ఆమె

 

 నెల .. నెలా
అటూ .. ఇటూ
పెద్ద కొడుకు ఇంటి  నుంచి
చిన్న కొడుకు ఇంటికి
చిన్న కొడుకు ఇంటి  నుంచి
పెద్ద కొడుకు ఇంటికి

తనుసు కుంటూ .. తనుసు కుంటూ .. తిరుగుతుంది
సుమారు దశాబ్దంగా
తోడై నిలిచినా పెనిమిటి
అర్దాంతంగా  బతుకు బాట నుంచి  తప్పుకున్న విషాదం
నడీడు .. నాను వాలైన  జీవితం
పొడుచుకు తింటున్న .. జ్ఞాపకాలు
ఇద్దరు  పిల్లల్ని పట్టుకొని
పొద్దు పొడిచిన దగ్గరున్న  బతుకున
ఈదులాడుతూ  దారిని చేరింది

ఉడిగిన …  వయస్సు
ఇల్లును  ఆస్తిని  రెక్కల కష్టాన్ని
వచ్చే  వజీఫను … తన యిష్టా ఇష్టాలతో
నిమిత్తం లేకుండా ఏంచుకొన్నారు

ఓ ముద్ద  చారెడు నీళ్ళు  పోసేదానికి
చెరో నెలగా  వంతు లేసుకున్నారు
దయ తలచి ఎప్పుడన్న ఒకసారి  పోనీ
రెండు గుక్కల చాయ కోసం
ఆశను నింపుకున్న కళ్లతో
నోట్లో నీరూరంగా  దవడలాదిస్తుంది
ఏం పిల్ల గందేశం .. అంటున్న ఈసడింపుల  మధ్య

కండ్లు బైర్లు కమ్మినా
చాతనయినా .. గాకున్నా
ఆట్టే ఆసరాతో
పోద్దుతోనే లేచి .. తోచిన పని చేసిపెట్టినా
ఆమెకు వచ్చే సరికి .. కట .. కట
పెట్టేతందుకు ముందటికి రాని  చేతులు
పైసలేని  వెట్టి చేత

మనస్సుతో నిండిన ఓ ఓదార్పుకూ
ప్రేమతో కూడిన ఓ ముచ్చట కొరకూ

ఎంచుకోరిక .. అంక్షల వారసత్వపు
కంచె లోపల పాణం నవిసి పోతున్నా
కన్నీటిని తుడుచుకొంటూ
పిల్లి పిల్లోలే ..  ఆ యింటికి .. ఈ ఇంటికి
తిరుగుతూనే ఉంది
వార్ధక్యపు వాకిట్లో
అతడుగా మిగిలి ఉంటే  ఉపయోగం తక్కువని
ఆమెగా తగిలి ఉంటే ఆసరా ఎక్కువన్న .. లౌక్యం
ఒక్క రోజు ఎక్కువైనా
రెండవ ఇంటిలో  పనులెక్కడివక్కడ్నే
నెల కాగానె  ఎదిరి చూస్తుంటారు
ఆమె చేత కోసం

ఆమె ఎవరైతేనేమి
ఆమె ఏమైతేనేమి
రిటైర్ అయిన ఉద్యోగిని అయినా
ఇంటి పనుల్లోనుంచి దిగిపోని  అమ్మ

గ్రుంకుతున్న  ప్రొద్దుకేసి
నడుస్తున్న
ఏ తల్లి అయినా కావచ్చు.
(
వార్ధక్యపు వాకిట నిల్చుని కుటుంబానికై  సర్వం ధారపోస్తున్న తల్లులకు )

– కొలిపాక శోభారాణి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

 

కవితలు, , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to ఆమె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో