అమ్మ కావడం గొప్ప వరం(కవిత)- బత్తుల రమ్య
మా అమ్మ జన్మనిచ్చిన నాకు వరం
రక్తపు ముద్దతో
నేను కడుపులో ఉండగా
నన్ను నవమాసాలు
మోస్తూ ఉండగా
కత్తులతో యుద్ధం,
నొప్పులతో బాధ భరిస్తూ
నాకు కొత్త లోకాన్ని చూపి
ఆ బాధలు మర్చిపోతూ
నన్ను చూసి ఆగిపోయిన
తన కన్నీరు మాయామవుతూ
బిడ్డని ఎదకీ హత్తుకొని,
ముద్దాడుతున్న
మధుర క్షణం అనుభవిస్తూ
తన నరక వేదన మరచిపోయి
బిడ్డ క్షేమం గురించి తపన పడుతూ
మా అమ్మ జన్మనిచ్చిన నాకు వరం
బిడ్డ పుట్టిందని తండ్రి నీ విడిచి
మా అమ్మ కొంగు కవచం లా
నన్ను కాపాడుతూ
అంతుచిక్కని అమ్మ ప్రేమ నాతో
మా అమ్మ జన్మనిచ్చిన నాకు వరం
సృష్టిలో త్యాగాల కీ నిదర్శనం
అమ్మ తోడు, నీడ నాతో ఉండగా
కొత్త లోకాన్ని,జీవితాన్ని పరిచయం చేసిన
మా అమ్మ పాదాలకి వందనం
నా కంట కన్నీరు కారిస్తే అమ్మ గుండెలో
అలజడి మొదలవుతూన్నా
నన్ను ఇరవై అయిదు ఏళ్ల వయసులో
పొరుగు వారి చేతిలో పెట్టీ
పెళ్లి అనే బంధంతో నన్ను
అమ్మ నుండి వేరు చేస్తూ
అమ్మా నాలో మీ అమ్మని
చూసుకుంటూ మూరుస్తూ
అమ్మ కావడం గొప్ప వరం
మా అమ్మ జన్మనిచ్చిన నాకు వరం
-బత్తుల రమ్య
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Comments
అమ్మ కావడం గొప్ప వరం(కవిత)- బత్తుల రమ్య — No Comments
HTML tags allowed in your comment: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>