ఇప్పుడు వ్రాయండి భారతాన్ని!

ఎలుకలు కొట్టిన రత్నకంబళం
ఇప్పుడు నా భరత దేశం
చెప్పుకోవడానికే తప్ప
కప్పుకోవడానికి లేదు
దండెత్తి వచ్చిన చుండెలుకల కన్నా దారుణం
ముంగిలి మూషికాల ముచ్చిలితనం
రాబందుల రెక్కల నీడల్లో
రాజకీయం కొనసాగినప్పుడు
రాచనగరుల్లోని రాజవీధుల గుండా వెళ్లే వాహనాలు
చిత్తకార్తి శునకాల కీచక మందిరాలవుతాయి
ఉద్యోగాల వీధుల్లో గ్రామ సూకరాలు
వీర విహారం చేస్తుంటాయి
ఖద్దరు వన్నె పులులు
ఖనిజాలు కాజేస్తుంటాయి
మతోన్మాద మద్యం మత్తులో
జనసమ్మర్దపు కూడళ్లలో
భీభత్సం సృష్టిస్తాయి
ఎద్దుపుండును పొడవటమే తెలిసిన కాకులు
ఖాకీలై కావు కావు మంటుంటాయి
నా చిన్ని పొట్టకు ఏ పక్షం రక్ష అనిచూసే
జిత్తులమారి సృగాలాలు
రోజుకో రంగులో తోకల్ని ముంచుకొని
జండాలు మారుస్తుంటాయి
శివ భక్తిని అడ్డంపెట్టుకుని
రావణానుచర గణాలు బంగారు లేళ్ల రూపాల్లో
వీధి భజనలు చేస్తుంటాయి
తాము బొక్కుతున్న బొక్కసం గుట్టు తెలియనీయకుండా
పందికొక్కులు పదవుల పతంగులెగరేస్తూ
జగడాల రగడలు సృష్టిస్తాయి
మొన్న ఒక కుంభకోణం
ఆవలి మొన్న అతివ మానభంగం
నిన్నటికి నిన్న ఒక అభాగ్యనగరంలో
గుండె గుర్తు గూడెం కూడలిలో
మునిమాపు వేళ మృత్యువు
కూడుపెట్టెలో మేకుల మలారమై
జోడుచక్రాల కాలుని దున్నపోతై వచ్చి
అభం శుభం తెలియని అమాయకుల శరీరాలను
మాంస శకలాలుగా కకావికలు చేసిన వైనం
ఎవ్వరి పాప ఫలం?
అమావాస్యకు అఫ్జల్ గురుకు ముడి ఏమిటి?
ఉరికొయ్యకు ఎదురేగే వాడి ఊసైనా తెలియని
పిచ్చుకల పై ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగం ఎవరి నిర్వాకం?
ఎప్పుడు చేతులు కాలుతాయా ఎప్పుడు ఆకులు పట్టుకుందామా
అని ఎదురు చూసే డూ డూ బసవన్నల యంత్రాంగం
కొమ్ములూపడానికే పనికొస్తుంది
ఓ వైపు జరిగిన భీభత్సాలకు
రబ్బరు ముద్రల పరామర్శల పలకరింపులు
మరో వైపు వియత్తలానికి పంపే వ్యోమనౌకకు
హారతులు పట్టే రాజముద్రల పులకరింపులు
భూగ్రహం మీది ఆగ్రహాలు చల్లార్చ లేనివాళ్ళు
గ్రహాంతర గమ్యాలను వెదుకులాడుతుంటే
నవ్వాలో ఏడ్వాలో తెలియక సతమతమయ్యే
శాంతి కాముక క్షతగాత్ర పారావతాలు
తమ నిరసనను తెలుపడానికి
ఒళ్ళంతా నలుపు చేసుకుని
విషాద గీతికలాలపించే కవి కోకిలలు
వాడి ఆటలు సాగుతూనే ఉంటాయి
గద్దెల మీద వాలిన గద్దలు
తమ కలల సాకార పూజకు
పథకాల పంచదార పలుకులు వెదజల్లుతాయి
చీమల బారులై ఓటర్లు వాటిని ఏరుకొవడం లోనె
స్వాతంతర్యానికి షష్టి పూర్తి జరిగి పోతుంది
ఒక్క శకుని మామ దుష్టచతుష్టయాన్ని ఉసికొల్పినప్పుడు కాదు
నన్నయ్యా! ఇప్పుడు రాయి మహాభారతం
ఒక్క ద్రౌపది వలువలూడ్చిన దుశ్శాసనుడో
చెరబట్ట జూచిన కీచకుడో ఉన్నప్పుడు కాదు
తిక్కన్నా! ఇప్పుడు రాయి భారతం
అప్పుడు ధ్రుతరాష్త్రు డొక్కడే గుడ్డిరాజు
వేలాది మంది అధికార మదాంధులైన
ధూర్త రాష్ట్రులు ప్రబలిన
ఇప్పుడు పూరించు ఎర్రన్నా!
అరణ్యరోదన పర్వ శేషం
కవిత్రయమా! ఇప్పుడు వ్రాయండి
ఈనాటి రాజకీయ భారతం

– తుమ్మూరి  రాంమోహన్ రావు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, పురుషుల కోసం ప్రత్యేకం, Permalink

7 Responses to ఇప్పుడు వ్రాయండి భారతాన్ని!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో