‘పత్ర చిత్రకారిణి’ లక్ష్మి సుహాసిని తో ముఖాముఖి

        లక్ష్మి సుహాసిని గారితో ముఖాముఖికి చాలా చక్కటి స్పందన రావడంతో పాటు చాలా కుతూహలంగా సమాధానాలు ఆశిస్తూ అడిగిన ప్రశ్నలు చూసాక ఈ మాసం విహంగలో కూడా ఆమె ముఖాముఖిని కొనసాగిస్తే బాగుంటుందని విహంగ భావించిన మీదట మరోమారు తన ఇంటర్వ్యూ తీసుకొని మీకు అందిస్తున్నాము.

హాట్స్‌ ఆఫ్‌ సుహాసినీ! మొత్తానికి ఒక వినూత్న కళా ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నందుకు విహంగ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది.

*     సుహాసిని మరోమారు విహంగతో ముచ్చటిస్తున్నందుకు ఎలా ఫీల్‌ అవుతున్నారు?
**  హేమ మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉంది. నా ఇంటర్వ్యూని  ముచ్చటగా అందిస్తున్న మీకు ధన్యవాదాలు. నా ముఖాముఖి చూడడమేకాక చక్కటి స్పందన తెలియజేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు.

*        సుహాసిని బహదూర్‌ గారు ప్రశ్నించినట్లు ఈ పత్రకళని కొలాజ్‌ అనవచ్చా? నిజంగా సమీప దూరంలోని పదమా?
**       నేను 1999 నుంచి చిత్రించి ప్రదర్శనలు నిర్వహిస్తున్నా, నాది ‘కొలాజ్‌’ అనే సంగతి ‘స్మైల్‌’ గారు చెప్పేదాకా తెలీదు. 2003లో ఒంగోలులో కథ 2003 ఆవిష్కరణ సభలో నా ప్రదర్శన నిర్వహించినప్పుడు నా చిత్రాలు చూసి ఆయన ‘‘కొలాజ్‌ అనేది చాలా సింపుల్‌గా అనిపించే కఠినమైన ప్రక్రియ దాన్ని ఆకులతో అద్భుతంగ సాధించారు.’’ అంటూ తన అభిప్రాయాన్ని రాశారు. ప్రముఖ కవి శివారెడ్డిగారితో కలిసివచ్చారు. అప్పటినుంచి కొలాజ్‌  గురించి అధ్యయనం చేయడం ప్రారంభించాను.

*        కొలాజ్‌ అంటే సరైన అర్ధం ఏమిటి?
**ఆ పదం వ్యుత్పత్తిని చూస్తే అది  Coller అనే ఫ్రెంచి వదంనుంచి ఏర్పడిరది. Coller  అనగా to Glue అని అర్దం. ఇది ఒక నియత కళారూపం. వేరు వేరు వస్తువుల సంకలనంతో సంపూర్ణంగా సరికొత్త రూపాన్ని సృజించడం అనుకోవచ్చు. రెండు వేరు వేరు అర్ధాలున్న పదాలు కలిసి క్రొత్త అర్దాన్నిచ్చే శబ్ద పల్లవాలలాగా
“ College is a work of formal art primarily in the visual art, made from an assemblage of different things thus creating a new form” అనే ప్రాథమిక నిర్వచనం కనిపిస్తుంది.

*        ఇంకేవరైనా నీ చిత్రాలని కొలాజ్‌గా అభివర్ణించారా?
**        అదే ప్రదర్శనలో నా ఆర్ట్‌ని చూసిన జాతీయ పురస్కార విజేత ఉల్చిగారు చూసి చాలా అభినందిస్తూ ‘‘ఇలాంటి కొలాజ్‌ నేనింతవరకు చూడలేదు. గతంలో యం.ఎఫ్‌. హుస్సేన్‌ పాత గుడ్డ పేలికలతో కథక్‌ కళాకారుని రూపాన్ని కొలాజ్‌ చేయడం చూశాను. ఆ తరువాత ఆకులతో హావభావ ప్రదర్శనలతో మీ చిత్రాల కొలాజ్‌ అంతగా సమ్మోహన పరుస్తోంది. చాలా అరుదైన ఈ ప్రక్రియని కొనసాగించండి’’ అంటూ అభినందించారు.

*        ఆ చరిత్ర కాస్త చెప్పవూ?
**        కొన్ని వందల ఏళ్ళకి పూర్వమే కొలాజ్‌కి మూలాలు వున్నా 20వ శ॥లో జార్జి బ్రెక్‌, ప్లబోపికాసో లు కొలాజ్‌ అనే పదాన్ని ఉపయోగించారు. కాన్వాస్‌, తైలవర్ణ చిత్రాలమీద నూనె కాయితాలను అతికించి వీళ్ళు తొలిప్రయోగం చేసారు. రేకు డబ్బాలని, గాజు బాటిల్స్‌ని పగిలిన టీ కప్పు ముక్కలని అతికిస్తూ ఇలా ఎన్నెన్నో ప్రయోగాలు నిర్వహించారు. భారతీయ మహిళలు కూడా రక రకాల గృహాలంకరలని ఈ తరహాలో చేసారు. గింజలు, గవ్వలు, పగిలిన గాజు ముక్కలు, పూసలు అతికించి గోడలపై అలంకరణలుగా తయారు చేయడం మనం చూస్తాము. బెంగాలీ సాంప్రదాయంలో కూడా చాలా తేలికగా ఉండే బెండుతో దుర్గ బొమ్మలను చేయడం చూడచ్చు
1919లో హెన్నా హోబ్‌ 90  144 సెంటిమీటర్లు అతికించిన పేపర్లతో చేసిన గొప్ప కళాఖండం బెర్లిన్‌లోని స్టాట్‌లిచ్‌ మ్యూజియంలో కనిపిస్తుంది. ఇది ఒక ప్రక్రియగానే కాక కళాకారుని కాన్సెప్ట్‌గా కనిపిస్తుంది. ఒక మీడియా మీద మరో మీడియాని అతికించడం కన్నా చాలా ఎక్కువ ప్రయోగాత్మకమైన ప్రక్రియ ఇది.

*        ఎక్కువ ప్రయోజనం అంటే?
**        వార్తా పత్రిక ముక్కలు అతికించడం ద్వారా బైట్‌ దైనందిన అంశాల తాలూకు సందర్భాలయొక్క స్పురణ ఆ కళాఖండానికి సరికొత్త విస్తృతిని కలిగిస్తుంది, ప్రజల జీవితాలని యుద్దాలని చిత్రించేటప్పుడు ఆ అంశమున్న పేపరు వార్తల శకలాలను అతికించినప్పుడు ఆ కళా ప్రయోజనం ద్విగుణీకృతమౌతుంది. నా చిత్రాలలో ఆకులతో కొలాజ్‌ చేయడం ద్వారా పర్యావరణ స్పృహని జోడిరచగలుగుతున్నాను. కొలాజ్‌ మీద ఒక పుస్తకం రాస్తున్నాను. ఆ సందర్భంలో సేకరించిన వివరాలివి. బహదూర్‌గారు! మీ దగ్గర తద్భిన్నంగా కొలాజ్‌ గురించిన సమాచారం వుంటే అందించండి.

*    సుహాసినిగారు కవినిగారు అడిగినట్లు మీరు ఏ ఏ ప్రయోగాలు చేసారో వివరించండి?
**        నేను ఒకే ఆకుని చిత్రంలాగా కత్తిరించి ఏకపత్ర చిత్రాలు చేశాను. 6 వేల ఆకర్షణ పత్రాలతికించి ఒకే చిత్రము చేశాను. గడ్డిపరకలతో లైన్‌ డ్రాయింగ్స్‌ వేశాను. మల్టీమీడియా కొలాజ్‌ చేస్తూ ఆకులతో పాటు టిష్యూ పేపర్లు చాక్లెట్‌ పేపర్లు, తళుకులు, గడ్డకట్టిన రంగులు, స్టికర్లు లాంటివి ఆకుల మీద అతికించి మరికొన్ని ప్రయోగాలు చేశాను. గులాబిరేకులతో పనిలో స్త్రీలు అనే థీమ్‌ మొత్తం చేశాను. తామర పువ్వు రేకులతో మరికొన్ని చేశాను. అలాగే రెండు వాటర్‌ లిల్లీపువ్పులతో బిచ్చగత్తె చిత్రాన్ని చేశాను.

*        మీకు నచ్చిన సఫలమైన ప్రయోగం ఏది?
**        నాకు నచ్చిన ప్రయోగం కా గుణింతం ఇవన్నీ ఒకెత్తైతే అక్షరాలలో స్త్రీల చిత్రాలను డిజైన్‌ చేసే ప్రయోగంగా కా గుణింతాన్ని చేశాను. స్త్రీల చిత్రాలు అన్న శీర్షికని చిలిపిగా కా భాషలో వసంత ‘‘కస్త్రీ కల కచికత్రాకలు’’ నామకరణం చేసి ఆంధ్రజ్యోతి నవ్యలో ప్రచురించారు. ఆ కా గుణింతం చిత్రాలు నడుస్తున్న చరిత్రలో ప్రచురింపబడ్డాయి.  చంద్రబాబు నాయుడు కారికేచర్‌ కష్టం మీద సాధించాను. ఆకులు చిన్న చుక్కల్లా పంచ్‌చేసుకుని కొన్ని చిత్రాలు చేశాను.

*   అలా మీ కళ తో పంచ్‌ ఇచ్చారన్నమాట?
**        నిజంగానే బ్లాక్‌ చార్ట్‌మీద తెల్లకాగితం తోటి, తెల్లని ఆర్ట్‌ పేపర్‌ మీద ఆకుపచ్చని ఆకుల పంచ్‌లతోటి చేసిన చిత్రాలు చాలా ఆకర్షనీయంగా వైవిధ్య భరితంగా వచ్చాయి.

*  మీ విదేశ యానంలో ఈ చిత్ర ప్రక్రియకు సంబందించి ఏమైనా చూశారా?

** నాలుగు గొప్ప ఆర్ట్‌ గ్యాలరీలను చూడగలిగాను హేమ. మిల్‌వాకి ఆర్ట్‌ గ్యాలరీలో ఆధునిక చిత్రకళా ప్రయోగాలు చాలా చూసాను.
టోరంటోలో పికాసో ఆర్ట్‌ గ్యాలరీని చూడటం తటస్తించింది. క్యూబిజంతో పాటు పికాసో చేసిన అనేక ప్రయోగాలు వేర్వేరు కొలాజ్‌లు అక్కడ చూసాను.
లాస్‌వేగాస్‌లో మోనె చిత్ర ప్రదర్శన చూడటంతోపాటు దాని ముందు మోనే చిత్రానికి నకలుగా సహజమైన తాజా పూలతో  కొలాజ్‌ చేసిన చిత్రాలను చూసి చాలా స్పూర్తిని పొందాను.
చికాగో ఆర్ట్‌ మ్యూజియంలో  అద్భుతమైన పేపర్‌ కొలాజ్‌ కళాఖండాలున్నాయి. దాదాపు సన్నని పెన్సిల్‌ లైన్‌ డ్రాయింగ్‌ అంత సూక్ష్మంగా న్యూస్‌ పేపర్‌లోని అక్షరాలు కత్తిరించి చేసిన అత్యంత ప్రాచీన చిత్రాలు చాలా ఆకట్టుకున్నాయి.

*        అంతర్జాతీయంగా ఈ ప్రక్రియలో ఇవ్వాళ్ళ చెప్పుకోదగ్గ డ్రైలీఫ్‌ ఆర్టిస్టులు ఎవరు?

**        డ్రైలీఫ్‌ కొలాజ్‌ ఆర్టిస్ట్‌ అకసాకి బొమ్మలని ఒకసారి బహదూర్‌గారు పరిశీలిస్తే అదే ప్రక్రియలో నా బొమ్మలు అదే పేరుతో పిలవడం సమంజసమని గుర్తిస్తారు. 2004 సం. తరువాత అంతర్జాతీయంగా కూడా ‘డ్రైలీఫ్‌ ఆర్ట్‌’ కి మంచి ఆధరణ కనిపిస్తుంది.

*        సరే సుహాసిని, అసలు మీకు ఈ ఆకుల ఆలోచన ఎలా వచ్చిందంటావ్‌?

**  కర్నూలు మహాసభలకి మా మహిళా సంఘం ఎంబ్లమ్‌ తయారు చెయ్యాలనుకుంటూ నవ్యత్వం కోసం తడుముళ్ళాడుకుంటున్న దశలో నా మిత్రురాలు ఉదయం వాళ్ళింటికెళ్ళాను. వాళ్ళపాప ఓ ఆకుకి మీసాలు, తోక పెట్టి ఉడతలా అతికించి గోడకు తగిలించింది. నన్ను చూస్తూనే చూడండి ఆంటీ! తాతయ్య నా ఉడత ఎలకలా వుందని ఎక్కిరిస్తున్నారు అంది. పోనీలే మళ్ళా ట్రై చెయ్యి బాగా వస్తుంది. అయినా నువ్వు ఉడతని చేస్తే నేను ఉమెన్‌ని చెయ్యలేనా అన్నాను. అన్నట్టుగానే రెండు రోజులు శ్రమపడి ఎంబ్లమ్‌ని ఆకులతో సాధించాను. థాంక్స్‌ టు వినీల. తన బుజ్జి బుజ్జి రెండు వాక్యాలతో 12 సంవత్సరాల గతాన్ని తళుక్కుమనిపించి నాస్టాల్జిక్‌గా నన్ను అంతర్వీక్షణం చేసుకునేలా చేసింది.

*     సరే సుహాసిని, హరీష్‌, గీత తదితరులు అడిగినట్లు నిర్జలీకరణ ప్రక్రియను కాస్త వివరిస్తావా?

**     హెర్బేరియమ్స్‌ చేసే పద్దతి     ఆకులని న్యూస్‌ పేపర్లలో పెట్టి పైన బరువు పెట్టడం ద్వారా నిర్జలీకరిస్తాను. ఆకులు, పువ్వులు త్వరగా నిర్జలీకరింపబడడానికి, వాటి రంగు అలాగే ఎక్కువ కాలం మిగలడం కోసం నాఫ్తలిన్‌ పౌడర్‌ జల్లి ప్రెస్‌ చెయ్యడంవల్ల మంచిఫలితం వుంటుంది. బూజుపట్టకుండ, సిల్వర్‌ ఫిష్‌ పురుగులు చేరకుండా ఉంటాయి.
ఒక రకంగా నేను సాంప్రదాయక పద్దతుల్లోనే నిర్జలీకరిస్తున్నాను.  అది చాలా నిదానమైన పద్దతి అయినప్పటికి 10 సం.లుగా ఆకులు పెలుసుబారలేదు. బటర్‌ పేపర్‌ మధ్యలో ఆకుని పెట్టి 5 ని.లు ఇస్త్రీ చేసినప్పుడు చక్కగా ఆకు నిర్జలీకరింపబడుతుంది. ఈ ప్రక్రియ శాశ్వతంగా హెర్బెరియమ్స్‌ చెయ్యడానికి,  విద్యార్థులకి, టీచింగ్‌ ఎయిడ్‌గా టీచర్లకీ ఉపయోగపడుతుంది. చుట్టు రెండు వైపులా బటర్‌ పేపరుండి పోతుంది. కనుక ఆకుని ఆకుగా అతికించుకోడానికి మాత్రమే ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. (నా కళకి ఇది సూట్‌ కాలేదు.)
అయితే ఆకులకు ముందుగానే ఆకృతిని ఇచ్చి పై పద్దతిలో ఐరన్‌ చెయచ్చేమో చేసి చూడాలి. ఇది మరో ప్రయోగం.
నేను మాత్రం మొదటి ప్రక్రియనే అనుసరించాను. ఆసక్తి వున్న వాళ్ళు వస్తే తప్పకుండా నేర్పిస్తాను. వీలైతే మేలో హైద్రాబాద్‌లో మూడు రోజులు వర్క్‌షాప్‌ నిర్వహిద్దామనుకుంటున్నాను.
అన్నట్టు ఆ బుద్ధుడు ఆవాలతోపాటు మెంతులు (నువ్వులు కాదు) అతికించి చేశాను. మరొక్కసారి గమనించమని మనవి *

మా పాఠకులతో ముచ్చటించి సందేహాలు తీర్చినందుకు ధన్యవాదాలు!

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , Permalink

4 Responses to ‘పత్ర చిత్రకారిణి’ లక్ష్మి సుహాసిని తో ముఖాముఖి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో