హలో డాక్టర్! – సురక్షిత మాతృత్వం

శ్రీదేవి , నిజామాబాద్

డాక్టర్ గారూ! మన దేశంలో స్త్రీలు ప్రసవ సమయంలో ఎంతోమంది ప్రాణాలను కోల్పోతూ వుంటారు. దీనికి కారణాలు ఏంటి?మన ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాలు లేక పోవటం వల్లనా?మెరుగైన వైద్యం కోసం అందరూ కార్పోరేట్ ఆసుపత్రులకు వెళ్ళలేరు కదా!
లేక ఇంకేవైనా కారణాలున్నాయా ?

* రెండు మాటల్లో అడిగినా కూడా ఇది చాల పెద్ద ప్రశ్న.ఒక సామాజిక బాధ్యతగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈ సమస్య వెనక చాల సామాజిక అంశాలున్నాయి . ఎక్కువ సమయం పట్టినా కూడా ఆ విషయాలను చర్చిస్తాను.

గర్భం, ప్రసవం ప్రకృతి సహజమే అయినప్పటికి ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 5 లక్షలమంది స్త్రీలు ప్రతిఏటా గర్భం, ప్రసవ సంబంధ సమస్యలు, ప్రమాదాల కారణంగా చనిపోతున్నారు. ఇలా చనిపోతున్న తల్లులలో 96 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలవారు. ఈ దేశాలలో సంతానోత్పత్తి వయసులోని స్త్రీల మరణాలలో 25-35 శాతానికి కారణం గర్భం, ప్రసవానికి సంబంధించిన ప్రమాదాలు. ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్న ప్రతినలుగురు తల్లులలో ఒకరు భారతీయురాలు. ప్రపంచంలో ప్రతిఒక్కనిమిషానికి ఒక తల్లి చనిపోతూంది. భారతదేశంలో ప్రతి 4 నిమిషాలకు ఒక తల్లి చనిపోతూంది. ఇది నివారించగలిగిన విషాదం.

తల్లుల అనారోగ్యాలు :

చనిపోతున్న ప్రతి ఒక తల్లికి మరో 5 గురు మరణం అంచుదాకా వెళ్ళి బ్రతికి బయట పడుతున్నారని, మరొక 10 మంది దీర్ఘకాలిక లేక జీవిత పర్యంత అనారోగ్యాల బారిన పడుతున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
రాగల అనారోగ్యాలు :
* పెల్విక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌
* సంతానం కలగకపోవడం లేక ఇన్‌ఫెర్టిలిటీ
* దీర్ఘకాలం పొత్తికడుపులో నొప్పి
* బహిష్టునొప్పి
* గర్భాశయం క్రిందకు జారడం (ప్రొలాప్స్‌)
* ఫిస్టులా (యోనికి మలాశయానికి మధ్య లేక యోనికి మూత్రాశయానికి మధ్య చిల్లుపడి నిరంతరం మలం లేక మూత్రం యోనిద్వారా జారడం). ఫిస్టులా లాంటి సమస్యలు వచ్చిన స్త్రీలు కుటుంబ నిరాదరణకు, సాంఘిక వెలికి గురవుతారు.

మరణాల రేటును ప్రభావితం చేసే అంశాలు :

1. ఆర్ధిక, సామాజిక స్థాయి
2. జెండర్‌ వివక్ష
3. భౌగోళిక ప్రాంతం
4. తెగ, జాతి

భారతదేశంలో మాతృమరణాల రేటు :

1 లక్ష సజీవ జననాలకు 400 మంది తల్లులు చనిపోతున్నారు. ఇంగ్లండులో 7గురు, అమెరికాలో 4మంది తల్లులు చనిపోతున్నారు. మనపొరుగున వున్న శ్రీలంకలోనూ, మనదేశంలోనే కేరళలోనూ ఈ మరణాలసంఖ్య 50లోపు వుంది. మనదేశంలో హిందీభాషా ప్రాంతాలలో ఈ మరణాల సంఖ్య ఎక్కువగా వుంది.

తల్లుల మరణాలకు కారణాలు :

ప్రత్యక్ష కారణాలు : 80%

1. గర్భం, ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం
2. సెప్సిస్‌ లేక ఇన్ఫెక్షన్‌ శరీరమంతటికీ సోకడం
3. అరక్షిత గర్భస్రావాలు
4. అధిక రక్తపోటు, గుర్రపువాతం
5. ప్రసవ సమయంలో జరిగే దుర్ఘటనలు
6. ఇతరాలు – ఎక్టాపిక్‌ ప్రెగ్నెన్సీ (గర్భాశయం వెలుపల గర్భం పెరగడం), ఎనస్థీషియా (మత్తునివ్వడం)కి సంబంధించిన సమస్యలు, ఎంబాలిజమ్‌

పరోక్ష కారణాలు : 20%

1. రక్తహీనత, పోషకాహార లోపాలు
2. మలేరియా
3. వైరల్‌ హెపటైటిస్‌, పచ్చకామెర్లు
4. ధనుర్వాతం, క్షయ, గుండెజబ్బు మొ||

మౌలిక కారణాలు :

1. స్త్రీలకు చదువులేకపోవడం, అజ్ఞానం, మూఢనమ్మకాలు
2. ప్రాధమిక ఆరోగ్య పరిజ్ఞానం లేకపోవడం
3. సమాజంలో స్త్రీల హీనస్థాయి
4. పేదరికం – రోజుకు 50రూ. కంటే తక్కువ కుటుంబ ఆదాయంగల తల్లులకు చనిపోయే ప్రమాదం 300 రెట్లు ఎక్కువ వుంటుంది.
5. బాల్యవివాహాలు, చిన్నవయసులో గర్భాలు, వ్యవధి లేకుండా గర్భాలు
6. కోరని గర్భాలు, అరక్షిత గర్భస్రావాలు
7. కుటుంబ నియంత్రణ సాధనాల లభ్యత మరియు అవగాహన లేకపోవడం, ఉపయోగించకపోవడం
8. గ్రామీణ స్త్రీలకు చేరువలో సమర్ధవంతమైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం
9. రవాణా సౌకర్యాలు లేకపోవడం
10. నాణ్యత లోపించిన ఆరోగ్యసేవలు, తగిన సౌకర్యాల లోపం
11. అవసరమైనంతమేరకు లభించని ప్రసూతి సేవలు, మందులు.
12. అత్యవసర పరిస్థితిలో స్త్రీలకు వైద్యం చేయించడం విషయంలో కుటుంబ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం
13. స్త్రీలు ఒకే సమయంలో అనేక పనులు చేస్తూ తమ ఆరోగ్యం గురించి, భద్రత గురించి నిర్లక్ష్యం చెయ్యడం
14. మాతృమరణాలను సంబంధించి ఆడిట్‌ జరగకపోవడం

– డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gy)

 సురక్షిత మాతృత్వానికి మార్గాలు  ఏంటో వచ్చే సంచికలో తెలుసుకుందాం. 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో