శిక్ష

vadrevu veera lakshmi devi

– వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

“ఇంత అచ్చు గుద్దినట్లు ఇన్నిన్ని పోలికలు ఎలా వచ్చేస్తాయోయ్ అంటోంది వదిన.” ఆవిడ కంఠంలో కుతూహలం నా

పరధ్యానాన్ని పక్కకు నెట్టేసింది.

ఆలోచనలు, అన్నం కలిపి కలుపుతున్న వాణ్ణల్లా ఏమిటో సరిగ్గా అర్థం కాక తల ఎత్తి చూసాను.

“చూడు-పాప కూడా సరిగ్గా నీలాగే ఆ బంగాళ దుంప వేపుడులోంచి ఒక్కొక్క ఉల్లిపాయ ముక్క ఏరి పడేస్తోంది”

నేనెప్పుడూ అంత పరీక్షగా చూళ్ళేదు. నిజమే! సరిగ్గా నాలాగే చేస్తోంది అదీను.

‘అదేం అమ్మలూ – అవి తీసేస్తున్నావ్?’

“ఆ వేపుడులో ఉల్లిపాయ నాకు సహించదు నాన్నగారూ.”

ఆ మాటల్లోని నా పోలికకు ఆశ్చర్యమేసింది.

“నీ చూపు చాలా వాడి వదినా” అన్నాను. చూపు మరల్చుకొని.

“పిల్లలన్నాక ఏవో పోలికలు రాకుండా వుండవు. కాని ఆశ్చర్యం! అతి సున్నితమైన ఇలాంటి విషయాల దగ్గర్నించీ పోలికలు రావడానికి వెనుక వున్న శక్తి ఎంత బలవత్తరమో! అనిపించి ఆశ్చర్య పడుతూనే వుంటాను.”

మా వదిన చాలా జాగ్రత్తగా చూడగలదు అన్నీ. ఆవిడ తెలివి తేటలన్నీ ఆ చూపులోని నైశిత్యం లోనే వున్నయనిపిస్తుంది నాకు. ఇలాటి విషయమే – ఆవిడే గుర్తించి చెప్పిందొకసారి నాకు. నాకు పై పెదవి కుడి వైపు చివర కొద్దిగా నొక్కినట్టుంటుంది. అసలు ఆ విషయాన్ని నేనే ఎన్నడూ శ్రద్దగా చూసుకోలేదు. అసలు ఏది శ్రద్దగా చేయగలిగాను గనుక – ?

“సరిగ్గా పాపకు కూడా అలాగే వుంటుంది.” అదీ వదినే గుర్తించి ఆ రోజు ఇలాగే ఆశ్చర్య పడింది.

కాని ఆమె వదనంలో ఆశ్చర్యం మాత్రమే కాదని తెలుసు నాకు.

“కనిపించే శరీరంలోనే కాక కనిపించని మనసులో కూడా పిల్లలకి పోలికలు రావడం సృష్టి యొక్క అద్బుతం” అంటోంది వదిన.

ఇంత హృదయమూ, ఇంత మేధా కలిపి ఉండడం వదినకు శాపం.

ఆలోచనలతోనే చేయి కడుక్కొని లేచి ఆఫీస్ కి తయరవుతున్నాను.

తలుపు దగ్గర సగ కనిపిస్తూ నుంచుంది పాప.

‘ఏమ్మా !’

‘బస్ టికెట్ కి డబ్బు ఈ రోజు ఇస్తానన్నారు కదా!’

సరిగ్గా నిన్న ఇదే టైం లో అడిగిన ఈ విషయం నాకు మళ్ళా ఇప్పటి దాకా గుర్తు రాక పోవడానికి కారణం ఏమై ఉంటుంది ?

కారణాలు వెతికే టైం లేదు.

సమాధానం ఆలోచించు కోడానికి కూడా టైం లేదు.

నా మొహం చూడగానే దానకి అర్థమైపోయి ఉండాలి.

నిన్నటి లాగే ఈ రోజూ నడిచి వెళ్ళాలి. నెల చివర ఎక్కడా అప్పు పుట్టని అత్యవసర పరిస్థితిలో దాని దగ్గర జాగ్రత్తగా దాచుకున్న డబ్బు తీసి వాడేసేను.

నా సమాధానం కోసం చూడకుండా వెళ్లి పోయింది పాప – అదీ నా పోలికే. యేమని సంతోషించను ? నా పిల్ల – నా రక్త స్పర్శ అని ఆనందించే టైమూ, అవకాశము ఏదీ నాకు ?

ఇంతలో వంటింట్లోంచి దభీ దభీ మని దెబ్బలు వినిపించాయి. ఏమిటా అని వంటింటి గుమ్మం దగ్గరకి వెళ్ళే లోగా – “నాన్నగారోయ్” అని వచ్చి నా కాళ్ళకి చుట్టుకుపోయాడు రాజా.

రాధ తనకున్న అందమూ, నాజుకూ అన్నీ వాడికి ధారపోసి కన్నది వాడిని. ఎంత సుకుమారమో ! అలాగే రాధకున్న అజాగర్త అంతా వచ్చేసింది. ఓ నీట్ నెస్ గానీ, ఓ పద్ధతి గానీ ఏవీ రావడం లేదు వాడికి. కొడితే ఎం లాభం ? పోలికలు చూసుకుని ముద్దు చేసినపుడో.

“చూడండి – కొత్త పెన్ను కొని నాలుగు రోజులవలేదు. ఎక్కడ పారేసేడో, వెధవ, మీతో చెప్పలేక, నన్ను ఏడిపిస్తున్నాడు.” అంటూ నా వెనుక వున్న వాణ్ణి చొక్క పట్టుకొని లాగబోయింది వాడు మరింత కరుచుకుపోయేడు.

“ఉన్న వాళ్ళు ఇద్దరు. ఎందుకర్రా అంత గొడవ”. గబ గబా వదిన వాణ్ణి రెండు చేతులతో దగ్గరకు తీసుకొని, తన సూట్ కేస్ దగ్గరకి తీసుకెళ్ళి అందులోంచి అందమైన బాల్ పెన్ తీసి బతిమాలి ఇస్తోంది.

ఆ దృశ్యం చూడలేక పోయాను. గబగబా చెప్పులు వేసుకొని బైట పడ్డాను.

ఒక్కగానొక్క పిల్లాడు. నిజమే. కాని కనీసపు అవసరం తీర్చలేక హింసించవలసి వస్తోంది. వెధవ పెన్ పారేసిన కారణంగా అన్ని దెబ్బలు తిన్నాడు. చిన్నప్పుడు ఎన్ని పెన్ లు పుస్తకాలు పారేయ్యకుండా చదువు కున్నాం మేం ? లోపం ఎక్కడుంది ?

ప్రభుత్వం మా హితవు కోరి చేసిన సూచన పాటించేమే!

నాలుగు రోజులు చుట్టపు చూపుగా వచ్చిన వదిన ముందు ఇలా జరగడం గుండెలో సన్నగా బాధ పెడ్తున్నా, ఒక రకంగా తృప్తిపడి స్థిమిత పడ్డాను.

ప్రాక్టికల్ గా ఉన్నా కష్టం ఆవిడకు తెలియాలి.

ఇల్లు దాటి బైట పడ్డాక ఆలోచనకి టైం ఉండదు. ప్రతి చోటా టెన్షనే. పాపకి బస్ కి డబ్బులివ్వకపోయినా, నాకు మాత్రం తప్పదు. ఈ బస్ పట్టుకుని వెళ్ళక పోతే పాపకి భవిష్యత్తే చూపించ లేక పోతానేమో నన్న భయం.

సాయంత్రం ఇంటికి వస్తూనే, “పాపా! రాజా “ అంటూ కొంచెం ఇష్టం కంఠంలో ద్వనిస్తోండగా పిలిచాను.

పాప ఎప్పటిలాగానే వచ్చి ఆ తలుపు దగ్గర చిరునవ్వు నవ్వుతూ నిలబడింది. రాజా మాత్రం నేను కూర్చున్న కుర్చీ చేతిమీద కెక్కి కూర్చున్నాడు.

“ఇలా రామ్మా!”

“రేపు సెలవు కదూ! రేపు మధ్యాహ్నం మీ ఇద్దరు మేట్నీ కెళ్తున్నారు.”

రాజా సంతోషంతో స్కూల్లో నేర్చుకున్న హాయ్ అన్న అరుపు అరిచి మా నాన్న మంచి నాన్న అని గబుక్కున నా చెంప మీద ముద్దు పెట్టేసుకున్నాడు.

వెధవ, అంతా వాళ్ళ అమ్మ పోలిక

”అబ్బ! ఉండరా. దానికంతా పెద్ద కథ ఉంది. మరి మీకో షరతు. సరే నంటేనే”

సరే రాజాకి అంతా రాధ తొందరే.

“ఈ రోజు అమ్మా, మీరూ, పెద్దమ్మా సినిమా కెళ్తారు. మేం చక్కగా చదువుకొని పడుకోవాలి. అంతేనా. “

ఎంతైనా పాప పాపే. దానికి అద్బుతమైన గ్రహింపు శక్తి మాత్రం అన్నయ్య నించి వచ్చింది.

అది నా పోలిక కాదు. ఆనందం వచ్చేసింది. “పాప నా కుతురురా” అన్నాను. పాపని దగ్గరకు తీసుకుంటూ.

“మీరెప్పుడూ ఇంతే – నేను అమ్మ దగ్గరకే పోతాను” చెంగున ఒక్క గెంతు గెంతి పరిగెత్తాడు రాజా.

సినిమా చూస్తున్నానే కాని మనసంతా ఇంటిమీదే ఉంది. పాపం – వెర్రి పిల్లలు పేచీ పెడితే చెయ్యగలిగే దేముంది ? నాలుగు వాయించడం తప్ప.

వాళ్ళతో వస్తే మొత్తం అయిదుగురికీ ఈ క్లాస్ టిక్కెట్లు కొనలేను. వాళ్ళతో కలిసి కింది క్లాసులో కుచోలేను అర్థంలేని కుహనా నాగరికత – దీన్ని చేదించ లేను.

నెల మొదటి రోజు కూడా స్వతంత్రత లేని ఆర్ధిక స్థితి. ఈ మహానగరంలో ఆరు వందల రూపాయల సామాన్య ఉద్యోగి పిల్లలతో కలిసి సినిమా చూడాలన్న చిన్న కోరిక తీర్చుకోలేడు.

ఆ పసివాళ్ళకి క్లాసులతో నిమిత్తం లేదు. ఎలా ఉంటుందో కూడా చూడ్డానికి ఎవరేనా చుస్తారేమోనని భయపడి – నేను వెళ్ళని క్లాస్ లో రేపు హాయిగా సినిమా చూస్తాడు రాజా. పాప మాత్రం నాన్నగారు లేరే అని మధ్య మధ్యలో బెంగ పడుతుందేమో ?

రాధ చేతి మీద మెల్లిగా తట్టింది.

“ఏమిటీ?” అన్నాను. ఆలోచనలు ఇంతగా నోక్కేస్తున్నాయేవిటో నన్ను.

“అక్కయ్య గారికి చీరేనా పెట్టకుండా పంపేస్తే బావుంటుందా ?” వదినకు వినిపించకుండా మెల్లిగా గొణుగు తోంది.

“అలాటి వేర్రిలేం పెట్టుకోకు” చిన్నగా కసిరాను. ఆవిడ నాలుగు రోజులు పిల్లలతో కలిసి ఉండాలని వచ్చింది నువ్విలాంటి పనులు చేస్తే ఆవిడ బాధ పడుతుంది.

అసలిలా మాట్లాడడానికి కారణం గాని అసలు ఎలా మాట్లాడుతున్నానని కాని ఆలోచించ బుద్ది కావడం లేదు.

పరిస్థితులు చూసి చూసి పాతి కేళ్లకే జీర్నించేసుకున్న అన్నయ్య మాటలు నా మనసులో మెదల్తూనే ఉంటాయి.

“మనం బతకలేంరా. ప్రతిచోటా టెన్షనే. ఓ బస్ దొరకదు. ట్రైన్ కి వెళ్ళాలంటే పదిహేను రోజులు ముందుగా అనుకుంటేనే కాని టికెట్ దొరకదు. ఏ ఒక్క ఆఫీసు లోనూ పని కావాలంటే జరగదు.

నలుగురికీ అవసరమయే ఏ వస్తువు సక్రమంగా అందుబాటులో ఉండదు.

ఏం చెయ్యగలం మనం ! – తప్పు మనది కాదు.

మనకి కలిగే ఏ సంకుచితమైన ఆలోచనకీ కారణం మన బీదరికం కాదురా! దేశం గొప్పదే. గొప్ప వాళ్ళ బుద్దులు బీదవి“. ఆక్రోశం. ఆవేదన కనిపించేది అన్నయ్య ముఖంలో.

అన్నయ్య మాటలు నాకు వేదం. అందుకే దేని గురించీ బాధ పడకుండా ఆలోచించి నిర్ణయిస్తున్నాను.

కాని తల్లీ, తండ్రీ, భర్తా, చివరకు పిల్లలు కూడా తనే అయి వదినను చూసుకుంటున్న అన్నయ్యకున్నంత శక్తి నాకేదీ?

అందుకే ఈ పోరాటం.

నా పిల్లల్ని తన వళ్ళో పెంచి ఆనందించిన అన్నయ్య తనకు పిల్లు లేరన్న బాధ ఒక్కనాడు పడలేదు.

నాకు గొప్ప ఆశ్చర్యం – ఇంత నిగ్రహం ఎలా సాధ్యమా? అని.

కాని కారణం తెలిసిన రోజున నాకు విని అరాయించుకునే శక్తి లేక పోయింది. ఆనాడు అది విన్న కాస్సేపటికి కళ్ళు తిరిగినట్టయి కాళ్ళ ముందు రకరకాల దృశ్యాలు కదిలాయి.

పెళ్ళయిన రెండు మూడేళ్ళు ఎదురుచూసి ఆ తర్వాత నించీ రకరకాల సన్నివేశాల్లో రోజులు గడిపిన వదిన కనిపించింది.

నాగ పంచమి ఉపవాసాలు చేసి శోషగొట్టి పోయిన వదినను వళ్ళో పడుకోబెట్టుకొని అన్నయ్య సేద దీర్చడం.

డాక్టర్ చేత టెస్టు చేయించుకుని వచ్చి ఏమీ లోపం లేకపోయినా ఏవిటీ ఆలస్యం అని బెంగతో తిండీ, నిద్రా మానిన వదినను కబుర్లు చెప్పి అన్నయ్య శ్రమ పడి నవ్వించడం.

“ఎందుకు రాజీ? నీకు బెంగా – ఇదిగో మన పాప చూడు” అని మా చిన్న చెల్లిని తీసుకొచ్చి వీపు మీద ఎక్కించుకొని గుర్రంలా వదిన చుట్టూ తిరిగిన అన్నయ్య.

అవన్నీ మెదలి ఆనాడు తట్టుకోలేక పోయేను. వాడు చెప్పిన మాటకి.

వాడి చేతులు పట్టుకొని ఏడ్చేసాను.

అన్నయ్య నాకేసి చాలా నిరసనగా చూసాడు – “ఎందుకురా నీ చదువు ? సమస్యని ఆలోచించడము , పరిష్కరించు కోవడము చేతగాని చదువు”

అని అసహనంగా ఆన్నాడు.

నేను తలవంచుకున్నాను. వదిన అలవాటు పడిపోయింది ఆ జీవితానికి.

కానీ అన్నయ్య చూపించిన పరిష్కారం ఎంత నిజం అనిపిస్తుంది ఇప్పుడు.

కానీ – ఎంత వరకూ సాధ్యం ?

అన్నయ్య చెప్పినట్టు గడచిన ఏడాదిలో వచ్చిన మార్పు రానున్న మూడు నెలల్లో వచ్చేస్తోంది. మూడు నెలల్లో వచ్చే మార్పుకి తర్వాత పదిహేను

రోజులు కూడా పట్టడం లేదు. సమస్యలు హెచ్చ వేసినట్టు పెరుగుతున్నాయి.

మనలాటి వాళ్ళ పిల్లలు రాబోయే తరంలో ఎలా బతుకుతార్రా ?

వాళ్లకి ఏం మిగిలుతుంది ? మనమే భరించలేని ఈ బీదరికం వాళ్ళని ఎంత హింస పెడుతుందో ఉహించ లేమురా ! మనం పిల్లల్ని గొప్పగా ప్రేమించితే

దాన్ని వ్యక్తం చేసే మార్గం ఒకటే.

నా చెవుల్లో పెద్ద హోరు – అన్నయ్య మాటలు దాన్లో కలిసిపోయి.

మంచి నీళ్ళకు వంటింట్లోకి వెళ్లి లైట్ వేసాను.

పాపమీద చేయి వేసి దగ్గరగా హత్తుకొని పడుకున్న వదిన పెళ్ళయిన వెంటనే వేసక్టమీ చేయించుకున్న అన్నయ్యని క్షమించ గలదా?

కాని అన్నయ్య చొక్కా, పేంటు తొడుక్కున్న ఋషి.*

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో