టగ్ ఆఫ్ వార్

నిజమే, ‘చంప’ మంచి బాంక్ ఉద్యోగం పిల్లలకోసమే వదిలేసింది. అలాగని పెద్ద డబ్బున్న పరిస్థితీ కాదు, కాని ఆడపిల్లలకు తల్లి అవసరం, ప్రతి నిమిషం చూసుకోవలసిన ఆవశ్యకత   ఉందని పించి మానేసింది. ఇంట్లోనే వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా చిన్న బోటీక్ తెరిచి తీరిక సమయాల్లో చిన్నపాటి కాలక్షేపాన్ని అలవరచుకుంది.

రత్నబాల తలదించుకుంది.

“సరే ఇప్పుడైపోయిన వాటికేం గాని జరగవలసిన వాటి గురించి ఆలోచిద్దాం, పిల్లను ఇక్కడ ఉంచి మీరు వెళ్లి ముందు ఆ శంకర్ ని కదిలించి  నయానో భయానో ఏదో ముట్టజెప్పి, ఫోటోలు గట్రా తీసుకుని ఇన్స్పెక్టర్ ముందు ఏ సంబంధం లేదని రాయించుకోండి. ఈ లోగా నేను దానితో మాట్లాడి   ఏం చెయ్యాలన్నది ఆలోచిస్తాను. “

“ సాహితిని కూడా ఉంచి వెళ్ళనా అన్నయ్యా “ అడిగింది రత్నబాల.

“ఎందుకు దాని చదువు పాడు చేస్తారు? దాని దారిన దాన్ని కాలేజికి పంపండి, ఎక్కువ రోజులు నాన్చ కుండా ఇలాటి విషయాలు త్వరగా పరిష్కరించుకోడం ఉత్తమం. రాత్రి భోజనాలు చేసి బస్సెక్కితే ఉదయాని కల్లా వెళ్తారు. “ రఘురామయ్య చెప్పినది భార్యా భర్త లిద్దరికీ సమంజసంగానే అనిపించింది.

అలాగే నని తలూపారు.

మధ్యాన్నం అందరి భోజనాలూ అయాక అందరూ కాస్సేపువిశ్రాంతి తీసుకునే వేళ ఈశ్వర్రావుని తీసుకుని టికెట్ల కంటూ బయటకు వెళ్ళాడు రఘురామయ్య. చంప రత్నబాల ను వీధి చివరనున్నతన బోటీక్ చూపిస్తానంటూ బయలు దేర దీసింది.

వీధి చివర ఓ చిన్న షట్టర్ ఉన్న రెండు గదుల పోర్షన్. మొదటి గదికి మధ్యలో కర్టెన్ వేసి దాన్నే రెండు భాగాలుగా చేసి ,ఒకటి ఆఫీస్ గదిగా ఆర్డర్లుబుక్ చేసుకుందుకు ఒక టేబుల్ నాలుగు కుర్చీలతో  అమర్చి ఉంది. కర్టెన్ వెనకాల గ్లాస్ స్టాండ్స్ మీద పొందికగా అమర్చిన గిఫ్ట్ ఆర్టికల్స్ ..ఫ్లవర్ వేజ్లు , కాండిల్ స్టాండ్స్, ఫోటో ఫ్రేమ్స్, సీనరీ పెయింటింగ్స్  ….లాటివి  ఇదివరలో ఎప్పుడూ చూడలేదనిపించేవి ఎన్నో ఉన్నాయి.

వెనకాల గదిలో నాలుగు మిషన్లు వాటిపై టేయిలర్లు, హామ్గార్స్ కి అమర్చిన డ్రెస్ లు ..

మొత్తమ్మీద పని ఎంత సిస్టమాటిక్ గా జరుగుతోందో అమరిక చూస్తేనే అర్ధమవుతోంది. చంప రాకముందే అక్కడ వర్క్ చేసే టేలర్స్ వచ్చి పని ప్రారంభించారు. ముందు గదిలో కస్టమర్స్ ని అటెండ్ చేసేందుకో  పాతికేళ్ళ అమ్మాయి. చంప రాగానే ఆర్డర్స్ అన్నీ వివరించి, సేల్స్ వివరాలు లెక్కచెప్పి మళ్ళీ తనపనిలో పడిపోయింది.

ఆశ్చర్యంగా చూస్తూండి పోయింది రత్నబాల. ఎంత సేపూ ఎప్పుడో రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్ కోసం జీవితం మొత్తం తాకట్టు పెట్టినట్టు ఉరుకుల పరుగుల మీద పనిచెయ్యడం … ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది, ఏమంటూ ఉద్యో గంలో చేరిందో కాని ఒక్కరోజైనా కడుపునిండా తిండి, కంటి నిండా నిద్ర దొరికాయా ?

ఉదయం లేస్తూనే వేడి కాఫీ తీరిగ్గా తాగే యోగమూ ఏనాడూ లేకపోయిందిపెట్టడం  అష్టావదానంలా ఓపక్క రైస్ కుక్కర్,  మరో వంక కూరలు కోస్తూ ఎన్ని సార్లు వేళ్ళు కోసుకోలేదు. మళ్ళీ అందరికీ టిఫిన్ బాక్స్ లు సర్దడం బట్టలు ఉతుక్కోడం, వంట దీంతో పాటు పేపర్లు దిద్దడం , ప్రశ్న పత్రాలు  రాయాలి , ఇంట్లోనే పిల్లల హోమ వర్క్ , క్లాస్ వర్క్ లు దిద్దాలి. నిజానికి స్కూల్లో పని చేసే ఆరున్నర గంటల సమయం కన్నా ఇంట్లో చేసే చాకిరీకి వెచ్చించే సమయమే ఎక్కువ.

అయినా ఎంత గౌరవం ఇస్తున్నారు. అసలు ఉపాధ్యాయులంటే వెట్టి చాకిరీకి మారుపేర్లా?

నిజమే , పిల్లలు పెరిగే వరకూ నానా తిప్పలూ పది కాస్త పెద్దవగానే వారి దారిన వారిని వదిలేసి పట్టించుకోకుండా, అదేనా ఈ యువత పాడైపోయెందుకు కారణం ?

అదేనా వసు ఇలా..

పనివారికి చెయ్యవలసిన పనులు చెప్పి ,అక్కడ అమ్మకానికని  ఉంచిన వాటిలో రెండు డ్రెస్ లు పాక్ చేసుకుని బయల్దేరింది చంప.

“ హాయిగా ఉందనుకో, ఏదేమైనా ప్రపంచం తల్లకిందులైనా అన్నీ వదిలేసి ఉద్యోగానికి పరుగెట్ట నవసరం లేదు. అలాగని తిని ఇంట్లో పడుకోడమూలేదు. నా సమయాన్ని బట్టి పనిచెయ్యడం . ఇందులోనూ శ్రమా , కొంత రిస్క్ ఉన్నాయనుకో , అయినా అవి ఇష్టమయినవి”

నిజమే.

తిరుగు ప్రయాణంలో రాత్రి పదింటికి బస్సెక్కిన మొదలు  రత్నబాల ఆలోచనలు తామర తంపరలుగా గతాన్ని నెమరువేసుకుమ్తూనే వుంది.

చిన్నప్పుడు పెద్దగా చదువు అబ్బ లేదు. అంతేకాదు పట్టుమని గట్టిగా నాలుగ్గంటలు చదివితే తెల్లారేసరికి జ్వరం వచ్చేసేది. పదో తరగతి పాసవడం గగనమయిపోయింది. ఒక్కో సబ్జెక్ట్ కనీసం రెండు సార్లయినా రాసిఉంటుది.

ఇహ కాలేజీ చదువులెలా వెలిగిస్తుందని తండ్రి ఇంట్లో నుండే హిందీ పరీక్షలు కట్టించాడు. నిజం చెప్పాలంటే అవి నాలుగు అక్షరాలూ ముక్కున పెట్టుకు రాసినవే.అత్తెసరు మార్కులతో పాసయినవే. అదృష్టం బాగుండి హిందీ పండిట్ ఉద్యోగం వచ్చింది. మొదటినుండీ దిగువ మధ్యతరగతి కుటుంబమే కావడంతో గంటకు తగ్గ బొంత , ఈశ్వర్రావుతో పెళ్ళీ జరిగింది.

అయితే తరువాత తరువాత గాని అతని మనస్తత్వం అర్ధం కాలేదు. ఏదో  వ్యాపారం అంటాడు, టూర్లంటాడు వారానికి అయిదు రోజులు బయట ఊళ్ళలోనే ఉండేది. వచ్చినప్పుడు ఇంటికి కావలసినవి కూరగాయలు . పళ్ళు ఒక్కోసారి బట్టలు తెస్తాడు. అయితే ఆ పధ్ధతి ఇద్దరు పిల్లలు పుట్టినా మారలేదు.  దానితో రత్న బాల బాధ్యతలు రెట్టిమ్పయాయి. ఒ పక్కన ఇల్లు వాకిలి , పిల్లలు , మరో పక్కన ఉద్యోగం.

కష్టంగానే ఉండేది.

ఎప్పుడయినా ఉన్నచోటే మరేదైనా పని చూసుకోరాదా అంటే నోరు విప్పి ఒక్కమాటా మాట్లాడేవాడు కాదు. గట్టిగా నిలదీస్తే నేలా రెండు నెలలుపత్తా లేకుండా  పోయేవాడు.

ఆడ పిల్లలు పెరిగి పెద్దయాక వారి చదువుల కోసం సిటీ లొ ఉండక తప్పని స్థితి, ఉద్యోగం మాత్రం ఊరి శివార్లలో , దాంతో న్జంగానే పిల్లల గురించి పట్టించుకునే సమయమే లేకపోయింది.

ఉదయమే ఏదో ఇంత హడావిడిగా అన్నం పప్పు వండి వెళ్తే మళ్ళీ తిరిగి వహ్చ్చేది అయిదు దాటాకే. ఈ మధ్యలో పిల్లలు స్కూళ్ళలో కాలేజీల్లో ఉంటారులే అని మనసును సరిపుచ్చుకునేది. కాని అదేమిటో పెద్ద దానికి ఎంత శ్రమపడ్డా చదువే వచ్చేది కాదు.

ఎప్పుడు అత్తెసరు మార్కులతో నెట్టుకోచ్చినా ఇంటర్ లో మాత్రం ససేమిరా కదలనని అక్కడే ఆగిపోయింది.

రాసినప్పుడల్లా ఒక్క పేపర్ మించి పాసవలేకపోడం , ఎలాగోలా డిగ్రీ అయితే సంబంధాలు చూద్దామనుకుంది .

–  స్వాతీ శ్రీపాద

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to టగ్ ఆఫ్ వార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో