నేర ప్రవ్రుత్తి నివృత్తికి అంకితమైన లేడీ కార్పెంటర్

                ఏకేశ్వరక్రైస్తవ ఉపాసకుడైన డాక్టర్ లంటూ కార్పెంటర్ పెద్ద కుమార్తె మేరీ కార్పెంటర్ .తల్లి పెన్ .1807 లో ఇంగ్లాండ్ లోని ఎక్సిటర్ పట్నం లో జన్మించింది .తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ను, ధర్మ బోధ లోను  మంచి పేరు పొందాడు .తండ్రి వద్దే మేరీ విద్య నేర్చింది .గ్రీక్, లాటిన్,  ఇంగ్లిష్ లలో మంచి ప్రావీణ్యం సంపాదించింది .తండ్రి ఆమె కు నీతి పాఠాలను శ్రద్ధగా బోధించాడు .జంతు ,శాస్త్రం ప్రకృతి శాస్త్రాధ్యయనమూ చేసింది మేరీ .ఆమె సోదర సోదరీలు కూడా సమాన ప్రతిభ చూపారు .చదువు కోవటం వాళ్ళ గృహ కృత్యాలకిప్పుడు ఇబ్బంది కలగలేదు .

   మేరీ కి పదేళ్ళ వయసు లో తండ్రి కాపురాన్ని బ్రిస్టల్ కు మార్చి తన ధర్మ బోధ చేస్తున్నాడు .ఇక్కడే మహా మేధావి అయిన జేమ్సు  మార్టినో అనే ఆయన శిష్యుడు గా చేరగా   మేరీకి క్లాస్ మేట్అయాడు .క్రమం గా మేరీ తో విద్యా బోధన చేయించాడు తండ్రి .ఆదివారాలలో ప్రత్యేక శిక్షణ లో కూడా తండ్రికి సహకరించేది .విద్యార్ధులకు ధర్మ ,నీతి బోధ చేయటమే కాక వారి ఇళ్ళకు వెళ్లి వారిని ప్రభావితం చేసింది .

       మేరీ ఇరవై ఒక్కవ ఏట తండ్రి ఆమెకు క్రైస్తవ బోధనే వృత్తి వ్యావృత్తి  గా చేసుకొమ్మని కోరాడు .1829 లో తండ్రి అనారోగ్యం వల్ల  తన బడి మూసేశాడు . .భార్య ముగ్గురు పిల్లలు కలిసి ఆడవారికోసం ఒక స్కూల్ పెట్టారు .స్త్రీలకు కావలసిన అన్ని విద్యలు నేర్పటం ప్రారంభించారు .గ్రీక్ లాటిన్ భాషలనూ నేర్పారు .కుట్టుపని అల్లిక మొదలైన ఇంటి వృత్తులను నేర్పారు .ఈ స్కూల్ లో విద్య నేర్చిన వారందరూ బీదలకు విద్యా దానం చేస్తూ గడిపారు .కొందరు వివాహం చేసుకొని ఉత్తమ గృహిణులు గా స్థిర పడ్డారు .

            1832లో బ్రిస్టన్ నగరం లో కలరా వ్య్యాపించింది .అప్పుడు మేరీ కార్పెంటర్ సేవా భావం తో రోగులకు సేవలందించి ఆదుకొన్నది .1833 లో రాజా రామ మోహన రాయ్ ఇంగ్లాండ్ వెళ్లి డాక్టర్ కార్పెంటర్ ను కలిసి ప్రభావితుడయ్యారు .డాక్టర్ గారింట్లో కొంతకాలం ఉన్నాడు రాయ్ .అప్పుడు మేరీ కూడా రామమోహన్ తో జరిగే చర్చలలో పాల్గొనేది .డాక్టర్ గారు అస్వస్థతపాలయ్యారు .

 .అశాంతి అలమటిస్తున్న ఆమెకు అమెరికా నుండి వచ్చిన డాక్టర్ టక్కర్ మాన్ అనే ఉత్తమ విద్యా వేత్తతో పరిచయం కలిగింది .ఆయన వలన  భారత దేశం లోని స్త్రీల దుస్తితి ని,విద్యా హీనతను తెలుసుకొన్నది .మనసంతా భారత దేశం లోని దీనులే ఆక్రమించారు వారి సేవలో జీవితం ధన్యం చేసుకోవాలని నిర్ణయించుకోంది .అయినా తన దేశం లోని వారి ని గూర్చిన చింత ఆమె ను అడుగు ముందుకు వెయ్య నివ్వలేదు .బ్రిస్టల్ లో 1835 లో ‘’వర్కింగ్ అండ్ విజిటింగ్ సొసైటీ ‘ఏర్పరచి ఇరవై ఏళ్ళు సెక్రెటరి గా సేవలందించింది .’ .ఈ సమాజం లోని స్త్రీలు పేద ప్రజల ఉనికిని గుర్తించి ఒక్కొక్క భాగం లో కొంతమంది పని చేస్తూ వారికి విద్యా బుద్ధులు నేర్పించారు .ఇలా చాలా ఏళ్ళు గడిచాయి .

              1839 లో డాక్టర్ గారి ఆరోగ్యం మరింత క్షీణించటంతో డాక్టర్ల సలహాతో యూరప్ దేశయాత్రకు  వెళ్ళారు .తూర్పు ముద్ర తీర ప్రాంతాలలో పర్య టిస్తూ 1840 లో ఓడపై నుండిసముద్రం లోకిదూకి  చని పోయాడు . తండ్రి మరణం బాధించినా తన సేవా ధర్మాన్ని మేరీ మానలేదు .నేరస్తుల వద్దకు వెళ్లి వారికి ధర్మం నీతి బోధించి వారి లో గొప్ప పరివర్తన తెచ్చింది .ధార్మిక సేవ ను తండ్రి మరణం తర్వాత చేబట్టింది .1846 లో ‘’రాగ్గేడ్ స్కూల్ ‘’స్థాపించింది .యావజ్జీవ కారాగార వాసం లో ఉన్న నేరస్తులైన ఖైదీలకు తాను ఇతోధిక సేవ చేయాలనే గాఢ సంకల్పం ఆమె మనసులో పడింది దానికోసం తీవ్రం గా ఆలోచించింది .దోషాలు చేస్తున్న ఉన్నత కులాలకు చెందిన వారి కి నేరస్తుల కు ఉపయోగపడే పాఠశాలల విషయమై 1851 లో ‘’reformatory schools for the children of perishing and dangerous classes and for juvine offenders ‘’ane  పుస్తకం రాసి ప్రచురించింది .దీని పై స్పందించిన ప్రభుత్వం కారాగారాలలో దోష నివారక విద్యాలయాన్ని స్థాపించటానికి అనుమతి నిచ్చింది .1853 లో ‘’juvenile delinquents ,their condition and treatment ‘’పుస్తకం రాసి ప్రచురించింది .

       జైలు స్కూళ్ళలో పని చేసే ఏర్పాటు కూడా మేరీ చేసి అందరి అభిమానం పొందింది .నేరాలు తగ్గుముఖం పట్టాయి .ఇంగ్లాండ్ లో అంతవరకు ఎవరూ చేయని సాహస కార్యం చేసి మేరీ కార్పెంటర్ అందరి దృష్టిని ఆకర్షించింది .ఆమె బోధనల వల్ల ప్రభావితులై ఎందరో బాల బాలికలు తమ జీవిత సరళిని గణనీయం గా మార్పు తెచ్చుకొన్నారు ఆమెకెంతో రుణ పడి ఉన్నారు వీరందరూ ..మేరీ ప్రభావం తో 1846 లో  లయన్ మీడ్అనే ఆయన మరో ఆరేళ్ళకు రసెల్ స్కాట్ కింగ్స్ ఫుడ్ లో పేదల బడిని నెలకొల్పారు  .అవే   బీదల పాఠ శాలలుగా సేవలందించాయి .

         1854 లో బ్రిటిష్ రాజు లార్డ్ బైరన్ బ్రిస్టల్ నగరం లో ఒక బాల స్త్రీ నేరస్తుల దోష నివారణ కోసం ఏర్పాటు చేసే గృహానికి విశాల మందిరాన్ని కొని ఇచ్చాడు .మొదట్లో పది మంది తో ప్రారంభమైన గృహం ఒక్క ఏడాదికే యాభై మంది కి ఆవాసం గా మారింది .మారు మూల ప్రాంతాలలో ఉన్న పాపాలతో మగ్గిపోతున్న ఎందరో నిర్బాగ్యులు  ఇందులో చేరి జీవన శైలిని మార్చుకొన్నారు .వీరందరి బాగోగులు స్వయం గా తీర్చి దిద్దిన ఘనత మేరీ కార్పెంటర్ దే .ఎంత నీచ స్థితి లో ఉన్న పిల్లల నయినా ఆమె అక్కున చేర్చుకొని వారి జీవితాలను బాగు చేసింది .స్వేచ్చను ఇస్తూనే వారికి కుటుంబ వ్యవస్థలో భాగ స్వామ్యం కల్పిస్తూ ప్రేమతో ఆదరిస్తూ  వారిని మంచి మార్గం లోకి మళ్ళించాలని మేరీ భావన ఆమె కృషి ఫలితాలే 1854 లో వచ్చిన ‘’యూత్ ఫుల్ అఫెండెర్స్ యాక్ట్ ‘’మరియు 1857 లో ఏర్పాటైన ‘’ఇండస్త్రియల్ స్కూల్స్ మరియు వర్కర్స్ హాల్ల్స్ ‘’ఆమె ధ్యేయం పనితో కూడిన విద్యా మరియు పనిలోనే విరామానందం .

       మేరీకి యాభై ఏళ్ళ వయసులో తల్లి మరణించింది .జీవిత కాలమంతా సేవలోనే గడపాలని వివాహం చేసుకోరాదని కన్య గానే ఉండి పోవాలని  నిర్ణయించుకోంది..సగం భోజనం తోనే ఆమె ముగ్గురు మనుషుల పని చేస్తుంది అని పేరు పొందింది .తనకు చేదోడు వాదోడు గా ఉండటానికి ఒక బీద బాలికను చేరదీసి పెంచుకుంది .1861 లో ఐర్లాండ్ దేశం వెళ్లి అక్కడి జైలు పరిస్తితులను అధ్యయనం చేసి  .’’మన ఖైదీలు ‘’అనే పేర రెండు సంపుటాలు రాసి ప్రచురించింది .అరవయ్యేళ్ళు వచ్చేసరికి భారత దేశం వచ్చిఅక్కడి వారికి తన సేవలందించాలని నిశ్చయించుకొన్నది .

   1866 లో ఇండియా చేరి బొంబాయి అహమ్మదాబాద్ ,సూరత్ లను సందర్శించి స్త్రీ విద్య బాల బాలికా విద్యా బోధన గురించి అన్నీ తెలుసుకొన్నది .తర్వాత పూనా,మద్రాస్ నగరాలను చూసి కలకత్తా చేరి లార్డ్ లారెన్స్ కు అతిధిగా ఉంది . మళ్ళీ  బొంబాయి చేరి పౌరసమ్మానం అందుకొన్నది .1867 లో స్వదేశం ఇంగ్లాండ్ చేరింది .తన ఇండియా పర్యటనలో విశేషాలను ఇక్కడి స్త్రీ విద్య ను గురించి కొన్ని సూచనలు చేస్తూ పుస్తకం రాసింది .

   మరుసటి ఏడాది ‘’ఇండియాలో  ఆరు నెలలు ‘’పుస్తకం రాసి రామమోహన రాయ్ కి అంకితమిచ్చినది .ఇండియా లోని ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపింది .బొంబాయి చీఫ్ జస్టిస్ గోపాల రావు హరి దేశ్ ముఖ్ రాసిన లేఖ వల్ల  ఆమె బొంబాయి లో స్త్రీలకోసం బోధనా భ్యాసన పాఠశాల  ఏర్పాటు చేయాలని భావించింది .ప్రభుత్వం తో చర్చలు జరిపి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున అయిదేళ్ళు ప్రభుత్వం గ్రాంటు ఇచ్చే ఏర్పాటు చేసింది. 1868లో మళ్ళీ రెండవ సారి ఇండియా వచ్చింది .స్త్రీ బోధనాధ్యయన పాఠ శాల కు అంటే లేడీ టీచర్ ట్రైనింగ్ స్కూల్ కు అధ్యక్షురాలు గా పని చేసి దాన్ని తీర్చి దిద్దటం లో నిమగ్న మైంది జీతం ఏమీ తీసుకో కుండా స్వచ్చందం గా పని చేసిన ఆదర్శ వంతురాలు మేరీ కార్పెంటర్ .మళ్ళీ స్వదేశం చేరింది

            1870 లో కేశవ చంద్ర సేన్ ఇంగ్లాండ్ కు వెళ్లి మేరీ కార్పెంటర్ ను కలిసి ఇండియా లో సాంఘిక దురాచారాలను రూపు మాపటానికి జ్ఞానాన్ని ,వృద్ధి చేయటానికి ఒక సమాజం స్థాపించమని కోరాడు అప్పుడే బ్రిస్టల్ నగరం లో‘’నేషనల్ ఇండియన్ అసోసియేషన్ ‘’ఏర్పడింది .భావాలను ప్రకటించటానికి‘’ఇండియన్ గెజెట్ ‘’అనే పత్రికనేర్పరచి తర్వాత ఆ బాధ్యతను మిస్ మానింగ్ అనే సమర్దురాలికి అప్పగించింది .1875—76 లో నాల్గో సారి ఇండియా సందర్శించింది మేరీ .జైలు జీవితాన్ని గురించి ,వృత్తి విద్యను గురించి బాగా అధ్యయనం చేసి లార్డ్ సాలిస్ బారి కి ఒక ఉత్తరం రాసింది .1877 లో ఏప్రిల్ మూడున డెబ్భై వ జన్మ దినోత్సవం నాడు  ఆమెను ఆశీర్వదిస్తూ అభినందిస్తూ అనేకులు బహుమతు లందజేశారు .జూన్ 14 న ఆమె అనాయాసమరణం పొందింది .ఆమె మరణానికి శోకించని వారు లేరు .ప్రపంచ వ్యాప్తం గా ఆమె సేవను కొని యాడారు .ఆమె అంత్యక్రియలకు వేలాది జనం పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు బీద, నేర ,పాపుల ను సక్రమ మార్గం లో నడవటానికి ప్రేమ ,త్యాగం ,దీక్షా ,అంకిత భావం తో కృషి చేసి వారి పాలిటి పరమ కృపాళువు అని పించుకుంది మేరీ కార్పెంటర్ .

      –  గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పురుషుల కోసం ప్రత్యేకం, వ్యాసాలు, Permalink

One Response to నేర ప్రవ్రుత్తి నివృత్తికి అంకితమైన లేడీ కార్పెంటర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో