ప్రాణహితవై ప్రవహించు

అగ్ని ప్రవాహమైన ఓ అంబేద్కరా
ఇగ  తెలంగాణా ప్రాణహితవై
ప్రవహించు మహొదయా
సుజల స్రవంతి గీతమై  ధ్వనించు
తెలంగాణా చిరకాల స్వప్నమై ఫలించు
తొలకరిలా పులకరింతలు చిలకరించు ..

చిన్న రాష్ట్రాలను సమర్ధించిన
మహాధినేతవు  నీవు
రాజ్యాంగ రూప శిల్పకర్తగా
జ్ఞానోన్నత సృజనుడివి నీవు
తెలంగాణా ప్రత్యేకతను గుర్తించిన
దార్శనిక సాహసికుడివి నీవు ..

బోధిసత్వుని ఆధునిక భారత వారసుడా
నవ బౌద్ధ  దమ్మ ఆచరణాత్మకుడా
నీవుంటే మా కష్టం తీరేది
కొండంత అండగా నీ గుండె బలం
మాకూ అబ్బేది
నీ ఒక చేత బతుకు ప్రపంచ గ్రంథం

మరో చేతి  చూపుడు వేలు
చూపేను మన కర్తవ్య సమరాంగనం ..
బాబా సాహెబ్ ! బహుజన సేనా నాయక్
నీ పేరున మహా జల తరంగాల ఉరులింక
ఆదిలాబాద్ ను  అదుముకొని
ఆశీర్వదిస్తాయి
రంగారెడ్డి మట్టి దారులంట
జలకాలాడుతూ  జల కళలు
ధూం ధాం  జేస్తాయి
మాడిపోయిన రైతు ముఖం మీద
ఒక చల్లని నీటి చిలకరింపు
చిరునవ్వై ఓదార్పు నిస్తుంది
ఓడిపోయిన సేద్యగాని  నాగలి
ఒక కొత్త పదునుతో  భూమిని దున్నేస్తుంది

సుగమ మార్గమున తెలంగాణా
వానకారు కోయిలలు ఎలుగెత్తి
యవుసం పాటలు పాడుకుంటయి
గడ్డి చిలుకలు గుంపులుగా
పంట పొలాల గట్ల మీద చేరి
బురదనేలను ముద్దాడి
ముచ్చట్లాడుకుంటయి

అంబేద్క రా!ఆయకట్టుల ఆయువు పట్టువై
ఆశలు పండించు
జలధారల గలగల విద్యుత్ వై  ఆవహించు
సస్యశ్యామల సంగీతమై మా ఏడు జిల్లాల
ఎడారి  బతుకుల్ల నవ్వులు పూయించు

ఇక తెప్పరిల్లవమ్మా  తెలంగాణ మ్మా
నీ ప్రాణాలను నిలబెట్టేందుకు
శిరమెత్తిన ఉద్యమ పతాకమై
అంబేద్కరుడే  నీటి ప్రాజెక్టుగా
నిప్పులను తడుపుతూ నీరై
సంతసాన మెరిసే కన్నీరై
వస్తున్నాడమ్మా నీ బిడ్డడిగా
తెలంగాణ మ్మా ఆహ్వానించంమ్మా
మనకు కాలం కనిస్తున్న ప్రేమయోధున్ని
అనురాగాలు మీటే  ఆ అమలిన పుత్రుల్ని
ప్రాణ హితవై  ప్రవహించమని …

– అనిశెట్టి రజిత 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to ప్రాణహితవై ప్రవహించు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో