ఉడుం

            –  పూర్ణచంద్రతేజస్వి

           గాడాంధకారంగా ఉన్న ఒక రోజున దూరంగా ఎక్కడ్నుంచో టామి మొరుగుతుంది వినబడసాగింది. సాధారణంగా కుక్కలు మనకు హెచ్చరికల్ని ఇచ్చేందుకో లేకపోతే మన గమనాన్ని వాటి వైపుకు మళ్ళించేందుకో మొరుగుతుంటవి. టామి మొరుగుతుంటే నేనైతే ఎన్నడూ నిర్లక్ష్యం చేసేవాడ్నికాదు. నేను ఇంట్లో లైట్‌ వెలుతురులో ఏదో పుస్తకం చదువుతున్నాను అప్పుడు. టామి పదే పదే మొరుగుతుంది. చదివేదాన్ని ఆపి, చెవిని నిల్పి దాని మొరుగును వినసాగాను. టామి ఉద్దేశపూరితంగానే నన్ను పిలుస్తున్నట్లుగా దాని అరుపుల 8    ఉడుంధ్వని నుంచి నేను స్పష్టంగా గుర్తించాను. ఎక్కడ్నుంచి దాని అరుపులు వస్తున్నవని నేను ఆలోచించసాగాను. అయితే నేను నాలుగు గోడల నడుమ కూర్చున్నందున ఏ దిక్కునుంచి అది మొరుగుతుందని ఊహించేందుకు సాధ్యం కావట్లేదు. చూద్దాం అని ఇంటి బయటకు వచ్చి వినసాగాను. దగ్గరలోనే ఎక్కడైనా గొడవ (లొల్లి) చేస్తుంటే గట్టిగా కేకలేసి, దాన్ని కట్టిపడేద్దామని బయటకొచ్చాను.

           మా ఇంటి వెనుకే దట్టమైన ఘోరారణ్యం ఉంది. టామి ఆ అడవిలోపల ఎక్కడ్నుంచో మొరుగుతున్నట్లుగా నాకు తోచింది. ఈ కటిక రాత్రిలో (అమావాస్య పక్షంలోని దినాలలో) ఆ అడవిలోపల ముళ్ళను తగిలించుకొంటూ (గుచ్చించుకొంటూ) వెళ్ళేందుకు ఎవరికి ఇష్టం ఉంటది? ఎలాగైనా చేసి దాన్ని పట్టుకొని కట్టిపడేయాలనే ఆలోచన చేసి అది మొరుగుతున్న దిక్కుకు ముఖంపెట్టుకొని జోరుగా ‘టామి’ అని పేరుపెట్టి పిల్చాను. నా కేక దానికి వినబడియుండొచ్చు. అది మరింత ఉత్సాహంతో జోరుగా మొరగసాగింది. నా కేకల్ని విన్న అర్థాంగి రాజేశ్వరి బయటకొచ్చి ఏమిటని అడిగింది. మరిక మేమిద్దరం చేరి ఐదారుసార్లు దాన్ని పిల్చాం. అయితే ఏ ప్రయోజనం కానరాలేదు. టామి రోషావేశంతో ఎందుకో మొరిగే దాన్ని నిల్పనేలేదు.
నాకు టామి మీద పిచ్చికోపం వచ్చింది. ఈ కారు చీకట్లో ఇది అడవిలోపలికి వెళ్ళి మొరుగుతుంటే, నేను తుపాకిని భుజంమీద పెట్టుకొని షికారికి వెళ్ళేందుకు ఈ సమయం అనువుగా ఉంటుందా అనే సంశయం నాలో కల్గింది. నా టార్చ్‌లైట్‌ కూడా సరిగాలేదు. దాన్లో ఉండే బ్యాటరీల శక్తి దుర్బలంగా ఉంది. అంతేగాకుండా అది ఒకొకసారి దబక్కనే ఆరిపోతుంది. దాని స్విచ్‌ పాడైందో ఏమో! అది ఆరినప్పుడల్లా దాని వెనుకనుంచి ఐదారుసార్లు తట్టి మొట్టి వెలిగించాల్సి వస్తుంది.

              టామి ఎంతగానైనా మొరుగుకోనీయ్‌…. నేను మాత్రం ఈ కారు చీకట్లో అడవిలోపలికి వెళ్ళేది లేదని గట్టిగా తీర్మానించుకొని ఇంటిలోపలికి వచ్చాను. కొన్ని నిమిషాలు గడిచినవి. టామినుంచి అరుపులు ఇంకా వస్తూనే ఉన్నవి. ఏమైనాగానీ అని ఇంట్లోకి వచ్చినా నాకు సమచిత్తంతో ఉండేందుకు మనసొప్పట్లేదు. ఎందుకంటే, అడవి జంతువుల వెంటబడి ఒకొకసారి వేటకుక్కలు ఎన్నో మైళ్ళ దూరం వరకూ పిచ్చిగా, కసిగా వెళ్తవి. ఎంతదూరంకు పోతవంటే, వెనుదిరిగి వచ్చేందుకు సైతం వచ్చినదారి మరిచేంతవరకూ వెళ్తవి. టామి ఒకసారి అడవిలో మా ఎస్టేట్‌మీద దాడి చేసిన కోతుల గుంపును వెంటాడి ఎంతో దూరం వెళ్ళింది. ఆ తుంటరి కోతులు టర్రో టుర్రో అంటూ చెట్టునుంచి మరొక చెట్టుకు ఎగురుతూ మున్ముందుకే దూసుకెళ్తుంటే, టామి ఆ చెట్లకింద అరుస్తూ ఎన్నో మైళ్ళదూరంకు వెళ్ళినప్పుడు దాన్ని వెతికి పట్టుకొచ్చేందుకు నాకు ఒక రోజంతా పట్టింది. పాత సంగతంతా గుర్తుంచుకొన్న నేను చివరికి టార్చ్‌లైట్‌ తీసుకొని అడవిలోపలికి వెళ్ళి, అది దేన్ని అడ్డగించి మొరుగుతుంది చూసి వద్దామని మనస్సు చేసుకొన్నాను. అయితే ఇప్పుడు తుపాకిని వెంటబెట్టుకోలేదు. ఎందుకంటే నా చేతిలో తుపాకి ఉన్నదాన్ని చూస్తే టామి తెల్లారేవరకూ దొరకకనే ఆ రాత్రంతా అడవిలో అది పసిగట్టిన జంతువు కోసం ఏటేటో తిరగగలదు. అందుకనే తుపాకి బదులుగా టామి మీద నాలుగు వేట్లు వేసి ఇంట్లోకి దాన్ని తరిమేందుకు పేమ్‌ బెత్తాన్ని పట్టుకొచ్చాను.

              అడవి లోపలున్న కాలిబాటలో కొంచం దూరం వెళ్ళాను. టామి మొరుగుతున్న స్థలం దగ్గరపడింది. నా టార్చ్‌లైటు నుంచి వెలుగు క్షీణంగా పడుతుంది. టామిని బెదిరించే ఉద్దేశంతో ఐదారుసార్లు కేకల్ని పెట్టాను.

                 టామి నా కేకల్నుంచి భయపడి ఆ స్థలంనుంచి బయటకు వచ్చేటట్లుగా నాకు కనబడలేదు. దానికి బదులుగా నా టార్చ్‌లైటు వెలుగునూ, నా కేకల జోరునూ విని అది నా నుంచి ప్రోత్సాహమే అని భావించి మరింత జోరుగా మొరుగుతూ ఒక పొదముందు ఏదో ప్రాణి మీద దూకి అఘాయిత్యం చేసేందుకు రాలిపడిన ఆకుల్ని జరబర అన్నట్లుగా కాళ్ళతో వాటిమీద సప్పుడు చేస్తూ, ఆపి నిల్పిన ప్రాణిని కరిచేందుకు అది సిద్ధమైనదాన్ని నేను చూసాను. ఎందుకంటే, మరుక్షణానే టామి నుంచి ఎదురౌతున్న దాడిని మీరి మరేదో ప్రాణి ‘హిస్సెస్స్‌’ అన్నట్లుగా జోరుగా బుసగొట్తుంది విన్పించింది నాకు. ఆ బుసపెట్టిన సప్పుడు ఎంత గట్టిగా ఉందంటే నా చెవులు బ్రద్దలౌతవేమో అన్నట్లుగా ఆ సప్పుడు ఉంది.

                 నేనిప్పుడు భయపడ్డాను. ఒక చేతిలో మిణుకు మిణుకుమంటున్న టార్చ్‌లైట్‌, ఇంకొక చేతిలో టామీని బెదిరించాలని పట్టుకొన్న పేమ్‌ బెత్తం, చుట్టూ దట్టమైన అడవి. కళ్ళకు ఏమి కనబడనట్లుగా బహుళపక్షంలోని కారుచీకట్లు. ఇటువంటి భీకర పరిస్థితిలో నగారా (భేరీని) మ్రోగించినట్లుగా ‘హిస్‌’ అనే శబ్దం మార్మోగుతుంది. ఒక్కసారిగా తక్షణమే అక్కడ్నుంచి పారిపోదాం అనే భావన కలిగింది. అయితే టామి అక్కడే మొరుగుతూ ధైర్యం ఇస్తున్నందున నేను పారిపోలేదు. తుపాకిని తీసుకురాకుండా అడవిలోపలికి జొరపడిందే నానుంచి జరిగిన తప్పు అని నన్ను నేనే మనస్సులో శపించుకొంటూ, నా టార్చ్‌లైట్‌ వెలుతురు ఏమైనా ఎక్కువగా అవుతదేమోనని దాన్ని ఒకట్రెండుసార్లు మొట్టాను. ఆ టార్చ్‌లైట్‌ వెలుతురులో ఏ మార్పులు నాకు కనబడలేదు.

                  టామి మొరిగేదాన్ని ఆపలేదు. దాన్నుంచి ఆపిన ప్రాణి ఇంకా ఒకట్రెండుసార్లు మొదట్లోలాగనే భీకరంగా బుసపెట్తుంది. అది పామే అయ్యుండొచ్చని నేను భావించసాగాను. పాములలో సాధారణంగా కోడెత్రాచులు, కొండ చిలువలు ఈ విధంగా గట్టిగా బుసపెట్టుతవి. అయితే ఇప్పుడు నాకు విన్పిస్తున్న భీకరమైన బుసపెట్టే శబ్దంను ఇంతకు మునుపెన్నడూ నేను వినలేదు ఈ అడవిలో. టామిమీద నాకు ఎంతో కోపం వచ్చింది. ఈ కారుచీకట్లో అడవిలోకి జొరబడి నాకు కనబడని ప్రాణితో అది చెలగాట మాడుతున్నందుకు, దాని వేటతీట (ఉబలాటం)మీద కోపం అధికమైంది.

                ఆ ప్రాణి (జంతువు) లక్ష్యం తననిప్పుడు కరిచేందుకే పొంచియున్న టామి మీదే నిమగ్నమైనందున, నేను ఆ జంతువుకు దగ్గరగా వెళ్ళి అదేమి జంతువో అని చూసేందుకు ధైర్యాన్ని పోగు చేసుకున్నాను. ప్రభాతఝాము అయ్యుంటే మరియు తుపాకి చేతిలో ఉండుంటే నేను టామి సహాయంకని అంతగా వెనుకాముందు ఆలోచన చేసేవాడ్ని కాను.
ఎలాగోలా ఆ పొదలోపలికి ఐదారు అడుగులు వేసి టార్చ్‌లైట్‌ను వెలిగించాను. టామి తెల్లటి తెలుపువర్ణంతో ఉన్న కుక్కైనందున అది తేలికగానే కనబడుతుంది. అయితే టామి ఏ జంతువు మీద దాడి చేస్తుందో ఆ ప్రాణైతే నాకు స్పష్టంగా కనబడటంలేదు.
నేను దగ్గరగా వచ్చిందాన్ని చూసి మరింత ఉత్సాహంతో టామి ముందుకే దూకి ఏదోదాన్ని కరిచి లాగసాగింది. మళ్ళా బుసపెట్టే ‘హిస్‌’ అనే శబ్దం! నేను దగ్గర్లోనే ఉన్నందున ఈసారి ఏదో కొండ చిలువ నన్ను చుట్టుకొని బుసపెట్తున్నట్లుగా నాకు అర్థమైంది. ఎంతో భయంగా వణుకుతూ ఒకట్రెండు అడుగులు వెనక్కేవేసి మరలా బుసపెట్టే వైపుకు టార్చ్‌లైట్‌ వేసి చూసాను.

                 పెద్ద ఉడుం ఒకటి అస్పష్టంగా టార్చ్‌లైట్‌ వెలుగులో కనబడింది. నాకు ఇంతకు మునుపే దాని ఉనికి తెల్సి, దానికి ‘మానిటర్‌’ అనే పేరు పెట్టి, అదెప్పుడన్నా నాకళ్ళలో పడ్తే ఆ పేరుతో దాన్ని పిలుస్తుండేవాడ్ని. టామి ఎన్నోసార్లు ఈ అడవిలో దాని వెంటపడినప్పుడు, ఆ ఉడుం చాకచక్యంగా తప్పించుకొని పొదలలో చేరుకొనేది. నిరాశగా టామి మళ్ళా నా చెంతకు చేరుతుండేది. మానిటర్‌ నాకు పరిచయమున్నా, ఆ ఉడుం ఈ విధంగా చెవులు చిల్లులు పడుతున్నట్లుగా బుసపెట్తుది అనేది నాకు తెల్వదు ఇప్పటిదాకా. పాములాగ ఇది విష జంతువు కాదనేది ఒకింతగా నాలో సమాధానమైంది. ఉడుం పారిపోయేందుకు ప్రయత్నించినప్పుడల్లా, టామి దాని తోకను నోట్లో కరుచుకొని వెనక్కి లాగుతుంది. తక్షణమే ఉడుం బుసపెట్తూ వెనక్కి తిరుగుతుంది. అప్పుడు టామి భయపడి వెనక్కి తగ్గి మొరుగుతుంది. ఈ జటాపటం (సిగపట్లు) ఎంతో సేపట్నుంచి జరిగియుండొచ్చు. ఎందుకంటే, బాక్సింగ్‌ రింగ్‌లో ఇద్దరు బాక్సర్లు పన్నెండో రౌండ్‌ వరకూ పోరాడి, పోరాడి సుస్తైపోయి ఎదురు రొప్పుల్ని పెట్టినట్లుగా ఇప్పుడు ఈ రెండు ప్రాణులు ఆ విధంగా ఎదురు రొప్పుల్ని పెట్తున్నవిలే!

                ఈ మానిటర్‌ (ఉడుం) మీద నాకు కొంచం కోపమూ ఉంది. ఎందుకంటే, నేను పకక్షుల ఫోటోలను తీద్దామని వాటి గూళ్ళ చెంత పొంచి ఉన్నప్పుడు అనేకసార్లు ఈ ఉడుం వాటిగుడ్లను తింటమేగాకుండా, ఆ గూళ్ళను పాడుచేస్తుండేది. ఒకసారి ఫోటో తీసేందుకు నేను వెళ్ళినప్పుడు, ఆ గూళ్ళలో గుడ్లను తింటున్న ఇది, నన్ను చూసి ఆ చెట్టు కొమ్మనుంచి ఇంకొక పెద్ద చెట్టుకి ఎగిరి దూకి పారిపోయిన ఆ ఉడుంను నేను కళ్ళారా చూసాను. నా చేతిలో అప్పుడు తుపాకి ఉండుంటే నా పనికి  (ఫోటోలను తీసేందుకు) అడ్డుపడి పాడుచేసిన దాన్ని ఆ సందర్భంలో ఏమి చేసి ఉండేవాడ్నో చెప్పేందుకు కుదరదులే.

                పావుగంటవరకూ టామిని బెదిరించి, నా వద్దకు పిల్చుకొనేందుకు ప్రయత్నించాను. ఫలితం ఏమి కలగలేదు. ఎన్నోసార్లు తననుంచి జారుకొంటున్న ఈ ఉడుంను ఈసారి మాత్రం వదలకూడదని టామి నిశ్చయించుకొన్నట్లుగా రోషంతో ఉంది. ఆ రెండు ప్రాణులు ఒకదానికొకటి ఎదురెదురుగా చూసుకుంటూ నన్ను అలక్షించే బుసగొట్తూ, మొరుగుతూ తమ పోరాటాన్ని ఉదృతంగా ముందుకే నడుపుకొంటున్నవి. అప్పుడు నా బుర్రలో ఒక ఆలోచన మెరిసింది (తళుక్కుమంది). ఈ ఉడుం అపాయకరమైన ప్రాణైతే కాదని దాన్ని నేనే ఎందుకు పట్టుకోగూడదు? ఎంతైనా టామి నుంచి అది తప్పించుకొని పారిపోలేదు కదా అనేది నాలో తళుక్కున మెరిసిన ఆలోచన నుంచి వచ్చింది.

              అయితే నాకు ఏ మూలో చిన్నగా దిగులు పుట్టింది. ఉడుం కరవదు అని అనుకొన్నా, అడవి ప్రాణులు ఎప్పుడు ఏమేమి చేస్తవో చెప్పేందుకు కచ్చితంగా కుదిరేదిలేదు. ఆత్మరక్షణకు దేవుడు ఏఏ ఉపాయాల్ని వాటికి దయపాలించాడో ఎవరికి తెల్సు? ఎంతో నిరపాయకరమైన (సాధు) ప్రాణులవి అని తెల్సుకొన్న మనిషి వాట్ని ముట్టుకొనేందుకు వెళ్ళిన తక్షణమే, అవి (సాధుప్రాణులు) రోషావేశంతో పళ్ళనో, గోళ్ళనో ఆయుధాలుగా చేసుకొని ఆత్మరక్షణ చేసుకొంటూ వచ్చినోళ్ళను ‘అయ్యయ్యో’ అన్నట్లుగా పెడబొబ్బల్ని, గావుకేకల్ని పెట్టేదాన్ని నేనే ఎన్నోసార్లు అనుభవించాను. ఒకసారి మా ఇంట్లో పొదుగుతున్న కోడిని, దాని గుడ్లను చూసేందుకని ఆ పొదుగు తట్టను (గంపను) లేపగా, ఆ కోడి ఏ ఉద్దేశంతో నన్ను తన పదునైన ముక్కునుంచి, కాలిగోళ్ళనుంచి నా ముఖం చేతులమీద ఎగిరిపడి పొడిచింది నేను మర్చిపోగలనా? పెంపుడు కోళ్ళకే అటువంటి ఎదురు దాడి సాధ్యమైతే మరిక ఈ ఉడుం ఏఏ అపాయాలతో కూడిన తంత్రాన్ని నామీద ప్రయోగిస్తదో ఏ వెటర్నరి డాక్టర్‌ చెప్పగలడు జ్ఞానిలాగ? ఇదంతా ఆలోచిస్తూ మెల్లగా ఎంతో జాగ్రత్తతో ఉడుం వెనుక నిలిచాను. ఉడుం తన ప్రథమ శత్రువైన టామీనే ఏకాగ్రతతో కోపంగా చూస్తుంది. ఉడుంకు గుర్తుగానట్లుగా మెల్లగా పిల్లి అడుగుల్ని వేసినట్లుగా సప్పుడును చేయకనే వెనకనుంచి పెద్ద చేదతాడులాగ దప్పంగా ఉన్నదాని తోకను పట్టుకోవాలని ఉపాయం చేసాను.

                   నేను దాని తోకను పట్టుకొన్న తక్షణమే అది బుసగొడ్తూ నామీద తిరగబడొచ్చని ఊహిస్తే, అది నన్నేమి చేయలేదు. ఆ ఉడుం తన తోకను నోటిలో కరుచుకొంది టామీనే అని తప్పుగా గ్రహించుకొని మళ్ళా బుసపెట్తూ టామి మీదే ఎదురు దాడి చేసేందుకు ప్రయత్నించసాగింది. ఆ సమయంను నాకు అనుకూలంగా ఉపయోగించుకొని దాన్ని గబక్కనే పైకెత్తి గట్టిగా పట్టుకొన్నాను. అప్పటికప్పుడే అకస్మాత్‌గా దానికాళ్ళకు ఆధారం తప్పి అంతరాళంలో వేలాడుతున్న ఆ ఉడుంకు ఇక ఏమి చేసేది తెల్వక బలంగా బుసపెట్తూ తన కోపంను మొత్తం విశ్వంమీదే అన్నట్లుగా ప్రదర్శించసాగింది. షికారి (వేట)లో నేనూ పాలుపంచుకొంది చూసిన టామి సంతోషంతో ఆ ఉడుంమీద ఎగిరి, లయ తప్పి నామీద పడింది. టామిని కాలితో బలంగా ఝాడించి తన్ని, దూరంగా నానుంచి పారద్రోలాను.

                     ఐదారు కేజీల తూకం (బరువు)తో ఉన్న బలమైన ఉడుంను దేనికీ ఏ చెట్టుకూ తాకనట్లుగా ఒకే చేతితో పట్టుకొని ఇంటివరకూ తీసుకురాగా, నా చేయికున్న సగం ఆయుష్‌ కుంగిందని నాకు అర్థమైంది. దాన్ని రేపు ఉదయం ఫోటో తీసిన తర్వాత అడవిలో వదిలేద్దామని తీర్మానించుకొని, నా వద్ద పొలం పనుల్ని చేసే ప్యారడ్ని మేల్కొల్పి తాడును తెమ్మని కేకపెట్టాను.
ప్యారడు నిద్రమత్తులో గలిబిలిగా ఇల్లంతా వెతికి చివరికి బావివద్ద ఉండే చేదతాడును తెచ్చాడు. మేమిద్దరం ఉడుం నడుంకు ఆ చేదతాడును బలంగా బిగించికట్టి దాన్ని భద్రంగా ఇంటెదురుగా ఉండే రావిచెట్టుకు ఆ తాడుతో సమేతంగా దాన్ని కట్టి పడేసాము. అక్కడకూ వచ్చి మొరుగుతూ లొల్లి పెట్తున్న టామీని బలంగా ఒక గుద్దు గుద్ది ఇంట్లోకి లాక్కొచ్చి ఒక మూలన గొలుసుతో కట్టిపడేసాడు ప్యారడు.
**                             **                      **                     **                        **                          **                             **
ఈ ఉడుం నాకు మొదటిసారి పరిచయమైంది సుమారుగా రెండు నెలల క్రితంలోనే. అడవిలో వేసవి కాలంలో జరుగుతుండే అగ్ని ప్రమాదాలు ఎస్టేట్‌కు తాకరాదని, ఎస్టేట్‌కు అడవి సరిహద్దుకు నడుమ ఒకలోతైన కందకంను (గుంతను) బలంగా తవ్వాము. ఆ కాలుగుంత దారిలో గడ్డి, కసువు, ఎండిన ఆకులు ఆ గుంత దార్లో లేకుండా ప్రతిరోజూ ఎస్టేట్‌ బారుకూ ఆ గుంతను శుభ్రం చేస్తుండేవాళ్ళం. ఆ గుంతలో పడిన ఆకులు, అలుముల్ని ఎత్తి వేరే చోట తిప్పగుంతలో పడేసేవాళ్ళం. ఇలాగున జాగ్రత్తలతో చేస్తే, ఉంటే ఒక వేళ అకస్మాత్తుగా అడవికి నిప్పు అంటుకొన్నా అది సులభంగా తోటకు వ్యాపించకుండా ఉండేందుకు ఈ కందకం ఒక రక్షణగా ఎస్టేట్‌కు తోడ్పడుతుండేది.

                    వేసవిలో కాఫి ఎస్టేట్లలో నడిచే ముఖ్య వ్యవసాయపనులలో ఇదెంతో ముఖ్యమైన పనిగా ఉంటుండేది. ఎక్కడ పొగ కన్పించినా, ఎక్కడ ఆకులలములు తగలబడిన వాసన వచ్చినా మేము అక్కడికి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం. వేసవిలో అగ్ని ప్రమాదాలనుంచి జాగ్రత్తల్ని చేసుగోకపోతే, ఎన్నో సంవత్సరాల వ్యవసాయ కృషి, కన్న బిడ్డలులాగ పెంచి పోషించిన అమూల్యమైన వృక్షాలన్నీ (గంధం, లవంగ, దాల్చిన చెట్లు, యాలకుల పొదలు) కొన్ని గంటలలోనే కాలి బూడిదైపోతవి కదా!

                  ఈ కందకం దారిలో ఆ ప్రక్క ఈప్రక్క శుభ్రం చేసి రాశిగా చేసిన ఆకులన్నీ ప్రతిరోజూ వేకువ ఝాములో మళ్ళా ఆ కందకంలోనే పడియుండేవి. ఈ కందకంను ఊడ్చి శుభ్రం చేసే పనిలో నిమగ్నమైన మారడు ఇది ఉడుంనుంచి జరుగుతున్న తుంటరి చేష్టే(పనే)నని ఊడ్చేటప్పుడల్లా ఆ ఉడుంకు శాపనార్థాల్ని పెట్తుండేవాడు. అయితే ఈ తుంటరి ఉడుంను చూడాలని నేనెన్నిసార్లు ఆ కందకం దారిలో నడిచినా దాన్ని చూడనేలేదు! మారడి వివరణనుంచి ఉడుం అంటే అదొక పెద్ద గాత్రం (సైజ్‌)లో ఉండే తొండలాగ ఉండొచ్చని భావించుకొనేవాడ్ని. ఉడుంను మానవులు తింటారని, దాని మాంసం ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠమైందని వెనకటి బ్రిటీషోళ్ళకాలంలో కాఫి ఎస్టేట్లను వేసిన యూరోపియన్‌ దొరలు ఉడుంలను ప్రీతిగా తిని భారతదేశ మహిళలతో రమించి ఆంగ్లోఇండియన్స్‌ జాతిని నిర్మాణం చేసారని మారడు లొట్టలేసుకొంటూ, పొగుడుతూ దాని మాంసంలోని గొప్పతనం చెపుతుండేవాడు.

                     అయితే ఈ ఉడుంను నేనొకసారి ఎంతో దగ్గరగా చూసినప్పుడు, దాన్ని తినే తిండి (మాంసం)లాగా భావించేందుకు నా నుంచి సాధ్యమేకాలేదు. పకక్షుల ఫోటోలను తీసేందుకు నేను మాటు వేసుకొని నిశబ్దంగా కూర్చున్నప్పుడు ఆకులమీద గలగల జరబర సప్పుళ్ళను చేస్తూ వచ్చిన ఉడుం, పొదల అంచున దొంగలాగ కూర్చున్న నామీద మెల్లగా చూసింది. తలను మాత్రమే ఆకుల మాటునుంచి బయటకు చాపినందున, నేను దాన్ని పాము తలేనని భావించుకొన్నాను. దాని గొంతుకున్న చర్మం పాముకుండే పొలుసు చర్మంలాగనే పోలి ఉంది. దాని నాలిక సైతం పాము నాలికలాగ రెండుగా చీలి ఉంది. ఇది ఈ విధంగా ఉన్నదాన్ని చూసిన నేను ఇదేదో పాము కావచ్చని అనుకొన్నాను. కొంచంసేపు నేను దాగిన పొదలమాటున ఉన్న చెట్టును నన్ను భయంగా అనుమానంతో చూసి, ఆ తర్వాత నిధానంగా బయటకు వచ్చింది. మారడి వివరణల నుంచి పెద్ద తొండలాగ ఉడుం ఉండొచ్చని భావించిన నాకు, ఇప్పుడు ఆ ఉడుంకున్న గాత్రం, ఆకారం చూసి భయమేసింది. సుమారుగా ఐదు అడుగుల పొడవుతో ఉన్న ఆ ఉడుం, దాని తోక గొడ్డలి కుండే కావునంతగా దప్పంగా ఉంది. ఆ ఉడుంకు నేను దాగిన వృక్షాన్ని చూసి ఏదో అనుమానం వచ్చియుండొచ్చు. అనుమాన చూపులతో మెడను ఒకపక్కకు వాల్చుకొని కొంచం సేపు నేను దాగిన వృక్షాన్ని చూసి, నన్ను మెంటలోడిగా భావించుకొందో ఏమో… చివరికి వచ్చిన దారి నుంచే మరలా వెనుదిరిగి వెళ్ళింది.

                      ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం మనం ఉండే ప్రస్తుత ఈ భూమండలంలో బృహద్గాత్రంలో ఈ జాతికే (ఉడుం) చెందిన డైనోసరాలు (మహోరాలు) తిరుగుతుండేవని చదివిన నాకు, ఈ రోజు వాటి ప్రతినిధినే చూసినట్లుగా సంబరమైంది. ఇదైన తర్వాత మరోసారి గూళ్ళలో పకక్షుల గుడ్లను కబళిస్తున్న (స్వాహా చేస్తున్న) ఈ ఉడుం మళ్ళీ నా కళ్ళలో పడింది. ఏదో తల్లి పక్షి నుంచి వస్తున్న చీరాటం (ఆక్రందన)ను దూరంనుంచే చూసిన నేను ఏదో ఆపద సంభవించిందని అనుకొంటూ అక్కడికి లగెత్తాను. నన్ను చూసిన తక్షణమే ఆ ఉడుం పక్షి గూడు కట్టిన కొమ్మనుంచి దభీల్నే క్రిందకు దూకి సప్పుడ్ను చేస్తూ పారిపోయింది. అప్పుడే నేను దానికి ‘మానిటర్‌’ అనే పేరును పెట్టాను.

                     ఈ మానిటర్‌ (ఉడుం)కు ఆహారంగా పకక్షుల గుడ్లు, పురుగులు, చెదలు, చీమలు ఉంటవని నేను తెల్సుకొన్నాను. వీటికనే ఇది మేము ఊడ్చి రాశిగా పోగుపర్చిన ఆకుఅలముల్ని చెరిపి అటు ఇటూ చెల్లాచెదురు చేస్తుందని గ్రహించాను. నేను ఉడుంను చూసానని మారడితో అంటే అతనేమి ఎక్కువగా ప్రతిక్రియను చూపకనే ”దాన్ని ఈసారి చూస్తే చంపండి. నేనైనా దాని మాంసంను తిని కొన్ని గంటలు యూరోపియన్‌ దొరలాగ ఉంటాను. ఒకవేళ మీరు చంపకపోతే దాన్ని కుక్కో నక్కో తిని అన్యాయమైపోతది దాని ఆత్మ” అని అన్నాడు. దాన్ని కుక్కో నక్కో తింటే అన్యాయం, తను తింటే న్యాయం అనేది మారడు ఏ తత్వంనుంచి ఆధారంగా నిర్ణయించుకొన్నాడో అతనైతే నాకు చెప్పలేదు. మారడితో ఒకానొక కాలంలో ఈ భూమండలంమీద కొండగుట్టలంత గాత్రం (సైజ్‌)లో ఉండి నివసించిన ఈ ఉడుంల గురించి చెప్పాను. ”అవన్నీ ఏమైనవి సార్‌?” అని ప్రశ్నించాడు మారడు. అన్నీ భూకంపంలో మట్టి అడుగున స్థాపితమైపోయినవని చెప్పాను. ”ఛి… ఛీ… ఎంత అన్యాయం జరిగింది సార్‌” అంటూ ఖిన్నపోయాడు మారడు.

**                    **                 **               **                    **                     **                      **                 **                     **

మరుదినం ఉదయంలో నేను మేల్కొనేముందే ప్యారడు గలిబిలితో వచ్చి ”సార్‌… ఉడుం చేదతాడుతో సహా పరారైంది” అని చెప్పాడు.
నాకు ఆశ్చర్యమైంది. అంతబారుగా, బలంగా ఉండే ఆ చేదతాడును గుంజుకొని ఉడుం ఎక్కడికి పోయేందుకు సాధ్యపడుతది? అదీ (దాన్ని) రావిచెట్టుకు సరిగానే ముడేసి కట్టాముకదా!
ప్యారడి జతగా అటు ఇటు వెతికాను. ప్యారడు కొద్దిగానైనా యోచించేందుకు తనబుర్రకు కసరత్తు చేయకనే గలిబిలిచేస్తూ, ”టామిని వదుల్తాను సార్‌! అది ఒక క్షణంలో ఉడుం ఎక్కడుందో కనుక్కోగలదు” అని అన్నాడు. అయితే రాత్రి అది చేసిన లొల్లి అంతా నాకు గుర్తుకొచ్చింది. ఇక నడుంకు త్రాడు కట్టించుకొన్న కష్టంలో ఉన్న ఉడుంను ఇది కొరికి చంపేస్తదని ఊహించి, దాన్ని ఉసిగొల్పేది వద్దని చెప్పాను.

                కొంచంసేపు ఎస్టేట్‌లో వెతికివేసారి, చివరికది ముడిని వదిలించుకొని ఎలాగున వెళ్ళిందోనని పరీక్షించేందుకు రావి చెట్టువద్దకు వచ్చినప్పుడు మాకు జరిగిందేమిటో గుర్తైంది ఇలాగున. ఉడుం చేదతాడును విప్పుకొని పారిపోలేదు. దాని బదులుగా దాన్ని కట్టిపడేసిన రావిచెట్టుకే తాడుతో సహా పైకి ఎగబ్రాకి దాని తుట్టతుదినున్న కొమ్మమీద కూర్చుంది. చేదతాడును లాక్కొని పైకెళ్ళి కూర్చున్నా ఆ బారు తాడుతో మేము చెట్టుకు కట్టిన ముడి దాని వంటినే వేలాడుతుంది. ఉడుం చెట్టు శిఖరాగ్రాన కూర్చున్న దాని విధం చూసి చిన్నబుచ్చుకొన్న మారడు ”ఇక దీన్ని క్రిందకు దించేది ఎవరితరంకాదు. ఏమైనా చేసేదుంటదంటే చెట్టునే నరికి దాన్ని పట్టుకొనేదుంటది” అన్నాడతను.

                     ”పో… పో… మూర్ఖుడా! అదెందుకు కిందకు దిగదో నేను చూస్తానులే! ఎంతైనా దాని నడుంకు చేదతాడును కట్టాం కదా! ఆ తాడును పట్టుకొని బలంగా గుంజితే అదేకాదు దాని జేజెమ్మా క్రిందకే పడ్తదిలే” అనే ధీమాకుతో అన్నాను నేను.
”ఉడుంపట్టు అనే మాటను మీరు వినలేదా? దాని ప్రాణం పోయినా, దాని పట్టు మాత్రం సలిలం (తేలిక) కాదులే” అని మారడు మాతో సవాలు చేసాడు.

                      ఈ పుక్కిటి పురాణ గాథల్ని నేను ఎంతగానో వినియున్నాను ఇప్పటివరకూ. వెనకటి కాలంలో రాజమహారాజులు, దళవాయిలు, సైన్యాధిపతులు తమ శత్రువుల కోటల్ని వశం చేసుకొనేందుకు, కోట గోడల్ని దొంగమాటుగా ఎగబ్రాకేందుకు (ఎక్కేందుకు) ఉడుం మూతికి తేనెపూసి, దాని నడుంకు బలమైన మోకుల్ని కట్టి కోటగోడల మీదకు దాన్ని ఎగబ్రాకించి, తర్వాత దానికి కట్టిన మోకును పట్టుకొని కోటలోపలికి ప్రవేశిస్తారనే మాటల్ని, గాథల్ని వినియున్నానులే! ఈ ఆధార రహితమైన అవ్వ, తాతలు చెప్పే సాహసగాథల్ని నేను గంభీరంగానైతే పరిగణించలేదు ఇప్పటివరకూ. ఉడుంను మొదలు క్రిందకు లాగి, ఆ తర్వాత మారడి దగ్గర మాట్లాడుదాం అని నిర్ణయించాను.

                    చెట్టుకు కట్టిన తాడు ముడిని విప్పి, ఆ తాడును చేతిలో పట్టుకొని గుంజాను బలంగా. ఉడుం ఆ శిఖర భాగాన్నుంచి ఒక్కసారిగా రప్పంటూ క్రిందకే పడుతదని ఊహించాను. అయితే నా ఊహ తప్పైంది. తాడు ఎక్కువ తక్కువ గాకుండా కొమ్మకే కట్టినట్లుగా భద్రంగా ఉంది. నేను గుంజే (లాగే) ఆటకు చెట్టు కొమ్మ కదుల్తుంది తప్పితే ఉడుం మాత్రం కొద్దిగానైనా అటు ఇటు కదలట్లేదు.
”చూసారు కదా సార్‌ ప్రత్యక్షంగా! నేను చెప్పింది అబద్ధమేనా?” అన్నాడు కుహకంగా మారడు.
నాలోని ఆత్మాభిమానం విలవిలలాడింది. ఆ తాడుకు నా బరువంతా చేర్చి వేలాడాను. నా బరువుకు అది (ఉడుం) కొద్దిగానైనా కదలలేదు. అంతలో ప్యారడు వచ్చాడు. మేమిద్దరం ఆ తాడునుంచి వేలాడాము. ఉడుం మహాశయుడు మమ్మల్ని కేరే (్పుబిజీలి) చేయట్లేదు.

                      మారడ్నివచ్చి తాడును పట్టుకొని వేలాడమని ఆజ్ఞాపించాను. పండు ముసలోడైన మారడు తన రెక్కల (భుజాల)లో అంత శక్తిలేదని, తనేమైనా గోగుపుల్లలాంటోడినేనని మావద్దకు వచ్చేందుకు నిరాకరించాడు. అంతలో వేలాడుతున్న మా ఇద్దర్ని చూసి సబ్‌ రిజిస్టార్‌ ఆఫీస్‌లో రైటర్‌ ఉద్యోగం చేస్తున్న కిట్టప్ప కుతుహలంతో మాచెంతకు వచ్చాడు. వారినీ వేలాడమని అడిగాను.

                 ఆ తుంటరి ఉడుం మా ముగ్గురి బరువుకూ కొద్దిగానైనా కదలలేదు.
ఇక ఇదెంత బరువును ఆపుకోగలదని తోటలో పనుల్ని చేస్తున్న రాగప్పను తాడునుంచి వేలాడమని పిల్చాను.
మారడు ప్రేక్షకుడిలాగ నిల్చి కృష్ణ భగవానుడిలాగ కొంటెగా నవ్వుతూ చూస్తున్నాడు ఈ తతంగాన్నంతా. అతనికి అతని మాటను (లోకోక్తిని) నిలబెట్టిన ఈ తుంటరి మానిటర్‌ మీద ప్రేమ ఉప్పొంగింది. మా నలుగురి బరువునుంచి ఉడుం పట్టు తేలికబడలేదు. మేము నలుగురం వేలాడుతుంటే ఒక ప్రమాదం జరిగింది. ఉడుం ఆ రావిచెట్టు శిఖరాన కూర్చున్న కొమ్మ మా నలుగురి భారం (బరువు)ను ఆపుకోలేక ఢమార్‌ అంటూ విరిగి పడింది మామీద. మాకెవరికీ పెద్ద గాయాలేమి కాకపోయినా వళ్ళంతా గీరుకుపోయింది. ఆ కొమ్మలో ఉన్న నల్ల చీమలు (గండు చీమలు) మా   వంటిమీద పడినందున, ఆ గీరుకుపోయిన దెబ్బలజతగా మా షర్ట్‌లలో ఆ గండు చీమలు చేరి మా దేహాల్నంతా కుట్టసాగినవి. మేమంతా ‘అయ్యో అమ్మో’ అంటూ పడ్తూ లేస్తూ ఆ చీమల్ని దులుపుకొంటుంటే ఉడుం నడుంకు కట్టిన తాడు ముడి దాని అదృష్టానికి ఎలాగో లూజు అయ్యి, ఈ గలిబిలిలో అది ఆ తాడునుంచి తప్పించుకొని అడవిలోపలికి పరారైంది.

                     మేమంతా నుదుర్లను కొట్టుకొంటూ బట్టల్ని విప్పుకొని చీమల్ని దులుపుకొంటుంటే ”ఎంథ అన్యాయం అయ్యిందండి సారుకు” అన్నాడు మారడు. ఉడుం    19మామీద కొమ్మపడినందుకు సానుభూతిని చూపెట్తున్నాడేమోనని ఊహించి ”ఎందుకోయ్‌” అని అడిగాను.

                    ”ఇంతగా భంగపడి ఆ ఉడుంను క్రిందకు పడేసి ఏం ప్రయోజనం పొందారు మీరు? మరలా అది అడవిలోకే పారిపోయింది కదా… ఐదారు కేజీల మాంసంతో ఉండేదాన్ని ఇక కుక్కో నక్కో తిని అన్యాయం అవుతది కదా” అన్నాడు మారడు.
అడవిలోకి పారిపోయిన మానిటర్‌ (ఉడుం) ఎక్కడో దూర దేశాలకు పారిపోలేదు. అక్కడే మా ఇంటి చెంతే తిరుగుతుండేది. టామికి దానికి ఒక్కొక్కసారి జటాపటం మొదలౌతుండేది. నేను తోటను అమ్మి ఆ ప్రాంతంకు వీడ్కోలు చెప్పేవరకూ దాన్ని అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాను. నేను తోటను అమ్మి ఇంకెక్కడికో చేరిన మీదట అది ఏమైందో, దాని స్థితి ఏమిటో, దాని గురించి వివరాలు నాకు తెల్వవు కదా!*

**                      **                         **                           **                             **                                **                       **

కన్నడ భాషలో దివంగత పూర్ణచంద్రతేజస్వి రచించిన ‘మానిటర్‌’ అనే కథకు యథాతథ తెలుగు అనువాదం.
అనువాదకుడు: శాఖమూరు రామగోపాల్‌.
ఈ కథను సేకరించింది ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని లైబ్రరి నుంచి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, పురుషుల కోసం ప్రత్యేకం, Permalink

One Response to ఉడుం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో