సుకన్య

శ్రావణమాసం ఆకాశంలో దట్టంగా మబ్బులు కమ్మాయి. ఏ క్షణానయిన వర్షించటానికి సిద్ధంగా ఉంది. చల్లటి గాలులు వీస్తున్నాయి.వాతావరణం హాయిగా ఆహ్లాదకరంగా ఉంది. సుకన్య తలారా స్నానం చేసి దొడ్లో మొక్కల మధ్య తిరుగుతుంది. అపుడే అటుగ వచ్చిన వెంకయ్యకు కూతురు అచ్చు ‘వనలక్ష్మి’ లాగా అనిపించింది. దూరం నుంచి ఆ అమ్మాయిని చూస్తున్న అతనికి ఆమె పై ప్రేమానురాగాలు పొంగివచ్చాయి. తాను తన పరువు ప్రతిష్ఠ అని ఏవో పంతాలకు పోయి తాను చెప్పినట్లు వినాలని అంటే తన మాటకు కట్టుబడి పోయింది. ఎంత వినయం విధేయత… మంచితనం… మనిషి కుండాల్సిన చెడులక్షణాలు ఒక్కటి  కూడా తన కూతురిలో వెతికినా కనిపించవు… నేనే ఆ అమ్మాయి జీవితాన్ని యిట్లా చేసాను. నేనే బాగుచేయాలి… కాని ఎట్లా చూస్తూ చూస్తూ ఆ తక్కువ వర్ణం వాడితో వియ్యమందుతాను. అందుకే ఏదో మిషతో కూతుర్ని కూడ ఢిల్లీ పంపితే అక్కడే పెండ్లాడుతారు.. ఔను అట్లా చెయ్యలి. తాను చేసిన తప్పు దిద్దుకోవాలి. అంతే కాదు నిరంజన్‌కి ఇంక తాను ప్రత్యేకంగా ఇవ్వవలసిన ఆస్తి ఏమిలేదు తనకున్నదంతా సుకన్యకే ఇస్తాడు. ఇట్లా ఆలోచిస్త్తూ సుకన్యను సమీపించాడు. తండ్రిని చూస్తూనే సుకన్య ”నాన్నా! మిమ్మల్ని ఎప్పట్నుంచో ఒక కోరిక కోరాలని అనుకొంటున్నాను. మీరు నామాట మన్నిస్తారని ఆశపడుతున్నాను.”

    ”ఏం లేదు నాన్న మనకు ఊరిచివర ఉన్న స్ధలంలో అనాధాశ్రమం ఒకటి, వృద్ధుల కాశ్రయశాల ఒకటి నిర్మిద్దామని… అదీ మీరు అనుమతిస్తే…”
”అంటే ఇక నీవు వాళ్ళందరికి సేవ చేస్తూ ఉండి పోతావా?” ఆశ్చర్యంగా అడిగాడు వెంకయ్య.
”ఔను ఆ ఆశ్రమానికి మీపేరు పెడతాను. నేనింతకాలం చక్కగా చదువుకోగలననే అనుకొన్నాను… కాని ఇప్పడు మీ వల్ల నేను అందరికీ ఉపయోగపడగలనని కూడా అర్ధం అయింది. మీ ఆశీస్సులతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తాను.

”నీవు చేసే మంచి పనికి దేనికైనా నా అభ్యంతరం ఉండదు తల్లీ! అయితే నీవు పెండ్లి చేసుకొని అయినా ఇవన్నీ చేయవచ్చు కదా! అంతకు మించి ఎవరిని పెండ్లాడాలనే మాట మాత్రం వెంకయ్య చెప్పాలని ఉన్నా చెప్పలేక పోయాడు.

గోవిందయ్య అక్కడికి రావటంతో సంభాషణ ఆగిపోయింది.

”అన్నయ్య! వాళ్ళకు విడాకుల నోటీసు పంపాను. అయినా మన ఇంటి ఆడపిల్లలకు పెండ్లి. సరయిన సంసార జీవితమనే యోగం లేదేమో! పెద్దదయిన సుకన్యకు పెండ్లిలేదు. చిన్నదయిన వనజ జీవితం ఇట్లా అయింది. పిచ్చి చాదాస్తాలకు పోకుండా పిల్లల యిష్టాలకు కొంత విలువ ఇస్తే బాగుంటుంది. గోవిందయ్య నర్మగర్భంగా అన్నాడు.

”చిన్నాన్న! మనసు కొంచెం దిటవు చేసుకోండి. వనజ చక్కగా చదువుకుంది. తన కాళ్ళ మీద తాను నిలబడగలదు. దానికి బంగారు భవిష్యత్తు ఉంది. మీరు తన గురించి ఆందోళన పడకండి. ఎందుకంటే తనకసలు ఇక పై ఆ అత్తగారింటి ప్రసక్తి కాని ఆ రమేష్‌ సంగతి కాని వినటానికి కూడ యిష్టం లేదు” అంది సుకన్య.
”ఏమో తల్లి! దానికిష్టం లేనిదే బలవంతంగా పంపటం ఎందుకని అనిపించింది. అందుకే విడాకులకు కూడా పెట్టాంకదా.”

వెంకయ్య ఏం మాట్లాడకుండా లోపలకు వెళ్ళాడు. సుకన్య తండ్రి తాను ఆశ్రమాలు నిర్మించటానికి అనుమతి నిచ్చిన సంగతి ఆనందంగా గోవిందయ్యతో చెప్పింది.

”మంచి పని చేస్తున్నావమ్మ వనజకి కూడ మనశ్శాంతి దొరకాలంటే నీతో పాటు పని కల్పించాలి. మీరు ఇట్లా నలుగురికి ఉపమోగపడే పనిచేస్తానంటే కాదని ఎవరంటారు.” అంటూ గోవిందయ్య తన ఆశీస్సులు అందజేసాడు.
ప్రభాతవేళ బయలు దేరిన సూర్యుడు పగలంతా పయనించి పయనించి అలసి పోయాడు. పడమటింటి పడకకు చేరుకోవాలని చాలా తాపత్రయ పడుతున్నాడు. ప్రయాణపు బడలికతో ఎఱ్ఱగా కందిపోయాడు. చూస్తుండగానే మబ్బులతెర తొలగించుకొని పడకకు చేరాడు.

సూర్యాస్తమయం వేళనే బాబాగారి అస్తమయం జరిగింది. ఆశ్రమాన్ని వెలిగించిన సూర్యుని వంటి బాబా వెలుతురులను కూడ తనతో తీసుకవెళ్ళాడు. ఆశ్రమం అంతా జనసందోహంతో నిండిపోయింది. ఎక్కడి వారక్కడ నిస్తేజంగా నిర్లిప్తంగా అయిపోయారు. చూస్తుండగానే కొన్ని గంటల్లో తరువాతి కార్యక్రమాలన్ని చకచకా జరిగిపోయాయి. బాబా భౌతికకాయం అగ్ని సంస్కారంతో యీ లోకాన్ని వదిలింది. అయితే అనుకోని విచిత్ర పరిణామమేమిటంటే బాబాగారి భార్య సావిత్రిదేవిని అమ్మని చేసి కూర్చోబెట్టారు భక్తులు. నమ్మినవారు వస్తునే ఉన్నారు. నమ్మని వారు హేళన చేస్తునే ఉన్నారు. బాబాగారి అల్లుళ్ళు, కూతుళ్ళు, కొడుకు, కోడలు ఆధ్యాత్మికత కంటే అవసరాలకే ప్రాముఖ్యమిచ్చారు. పుణ్యకార్యాల కంటే లాభాలు ఆర్ధికావసరాలకే ప్రాధాన్యమెక్కువ ఇచ్చారు. ఇంచుమించుగ ఆ ఆశ్రమంతో ప్రగాఢ సంబంధం కలవారు తప్ప తక్కినవారంతా ఒక్కక్కొరే దూరం  కాసాగారు.

అంతే కాదు అందరి స్మృతిపధంలో నుండి ఆ ఆశ్రమం క్రమక్రమంగా మరగున పడి పొసాగింది. కొంత కాలం తన ప్రభ  చూపించిన ఆ ఆశ్రమం క్రమంగా ఒకవైపు విద్యాలయంగా మరొకవైపు ఫైనాన్స్‌ ఆఫీసుతోను అలరారుతున్నాయి…
కాలం ఇచ్చే తీర్పుకి ఎవరయినా కట్టుబడవలసిందే!

భారతదేశాన్నాంత ఏకచ్చత్రాధిపత్యంగా పాలించిన మొగలుల చిట్టచివరి చక్రవర్తి బహుదుర్‌ షాజాఫర్‌ రంగూన్‌లో బ్రిటీషు వారి ఖైదిగా జీవించలేదా! మహా సామ్రాజ్యాధి నేతలు బంటుల్లాగా అయ్యేది, గరీబులు అమీరులయ్యేది కాల మహిమ వల్లనే! కాలాని కున్నంత శక్తి మరిదేనికి లేదు. అది నిరంతర గమనశీలి… ఆగిపోవటమన్నది ఎరుగదు. ఎంతచిత్రమైనది ‘కాలం’  ఇన్ని రకాల మార్పులకు తాను కారణభూతమయినా తానేమి ఎరగనట్లే తనపని తాను ఆగకుండా చేసుకుపోతూనే ఉంటుంది. సూర్యోదయాలు సూర్యాస్తమయాలు, ఋతుపరిణామాలు ఏవి, ఎపుడు, ఎక్కడ ఆగవు. ఎంతో క్రమశిక్షణతో చరించేది కాలమొక్కటే.

వనజ ఎంతో ఉల్లాసంగా ఉంది. తనను మొగుడనే రూపంలో పట్టి పీడించిన రమేష్‌తో ఇక తనకు ఏసంబంధం ఉండదు. తనకు విముక్తి దొరుకుతుంది. సుకన్య చేతిలో ఉన్న ”జానకి విముక్తి” నవల చూచి ”అక్కా!” ఈ నవల ఏమిటి? జానకి విముక్తి అంటే రావణుడు చెరనుండి  సీత విముక్తి పొందటమా? వనజ అమాయకంగా అడిగిన ఆ ప్రశ్నకు సుకన్య కిలకిల నవ్వింది.

”ఆ విముక్తికి దీనికి జాతి భేదం  ఉంది. అది ఒక్కసంవత్సరం చెరబెట్టిన రావణుడు కూడా మంచివాడు. సీత గౌరవానికి ఎటువంటి భంగం కలగించలేదు. కాని ఇక్కడ మొగుడి రూపంలో ఉన్న రావణాసురుడు ముందు అసలు రావణాసురుడు ఎందుకు పని చేయడు. నిరంతరం హింస, క్రౌర్యం, అవమానం దాని నుండి జానకికి విముక్తి. సంసారమనే నరక కూపం నుండి విముక్తి. నిజంగా నాకయితే ఈ జానకి విముక్తి కంటే ఆ సీత విముక్తి పెద్ద గొప్పగ అనిపించదు.”

”అయితే ఆ పుస్తకం నీవు చదివిన తర్వాత నాకివ్వు అక్కా! నేను చదువుతాను.”
”నేను ఎపుడో చదివాను. మళ్ళి చదువుతున్నాను. నీవు చదువు. అయినా ఇంకా మన యింట్లో నేను చదవవలసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. అవన్ని చదవాలి తెలుసా?

”నిజమే అక్క! అసలు ఇవన్ని చదవకుంటే ఏం తెలుస్తుంది. పోయిన కాలం ఎటు పోయింది. కనీసం ఇక మీదనైన ప్రతి నిముషాన్ని చాల జాగురుకతతో కాపాడుకుంటూ చదువుకోవాలి. నీ సహచర్యంలో ఎన్నో విషయాలు తెలుస్తాయి.

”అంతే కాదు! నీవు ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. నీవు విడాకులు తీసుకొన్నావని అంతా ఎగతాళిగా మాట్లాడినా పట్టించుకోకూడదు తెలిసిందా?”
”సరే”

”ఒకవేళ నీ తల్లిదండ్రులు అప్పుడప్పుడు విసుక్కొన్నా, నోరుజారి ఏమన్నా అన్నా నీవు ఏం ఫీల్‌ అవకూడదు… వింటున్నావా?”

”అక్కా! నీవే చూస్తావుగా విడాకులతో నా జీవితం అంతమయిందని నేననుకోను. నా జీవితానికిదే ఆరంభం అనుకొంటాను. పెండ్లి ఒక్కటే జీవిత పరిమావధి కాదని దాన్ని మించినవి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయని అర్థం అయింది. నేను ఎటువంటి నిరాశా నిస్పృహలకు నా మనసులో చోటివ్వను.”

”గుడ్‌ అలా ఉండాలి.” సుకన్య చెల్లెల్ని అభినందన పూర్వకంగా భుజం మీద తట్టింది.
  
ఆ రోజురాత్రి వెంకయ్య భోజనాల వద్ద తన అభిప్రాయం చెప్పాడు సుకన్యతో. సీతమ్మ తండ్రి కూతుళ్ళ సంభాషణంతా నోరు తెరుచుకొని వినసాగింది.

”చూడమ్మా! నీ యిష్ట ప్రకారం ఆ ఊరి చివరనున్న స్థలం నీ పేర రిజిష్టర్‌ చేస్తాను. నీవు వెంటనే అక్కడ నీకు కావలసిన రీతిలో ఇంటిని నిర్మించుకో! అందుకుగాను బ్యాంకులో ఉన్న మూడు లక్షలు వాడుకో! అన్నయ్యకు ఈ ఆస్తి మీద అంతమమకారం లేదు. ఒక వేళ వాడు ఇట్లా చేసావేమిటి నాన్న అని అనకుండా ఈ ఇంటిని మన చేనుని వాడికిస్తాను.

”నాన్న! మీ ఆశీస్సులతో నా పని చక్కగా నెరవేరుతుంది.” సుకన్య ఎంతో ఆత్రంగా అంది.
”పిచ్చితల్లీ! నా ఆశీస్సులేమిటి? మంచి మనస్సుతో ప్రారంభించిన ఏపనయినా చక్కగా నెరవేరుతుంది. మంచి రోజు చూసుకొని నీ యిష్టం వచ్చినట్లు కట్టించుకో. ముందుగా రెల్లుపాకలు వేయిస్తే మంచిది. తర్వాత బిల్డింగు కట్టించవచ్చు.”

అయినా మంచి రోజు ఏమిటి? ఇదే మంచి ముహుర్తం. మనసులు మంచిగుండాలి గాని.
”అదే నేను ఆలోచిస్తున్నాను నాన్నా!” అంది సుకన్య. ఈలోగా ఫోను రింగవుతుంటే వెళ్ళి ఫోన్‌ ఎత్తింది.
”అదేమిటి? దాన్ని సన్యాసిలాగా జీవించమనేనా ఇవన్ని ఇట్లా అప్పజెబు తున్నారు.”
”నిజానికి నాకు ఇది యిష్టంలేదు. కాని నేను నాకండ్ల ముందు నా కులాన్ని ఎట్లా భ్రష్టు పట్టించను చెప్పు… అందుకే ఏం మాట్లాడలేక పోతున్నాను.”

”మీరు చాలా పాపం చేస్తున్నారు… దాని కట్నకానుకలకు దాచిందంతా దాన్ని ఏదో యోగినిలాగా జీవించమని వాడుకోమని చెబుతున్నారా?”

”నీవు ఇంకేమి మాట్లాడకు నా నోటితో నేను ఆ కులం తక్కువ వాడిని పెండ్లి చేసుకోమని ఎలా చెప్పను? నా వల్లకాదు.. వెంకయ్యకు కోపం వచ్చింది. ఫోను పెట్టేసి వచ్చిన సుకన్య ముఖం పున్నమి నాటి చంద్రునిలాగ వెలిగి పోతుంది.

”ఎవరమ్మ ఫోను. ఏమిటి?”
”మరేం లేదు నాన్నా! అదే నా సేహ్నితుడు చంద్రధర్‌ ఐ.ఎ.ఎస్‌.గా సెలక్టయ్యాడట.”
”ఆఁ ఆ పిల్లాడా! కలెక్టరవుతాడా?” తల్లి ఆశ్చర్యంగా అడిగింది. అడుగుతునే వెంకయ్య వైపు విన్నారా ఈ గొప్ప విషయం అన్నట్లు చూచింది.

వెంకయ్య ఏం మాట్లాడలేదు. భోజనం ముగించివెళ్ళాడు.
”ఏమిటి! ఆ కనకయ్య కొడుకు కలెక్టరవుతాడా? నిజమే!” మళ్ళి సీతమ్మ అచ్చెరువుగా తిలకిస్తూ అడిగింది సుకన్యను.

”నిజమేనమ్మా! అయినా ఈ రోజుల్లో ఎవరు ఏది కావాలంటే అది అవవచ్చు. కావాలసిందల్లా కృషి, పట్టుదల, శ్రమ. ఈనాడు ప్రతిమనిషికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. నన్నెవరో అణగద్రొక్కుతున్నారు. నన్నెవరో పైకి రాకుండా నొక్కిపెడుతున్నారు. అని అనుకోటం శుద్ధ అబద్ధం. ప్రతి వాడికి ఒక లక్ష్యం అంటు ముందుండాలి. అదుంటే ఏమైనా సాధించగలరు. ఇప్పుడదే చంద్రధర్‌ అనే ఈ కుమ్మరి కనకయ్య కొడుకు సాధించాడు. ఇక జిల్లాకంతా అధికారి కాబోతున్నాడు.” సుకన్య ఎంతో ఆవేశంగా మాట్లాడింది.

ప్రక్కగదిలో ఉన్న వెంకయ్యకు ఈ మాటలన్ని వినిపిస్తున్నాయి. చేతిలో పొగాకు చుట్టచుడుతున్నా మనసంతా పరిపరి విధాల పరుగులెడుతున్నది. తన నిర్ణయం తప్పేమో! అనుకోసాగాడు. సుకన్య చెప్పిందాంట్లో ఎంతో నిజముంది. అయితే మన పూర్వీకులు ఎందుకిట్లా ఇన్ని కులాలు పెట్టారు. ఎవరి పద్ధతులు, ఆచారాలు వారి కుండబట్టే ఒకరి కులానికి మరొకరి కులంతో పెండ్లిళ్ళు నిషేధించారు. ఒక వేళ ఆ ఆచారాన్ని అతిక్రమించినట్లుయితే ఎన్నో సమస్యలు, బాధలు ఎదుర్కోవలసి వస్తుంది. పెద్దలు పిచ్చోళ్ళయి ఇవన్ని పెట్టలేదు. అయినా ఆ అబ్బాయిని తాను ఎందుకంత ద్వేషిస్తున్నాడు. అతను ఇపుడు కలెక్టరు! తల్లిదండ్రులెట్లాటి వారయినా పిల్లాడు ఉన్నత పదవికి ఎదిగాడు. అతన్ని పెండ్లాడటానికి తాను సుకన్యను అనుమతిస్తే అంతా తన గురించి ఏమనుకుంటారు! చాలా తక్కువ మంది మాత్రమే హర్షిస్తారు. తన వాళ్ళంతా నిందిస్తారు. ఎక్కువ మంది హర్షించే పని చేయాలి కాని తక్కువ మంది ఆనందించే పని చేయకూడదు. అందుకే తాను తన అంగీకారం తెలుపలేక పోతున్నాడు. పోనీ ఏదయితే అదయింది రేపు సుకన్యతో మాట్లాడి అతన్ని పెండ్లాడమని చెబితే? తన ప్రమేయం లేకుండా వాళ్ళిద్దరిని వెళ్ళి ఎక్కడో పెండ్లి చేసుకొని రమ్మని చెబితే? ఇట్లా తనలో తాను తర్కించుకొంటునే నిద్రలోకి వెళ్ళిపోయాడు వెంకయ్య.

ఆ రాత్రంతా సుకన్య మనసు దూదిపింజలా తేలిపోతుంది. తన చందు కలెక్టరవుతాడు. తన సంతోషాన్ని పంచుకోవాలని వెంటనే ఢిల్లీ నుండి ఫోను చేసి చెప్పాడు… తాను తొందరలోనే వస్తాడట. ఎంత ఆనందం… మనసు ఎందుకో తేలిపోతున్నట్లుంది. రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరించినట్లుంది. ప్రపంచమంతా అందంగా ఆనందంగా కనబడుతుంది. చందుని సామాన్యుడుగ అనుకొన్న తన తండ్రికి కూడా ఇపుడు చందు అంటే ఏమిటో అర్థం అయివుంటుంది. అతను అసామాన్యుడు. తన చందు అందరిలాంటి వాడు కాదు.   
సీతమ్మకు ఎంతో సంతోషంగా ఉంది. భర్తలో ఏదో మార్పు… తప్పనిసరిగా సుకన్య పెండ్లికి ఒప్పుకుంటాడు.
అయితే విధి బలీయమైంది. చిత్రమైంది. అందరి ఆలోచనలు తారుమారు చేస్తు వెంకయ్య నిద్రలోనే మరణించాడు. ఎవరితో ఏమి మాట్లాడలేదు. ఏం చెప్పలేదు. అంతా చిత్రం! కాకుంటే, ఆయన బ్రతికున్నట్లయితే మర్నాడు సుకన్యతో చందుని పెండ్లాడటానికి అంగీకారం తెలిపేవాడు. అయితే ఆయన సుకన్య దగ్గర ప్రమాణం చేయించుకొన్నాడే కాని, దాన్ని తీసివేయమని కూతురుని ఒక్కరోజు అడగలేదు. తన మనస్సులోనే ఎన్నో మార్లు తర్కవితర్కాలకు లోనయినాడు. సీతమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నది. కనీసం ఒక్కమాటయినా చెప్పకుండా పెండ్లి గురించి వెళ్ళిపోయాడేమిటి అని ఆవిడ బాధ పడుతున్నది. తండ్రి కేమంత వయసయింది అపుడే తమను విడిచి వెళ్ళాడు… తండ్రి చేతుల మీదుగానే తన కార్యక్రమాలు అన్ని జరపాలనుకొన్నది.
అంతా నిరంజన్‌ రానిదే ఎట్లా అన్నారు! దహన సంస్కారాలు అవి ఎట్లా చేయటం కొడుకుండగా మరొకరు అనుకొన్నారు. నిరంజన్‌ తాను వస్తున్నట్లు సమాచారం అందించాడు. కళేబరాన్ని ఐస్‌లో పెట్టి జాగ్రత్త చేసారు. ఆ మర్నాడు నిరంజన్‌ వచ్చాడు. కార్యక్రమాలన్ని జరిగిపోయాయి. అతను వచ్చినంత వేగంగా ఆ వెంటనే బయలు దేరాలన్నాడు. కర్మకాండలన్ని పూర్తయిన తర్వాత అతను అందరు వింటుండగ సుకన్యతో అన్నాడు. ”సుకన్య! నాన్న పోయినాడు. నీవు ఆయనకిచ్చిన మాట ఆయనతోనే పోయింది. నీవు నీకు నచ్చిన వాడిని పెండ్లాడవచ్చు హాయిగా. చెప్పు నేనుండగానే మీ మ్యారేజి జరిపిస్తాను”

”అన్నయ్య! నేను నాన్నకు ప్రమాణం చేసి చెప్పాను. ఆయన ఏరోజు ఆ ప్రమాణం వెనక్కి తీసుకోమని నాతో చెప్పలేదు. నా యిష్ట ప్రకారం పెండ్లి చేసుకోమనలేదు. పైగా నేను నడపబోయి అనాధ, వృద్ధుల ఆశ్రమాలకు స్థలాన్ని, డబ్బును ఇచ్చాడు. ఆ సందర్భంగానయినా ‘నీ ప్రయత్నం విరమించుకో, నీయిష్టం వచ్చినట్లు పెండ్లాడమని లేదు. అలాటప్పుడు నేను ఆయన యిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఆయన ఆత్మకు అశాంతి కలిగించనా! చెప్పు.”

సుకన్య మాటలు విన్న నిరంజన్‌ ఏమి సమాధానం చెప్పలేక ఆ అమ్మాయిని పిచ్చిదానిలా చూచాడు. ”సెంటిమెంటల్‌ పూల్‌” అని మాత్రం అన్నాడు.
సీతమ్మ కోడలు రానందుకు నొచ్చుకొంది. కొడుకు చాలా తేలికగా ఆవిషయం ఏమంత పట్టించుకోవలసింది కాదన్నాడు! జననమరణాలు సహజ విషయాలు. దాని నిమిత్తమై పొంగి పోవటం  కుంగి పోవటం అనవసరం అని తేల్చిపారేసాడు.
”బాబు నీ ఆస్తి విషయం నాన్న ఏమిచెప్పారంటే… ”సీతమ్మ మాటలు మధ్యలోనే అడ్డుకున్నాడు నిరంజన్‌.
”అమ్మా! ఇదంతా నాన్న కష్టపడి సంపాదించుకొన్నది. ఆయన యిష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు నేనేమి ఇక్కడ ఉండటం లేదు. బహుశా ఉండను కూడా! నీవు, చెల్లి నీకు నచ్చినట్లు చేసుకోండి.” అంటూ చాలా సింపుల్‌గా తేల్చిపారేసారు.
కర్మకాండలు యధావిధిగా ముగించి అతను వెళ్ళిపోయాడు.

 – విజయ బక్ష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

113

సుకన్య, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో