స్త్రీ యాత్రికులు

చీకటి ఖండంలో సాహసయాత్రలు చేసిన
మేరీ కింగ్‌స్లీ  

                     మేరీ కింగ్‌స్లీ ఇంగ్లండులోని ఇస్లింగ్‌టన్‌ అనే పట్టణంలో జన్మించింది. మధ్య తరగతి కుటుంబం. ఇంటి వద్దనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద చదువులకి వెళ్ళలేకపోతుంది. అమ్మకి, తమ్ముడికి అనారోగ్యం కాబట్టి వారి బాగోగులు చూస్తూ ఇంట్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమయానికి వారికి మందులు ఇంజక్షన్లు, తిండీ తిప్పలు అన్నీ సమకూర్చాల్సిన బాధ్యత తనదే. అయినా ఆ ఇద్దరినీ వదలకుండా క్షణం ఉండకూడదు అనేది ఆమె నిర్ణయం.   

                      తండ్రి జార్జి కింగ్‌స్లీకి దేశాల వెంట తిరిగే ఉద్యోగం. ఇంటి పట్టున ఎప్పుడూ ఉండేవాడు కాదు. భౌగోళిక విషయాల మీద అవగాహన కోసం ఇంగ్లండు ప్రభుత్వంచేత ప్రత్యేకంగా నియమింపబడిన ఆఫీసర్‌. ఆ సుదూర ప్రాంతాలనుండి ఆయన రాసే ఉత్తరాలే అందరికీ సంతోషాన్ని కలిగిస్తూ ఉండేవి. క్రమం తప్పకుండా డబ్బు మాత్రం ఇంటికి వస్తూ ఉండేది. ఆయనేమో రెండు మూడు నెలలకి ఒకసారి ఇంటికి వచ్చేవాడు. ఆ కాసిని రోజులు మేరీకి వివిధ దేశాల గురించి తండ్రి చెప్పే విషయాలు పరమా నందం కలిగించేవి. తాను తండ్రితో పాటే స్వేచ్ఛగా తిరిగినంత ఆనందం పొందేది. ‘డాడీ, ఈసారి నేను కూడా నీతో వస్తాను’ అని ఎన్నిసార్లు బతిమలాడి ఉంటుందో ఆ చిన్నారి!.   

                     అలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. తన తోటివారందరికీ పెళ్ళిళ్ళై, తల్లులైపోతున్నా తనకి అలాంటి ముద్దూ ముచ్చటా ఏమీ లేకుండా పోతుంది. బాధ్యతలకి బందీ అయిపోయి ఇంట్లో తండ్రి పాత్ర ఆమె పోషించాల్సి వచ్చింది. శ్రవణ కుమారుడి మాదిరిగా తల్లికీ, తమ్ముడికీ సేవచేయటమే ఆమె జీవితానికి మిగిలిపోయింది. ఈ విధంగా మేరీకి ముప్ఫై సం||లు వచ్చేవరకు ఎంతో ఓపిగ్గా, ఇంటి భారాన్ని మోసుకొంటూ వచ్చింది.

              ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని దుర్ఘటనలు జరిగాయి. దూరాన తిరుగు తున్న తండ్రి, అనారోగ్యపు తల్లీ, మంచం దిగలేని తమ్ముడు అందరూ కొన్ని వారాల తేడాతో మరణిస్తారు.దిగ్భ్రాంతి కలుగజేసిన ఈ సంఘటన మేరీని కుంగతీయటమే కాకుండా ఆమెని ఒంటరిదాన్ని చేస్తుంది. ఎంతో బాధపడింది. మాట చెప్పుకోవటానికి మనుషులు కరువయ్యారు. డబ్బులేదు. ఇల్లు అప్పులవారి పాలవుతుంది. తనకి పెద్దగా విద్యార్హతలు లేవు కాబట్టి ఏ ఉద్యోగమూ చెయ్యలేదు. జీవించటం ఎలాగా? అనే బరువైన ప్రశ్న కింద సతమతమై పోతున్న సమయంలో, మేరీ నాన్నగారి మిత్రులు, కొలీగ్స్‌ జోక్యం చేసుకొని ఆమెను లండన్‌లోని బ్రిటీషు మ్యూజియం అధికారుల వద్దకి తీసుకుని పోయి, పరిస్థితుల్ని వివరిస్తారు. ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అర్జీపెట్టు కొంటారు.  

                  మేరీ తండ్రి చేసిన సేవలు మ్యూజియం వారు మరచిపోలేదు. అందుకని మానవతా దృష్టితో ఆలోచించి మేరీకి ఉద్యోగం ఏర్పాట్లు చేస్తారు.గుండెలనిండా ఊపిరి పీల్చుకొన్నట్లయింది మేరీకి. ఉద్యోగం అయితే దొరికింది కానీ, తాను పని చేయవలసింది మాత్రం పశ్చిమ ఆఫ్రికాలో. ‘అక్కడికి వెళ్ళటానికి ఇష్టపడితేనే ఉద్యోగం ఇస్తాం’ అని ముందు నుండే చెబుతున్నారు మ్యూజియంవారు.  

                  మేరీకి ఏదో ఒక ఆసరా దొరకటమే గొప్ప. సుదూరాన ఉన్న ఆఫ్రికా వెళ్ళటానికి వెంటనే ఒప్పుకొంటుంది. లండన్‌లోని ‘నేచురల్‌ హిస్టరీ మ్యూజియం’ కోసం ఆఫ్రికా సరస్సుల్లో దొరికే చిత్రమైన చేపల్ని, వింత జీవుల్ని పట్టుకురావటమే మేరీ ఉద్యోగం. ఆమె వెళ్ళవలసిన ఆఫ్రికా దేశాల్లో అప్పటికే బ్రిటీషువారి కాలనీలు ఉన్నాయి కాబట్టి, దూరమైనా భయ పడాల్సిన పనిలేదు. ఎలాగూ ఆమెకి స్థానికుల్ని సహాయకులుగా ఇస్తామం టున్నారు.ఇలాంటి పరిస్థితులు మేరీకింగ్‌స్లీ ని ఒక గొప్ప యాత్రికురాలిగా మార్చివేసాయి. ముప్పై సంవత్సరాలుగా ఇల్లువదిలి బయటికి వెళ్ళని మేరీకింగ్‌స్లీ చరిత్ర సృష్టించబోయే తన ఆఫ్రికా యాత్రలకి 1892 వ సం||లో బయలుదేరింది. తండ్రి చేసిన ఉద్యోగంలాంటిదే తనకు దొరకటం తన అదృష్టం. చిన్నతనంలో తాను కన్నకలలు అన్నీ ఒక్కసారిగా నిజమవబో తున్నందుకు మేరీ ఎంతో ఆనందపడింది. ఆమె జీవితం అంతా ‘తిరగటం’ అనే కేంద్రం చుట్టూ తిరగాల్సి వచ్చింది.  

                    లోగోస్‌ అనే ఓడమీద ఆఫ్రికాకి బయలుదేరిన కింగ్‌స్లీకి వ్యాపార స్థులు, ప్రభుత్వాధికారులు, మత ప్రచారకులు పరిచయమవుతారు. ఆమె వారితో ఎంతో స్నేహంగా మెలగటంతో తమ ఆఫ్రికా అనుభవాల్ని ఈమెకి వివరిస్తారు. ఆయా ప్రదేశాలగురించి వాళ్ళు చెప్పే ప్రత్యక్ష అనుభవాలు ఎంతో విలువైనవిగా గుర్తిస్తుంది. అవన్నీ మేరీలో కుతూహలాన్ని కలిగిస్తాయి.ఆఫ్రికాలో తిరగాలంటే వస్తుమార్పిడి, నదులు దాటే విధానాలు, ఆహారం సంపాదించే మార్గాలు వీటి గురించి తెలిసి ఉండాలని గుర్తిస్తుంది. ఓడమీద ఉన్నన్ని రోజులు ఒక్క నిమిషం వృధా చేయకుండా బోలెడంత విషయ సేకరణ చేస్తుంది. మరీ ముఖ్యంగా క్రూ-ఇంగ్లీషు అనే భాషని మాట్లాడేవారు ఆఫ్రికాలో ఎదురౌతారనీ తెలుసుకొంటుంది. ఆ భాష రాకపోతే వారితో మెలగటం కష్టం అని గమనించగలుగుతుంది.  

                            లోగోస్‌ ఓడ పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ఫ్రీ-టౌన్‌ చేరగానే ఎదురైన వాతావరణం అంతా మహా దుర్గంధంగా ఉంటుంది. బురదమట్టితో కట్టిన ఇళ్ళు, ఈగలమోత, విషజ్వరాలు పుట్టించేదోమల గుంపులు ప్రత్యక్షమవు తాయి. పరిసరాల్లో నిరంతరం వర్షాలే. దట్టమైన పొగమంచు. అలాంటి పరిస్థితులు చూసిన తర్వాత ఎంత ధైర్యవంతులైనా వెనకడుగు వెయ్యా ల్సిందే. ఎంతటి ఉత్సాహమైనా నీరుగారిపోవాల్సిందే.  

                         కానీ మేరీకి ఇదంతా చాలా తమాషాలాగా అనిపిస్తుంది. వారం రోజుల పాటు ఓడమీదే గడిపిన తర్వాత అక్కడ పేరుకుపోయిన మంచు అంతా కరిగిపోయి, అందమైన ఆఫ్రికా ప్రకృతి తలుపు తెరుచుకుని మేరీకి ఆహ్వానం పలుకుతుంది. వెంటనే పోర్చుగీసు వారి ఆధీనంలో ఉన్న అంగోలాలోని ‘లోండా’ అనే చోటుకి వెళ్ళి, అక్కడి స్థానికులతో ఉండ టానికి సిద్ధపడి తన విధి నిర్వహణా కార్యక్రమాలు మొదలు పెడుతుంది. ఆకాశాన్నంటే చెట్లూ, విశాలమైన సరస్సులూ, వాటిలో సింగా రించుకొనే మేఘాల గుంపులు, తొలిచిన కొయ్య దుంగల్ని పడవలుగా చేసుకుని ప్రయాణాలు చేసే స్థానికులు, తుంగతో తయారైన తెరచాపలు, ఇవన్నీ చూసిన మేరీకి తానొక వింతలోకంలో ఉన్నట్లుగా అనిపించింది. అలాంటి పడవల్లో ప్రయాణం చేసి అరుదైన చేపలు, ఇతర జలచరాలు పట్టి ఎప్పటికప్పుడు వాటిని మ్యూజియంకి పంపిస్తూ ఉంటుంది మేరీ.  

                          అలాగా ఒకసారి చేపలు పడుతున్నప్పుడు పెద్ద ‘క్యాట్‌ ఫిష్‌’ దొరుకు తుంది ఆమె వలకి. అంత బరువైన చేపని బయటకి లాగే ప్రయత్నంలో పడవ బ్యాలెన్సు తప్పి సాంతం తిరగబడుతుంది. ఆ ఊపుకి మేరీ వెళ్ళి దూరంగా ఉన్న బురదగుంటలో కూరుకుపోతుంది. సమయానికి మేరీ నీగ్రోస్నేహితులు పక్కనే ఉండబట్టి బతికి బయట పడుతుంది.మరోసారి తాను ఒంటరిగా పడవమీద వెళ్ళాల్సివస్తుంది. ఇంతలో ఒక మొసలి మెల్లగా ఆమె పడవ వెనక్కి వచ్చి చివరి భాగాన్ని పళ్ళతో బరకటం ప్రారంభిస్తుంది. ఇది గమనించిన మేరీ, పడవ సమతౌల్యం తప్పకుండా మెల్లగా వెనక్కివచ్చి తెడ్డుతీసుకుని, దాని ముట్టె మీద ఒక్క వేటు వేయగానే ఆ దొంగమొసలి నీటికిందకి పారిపోతుంది. ‘నాతో కాస్త పరిచయం పెంచుకుందామని వచ్చినట్లుగా ఉంది ఆ మొసలి. నాకు అంత తీరిక లేదు’ అని కాస్త గట్టిగా చెప్పాల్సి వచ్చింది అని తన డైరీలో రాసుకుంది వ్యంగ్యంగా. ఇలాంటి భయానకమైన అనుభవాలు ఎదురవు తున్నాసరే ఆ పరిసరాల్ని అంటిపెట్టుకుని ఉండేదేకానీ ఎప్పుడూ అధైర్య పడలేదు మేరీ కింగ్‌స్లీ.    

                       దట్టమైన అడవిప్రాంతాల్లో తిరిగేటప్పుడు మేరీకి క్రూ-ఇంగ్లీషు మాట్లాడే ఆఫ్రికా ఆటవికులు తారసపడతారు. క్రితంలో ఐరోపా వారికి అలాంటివారితో పరిచయం ఎప్పుడూ జరగలేదు. మేరీ తన ధైర్యంతోనూ, తెలివితేటలతోనూ వారి హృదయాల్లో స్థానం సంపాదించగలిగింది. వారి మట్టిగుడిశెల్లో నిద్రపోయేది. వారు తినే ఆహారానికి అలవాటుపడింది. వాళ్ళు మానసికంగా బాధల్లో ఉన్నప్పుడు ఆసరాగా నిలిచి ధైర్యాన్ని ఇచ్చేది. శారీరకంగా జబ్బులతో బాధపడుతూ ఉన్నప్పుడు వైద్యం చేసేది. ఆర్ధికంగా కూడా వారికి తన వంతు సాయం అందించేది. తాను వారికి వైద్యం చేస్తున్నప్పుడు స్థానిక మంత్రగాళ్ళతో కూడా స్నేహంగా ఉండేది. ఎందుకంటే స్థానిక ప్రజలకి జబ్బులు వస్తే అవి దెయ్యాల వలన వచ్చాయని భావించి, మంత్రగాళ్ళ వద్దకి వెళ్ళేవారేకాని ఆధునిక వైద్యానికి ఒప్పుకునేవారు కాదు. అందువలన వారి సాంప్రదాయ వైద్యాన్ని గౌరవిస్తూనే వారికి అల్లోపతి వైద్యం చేసేది.  

                ఈ విధంగా చాలా మంది స్ధానికులకి సహాయం చేయటం వలన, తన ఒంటరి ప్రయాణాల్లో వారి సహాయం మేరీకి లభించేది. పుస్తకాల్లో వర్ణించినట్లుగా ఆమెకి ప్రమాదభరితమైన వ్యక్తులు ఎవరూ తారసపడనందుకు ఆశ్చర్యపడిందికూడా. అందుకని తన చుట్టుతా ఉండి తనకు సహాయం చేసిన వారినే తన బంధువులు, సోదరులు అనుకొంది అక్కడ ఉంటున్న సమయంలోనే ఆ ప్రజల ఆచారవ్యవహారాలు, సాంప్రదాయాలు, పూజా విధానాలు, ఆదిమ సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప వస్తువులు, దేవుళ్ళ విగ్రహాల గురించిన విషయ సేకరణ చాలా చేయగలిగింది. తనకు తెలియకుండానే ఒక యాంత్రోపాలజిస్టుగా పని చేయటం ప్రారంభించింది.   

                    ఈ విధంగా తన విలువైన కాలాన్ని వారి మధ్య గడుపుతూ, అక్కడి వస్తువుల్ని లండన్‌ మ్యూజియంకి పంపిస్తున్న మేరీని అధికారులు ఎంతగానో మెచ్చుకొంటారు. అప్పటినుండీ ఆమెకి ప్రత్యేకమైన దుస్తులు, రక్షణ కూడా కల్పిస్తారు. ఆ ప్రోత్సాహంతో మరికొన్ని నెలలు అంగోలాలో ఉండి, 1893 వ సం||లో లండన్‌ తిరిగి వచ్చిన మేరీ కింగ్‌స్లీని అందరూ మెచ్చుకొని, ఆమెను ఒక జాతీయ సంపదగా గుర్తిస్తారు.  

                    లండన్‌లో కొంతకాలం విశ్రాంతి తీసుకున్న మేరీ తన రెండవ ఆఫ్రికా యాత్రకి 1894 వ సం||లో డిశెంబరు ఇరవై రెండవ తేదీన బయలు దేరింద్ష్మి తన దేశానికి గొప్ప కీర్తిని తెచ్చే వస్తువులు తేవాలనే గొప్ప ఆలోచనలతో. బతంగా అనే రాయల్‌ ఆఫ్రికావారి ఓడమీద ప్రయాణంచేసి కలబార్‌ నదీతీరంలో ఆగుతుంది. అదే ప్రదేశంలో మేరీ స్లెస్సర్‌ అనే క్రైస్తవ మిషనరీ ఆవిడకూడా ఉండటంతో మేరీ పరిశోధన మరీ సులువుగా మారింది. స్లెస్సర్‌ వలన మేరీ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుని జాగ్రత్తపడుతుంది.   

                     కలబార్‌లో ఉండగానే మేరీకి ‘ఎగ్బో’ అనే ‘రహస్య ఆఫ్రికా సమాజం’ గురించి తెలుస్తుంది. ఆనాటి ఆఫ్రికాలో ఇలాంటి సమాజాలు చాలా పనిచేస్తూ ఉండేవి. అలాంటివారికి సమాజంలో గౌరవం కూడా ఎక్కువే. ఆ సభ్యులంటే అందరికీ భయం. వారి సమాజంలో నరబలి ఉండేది. పైగా నరమాంసాన్ని తినటంకూడా వారికి అలవాటు మేరీ ఒకసారి ఆ పరిసరాల్లో ఒంటరిగా ప్రయాణం చేయవలసి వస్తుంది. అంతా అడవిమార్గం. ఎత్తైన చెట్లవరుసలు. అకస్మాత్తుగా ఆ చెట్ల చాటునుండి ఆ రహస్య సమాజం వారు కనిపిస్తారు. వెంటనే మేరీ ఒక పెద్ద పొదచాటుకి వెళ్ళి దాక్కుంది. తనని వారిలో ఎవరైనా చూశారంటే ప్రాణాలు దక్కవని తెలుసు. అయినాసరే ప్రాణాలకి తెగించి, వారి కర్మకాండ చూద్దామని ఊపిరి బిగపట్టుకుని ఆ పొదలచాటు నుండే అంతా చూస్తూ ఉంటుంది.   

                     పులితోళ్ళు కప్పుకున్న పదిమంది నీగ్రోలు డప్పులు మోగించు కొంటూ వస్తుంటే, వారికి మధ్యగా ఇద్దరు ఒక పెద్ద ఖాళీ పెట్టెను తేలిగ్గా మోసుకుంటూ అరుస్తూ వస్తుంటారు. అందరూ ఒక దట్టమైన పొదవెనక్కి వెళ్ళి, ‘ఏమే, ఓ పెద్ద భూతమా, నీవు వెంటనే వచ్చి ఈ పెట్టెలో కూర్చోవాలి. ఇది మా సమాజ ఆజ్ఞ’ అంటూ గుండెలు దద్దరిల్లేలా భయంకర శబ్దాలు చేస్తూ ఊగిపోతుంటారు. కాసేపటికి ఆ పొదల్లోంచి మనిషికంటే కాస్త భిన్నమైన స్వరంతో కీచుగా అరుస్తూన్న ఒక ఆకారం వారి ఖాళీ పెట్టెలోకి వెళుతుంది. పెట్టెను మోస్తున్న ఆ ఇద్దరికీ అది లేవదు. మరో ఇద్దరు దృఢకాయులు అవసరమవుతారు ఆ పెట్టెను పైకి లేపేందుకు. డప్పుల శబ్దం, నాట్యం అంతా వారి వెనుక సాగిపోయింది. ఈ సొసైటీ పేరు ‘లియోపార్డ్‌ సీక్రెట్‌ సొసైటీ’ (చిరుత పులుల రహస్య సమాజం). ఇలాంటి భయానక సంఘటనలు జరిగే ఆనాటి ఆఫ్రికాలో తిరగటానికి ఎంత గుండెధైర్యం అవసరమో అంతా మేరీ కింగ్‌స్లీకి ఉంది.   

                      ఒకసారి తనమీదకి దూకిన చిరుతపులిని మట్టికుండతో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకోసారి చిరుత ఎదురైనప్పుడు జాలిపడి దాన్ని కొట్టకుండా పెద్దగా అరిచి తిడుతుంది. అది వెంటనే తోక ముడుచుకొని దూకి చెట్లలోకి పోతుంది. కానీ ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు మేరీకి మంత్రశక్తి ఉందని నమ్ముతారు. అప్పటి నుండి మేరీని వారు దెయ్యం మనిషి అనే ముద్దుపేరుతో పిలిచేవారు.  

– ప్రొ .ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

One Response to స్త్రీ యాత్రికులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో