నర్తన కేళి -7

 ఒక సంవత్సరం నేర్చుకుని   రెండు  మూడు ప్రదర్శనలు ఇస్తే  చాలు  అనుకునే  వాళ్ళు అసలు నాట్యం నేర్చుకోక పోవడమే మేలు . నాట్యాన్ని అభ్యసిస్తే త్రికరణ శుద్దిగా ఒక యజ్ఞంలా నేర్చుకోండి అంటున్న పార్వతి రామ చంద్రన్ గారితో ఈ నెల నర్తన కేళి ముఖాముఖి …..

 *మీ పూర్తి  పేరు  చెప్పండి ?
అగ్రహారపు పార్వతి  రామచంద్రన్ .
*మీరు ఏవయస్సు  నుంచి నాట్యం నేర్చుకున్నారు ?
నాకు పది సంవత్సరాల వయస్సు నుండి నేర్చుకున్నాను .
*ఎవరి  వద్ద నాట్యం లో శిక్షణ పొందడం ప్రారంభించారు?
సి. ఆచార్య గారి వద్ద భారత నాట్యం  నేర్చుకోవడం ప్రారంభించాను . ఆయన అక్కడ నుండి వెళ్ళిపోవడం తో  తరవాత గుడిమెట్ల శ్రీ కృష్ణ  గారి  నేర్చుకోవడం మొదలు పెట్టాను .

*భరత నాట్యం లో ఎంత వరకు ప్రవేశం ఉంది ?
గుడి మెట్ల శ్రీ కృష్ణ గారి వద్ద నేర్చుకున్న తరవాత నృత్య కళాశాలలో వాసిరెడ్డి కనకదుర్గ గారి వద్ద భారత నాట్యం లో డిప్లమో చేసాను.
*భరత నాట్యం లో డిప్లమో చేసాను అంటున్నారు ? కూచిపూడి నేర్చుకోవాలని ఎలా అనిపించింది ?
భరత నాట్యం ఆలయ నృత్యం . కూచిపూడి నాట్యం లో అభినయానికి ఉన్న ప్రాధాన్యం  ఎక్కువ . అందువల్ల నేను కూచిపూడి నేర్చుకోవడం మొదలు పెట్టాను
*కూచిపూడి ఎవరి వద్ద అభ్యసించారు?
వేదాంతం ప్రహ్లాద శర్మ గారి వద్ద , రాధేశ్యాం గారి వద్ద నేర్చుకున్నాను .
*మీ తొలి ప్రదర్శన గురించి చెప్పండి ?
రాజమండ్రి లో ని ఆనం కళా కేంద్రంలో జరిగిన  పోటిలో పాల్గోన్నాను . అప్పుడు భామా కలాపం చేసాను .
*మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు ?
మన దేశం మొత్తం మీద  సుమారుగా 600 వరకు ప్రదర్శనలు ఇచ్చాను .
*భరత నాట్యం , కూచిపూడి లో మీరు గమనించిన తేడాలు ఏమిటి ?
భరత నాట్యం అడుగులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది . అలాగని  కూచిపూడి లో ఉండదని కాదు . కూచిపూడి లో అభినయానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది . కూచిపూడి అనేది భాగవతుల మేళకి చెందినది.  కూచిపూడికి , భరత నాట్యానికి శాస్త్రం ,ముద్రలు ఒకటి గానే ఉంటాయి .తరవాత కాలంలో  కూచిపూడి మార్పు చెందింది .
*ఒకప్పటికి , ఇప్పటికి  కూచిపూడి లో వచ్చిన ప్రధానమైన  మార్పులు ఏమిటి ?
కూచిపూడిలో సోలో ప్రదర్శనలు ఉండేవి కావు . నాటక రూపంలో ఉండేది . భామా కలాపం , ఉషా పరిణయం వంటివి నాటకాలుగా ప్రదర్శించేవారు . తరవాత కాలంలో చిన  సత్యం  మాష్టారు  కూచిపూడి నాట్యన్ని మరింత మెరుగులు దిద్దారు . సోలో ప్రదర్శనలు చేయించడం మొదలుపెట్టారు . ఆడవాళ్ళకు నాట్యంలో  శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు .
*మీ ఇంట్లో  నాట్యం ప్రభావం ఎంత వరుకు ఉంది ?
నాకు ఇద్దరు  చెల్లెళ్ళు . వాళ్ళు సంగీతం నేర్చుకున్నారు .  నేను సంగీతం తో పాటు నృత్యం కుడా నేర్చుకున్నాను .

*మీరు నృత్య నికేతన్ పేరు ఎప్పుడు ప్రారంభించారు ?
నేను నృత్య నికేతన్ ని 1980లో ప్రారంభించాను . మా నృత్యనికేతన్ పేరు “కళా దీపిక” నృత్య అకాడమిని ప్రారంభించాను .
*మీ శిష్యులు పాల్గొన్న ప్రదర్శనల వివరాలు చెప్పండి ?
చిలకూరిపేటలో  జరిగిన ఆల్ ఇండియా పోటీలు ప్రధమ బహుమతి వచ్చింది . ఇంకా  రాష్ట్ర స్థాయి , జాతీయ స్థాయి పోటిలలో పాల్గొన్నాము. ఒకసారి వెంపటి పెద సత్యం గారి పర్యవేక్షణలో మా శిష్యులు భామాకలాపం  ప్రదర్శించారు.ఏలూరు లో జరిగిన యూత్ ఫెస్టివల్ లోను బహుమతులు గెలుచుకున్నాము .
*మీ నృత్య నికేతన్  ఆధ్వర్యం లో జరిగిన ప్రదర్శనలు గురించి చెప్పండి ?
ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు జరుపుతాము . ఆ వేడుకలు మూడు రోజులు జరుగుతాయి . జూనియర్స్ , సీనియర్స్ విభాగాలలో  నాట్య పోటీలు నిర్వహిస్తాము.   అలాగే సంగీతం , నాట్యం లో నిష్ణాతులైన వారిని సన్మానం  చేస్తున్నాము .  బాల మురళి కృష్ణ గారికి , శోభానాయుడు గారికి,మంజు భార్గవి గారికి చేసాము .
* మీరు భరత నాట్యం , కూచిపూడి రెండు నేర్చుకున్నారు కదా, మరి మీ శిష్యులకు రెండు శాస్త్రీయ నృత్యాలలో శిక్షణ ఇస్తున్నారా ?
లేదండి . వాళ్లకు ఏ నృత్యం పై ఆసక్తి ఉంటె దానినే నేర్పిస్తున్నాను .
* ప్రస్తుతం మీ వద్ద నేర్చుకున్తున్న పిల్లలు ఏ నాట్యం పై ఆసక్తి కనబరుస్తున్నారు ?
ఎక్కువ  మంది పిల్లలు కాని , వారి తల్లిదండ్రులు కాని కూచిపూడి నేర్చుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు . కూచిపూడి నాటక,యక్షగాన ప్రక్రియకు చెందినది  కావడంతో అది వారికి తొందరగా అర్ధమవుతుంది.అభినయానికి అవకాశం ఉంటుంది కదా అందరు కూచిపూడి నేర్చుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు.
*మీరు సిలికానాంధ్ర కూచిపూడి నాట్య సమ్మేళనానికి వచ్చారు కదా ?ఆ ప్రదర్శన పై మీ అభిప్రాయం ఏమిటి ?
నాకు చాలాగొప్ప అనుభూతి.అంత మంది ఒకేసారి, ఒకేలా నృత్యం చేస్తుంటే చూడడమే కాని మాటలే రావు.ఇలాంటి  కార్య క్రమాల ద్వారా కూచిపూడి ప్రపంచం మొత్తం తెలిసింది .  సిలికానాంధ్ర వాళ్ళు నిర్వహించిన సంగీత కార్యక్రమలలోను  మేము పాల్గొన్నాము .
*కూచిపూడి లో మొదటి నుండి వస్తున్న పూర్వ రంగం ఇప్పుడు అంతగా ప్రదర్శించడం లేదు? దీని పై మీ అభిప్రాయం ?
మీరన్నట్లు  పూర్వ రంగం కొన్ని చోట్ల ప్రదర్శించడం లేదు .  అయితే సంప్రదాయంగా కూచిపూడి ని  అభ్యసించిన వాళ్ళు ఇప్పటికి  పూర్వరంగం చేస్తున్నారు . మిగిలిన వాళ్ళు దాని పై దృష్టి  పెడితే మంచిది . అప్పుడే నాట్యం మారకుండా ఉంటుంది .
* నాట్యం లో మార్పు రావడం  మంచిది కాదంటారా ?
మార్పు రావాలి.కాని మూలాన్ని మార్చకూడదు కదా. కూచిపూడి లో ఎన్నో మార్పులు చేసారు వెంపటి చిన సత్యం మాష్టర్  గారు . ఆ మార్పులతో కూచిపూడి ఖ్యాతి ప్రపంచ దేశాలకు విస్తరించింది . అంతే తప్ప దాని ఉనికిని కోల్పోయే విధంగా చేయకూడదు అని నా అభిప్రాయం .
*మీ  వద్ద   నేర్చుకునే  పిల్ల లకు మీరు ఇచ్చే  శిక్షణ ఎలా ఉంటుంది ?
ముందుగా వాళ్లకి అడుగులు నేర్పుతాను . తరవాత చిన్న చిన్న శ్లోకాలు నేర్పిస్తూ ముద్రలు పరిచయం చేస్తాను . జతులు  తీర్మానాలు చెప్పడం ,ఆ తరవాత ప్రదర్శన చేయడానికి అనువుగా పిల్లలకి శిక్షణ ఇస్తాను .
*నాట్యం  నేర్చుకోవాలి అనుకునే వారికి మీరిచ్చే సలహా ?
మీకు ఆసక్తి ఉంటేనే నేర్చుకోవడం మొదలు పెట్టండి , నృత్యం తో పాటు సంగీతం కుడా నేర్చుకుంటే  చాలా ఉపయోగం ఉంటుంది . ఏదో ఒక సంవత్సరం నేర్చుకున్నాము ,  రెండు  మూడు ప్రదర్శనలు ఇస్తే  చాలు  అనుకునే  వాళ్ళు అసలు నేర్చుకోక పోవడమే మేలు . నాట్యాన్ని అభ్యసిస్తే త్రికరణ శుద్దిగా ఒక యజ్ఞంలా నేర్చుకోండి . త తల్లిదండ్రులు కుడా పిల్లల్ని ఆ ఆలోచనతోనే నాట్యం నేర్పించడానికి పంపించాలి .

 

మీ భావాలు , అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.నమస్తే

– అరసి 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to నర్తన కేళి -7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో