ఉద్యమమే ఊపిరి …POW సంధ్య తో ముఖాముఖి

POW  నే  ఇంటి పేరుగా మార్చుకున్న సంధ్య  ప్రస్తుతం POW అధ్యక్షురాలిగా ఉంటూ తెలంగాణా ఉద్యమ పోరాటం,మహిళల

ఆత్మస్థైర్యాన్నిపెంపొందించే కౌన్సిలింగ్ కార్యక్రమాలు , మహిళల సమస్యలపై ఉద్యమిస్తున్నారు.సామాజిక ఉద్యమాలలో సంధ్య

గత పాతికేళ్ళుగా చురుకైన పాత్ర పోషిస్తూ వస్తోంది.ముఖ్యంగా స్త్రీల విషయంలో, దళితుల విషయం లో .. వారి హక్కుల కోసం

ఎన్నో చారిత్రకమైన    పోరాటాలు చేసి ఫలితాలు  సాధించింది. భూస్వాముల్ని ఎదుర్కొంది. పోలీసు అధికారుల అరాచకాలను ఎదుర్కోవటం లో

ఆమె  వెనుకంజ వెయ్యలేదు.తన ప్రాణాలకు  ముప్పున్న సందర్భాల్లో కూడా నిజాన్ని చెప్పటానికి అధైర్యపడలేదు.

ఆమె జీవితమే పోరాటం…

సంధ్య మనోగతాన్ని విహంగ పాఠకులకి  అందించటానికి  సంతోషిస్తున్నాం.

ముఖాముఖి నిర్వహించిన డా.రోష్ని కి అభినందనలు .

-సంపాదకులు

 

*మీ కుటుంబం గురించి చెప్పండి?

మా నాన్న పేరు వి, రాజారావు, తల్లి సీతా దేవి.నాకు ఒక అన్న , తమ్ముడు.నేను పుట్టే సరికి నాన్న ఉద్యోగం బోధ్ లో. బిడివోగా

పని చేసే వారు.

*కుటుంబం లో తల్లి పాత్ర ప్రాముఖ్యమైనది కదా?మీ అమ్మ

ప్రభావం మీ పై ఎంత వరకు వుంది?

నైతిక విలువలు , ఆత్మ గౌరవం తో , డిసిప్లిన్ తో జీవించటం అమ్మ నేర్పింది.ఒక ప్రభుత్వాధికారి భార్యని కదా అని దర్పంగా

జీవించాలనుకోలేదు.ఆర్ధిక ఇబ్బందులు, పోలీసు నిర్భందాలు, ప్రైవేటు దాడులు సాగినా అమ్మ  ఆత్మ స్థైర్యం

చెక్కుచెదరలేదు.కుంగి పోలేదు.విలువల పట్ల నమ్మకాన్ని కోల్పోలేదు.ఆడంబరంగా జీవించటానికి అర్రులు చాచలేదు.ఎన్ని

సమస్యలొచ్చినా ఒక్క రూపాయి కూడా అప్పు చేయకుండా సర్దుకు పోయింది.సంసారాన్ని నడుపుకొచ్చింది.అమ్మఆడపిల్లకని

బంగారం కూడా కొనలేదు.కారణం తన బిడ్డలకు, తనకు అన్నీ అమరాలని ఆశించలేదు.ఆత్మ గౌరవం తోజీవించటం

కన్నావిలువైనది ఏమీ లేదని ఆలోచించేది.మట్టిని, మనుషుల్ని,ప్రపంచాన్ని ప్రేమించటం,నిస్వార్ధంగా జీవించటం నాన్న

నేర్పారు.నా బాల్యం అంతా అద్భుతమైన జ్ఞాపకాలే.అందులో ఆకలి ఉన్నా, నిర్బంధం వున్నా  వాటన్నిటిని మర్చిపోయే  ప్రేమ

వుంది.అది మనల్నిమనం ప్రేమించుకోవటం కాదు.మా చుట్టూ ఉన్న మనుషుల్ని

ప్రేమించటం.ఆకల్నిప్రేమించటం.అసమానతల్ని ప్రశ్నించటం.అందుకే వాటిని విలువైన బహుమతులుగా స్వీకరించాను.

ఈ రోజు బాధితులతో పని చేస్తున్న నేపథ్యం లో ఒక మాట చెప్పదలుచుకున్నాను.బాధితుల తల్లిదండ్రులు మా అమ్మాయికి

ఎన్నో ఇచ్చామని లెక్కలు చెపుతారు.కానీ వాళ్ళలో లోపించినది జీవించటానికి కావలిసిన ఆత్మ స్థైర్యమే.

నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు మా అక్క నాయకత్వం లో  వినాయక చవితి పండగని చెయ్యమని మేం భీష్మించుకుని

కూర్చున్నాం.అప్పుడు మా అమ్మ నిస్సహాయతతో చూసిన చూపు నాకింకా గుర్తుంది.పదవ తరగతి జగిత్యాలలో

చదివాను.అక్కడ జగిత్యాల జైత్రయాత్ర జరిగింది.ఆ ర్యాలీ లో కూడా పాల్గొన్నాను.ఇంకా ఆ వాతావరణంలో కొనసాగితే

నేనేమైపోతానోనని  అమ్మ భయపడేది.

*మరి మీ  నాన్నగారి  ప్రభావం మీ మీద ఎలా ఉండేది?

నా స్కూల్ విద్యంతా ఆదిలాబాద్,కరీంనగర్,నిజామాబాద్ జిల్లాల్లో జరిగింది.ఈ మూడు జిల్లాలు విప్లవోద్యమానికి కేంద్రంగా

వుండి,విప్లవ గాలులు శక్తివంతంగా ఉన్న రోజులు.ఈ ఉద్యమానికి మా ఇల్లు కేంద్రంగా ఉండేది.కె.రాజన్న,చండ్ర

పుల్లారెడ్డి,వేములపల్లి వెంకట్రామయ్య,కొండపల్లి సీతారామయ్య లాంటి ఎందరో నాయకులు మా ఇంటికి వచ్చేవారు.వీరందరి

ప్రభావం కూడా నా మీద  వుంది.ఆనాటి విప్లవోద్యమం గురించి , తెలంగాణా గురించి చర్చిస్తూ వుండేవారు.

*మీరు బాగా దగ్గరగా చూసిన  ఉద్యమం ఏది?

నాకు గుర్తున్న మొదటి ఉద్యమం…

మా  నాన్న సోన్ వాంఖిడిలో బిడివో గా వుండగా ఎక్కువగా టూర్ వెళ్ళే వారు. అది ట్రైబల్ ఏరియా.అంబేద్కర్,అల్లూరి

సీతారామరాజు, భగత్ సింగ్ పేర్ల మీద అనేక యువ సంఘాలు స్థాపించారు.వీటి ద్వారా గిరిజనుల కొరకు ఉన్న హక్కుల

గురించి, కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు.కాంగ్రెస్ నాయకులుగా -రెడ్లు, వెలమలు ఆధిపత్యం చెలాయిస్తున్న

రోజుల్లో యువతను సంఘటిత పరిచారు.కొన్నివందల గ్రామాల్లోని ప్రజలకు ప్రశ్నించటం నేర్పారు.ఈ ప్రశ్నించటం అక్కడితో

ఆగలేదు.ఇది ఒక విప్లవోద్యమానికి బీజం వేసింది.ఆ ప్రవాహం అనేక పాయలుగా చీలింది.

కొంత మంది పీపుల్స్ వార్ లో , కొంత మంది చండ్ర పుల్లా రెడ్డి (ఎం.ఎల్)పార్టీ లో చేరారు.కొంతమంది అమరులయారు.మా

ఇంట్లో ‘గోండ్లు’  పై అణచివేత,దోపిడీ గురించి చర్చలు జరిగేవి.అవి నాకు బాగా గుర్తున్నాయి.అణచివేత నుంచి గోండులను

రక్షించటానికి పై రెండు పార్టీలనుంచి ఎవరైనా వస్తే నేను సహకరిస్తానని నాన్న అన్నారు.పొరకల దొరలాంటి వారు అందుకు

సహకరించారు.అది ఇంద్రవెల్లి  ఉద్యమానికి దారి తీసింది.యువత,ఉద్యమాలు,పిడి ఎస్ యు , కల్చరల్  ప్రోగ్రాముల గురించి

చర్చ చాలా ఆసక్తి కలిగించాయి.

*అప్పట్లో ఉద్యమాలు  సాహిత్యం పై ఎలాంటి ప్రభావం చూపాయి?

సృజన,అరుణ తార,ప్రజాతంత్ర పత్రికలు వచ్చేవి.ఆ సాహిత్య ప్రభావం తో పాటు శ్రీకాకుళ పోరాట సాహిత్య ప్రభావం కూడా నాపై

బాగా వుంది.అప్పటికే క్రూరంగా అణచివేత కి గురైన శ్రీకాకుళం పోరాటాల, త్యాగాల ప్రభావం సాహిత్యం పై కొనసాగింది.ఆ

సాహిత్యం తాలూకు ప్రభావం ఆనాటి పిల్లలు, యువతపై బాగా ఉండేది.అందుకే ఎటు చూసినా చైతన్యమే కనిపించేది.దాంతో

పాటే సాగింది నా బాల్యం.

*ఈ ఉద్యమాల నేపథ్యం లో మీకు బాగా గుర్తున్న సంఘటన ఏదైనా ఉందా?

ఉంది.ఆదిలాబాద్ నుంచి కరీంనగర్ , జగిత్యాల వచ్చే సరికి సిరిసిల్ల , వేములవాడల్లో పెద్ద ఎత్తున భూపోరాటాలు జరుగుతున్న

రోజులవి.ఈ ప్రాంతాన్ని కల్లోల ప్రాంతంగా ప్రకటించి క్రూరంగా అణచివేతకు  గురి చేస్తున్న రోజులవి.అప్పుడు మా నాన్నని

పోలీసులు అరెస్టు చేశారు.చిత్రహింసలకి గురి చేసి సిరిసిల్ల బస్టాండులో పడేసి వెళ్లారు. ఇక్కడొక మాట చెప్పాలి-అంతటి చీకటి

రోజుల్లోనే ,ప్రశ్నించే అవకాశమే లేని రోజుల్లో ఎల్లారెడ్డి రాజకీయ నాయకుడైన  బాలగౌడ్ ఇంటికి   వేలమంది నాన్న కోసం వెళ్ళిన

సంఘటన గుర్తుంది.ఇది నన్ను కదిలించిన సన్నివేశం.

*ఉద్యమాలతో మీకున్న మొదటి వ్యక్తిగత అనుభవం ఏది?

ఎమర్జెన్సీ నిర్భందానికి వ్యతిరేకంగా జరిగిన ఆర్ ఎస్ యు , పి డి ఎస్ యు కార్యక్రమం  నా మొదటిది.అప్పుడు తొమ్మిదవ

తరగతి చదువుతున్నాను.నన్ను అరెస్టు చేశారు గానీ చిన్నపిల్ల అని వెంటనే వదిలేసారు.ఎన్ని వందల సార్లు అరెస్ట్ అయినా నా

మొదటి అరెస్ట్ నాకు బాగా గుర్తుంది.

గిరిజనులు గొర్రెలకు,బర్రెలకు,కుట్టు మిషన్లకు పెట్టుకొనే అప్లికేషన్లను నాన్న నా చేత , మా శాంతక్క చేత  పూర్తి

చేయించేవారు.ఏ నిర్మాణంలోనూ లేకున్నా,ఆయన ఒక నిజాయితీ గల అధికారి.రాజకీయ చైతన్యమే కాదు,రాజకీయ స్పృహను

పెంపొందించారు.నిబద్ధతతో కూడిన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు.వీటన్నింటి ప్రభావం నా మీద వుంది.ఆ

విలువలు,నిబద్ధత,చైతన్యం ఇప్పటికీ నన్ను నడిపిస్తున్నాయి.

*ఇంకా మీకుటుంబం లో ఎవరి ప్రభావం మీపై వుంది అనుకుంటున్నారు?

నాయనమ్మ కూడా అలాగే ఆలోచించేది.తన పిల్లలందరినీ ఒక పద్ధతిలో పెంచడమే కాకుండా ఆమె కమ్యూనిజాన్ని

ప్రేమించింది,తన పిల్లలకు నూరి పోసింది.ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి.నిరంతర శ్రమ జీవి.నిస్వార్ధంగా పిల్లల్ని ప్రేమించింది.ఈమె

ప్రభావం కూడా నా మీద వుంది.

పెద్దనాన్న రంగారావు కొండపల్లి సీతారామయ్య తో కలిసి పనిచేసారు.కడెం ఆయకట్టు లోని రైతుల పోరాటం లో కీలకమైన పాత్ర

పోషించారు.ఎమర్జెన్సీ సమయంలో రహస్య జీవితం గడిపారు.నాన్న చండ్ర పుల్లారెడ్డి తో వున్నారు.మొత్తంగా కుటుంబం పై

ఉద్యమప్రభావం వుంది.కుటుంబ ఆర్ధిక స్థితి చితికి పోయింది.అయినా విలువలు కోల్పోలేదు.పోలీసు దాడులు,వెలమ దొరల

దాడులు తరుచు ఉండేవి.దొనబండ లో రాజేశ్వరరావు అనే వెలమ దొర మా పెద నాన్నని కొడితే వేల జనం ముందు  దొర చేత

క్షమాపణ చెప్పించాడు మా నాన్న.ఆర్ధిక సమస్యలు లెక్కచేయకుండా నిస్వార్ధంగా పోరాడారు కానీ మా కుటుంబం లోని

మగవాళ్ళు భార్యలను చైతన్య పరచటం కానీ అవగాహన కల్పించటం కానీ చెయ్యలేదు.దాని వాళ్ళ కుటుంబం లోని స్త్రీలు

ఇబ్బంది పడ్డారు.ఆ ప్రభావం నా మీద కూడా వుంది.

*ప్రింటింగ్ టెక్నాలజీ లోకి ఎలా ప్రవేశించారు ?

ఒక పత్రిక పెట్టాలని ,ప్రింటింగ్ టెక్నాలజీ అంటే తెలుసుకోవాలని నాన్నకున్న ఆసక్తితో నన్ను ఈస్ట్ మారేడు పల్లి లోని

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ లో జాయిన్ చేసారు .అప్పటి వరకూ చదువంతా బాలికల పాఠశాలలో చదివిన నేను కో

-ఎడ్యుకేషన్ కి   వచ్చేసరికి చాలా భయ పడ్డాను.ప్రింటింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యుట్ లో చేరాక అమ్మా నాన్నలను వదిలి ఉండ లేక

నేను… నన్ను వదిలి ఉండలేక అమ్మ చాలా బాధ పడ్డాం .మొదటి సంవత్సరం సరిగా చదవకుండా ,ఎక్జామ్స్ రాయకుండా తిరిగి

జగిత్యాలకు వెళ్లి పోయాను.

*మరి మీ ట్రైనింగ్?

ఇది చూసి నాన్న అమ్మాయిలు చేయలేని పని లేదు ,భయ పడాల్సిన అవసరం లేదు .ధైర్యం ఉంటె ఏ రంగం లోనైనా రాణించ

వచ్చు ,అని ప్రోత్సహించారు.నా అనుభవం ,విస్తృత మైన విజన్ తో నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను.ఎక్కడైతే తల్లి

దండ్రులు – ముఖ్యంగా ,తండ్రుల వైపు నుంచి ఆడ పిల్లలని ఎక్కడైతే వివక్ష లేకుండా పెంచుతారో అక్కడ ఆత్మ స్థైర్యంతో

పెరుగుతారు .ఏ సమాజం లోనైనా తండ్రిని కుటుంబ పెద్దగా గుర్తిస్తారు. కాబట్టి భార్యా పిల్లల పట్ల డెమోక్రటిక్ గా ఉంటే వారికి

ఎంతో  ఆత్మ స్థైర్యాన్ని అందించ గలమనే    విషయాన్ని   చాలా మండి తండ్రులు అర్థం చేసుకోరు .కోట్ల రూపాయల ఆస్తులు

ఇచ్చినా అది ఆత్మ స్తైర్యాన్ని అవగాహనని ఇవ్వలేవు .

పెద్ద పెద్ద ప్రైవేటు కాలేజీలలో నన్ను చదివించ లేదు .ఇంజినీరింగ్ ,మెడిసన్ చదివించాలని కూడా అనుకోలేదు .నాకు బంగారం

బట్టలు కానీ కొన్న గుర్తు కూడా లేదు .చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు .జ్ఞాపకానికి మా నాన్నతో దిగిన ఒక్క ఫోటో కూడా లేదు .ఈ

సమాజం గొప్పగా చెప్పుకునేవేవీ మా దగ్గర లేవు .కానీ మనుష్యుల్ని ,ప్రపంచాన్ని ప్రేమించడం నేర్పించారు .

అప్పుడు నా కోసం నాన్న హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చేసారు .అట్లా మొదలైంది హైదరాబాద్లో నా జీవితం .

ఈ నగరం నాకు ఎంతో అనుభవాన్ని,గుణాన్ని ఇచ్చింది నన్ను మనిషిగా నిలబెట్టింది .

* అయితే మీ చదువు వల్ల మీరు ఉద్యమ జీవితాన్ని దగ్గరగా చూసే అవకాశం

కోల్పోయారా?

లేదు.ఇక్కడే నేను రాజకీయ కార్యకర్తగా పనిచేయటం మొదలు పెట్టాను . పీ డీఎస్ యు లో పని చేస్తూ చదువు కొనసాగించాను

.అబ్బాయిలని చూసి మొదట్లో బెదిరే దాన్ని అసలు మాట్లాడే దాన్ని కాదు .నా చేత సమాధానం చెప్పించాలంటే తాతలు

దిగొచ్చేవారు .అటువంటి నేను ఆ కాలేజీలో పీ డీఎస్ యు కార్యకలాపాల ప్రారంభకురాలినయ్యను.ఈస్ట్ మారేడ్ పల్లి కి దగ్గరలో

ఉన్న గాంధి మెడికల్ కాలేజ్ కి చెందిన పీ డీఎస్ యు నాయకులు చెరుకు సుధాకర్ గారి ఆధ్వర్యంలో కార్యకలాపాలు

జరిపేవారం .ఈ పీరియడ్ లోనే క్లాస్ రూం లో  ఒక్క దాన్నే ఉన్నాఎవర్నీ పట్టించుకోకుండా విప్లవ సాహిత్యం చదువుకునే

దాన్ని. నగరంలో విరసం ,పౌర హక్కుల సంఘం,  పీ డీఎస్ యులకు సంబందించిన ఏ మీటింగ్ జరిగినా మిస్ కాకుండా

హాజరయ్యేదాన్ని .ఒక్కో సారి అన్నీ వదిలేసి ఉద్యమం లోకి వెళ్ళాలని మనసు ఉవ్వి  ళ్ళూరేది .ఎక్కడ ఏ మీటింగ్ కి వెళ్ళినా

అక్కడ విన్న విషయాలు కలవర పెట్టేవి .నన్ను అల్లకల్లోలం చేసేవి .నాలో చాలా పెద్ద ఘర్షణ సాగేది .ఒక మధ్య తరగతి

కుటుంబంలో పుట్టిన ఆడ పిల్లగా కాసేపు ఆలోచించే దాన్ని .కుటుంబం, కెరీర్ ఇలాంటి విషయాలకే ప్రాధాన్యత ఇవ్వాలా?లేక

నా మీద విపరీత ప్రభావం చూపిస్తున్న విప్లవోద్యమం వైపు పోవాలా ?అని నిరంతర సంఘర్షణకు గురయ్యాను .బహుశ అగ్రకుల

మధ్య తరగతి కుటుంబ వాతావరణం వల్ల నేను మరింత సంఘర్షణకి లోనయ్యాను మొత్తం మీద ఆ సంఘర్షణ పడ్తూనే అమ్మకి

తెలీకుండా ఉద్యమాల్లో పాల్గొన్నాను. నాన్నకు తెలిసినా ఏమీ అనే వారు కాదు .ఆ రకం గా నా చదువు డెబ్బై పర్సెంట్

మార్కులతో ముగించాను .

*మీ జీవిత సహచరుడి గురించి చెప్పండి ?

నా జీవిత సహచరుడు నా క్లాస్ మేటే.మా కుటుంబం లాగా వాళ్ళది కూడా కమ్యూనిస్ట్ కుటుంబమే.పార్టీ ఉద్యమం నుండి

రావటం వల్ల సహజంగానే కాలేజీలో పీ డీఎస్ యు సందర్భంలో కలిసాము .అప్పటి వరకూ ఎవరితో మాట్లాడని నేను కొందరితో

స్నేహం చేసి పని ప్రారంభించాను .రాం ,శ్యాం, నేను కలిసి పీ డీఎస్ యు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వాళ్ళం .అలా మంచి

స్నేహితులమయ్యాం .పదేళ్ళ స్నేహం తర్వాత ఆ రామే  నా సహచరుడయ్యాడు.ఆ స్నేహ బంధమే వివాహ బంధంగా మారింది .

*మీరు ప్రైవేటు,ప్రభుత్వ ఉద్యోగాలు చేసారు.వాటి గురించి చెప్పండి

కాలేజీ  చదువయ్యాక ఉద్యోగం చెయ్యాలా ?లేక ఉద్యమంలో చేరాలా అన్న ఘర్షణ మొదలయింది .ఇక్కడ ఒక వాస్తవాన్ని

చెప్పాలి .హైదరాబాద్ వచ్చాక కుటుంబ బాధ్యతలు ,విధి నిర్వహణల మధ్య నాన్న ఉద్యమంలో కీలక పాత్ర పోషించ లేక

పోయారు .అయినా ‘ఉద్యోగ క్రాంతి’ ఎడిటర్ గా నిరంతరం పత్రిక సర్క్యులేషన్ కోసం కోసం జిల్లాలన్నీ తిరిగే వారు .దాని

సర్క్యులేషన్లో మేజర్ భాగం నాన్నే చూసుకునే వారు .ఉద్యోగ క్రాంతి పత్రికను సైద్ధాంతికంగా ,రచనల పరంగా పరిపుష్టం చేస్తూ

సర్క్యులేషన్ పెంచడానికి నిరంతరం కృషి చేసారు .తెలంగాలోని అనేక జిల్లాల్లో పని చేసిన మా నాన్న గారు ఎప్పుడూ మద్యం

ముట్టుకోలేదు .కానీ హైదరాబాద్ నగర వాతావరణం ,ఎన్జీవోల మధ్య ఉన్న ఘర్షణ మా నాన్నని చాలా కృంగదీసింది .ఆ నాడు

ఆయన టీఎన్జీవో సంఘానికి రాష్ట్ర కార్యదర్శి గా ఉండే వారు .నాన్న మరి కొంత మందితో కలిసి నిజాయితీ నిబద్ధతలతో

ఉద్యోగుల హక్కుల కోసం పోరాడేవారు .నిజాయితీగా జీవించాలని స్థలాల ,ఇండ్ల కేటాయింపులలో తమ పేర్లు పెట్టుకోలేదు

.ఆస్తులు కూడ బెట్టుకోవాలని ఎప్పుడూ తపన పడలేదు .కానీ అప్పట్లో కూలి పోతున్న తూర్పు యూరప్ దేశాలు ,

విచ్చిన్నమైన సోవియట్ యూనియన్ పరిస్థితి ,గ్లాస్నస్త్-పెరిస్త్రోయికా పరిణామాలతో మా నాన్న విశ్వాసం దెబ్బ తిన్నది

.మానసికంగా కుంగి పోయారు .కారణం ఏదైనా ఒక బలహీనతకి లొంగి పోయారు.మద్యానికి అలవాటు పడ్డారు .నగరానికి రాక

ముందు ప్రశాంతంగా జీవించిన మా కుటుంబం ఆర్ధిక ఇబ్బందులకు గురైంది .ఆ సమయంలో నేను ఉద్యోగం వైపే మొగ్గు

చూపాను అప్పుడు మొదలైంది మరో పోరాటం .ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలను ప్రింటింగ్ ప్రెస్సుల్లోకి తీసుకోమనే సమాధానం

ఎదురైంది .ఇక్కడే మొదలైంది జెండర్ వివక్షకి వ్యతిరేకంగా అసలు సిసలైన నా పోరాటం .

(ఇంకా వుంది)

ముఖాముఖి, , , , , , , , , , Permalink

11 Responses to ఉద్యమమే ఊపిరి …POW సంధ్య తో ముఖాముఖి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో