దొర్సానీ ఓ దొర్సానీ !

ఇన్నొద్దులు నువ్వు కాలు కింద బెడితే
నీ అరికాళ్ళకు నొప్పయితదని నా అరచేతుల్ని పర్సిన
నీకు సుస్తి జేత్తే గది నాకు రావాల్నని
మొక్కులు మొక్కుకున్న
దొర బోయిన దుక్కంల పండుటాకోలె
గార గార ఊగుతున్న నిను జూసి దొర్సానీ
కన్నతల్లి కనిపించి నట్టు చిత్తం జేసుకొని
నా కండ్లల్ల పటం గట్టుకున్న
నీ దుక్కాలన్నింటిని చెరువును చెరువడుగు
మోసినట్టు మోసిన
నా గుండెకాయను దీసి నా ముంగటేసి
దొరసానీ నేను నీ మన్సినేనన్న
నీకిచ్చెం దుకు నా దగ్గరేమి లేదు బిడ్డంటే
నాకేం గావాలె దొరసానీ
నీ సాయిత గావాలె నువ్వు సల్లం గుండాలే
గందుకు నా పానమైన పండోలె ఒలిసి
నీ చేతులల బెడ్తనన్న
నువ్వు నవ్వుతె ఎన్నెలపూలని ఏరుకున్న
మా అవ్వవని మురోసి మురిసి ఎన్నముద్దైన

నిను దొర్సానమ్మ అని పిల్సుకుంట
పసికూననై కేరింతలాడిన
నీ సేవలకని నన్ను నీకు మూటగట్టిచ్చిన
నీ వేడికిబొతే గాడికి నీ కట్టం గలుగొద్దని
జాడబట్టి నీడోలె ఎంటొచ్చి అర్సుకన్న
నా అరిచేతుల్ల లచ్చవరాల పూవోలిగే
గర్వంగా జూసుకున్న
అయినా సుత దొరసానీ నువ్వు నన్నే మనుకున్నవో గని
నేను నీ కండ్లకు పేదోళ్ళ జెండా కనిపిస్తానని
పండ్లు కొరికి నిప్పులు కుర్సినవ్
గిచ్చి గిచ్చి కయ్యాలు బెట్టుకొని
కసి తోటి నన్నేడిపిచ్చినవ్

నాది తక్కువ కులం పేమని
తక్కువజేసి తూట్లు బొడ్సినవ్
సిత్తుకాయితాన్ని సేత్తుకుండ్లెకు ఇసిరినట్టిరిసినవ్
దగ్గరికి తీసుకున్నట్టె తీస్కొని
అంటరానిదంటుకున్నట్టు దులపరిచ్చినవ్
ఒక్కోపాలి పిర్రగిచ్చి జోలబాడినవ్
ఇంకో పాలి పిర్రగిచ్చి సెంపల్ని సిదిమి ముద్దుజేసినవ్
నీ పేమకోసురం నేనెవ్వలో నేనెందో మర్సిపోయిన
మన మనసులు అల్లుకున్నయని పొరపాటున మైమర్సిన
మీది ఏలేకులమని మేం సాగిలబడేటోల్లమని
యాది తప్పిన

మట్టి పెల్లల కెల్లి బుట్టిన మొల్కను
బుర్దనీల్ల కెల్లి లేసిన పువ్వువని సోయిదప్పిన
రామునికి అనుమంతునోలిగె నీకంకితమైన
నా కొమ్మ బత్కును సక్కని తల్లి సెట్టుకు
మూడేసుకున్నానని పాల పొంగునైన
మనం తల్లి బిడ్డలమని ఊరంతా శంకూది
తాటి సెట్టంత నిక్కన
నవ్వు యాష్టల కొచ్చి సాపుదల ఊసెత్తితే
నానోట్లె మన్ను బోయకు దోర్సానీ అని
నీ కాల్లకు సుట్టుకున్న
ననునువు సంకకేత్తి సాచికొడ్తవని
నేత్తికేత్తుకొని న్యాలకు సర్తవని తెలిసుంటే
గప్పుడే నీ జాతికి నా జాతికి కుద్రదని
నీ కులం నా కులం కలువదని గ్రయించుంటే
ఎల్లలు తెల్వని నా పేమని ఈడ్సితన్ని
ఎడబాట్నే వరమిత్తావని తెలిసుంటే దోర్సానీ
గిప్పుడు నా మనసు సిల్లుల జల్లెడయ్యేది గాదు
మా జీవించే అక్కునోల్లనోల్లు మీరు
మా ప్రేమించే అక్కునోల్లుతరాని
నాబుద్దిని శుద్దిజేసుకుని
ఎన్కటి సంది నావోల్లు జేత్తున్న తప్పులనే
నేను సుత చేసుండకపోదును
గిట్ల దెబ్బలు బొబ్బలయి మూలుక్కుంట
నావోల్ల మింగట తలవాల్సి పడిపోకపోదును

పేదోల్ల బత్కులను అదుమంగ జూసే నువు
సిన్న కులాలని సీదరించుకునే నువు
మా ఆడోల్ల యెతలను ఎక్కిరించే నువు
బతుకుదెర్వుకు పాట్లిబడే మన్సులను ఈనంగా జూసే నువు
గాలల్లనే బుట్టి పెర్గి జరంత మెరుగ్గున్న నన్ను
నీ మన్సిగ ఎట్లు కలుపుకుంటవు దొరసానీ
గందుకే ఉత్తపున్యానికే అన్యాలంగా
నా పేగుల్ని గుంజి పేట మీదేసిన
బంగపాటుకు కుప్పకూలిన
నా ఆత్మగవురవం మర్లబడి
నెత్తురు బొట్లై రాలుతున్న నా కన్నీల్ల సాచ్చిగా
తల్లడిల్లుకుంట తల్సుకుంట కొరతలు బడి
కూటికి గుడ్డకు కొంపకు కొరతలు బడి
బహుకట్టాలతోటి కదా తేర్తున్న మనిషి కులపోల్లం
అయినా పేమలకు కరువు లేనోల్లోం
ఆపేచ్చలకు అద్దులు ఎరుగనోల్లం
పైసలున్న కులమన్న గర్రతోటి ఎలిబడి
ఎల్తి బడ్దోల్లు మీరే దొరసానీ
పేమలకు ఎనక బడ్దోల్లు మీరే దొరస్సానీ

– అనిశెట్టి రజిత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

4 Responses to దొర్సానీ ఓ దొర్సానీ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో