సమకాలీనం – వివాహ బంధం

           కొండపల్లి కోటేశ్వరమ్మగారి రచన నిర్జన వారధి చదివినా, అన్నపూర్ణాదేవి రచన ఏన్ అన్ హర్డ్ మెలొడీ చదివినా, నటి సారిక జీవితాన్ని చూసినా, మా పై ఇంటి పనిమనిషి జీవితం గురించి విన్నా….. ఏవీ వేరు కాదు. కమిట్మెంట్ నుండి విడదీయబడ్డ జీవితాలవి! సోషల్ కమిట్మెంట్ అంటే వివాహం. దానితో ముడిపడ్డ అంశాలు బోలెడు. సాంఘిక చట్రాన్ని పటిష్టంగా ఉంచుతుందని భావించి ప్రపంచ వ్యాప్తంగా పట్టం కట్టబడిన వివాహ వ్యవస్థ నేడు బీటలు వారిపోతోంది.

             జంతువులకు మల్లే జంట కట్టడం, సంతతిని వృద్ధి చేయడమే పని ఐతే మానవ నాగరికత, పరిణామక్రమానికి అర్థం ఉండేది కాదు. ఇప్పుడు ఒంటరి కుటుంబాలు పెరిగిపోతున్నాయి. (ప్రభుత్వం పెట్టిన పేరు) మన దేశంలో పద్దెనిమిది శాతానికి పెరిగిన వంటరి కుటుంబాలు సమాజానిపై ప్రభావాన్ని చూపవా? ఈ మార్పుకు సహజంగా అలవాటుపడే తత్వాన్ని, కమిట్మెంట్ నుండి తప్పుకుంటున్నంత తేలిగ్గా అలవర్చుకోలేకపోతున్నాం మనం. ఆర్థికంగా ఆధారపడిన భార్య/భర్త, వివాహ బంధం నుండి విడిపోయాక పడే ఇబ్బందులు ఒక ఎత్తైతే, బిడ్డల సంరక్షణ, వారి సక్రమ పెంపకం ఒక ఎత్తు. ఒక స్ట్రక్చరల్ పాటర్న్ కు అలవాటు పడ్డ సమాజంలో ఈ అసమతౌల్యం చాలా విషబీజాలను నాటుతోందని సర్వేలు చెప్తున్నాయి. కారణాలు సవాలక్ష ఉన్నా, సామాజిక అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

                    “ఇద్దరు మహిళలు ఒకచోట చేరితే, డొమెస్టిక్ గాసిప్/ కుటుంబ విషయాలు/ ఉద్యోగంలో సమస్యలు/ చీరలు, నగలు….వీటి గురించి తప్ప, వేరే విషయాలు మాట్లాడుకోవడం నేనెప్పుడూ చూళ్ళేదు! నువ్వు నాకు మహిళకు సామాజిక బాధ్యత ఉందని చెప్తావ్! చూపించు ఎక్కడుందో” అని అడిగాడు నన్నొక స్నేహితుడు. నాకు కోపం వచ్చిన మాట వాస్తవం.

             “మహిళ ఒక బంధానికి ఎంత కమిటెడ్ గా ఉంటుందో నీకు తెలుసా? కుటుంబం, పిల్లలు, భర్త అనే మాట్లాడుతోందంటే ఆమె ఆ విషయానికిచ్చే ప్రాముఖ్యత, ఆమె జీవితమే కుటుంబమని ఆమెను నిండిపోయిన భావన అని ఆలోచించవా? అయినా కుటుంబాన్ని మించిన సామాజిక బాధ్యత ఏముంది? ఆ కుటుంబం నుండే కదా సమాజం ఏర్పడుతుంది?” అంటూ క్లాసు పీకాను.

              కానీ, వివాహ బంధం నుండి బయటకు వచ్చిన మహిళలను ఇంటార్వూ చేసినపుడు మనసంతా చేదుగా ఐపోతుంది. వారు సమాజ పరిస్థితులను స్టడీ చెయ్యరు. తమ పరిధి దాటి దేశ కాలమాన పరిస్థితులకు తమ వంతు సహకారం గురించి ఆలోచించరు. బ్యాంకు లావాదేవీలు గానీ, ఆర్థిక వ్యవహారాలు గానీ పట్టించుకోరు. సమాజ మార్పులకు అనుగుణంగా తమను తాము మలచుకోరు. ఒక్కసారిగా వైవాహిక బంధం నుండి బయటికి వచ్చినపుడు అన్నీ తామే సమర్థించుకోవాల్సి వచ్చినపుడు అగమ్యగోచరమైపోతుంది. అంతా అస్తవ్యస్తమనిపిస్తుంది. అప్పుడు ఆత్మహత్యలకు పాల్పడుతారు లేదా తోచిన విధంగా జీవించి, ఒక అర్థం లేని జీవితాన్ని, పొంతన లేని వైరాగ్యంతో గడిపేస్తారు.

             నిజమే, సమాజంతో నడవాలి. విషయాలన్నీ తెలుసుకోవాలి. ఏ రోజు ఎటువంటిదో తెలియనపుడు దేశంలోని పౌరురాలిగా ప్రతి విషయానికీ స్పందించాలి. ఇలా వ్యక్తిత్వం వెలుగొందినపుడు జటిలమైపోతున్న వైవాహిక సమస్యలను కూడా స్త్రీ పరిష్కరించగలదు….బయటపడాల్సి వచ్చినపుడు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కోగలదు!

   – విజయ భాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో