి వెళ్లింది.            

‘‘ఆంటీ! సార్‌ జాగ్రత్త!’’ అంటూ దనుంజయరావు గురించి ఆవిడకి ఇంకోసారి గుర్తుచేసి కాలేజికి వెళ్లింది చేతన.            

ప్రభాత్‌ బైక్‌ మీద వస్తూ` వాళ్ల అమ్మకి కాల్‌ చేసి నాన్న హాస్పిటల్లో వున్నట్లు చెప్పాడు. ఆమె పర్వతగిరి అనే ఊరిలో పెళ్లిలో వుంది. ఆమె కంగారు పడ్తూ  వెంటనే బయలుదేరుతున్నట్లు చెప్పింది.           

ప్రభాత్‌ హాస్పిటల్లోకి అడుగుపెట్టి తండ్రికోసం వెతికాడు. పేషంట్లతో హాస్పటల్‌ కిక్కిరిసి వుంది.  అప్పుడే డాక్టర్‌ గారు రావటంతో దేవుడు ప్రత్యక్షమైనట్లు అంతా లేచినిలబడ్డారు. 

ఆయన లోపలకెళ్లి కూర్చోగానే తమ పేరు పిలవకముందే ఆత్రుతగా లోపలకెళ్లాలని కొంతమంది రోగులు ప్రయత్నిస్తున్నారు.  డోర్‌ దగ్గర కాపలాగా నిలబడివున్న కాంపౌండరు వాళ్లను లోపలకెళ్లకుండా అడ్డుకుంటున్నాడు.ఒక్కోరోగి లోపలకెళ్లి బయటకొచ్చాక `

డాక్టర్‌ గారు రాసిచ్చిన ఇంజక్షన్లని ప్రక్కనున్న మెడికల్‌ షాపులో కొని ` నర్స్‌ దగ్గరకెళ్లి వేయించుకుంటున్నారు.  అక్కడా నర్స్‌ పద్దతి తెలిసినవాళ్లు నర్స్‌ చేతిలో ముందే డబ్బులు పెట్టి ఇంజక్షన్‌ వేయించుకుంటున్నారు. అది తెలియని వాళ్లు మాత్రం ఫ్రీగా పొడిపించుకొని, ఆ పొడుచుడికి ప్రాణాలు పోతున్నట్లు నొప్పిని దిగమింగుతున్నారు.  అదేమని అడిగితే…‘అందరూ ఒక్కసారే వచ్చి నా నెత్తిన పడితే నేనేం చెయ్యను?’ అని తనను తాను సమర్థించుకుంటోంది.            

ప్రభాత్‌ తన చురుకైన కళ్లతో అదంతా గమనిస్తూ తండ్రిని చేరుకున్నాడు. .. అక్కడ ఆ రద్దీలో, ఆహడావిడిలో దనుంజయరావుని ఎవరూ పట్టించుకోనట్లు ఓ బెంచీపై ఒక పక్కకి పడుకొని వున్నాడు. నిస్సహాయంగా.. చేతనతో ‘నేను చూస్తాను. నువ్వు కాలేజికి వెళ్లు!’’ అన్నావిడ తన కూతుర్ని లాబ్‌లోకి తీసికెళ్తూ ఆయన్ని మరచిపోయింది. తండ్రిని ఆ స్థితిలో చూడగానే  ప్రభాత్‌ హృదయం కళుక్కుమంది…             

ఉదయం తను కాలేజికి వెళ్లేముందు ‘నీరసంగా వుందిరా!’ అన్నాడే  కానీ ఇంత డల్‌గా లేడు. ఇలా వుండివుంటే తనసలు కాలేజికి వెళ్లివుండేవాడు కాదు.  హేమేంద్ర తన తండ్రిని హాస్పిటల్‌కి తీసుకురావడం మంచిదైంది. కానీ దిక్కులేనివాడిలా వదిలేసి వెళ్లటం దారుణంగా వుంది.            

నర్స్‌తో మాట్లాడి తన తండ్రిని వెంటనే డాక్టర్‌ దగ్గరికి తీసికెళ్లాడు ప్రభాత్‌. డాక్టర్‌ టెస్ట్‌ చేసి, మందులు రాసి ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్‌ చేసుకొన్నాడు.  ఆయనకి ట్రీట్‌మెంట్‌ జరుగుతోంది.            

ధనుంజయరావు భార్య సులక్షణమ్మ వచ్చి ` బెడ్‌ మీద మగతగా పడుకొని వున్న భర్త వైపు చూస్తూ ఆందోళనగా కూర్చుంది.  తల్లికి దైర్యం చెప్పాడు ప్రభాత్‌.            

ధనుంజయరావు పక్కన ఇంకో బెడ్‌ మీద వున్న పేషంట్‌ ఆలోచనగా శూన్యంలోకి చూస్తుంటే ఆయన భార్య మాత్రం కళ్ల నీళ్లు పెట్టుకుంటూ దయనీయంగా కన్పించింది.  వాళ్లనలా చూస్తూ ప్రభాత్‌ మౌనంగా వుండలేకపోయాడు.             ‘‘ఏంటమ్మా అంతగా బాధపడ్తున్నావ్‌? డాక్టర్లేం చెప్పారు? ఏమైనా ప్రాబ్లమా?’’ అన్నాడు కాబోయే డాక్టర్‌గా స్వతహాగా అతనిలో వుండే ఆసక్తి వల్ల ఆమె దగ్గరికి వెళ్లాడు ప్రభాత్‌…            

ప్రబాత్‌ని చూడగానే కళ్లనీళ్లు తుడుచుకోవడం కూడా మరచిపోయింది. ఆమె చాలసేపటి నుండి అతన్ని గమనిస్తుండడం వల్లనేమో అదోలాంటి నమ్మకంతో…. ‘‘నాలుగు రోజులుగా ఇక్కడే వున్నాం బాబు! ఇదిగో ఈ స్కానింగ్‌లు, టెస్ట్‌లు, ఎక్సేరేలు తీశారు.  మా దగ్గర వున్న డబ్బులన్నీ అయిపోయాయి.  ఈ జబ్బు ఏం జబ్బో ఇంకా చాలా డబ్బు కావాలంటున్నారు.’’ అంటూ లేచి రిపోర్టులన్నీ తీసి ప్రభాత్‌కి చూపించిందామె.            

అతను అవన్నీ చూసి… ‘‘మీకు తెల్ల బియ్యం కార్డు వుందా మ్మా?’’ అన్నాడు.            

‘‘వుంది బాబు! ఈ మధ్యనే ఇచ్చారు. మాది పరకాల పక్క వూరే.’’ అంది.            

‘‘మన ముఖ్యమంత్రి కీ॥శే॥ రాజశేఖర్‌ రెడ్డి దయవల్ల ‘ఆరోగ్యశ్రీ’ అనే పథకం ఒకటి అమల్లోకి వచ్చిందమ్మా! తెల్ల రేషన్‌కార్డు వున్న వాళ్లకి ఆరోగ్యశ్రీ కార్డు తప్పకుండా ఇస్తారు.  మీకు ఇంకా ఇచ్చినట్లు లేదు. మీలాంటి వాళ్లకి తెలియటం కోసమే ఆరోగ్య మిత్ర ప్రతి వూరువెళ్లి దండోర వేసి మరీ ప్రచారం చేస్తుంటారు.. సంతోషించదగ్గ విషయం ఏమిటంటే మీ భర్తకున్న జబ్బు ఆరోగ్యశ్రీ కిందకి వర్తిస్తుంది… నేనిప్పుడు నిన్ను తీసికెళ్లి ఈ హస్పిటల్‌లోనే ఆరోగ్య మిత్రా వాళ్లను చూపిస్తాను.  వాళ్లకి మీ తెల్ల బియ్యం కార్డు చూపించు.  మొత్తం వాళ్లే చూసుకుంటారు. ఒక్క పైసా  కూడా నువ్వు ఖర్చుపెట్టాల్సిన అవసరం వుండదు.  తిండి, మందులు, ప్రయాణ ఖర్చులతో సహా వాళ్లే ఇస్తారు. ఈ నాలుగు రోజులుగా అయిన ఖర్చు కూడా మీకు తిరిగి ఇప్పిస్తారు.  అంతేకాదు మీరీ హాస్పిటల్‌ నుండి వెళ్లేముందు నర్స్‌లకి, స్వీపర్‌కి, ఓ.టి.బాయ్‌కి, వాచ్‌మెన్‌కి డబ్బులివ్వనవసరం లేదు.’’ అన్నాడు ప్రభాత్‌.             

చిన్నవాడు కాబట్టి మౌనంగా చూస్తోందామె… లేకుంటే ప్రభాత్‌ కాళ్లు మొక్కేదే. ఆమె భర్తలో కూడా అదే భావం కన్పిస్తోంది.     అంతలో అమె కొడుకు తండ్రిని పరామర్శించే ఉద్దేశ్యంతో అక్కడికి వచ్చాడు.  బాగా తాగివున్నాడు.  తూలుతున్నాడు.  నీ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నట్లు నిరాశతో కూడిన నిర్లిప్తత వాళ్లలో వుండటం వల్లనేమో కొడుకు వచ్చాడన్న సంతోషం వాళ్లలో కన్పించలేదు… ప్రభాత్‌ని చూడగానే డాక్టరేమోనని దండంపెట్టి ‘నా తండ్రిని కాపాడండి సారూ!’’ అంటూ ‘వీడు నిజంగానే దొంగవెదవ’ అని చూసేవాళ్లకి అన్పించే లాగ ప్రభాత్‌ కాళ్ళ మీద పడ్డాడు. ప్రభాత్‌ అతన్ని పైకి లేపి నిలబెట్టి….             ‘‘నువ్విప్పుడు తాగివున్నావు.  ఎయిడ్స్‌, క్యాన్సర్‌, స్వైన్‌ప్లూ, వరదలు, ఉప్పెనలు, భూకంపాలు పేర్లు విన్నావుగా.  వాటికన్నా భయంకరమైంది ఈ తాగుడు వ్యసనం… దీన్నుండి బయటపడి ముందు నిన్ను నువ్వు కాపాడుకో..’’ అన్నాడు ప్రభాత్‌ చాల ప్రశాంతంగా… ప్రభాత్‌ ఎప్పుడు ప్రశాంతంగా, గంభీరంగా వుంటాడు.            

తాగుడు ప్రసక్తి రాగానే ప్రభాత్‌ వైపు కోపంగా, నిర్లక్ష్యంగా చూసి అక్కడో క్షణం కూడా వుండకుండా వెళ్లిపోయాడు  ఆమె కొడుకు … పువ్వులలోని సువాసన, వ్యక్తులలోని యోగ్యత ఎలా దాగవో తన కొడుకులోని అయోగ్యత కూడా అంతేనని గ్రహించి ప్రభాత్‌ వైపు ప్రేమగా చూస్తూ..            

‘‘బాబూ! నీకో విషయం చెబుతాను.  ఎప్పటికీ గుర్తుంచుకో… నీలాగ మానవత్వంతో ఆలోచించే వాళ్లు అరుదు.  నీలో వుండే ఈ మంచి లక్షణమే నిన్నెప్పటికీ కాపాడుతుంది.  గొప్పవాడిని కూడా చేస్తుంది…             

కానీ మిణుగురు పురుగులతో చలికాచుకుంటూ వణుకుతున్న కోతులకి ‘అలా కాదు ఎండు కట్టె పుల్లలతో మంట రాజేసుకుని చలి కాచుకోవాలి’ అని సలహా ఇచ్చిన పావురాన్ని వెంటనే ఆ కోతులు పీక నొక్కి చంపేసిన కథని విన్నావో లేదో కాని చెడిపోయిన వాడి దృష్టిలో మంచివాడెప్పుడూ చెడ్డవాడే… చెడ్డవాళ్లకి, దుర్మార్గులకి మంచి సలహాలు ఇవ్వకు.  వాళ్లు నీ మంచితనానికి విలువ ఇవ్వరు….’’ అందామె బాధపడుతూ…  సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు…            

ప్రభాత్‌ నవ్వి…‘‘ మీ అబ్బాయి నిరసన నన్నేం బాధపెట్టలేదులేమ్మా! నువ్వేం బాధపడకు, రా! నీకు ఆరోగ్య మిత్రా వాళ్లను చూపిస్తాను…’’ అంటూ ఆమెను తీసికెళ్లి హాస్పిటల్‌ బయట హెల్ప్‌ బాక్స్‌ దగ్గర కూర్చుని వున్న శ్రీలతా మేడమ్‌కి పరిచయం చేసి, పక్కనే వున్న మెడికల్‌ షాపుకి వెళ్లాడు.            

తండ్రికి కొన్ని మందులు కొని, మొబైల్‌ బయటకి తీసి హేమేంద్రకి కాల్‌ చేసి… అతను ‘‘హలో…’ అనగానే’’ నువ్వు మా నాన్న గారిని హాస్పిటల్‌కి తీసుకురావటం చాలా మంచిదైందిరా! థ్యాంక్స్‌! అన్నాడు.               

‘‘ఇప్పుడెలా వుంది?’’ అని అడగకుండా ‘ఊ’ అన్నాడు హేమేంద్ర.            

‘కానీ… హేమేంద్రా! అయన్ని నువ్వలా వదిలేసి వెళ్లాల్సింది కాదు. అయినా నీకెలా మనసొప్పిందిరా? నేనొచ్చే వరకు ఆగలేకపోయావా? అదే మీ నాన్న గారినైతే అలాగే వదిలేసి వెళ్తావా?’’ అన్నాడు ప్రభాత్‌ కోపాన్ని, బాధను ఆపుకోలేక…    

‘‘నాకింకేం పనిలేకుంటే అలాగే వుండేవాడ్ని.. అందుకే అక్కడో అమ్మాయిని వుంచి వెళ్లాను.  నువ్వు వచ్చేంతవరకు వుంటానందే.’’ అన్నాడు నిర్లక్ష్యంగా.             

హేమేంద్ర ఏ మాత్రం ఫీలవ్వటం లేదని అర్థమవుతున్నా అతని ప్రవర్తనకి విస్తుపోతూ…            

‘‘ఇక్కడ ఏ అమ్మాయి లేదు….’’ అన్నాడు ప్రభాత్‌.           

‘లేదా? అంత రిక్వెస్ట్‌ చేసి, అప్పజెప్తే వుండకుండా వెళ్లిందా? ఇదేదో పెద్ద దేశ ముదురులా వుందే… ఇంకా నయం ఆయన చేతికున్న ఉంగరాలను పట్టుకెళ్లింది కాదు…. ఇలాంటి వాళ్లను చూసే కాబోలు   పెద్దవాళ్లు మనుషుల్ని నమ్మకూడదంటారు…’ తనక్కడవుండలేదన్నది పక్కనపెట్టి ఆ అమ్మాయి మీద కోపంతో పళ్లునూరాడు            

హేమేంద్ర మౌనం ప్రభాత్‌ మనసుకి చివుక్కు మనిపించి…           

‘‘కాలేజికి వెళ్తూ ` దారిలో హాస్పిటల్‌ వుంది కాబట్టి ఆయన్నక్కడ వదిలేసి వెళ్లావ్‌! అంతేకాని,స్నేహితుని తండ్రిని ఎంత బాధ్యతగా చూసుకోవాలో తెలుసుకోలేకపోయావ్‌! ఇలాంటి సందర్భాలే అవతలి మనిషేంటో తెలియజేస్తాయి హేమేంద్రా’’! అన్నాడు ప్రభాత్‌ సీరియస్‌గా.            

‘‘ ఇంత చిన్న విషయానికి ఎందుకంత సీరియస్‌ అవుతావ్‌?’’            

‘‘ఇది చిన్న విషయమా? నేను వెళ్లేసరికి మా నాన్న నోట్లోకి ఈగలు పోతున్నాయి.  అది నీవల్లనే కదా! నువ్వక్కడ లేకుండా పోవటం వల్లనేగా! ఒక్కటి గుర్తుంచుకో హేమేంద్రా!  ఆపద సమయంలో కూడా మన వాళ్లను మనం కరెక్టుగా చూసుకో లేకపోవటం మన వాళ్ల కోసం కొంత సమయాన్ని కేటాయించలేకపోవటం క్షమించ తగినది కాదు. అవసరాలను తీర్చుకోవటానికి మాత్రమే స్నేహాలను గుర్తు చేసుకోవటం కూడా మంచిది కాదు.            

ముఖం మ్మీద కొట్టినట్లైంది హేమేంద్రకి… అంతేకాదు.             

‘‘అన్నం పెట్టే చేతిని కొరికే రకంరా నువ్వు!’’ అని అనకపోయినా అన్నట్లే వుంది. దానితో  ఒకవైపు ఆత్మన్యూనతా భావం, ఇంకో వైపు అహంకారం ఎముకల్ని కొరుకుతుంటే ధిక్కారంతో కూడిన కదలికతో తల విదిలించాడు హేమేంద్ర. పట్టరాని కోపంగా వుంది హేమేంద్రకి.            

ధనుంజయరావుని హాస్పిటల్‌ నుండి ఇంటికి తీసుకొచ్చారు ఉదయాన్నే ప్రభాత్‌ కాలేజికి వెళ్లేముందు తండ్రి పక్కన కూర్చుని ముందుగా సెత్‌స్కోప్‌తో గుండె ఎలా కొట్టుకుంటుందో చూశాడు.  తర్వాత బి.పి.చెక్‌ చేశాడు.  అంతా ఓ.కె. అన్పించింది.  జ్వరం నార్మల్‌కి వచ్చింది. తండ్రి ఏదో అడుగుతుంటే ప్రశాంతంగా సమాధానం చెబుతూ ఏ మందులు ఆపాలో చూస్తున్నాడు ప్రభాత్‌.           

భర్తకు టెస్ట్‌ చేస్తున్న కొడుకును వెనక నుండి చూస్తుంటే అతను కూర్చున్న తీరు, తీరైన భుజాలు  కొడుకు ఆత్మ విశ్వాసాన్ని తలపింపజేస్తూ తృప్తిగా వుంది సులక్షణమ్మకి…కొడుకు త్వరలో డాక్టర్‌ కాబోతున్నాడన్న నిజాన్ని  ప్రత్యక్షంగా చూస్తూ..  ఆనందిస్తోంది. ఆమెకు తన కొడుకు వల్ల ఎప్పుడూ ఆనందమే…             

చిన్నప్పటి నుండి ఎవరి జోలికి వెళ్లేవాడు కాదు.  ఒకచోట బుద్దిగా కూర్చుని బొమ్మలతో ఆడుకుంటూ తన లోకంలో తనుండేవాడు చెప్పిన మాట చక్కగా వినేవాడు.  అందుకే అందరు ముద్దు చేసేవాళ్లు. ఒక్క దెబ్బ కూడా కొట్టేవాళ్లు కాదు.  ఒకసారి సరదాగా కొట్టి ఏడ్పించాలని వాళ్ల మేనత్త ట్రై చేసి నవ్వుకుంది.            

ఇప్పుడు తను మురిసిపోయేంతగా తన కొడుకు ఎదిగాడంటే కారణం తన భర్తే.  ప్రభాత్‌ చిన్నగా వున్నప్పుడు భర్త చెప్పిన మాటలు గుర్తొచ్చాయి సులక్షణమ్మకి.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10
UncategorizedPermalink

2 Responses to ఎనిమిదో అడుగు 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో