సుకన్య

”మీ కోరిక తీరే మార్గం మీ చేతుల్లోనే ఉంది.”
ఇంక తండ్రి ఏం సమాధానం ఇవ్వలేక పోయాడు.
మరో వారం రోజుల తర్వాత వనజ ఆశ్రమానికి వచ్చింది. అంత క్రితం ఉన్న ఉత్సాహం, చురుకుదనం ఏ మాత్రం వనజలో కనిపించటం లేదు. ఏదో పరధ్యానంగా ఏమిటో కోల్పోయినట్లుగా ఉంది.
”వనజ! నీవు ఇట్లా ఉండటం ఏం బాగాలేదు. వెనకటిలా ఉండాలి.” ధైర్యం చెప్పే ధోరణిలో మాట్లాడింది సుకన్య. ”నీవు అందర్ని ప్రేమించగలవు అన్ని విషయాలు చక్కగా అర్ధం చేసుకోగలవు. అందుకే నీకు అంతా మంచిగా కనపడతారు.”
”ఔను! అందరు మనలాగా ఆలోచించాలని లేదు కదా! అందరితో కలసి మనం జీవించాలి తప్పదు! అందుకే ఈ వ్యవస్ధకు తగ్గట్లు కలసి మనం జీవించాలి తప్పదు కదా! అందుకే ఈ వ్యవస్ధకు తగ్గట్లు మనల్ని మనం మలుచుకోవాలి కాదంటావా?”
ఏమో! అది అందరి వల్ల సాధ్యం కాదు. ఎవరో నీలాటి గొప్ప వ్వక్తి వల్ల తప్ప… అక్కా! అసలు విషయం చెబుతాను. అతను నిన్న ఫోను చేసి నన్ను వచ్చేయమని పూర్తిగా మారిపోయానని చెబుతున్నాడు. ఏం చెయ్యమంటావ్‌? అమ్మనాన్న అయితే ఎప్పడెప్పుడు తీసికెళ్ళి నన్ను అక్కడ దించేద్దామానని ఎదురు చూస్తున్నారు. అందుకే అతను రమ్మన్నాడన్న విషయం వాళ్లకు తెలియనివ్వలేదు. నీదగ్గరకు వచ్చాను. నువ్వేమిసలహా చెబుతావోనని…”
”వనజ! ఈ విషయం పెద్దలకు తెలియకుండా మీకు మీరే ఏవిధమైన నిర్ణయం తీసుకోవద్దు… అసలు ముందుగా నీకు అతని మీద విశ్వాసం ఉన్నదా? వెళ్ళితే అతను నీపట్లబాగా ప్రవర్తిస్తాడు అనే నమ్మకం ఉన్నదా? అట్లా ఉంటేనే నీవు వెళ్ళు లేకపోతే మానేయి…”
”నిజంగా నాకు ఏ విధంగాను నమ్మకం లేదు. అయితే నన్ను వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఏం చెయ్యమంటావు చెప్పు. ఇట్లా పుట్టింట్లో ఉండటం అమ్మకు నాన్నకు ఎంత మాత్రం ఇష్టం లేదు… అట్లా అని గట్టిగా వెళ్ళమని అనరు. అసలు నన్ను ఏం చెయ్యమంటావో చెప్పు” నిస్సహాయంగా అడిగింది వనజ.
”ఇష్టం లేని చోట కాపురం ముళ్ళ మీద కూర్చున్నట్లుంటుంది… పోనీ నీకు వెళ్ళాలి అని ఉంటే వాళ్ళందర్ని, పెద్దవాళ్ళను మన ఇంటికి పిలిపించి వ్రాత పూర్వకంగా నీ ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లినా అందుకు బాధ్యులం మేమే అని లిఖిత పూర్వకంగా వ్రాయించుకొందాం… నీకు ఇట్లా వెళ్ళటం యిష్టంలేదంటావా చక్కగా చదువుకో ఈసారి బి.యి.డి ఎంట్రన్సు వ్రాయి. లేదా మరో పరీక్ష వ్రాయి… నీవు ముందుగా మనస్సుని నిశ్చలపరచుకొని ఓ దృఢమైన నిర్ణయానికి రావాలి.. అంతేగాని ఎవరినో నిందించవద్దు తర్వాత.”
”అక్కా! నేను కొంచెం ఆలోచించుకొని నీకు తెలియ చేస్తాను. ఏది ఏమయినా నీవు మధ్య ఉండి ఈ విషయాన్ని చూడాలి.
”అదేమిటి అట్లా అంటావు వనజ నీక్షేమమే నేను కోరేది. అందుకు ఏం చేయమన్నా సిద్ధం” సుకన్య చెల్లి బుగ్గల నిమురుతూ అంది అప్యాయంగా.
”అక్కా! మరి నేను వస్తాను… ఇక్కడ ఆశ్రమంలో ఏవో గొడవలు ఆస్ధి తగాదాలు మొదలయినాయని చెప్పుకొంటున్నారు. నీవు పెదనాన్న గారిని ఎలాగోలా ఒప్పించి చందుని పెండ్లాడవచ్చు కదా!”
”ఒప్పించటం ఏమిటి? ఆయన అన్ని విషయాలను గమనిస్తునే ఉన్నారు కదా!”
”ఏమిటో చాలా చిత్రంగా ఉంటుంది విధి… ప్రేమించుకొన్న వాళ్ళకు పెండ్లి కాదు.. పెండ్లాడిన వాళ్ళుకు ప్రేమ ఉండదు. అంతా చిత్రం… మరి వస్తానక్కా” అంటూ వనజ లేచింది. ఆ అమ్మాయిని గేట్‌ వరకు సాగనంపింది సుకన్య… తిరిగి వస్తుంటే మధ్యలో ఆపేసాడు నాయుడు… బాబాగారి ఆస్తివ్యవహారాలన్ని చూచే ఆయన.
”ఏమ్మా! సుకన్యా! ఇంకా ఆశ్రమంలోనే ఉండిపోదామని అనుకొంటు న్నావా?” ఏదో ఆరాతీస్తున్నట్లడిగాడు.
”అలా అడుగుతున్నారేమిటి?”
”అంటే ఇకమీదట పాఠశాల వ్యవహారమంతా బాబాగారి చిన్నల్లుడు చూచుకొంటా డట! పాత వాళ్ళందర్ని తీసి వేస్తాడని అనుకొంటున్నారు…”
”నాకు తెలియదండి. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినా నాకు కలిగే నష్టం ఏమి లేదు. ఎందుకంటే నేనేమీ జీతం తీసుకొని పనిచేయటంలేదు కదా!”
”ఏమిటి నీకు జీతం లేదా! ఇస్తున్నట్లు పంతులు చెప్పాడే!”
”అట్లాగని చెప్పారా! నేనేమి తీసుకోవటం లేదు. కేవలం సర్వీసు చేయాలనే తపన తప్ప…”
”ఔను! మీ నాన్నతో ఒకసారి కలసి మాట్లాడుతాను… మరొక స్కూలు, మహిళా సేవ సమితి పెట్టాలని చూస్తున్నారు… నీకు ఏది ఇష్టమయితే అందులో ఉండవచ్చు.”
ఆయన బాబా నివాసం వైపు వెళ్ళాడు.
సుకన్య ఆరుబయట కుర్చీలో కూర్చోని ఆకాశం కేసి చూస్తున్నది. అపుడే తూరుపు వైపు నుంచి చంద్రుడు పైకి వస్తున్నాడు… ఎందుకో చందు గుర్తు వచ్చాడు. మనసంతా హాయిగా అనిపించింది. మరునిముషంలో బరువుగా అనిపించింది. తండ్రి తన మీద ఏ విధమైన నిబంధనలు పెట్టకుండా ఉండి ఉంటే ఈ పాటికి చందు తను భార్యభర్తలయి దాంపత్యంలోని మధురిమను చవి చూస్తుండే వారు ఆనందపుటంచులను తాకి చూచేవారు. కాని విధి బలీయమయింది! ఎంతో ఎడబాటును సృష్టించింది. అటువంటి విధే తమని కలుపుతుందేమో! అందుకై వేచిచూడటమే! వనజ అన్నట్లుగా తాను గొప్ప వ్యక్తినేనా? తనకు మనసు నిండా ఎన్నో కోర్కెలు… మానవ సహజమైన వాంఛలు… కాని ఎట్లా నిగ్రహించుకొంటున్నదో! ఎవరికి తెలుసు… ఈపిల్లలు… సేవాభావం… అదియిది అని తనను తాను ఎంతగానో కంట్రోలు చేసుకొంటున్నది… తనను గురించి ఎందరో ఎన్నో అనుకుంటూ ఉంటారు. పెండ్లి పెటాకులు లేకుండా ఇట్లా ఆశ్రమంలో పడి ఏడుస్తున్నానని… కాని ఒక తండ్రి తన బిడ్డకు విధించిన శిక్ష అని ఎంతమందికి తెలుసు! ఈ దేశంలో ఆడపిల్ల అయి పుట్టినందుకు ఈ దేశపు విషసంస్కృతి అయిన కులాల పట్టింపుల్లో తన జీవితం నూరుతాళ్ళ లోతున సమాధి అయింది! అయినా ఎవరు ఒక్కసానుభూతి వాక్యం మాట్లాడరు. ఒళ్ళు బలిసి కులం కాని వాడిని ప్రేమించింది అని తిడతారు. కాని కొంచెం ఆలోచించి అర్ధం చేసుకోరు. ఏమయినా తాను చందు శారీరకంగా ఒక్కటి కాలేదు. దాంపత్య సుఖాన్ని అనుభవించలేదు. దంపతులు కాలేదు. కాని అంత కంటే ఎక్కువగా మానసికంగా ఒకరికొకరు చాల చేరువ అయ్యాం… ఒకరికొకరం ఎంతో ఓదార్పునిచ్చుకొంటున్నాం… దీన్నెవరు కాదనలేరు. ఎన్ని వందలమైళ్ళ దూరాన ఉన్నా మనసు ఊసులు చెబుతూనే ఉంది ఒకరికొకరితో. దీన్నెవరు దూరం చేయలేరు!
బాబాగారి ఆరోగ్య పరిస్ధితి నానాటికి క్షీణించిపోసాగింది. ఆయన ఎక్కడెక్కడో ఆసుపత్రుల్లో ఉంటాననిపేచి పెట్టడం వల్ల డాక్టర్లను తప్పనిసరిగా ఆశ్రమానికి తీసుకు వచ్చారు. ఎప్పుడో కాని ఎవరికో కాని అనుమతించటం లేదు చూడటానికి. ఈలోగా పిల్లలకు వార్షిక పరీక్షలు మొదలయినాయి. అప్పారావు పంతులు బాబాని ఒక్కసారి కలవాలన్నా వీలులేకుండా ఆయన పిల్లలంతా సైంధవుల్లాగా అడ్డుకొన్నారు. ఎక్కడ ఆయన మాటలు విని బాబా మనసు మార్చుకొంటారోనని.. గబుక్కున నీవే పాఠశాల నడుపుకోమంటారని భయపడి పంతులుని లోపలివైపు రానీయలేదు. ఈలోగా ఆనోట ఆనోట ఆయన ఆస్ధినంతా పిల్లలకి భార్యకి ఇచ్చివేసాడన్నది నిజమని తేలిపోయింది. ప్రజలకి కూడా బాబాగారి చర్య బాధ కలిగించింది. అప్పారావు పంతులు స్కూలు పెంచి అంత పెద్దది చేసాడు. బాగా ఆదాయం తెచ్చిపెట్టే ఆ సంస్ధని తామెందుకు వదిలి వేయాలని బాబా పరివారం పట్టుపటింది. బాబాకి యిష్టమున్న లేకునా ”ఊఁ” అనక తప్పలేదు. ఒకవేళ ఆయన అనకున్నా ఆయన వాళ్ళంతా బలవంతంగానయినా అనిపిస్తారు. పంతులు పిల్లల పరీక్షలయ్యే వరకు ఉగ్గబట్టాడు. ఒక్కసారి బాబాకు కనిపించాలన్న అతని కోరిక కోరిక లాగే ఉండిపోయింది. ఎదురు చూచి చూచి ఇక లాభం లేదని నిర్ణయించుకొని అతను పూర్తిగా బయటకు వచ్చి వేరే పాఠశాల పెట్టుకొన్నాడు. జరిగిన అన్యాయాన్ని గమనిస్తున్న జనం అతనివైపే మొగ్గు చూపారు.
సుకన్యకు ఇటువంటి పరిస్ధితులు వస్తాయని తెలుసు. డబ్బు ఎంత పాపిష్టిదో, మనిషిని ఎట్లా కీలుబొమ్మను చేసి ఆడిస్తుందో తెలుసు కాబట్టి త్వరత్వరగ చోటు చేసుకొన్న ఈ పరిణామాలకు ఆమె ఏమీ ఆశ్చర్యపోలేదు.
ఒకరోజు బాబాగారి అల్లుడు చలపతిరావు ఆమెను పిలిపించాడు. ”మీరు చాలా సిన్సియర్‌గా పిల్లల విషయం బాగోగులు పట్టించుకొంటు న్నారని విన్నాం. చూస్తున్నాం. మీకేమి అభ్యంతరం లేకపోతే మొత్తం పాఠశాల మేనేజ్‌మెంట్‌ అంతా మీరే చూడండి. సుకన్య చిరునవ్వు నవ్వింది. ఆనవ్వులో ఎంతో భావం ఇమిడి ఉంది ”నేను ఇంతవరకు మీ వద్ద జీతానికి పని చేయలేదు. ఇక మీదట కూడ అట్లా చేయను. అయితే నేను పని చేస్తానా లేదా అన్న విషయం అనుమానమే!”
”అయితే-అంటే మీకు ఇక్కడ ఇకముందు పనిచేయాలని లేకుంటే మీరు వెళ్ళిపోవచ్చు” చలపతిరావుదంతా వ్యాపారధోరణి. ఒక్కపైసా ఆదాయం వస్తుందని అనిపిస్తే తప్ప ఏపని చేయడు. అనవసరంగా ఆమె కోసం ఒక రూము వగయిరా సెలవల్లో కూడ ఎందుకు. పాఠశాలనంతా తన ఇష్టం వచ్చినట్లు మార్చాలనే ఉద్దేశ్యం అతనికుంది. అందుకే సుకన్యని వెళ్ళిపొమ్మని ఇండైరక్టుగా చెప్పాడు. ఆమెకు ఎందుకో ఒక్కసారి బాబాను చూచివెళ్తే మంచిదనిపించింది.
అప్పటికే రామేశాన్ని కూడా కుటుంబసభ్యులు దూరం చేసారు. బాబాగారు మంచం మీద ఉన్నారు. మధ్యాహ్న సమయంలో ఆయన పరివారమంతా విశ్రాంతి తీసుకొనేటప్పుడు సుకన్య ఆయన గది వద్దకు వెళ్ళింది. బయట ఇంటి నౌకరు ముసలయ్య కూర్చుని ఉన్నాడు.
”తాతా! ఒక్కసారి బాబా గారికి చెప్పి వెళ్దామని వచ్చాను.”
”నీవా తల్లీ! ఎవర్ని రానీయటం లేదమ్మ! అయినా అయ్యగారు ఏం చేత్తున్నారో చూచి అడిగి వత్తాను.” అంటూ అతను లోపలకు వెళ్ళాడు మరో రెండు నిముషాల్లో వచ్చాడు.
”రామ్మా! తొందరగా చెప్పేసి వెళ్ళిపో! ఎవరైన చూచారంటే నన్ను తిడతారు” అన్నాడు.
సుకన్య లోపలకు వెళ్ళి ఆయనకు నమస్కారం చేసింది. ఆయన బాగా దగ్గరకు రమ్మని చేత్తో సైగ చేసాడు సన్నగా అయిపోయాడు. మాట కూడ చాలా నీరసంగా, వినిపించనంత నీరసంగా వస్తుంది.
”బాబా! నేను ఆశ్రమం నుంచి వెళ్తున్న! మీతో చెప్పి వెళ్దామని మిమ్మల్ని ఒకసారి చూచి వెళ్దామని వచ్చాను.” వినమ్రంగా అన్నది.
ఆయన చేయెత్తి ఆశీర్వదిస్తూ ”మంచిది… మీనాన్న చెప్పినట్లు పెండ్లాడి ఆయనకు మనశ్శాంతి కలిగించు తల్లి” అన్నాడు.
సుకన్య సమాధానంగా నమస్కారం చెప్పి వచ్చింది. బాబాకి జ్ఞానోదయం ఈ జన్మలో అవదు. అని రూఢీ చేసుకొంది. ఎన్నో బోధలు చేసే ఈయన సవర్ణులను పెండ్లాడమని ఎంత సూటగా చెప్పాడు. కాని అందరితో మాట్లాడేటపుడు మాత్రం సర్వమానస సౌభ్రాతృత్వం అనీ అంతా సమానమేనని అంటాడు. ఎలాంటి మనుషులో అనుకొన్నది!
వెంటనే తన పెట్టె తీసికొని బయటకు వచ్చింది. రామేశం అప్పటికే ఆశ్రమం ఖాళీ చేసాడు. బాబా బ్రతికున్నంత సేపు ఇది ఆశ్రమమే! తర్వాత ధనార్జనే ధ్యేయంగా సాగిపోయే అతని బంధువుల చేతిలో ఏహోటల్‌ గానో ఏబార్‌ గానో మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆయన మీద విశ్వాసం, భక్తితో కొంత, చౌకగా వస్తున్నాయని కొంత ఆశపడి కొందరు అక్కడ స్థలాలు కొని ఇళ్ళు కట్టుకొన్నారు. వారంతా ఈ జరుగుతున్న తతంగం కూడా అంత పట్టించుకోలేదు. తమకుండటానికి నీడ దొరికింది చాలు. అనవసర విషయాలు తమకెందుకను కున్నారు. మొత్తం మీద ఈ రోజుల్లో రాజకీయనాయకులతో పాటు పోటీ పడి సంపాదిస్తున్న ఈ బాబాలే నూటికి ఏ ఒక్కరో అనాధ శిశువులకి రోగిష్టి వారికి సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారు. తక్కిన వారంతా స్వార్ధం, ధనాపేక్షతో మాత్రమే రకరకాల నాటకాలాడుతున్నారు. వారిని కేంద్రంగా తీసికొని. అనుకోకుండా ఇంటికి వచ్చిన కూతురిని చూచి ఆశ్చర్యపడ్డారు.
తల్లిదండ్రులు పైకి ఎంతో సంతోషించినట్లు కనబడ్డా లోపల లోపల భయం కలుగసాగింది. మళ్ళి ప్రేమలు పెండ్లిళ్ళు ఇటువంటి సంభాషణలు వస్తాయేమోనని…
”అదేమిటే! ఫోన్‌ అయినా చేయకుండా వచ్చావ్‌?” తల్లి ఆప్యాయంగా అడిగింది.
”వెళ్ళిపోమన్నారు.”
”ఎవరు! ఆ చలపతిగాడేనా అన్నది… వాడే అట్లా దురుసుగా మాట్లాడేది” తండ్రి కోపంగా అన్నాడు.
”నాన్నా! అతను మాత్రం తప్పేం చేసాడు. వాళ్ళమామగారికి బాబా అవతారంలో బాగా సంపాదించటం తెలిసింది. ఇతనికి గొప్ప వ్యాపారస్ధుడుగా తన సంపాదన ఎట్లా పెంచుకోవాలో తెలుసు. అందుకే తన ధోరణిలో తన ఫక్కీలో అంతా మార్పు చేస్తున్నాడు.”
”నీవు అందరిని అట్లాగే సమర్థిస్తావు…” తల్లి కూతురి గొప్పతనం గుర్తించాలి అక్కడన్ను వారంతా అనే తాపత్రయంతో అన్నది.
వనజ కూడ అక్కడే ఉంది. తను పెండ్లయిన తర్వాత సంపాదించిన అనుభవంతో తాను ఇందరి ముందు తన అభిప్రాయం వెల్లడించాలి. ‘హాయిగా! నీకు నచ్చిన వాడిని పెండ్లి చేసుకుని సుఖపడక ఎందుకక్కా ఈ ఆశ్రమాలు బాబాలు… అమ్మలు… ఇప్పటికయినా మించి పోయింది ఏమిలేదు. నీ యిష్టప్రకారం చేయి. లేకపోతే చూడు నాగతి ఏమైందో!”
”ఆఁ ఆఁ సరే! ఇప్పడు నీకేమయిందే! మగవాడన్నక ఆ వయసులో ఏవో దుర్వసనాలు ఉంటాయి. అంతమాత్రానికే ఇక కాపురం చెడిపోయినట్లేనా! అన్నట్లు రేపు మీ అత్తమామలు పెద్ద మనుషులతో వస్తున్నారు. నిన్ను తీసుకువెళ్ళడానికి. వనజ పెదనాన్న అంత కఠినంగా మాట్లాడేసరికే” ఎదురు చెప్పలేక పోయింది. మాట్లాడలేక ఊరుకొంది.
ఆ మర్నాడు రానే వచ్చింది అందరు ఎదురు చూస్తున్నట్లుగా రమేష్‌ రాలేదు అతని తల్లిదండ్రులు వచ్చారు. అందరు ఆశ్చర్యపోయారు. వెంకయ్య, గోవిందయ్య, సీతమ్మ, పార్వతమ్మ, మరికొందరు పెద్దలు అంతా హాల్లో సమావేశమయ్యరు.
”ఎందుకొచ్చారు? ఇంకా మాపిల్లని కొట్టి చంపుదామని అనుకొంటున్నారా?” వెంకయ్య కోపంగా అడిగాడు.
”అసలింతకీ భార్యని చూడటానికి ఒక్కరోజైనా తీరికలేదా మీ అబ్బాయికి?” పెద్దమనుషులు ప్రశ్నించారు.
”వాడికి మొహం చెల్లక రావటం లేదు. మేము తీసుకెళ్తాం పంపండి.” రమేష్‌ తల్లి అన్నది.
అప్పటి వరకు మాట్లాకుండా మౌనంగా ఉన్న వనజ ఇక ఉండబట్టలేక పోయింది. ”నేను కాపురం చేయవలసింది అతనితో! అతను నాకు ఎటువంటి భరోసా ఇవ్వకుండ నేనెట్లా వెళ్ళేది?”
”అంటే అతను నీకేమని చెప్పాలి?”
వింటున్న పెద్దలు కల్పించుకొన్నారు. ”ఆ అమ్మాయిని ఒకసారి భర్త మెట్ల మీద నుండి తోసేసాడు ప్రాణాపాయం జరిగింది. ఇక మీదట అట్లా జరగదని నమ్మకమేటి? మీరట్లా జరగదని హామీ వ్రాసివ్వండి పిల్లను పంపుతాము”
”బాగుంది మీ అమ్మాయి ఏ అఘాయిత్యమో చేస్తే మేమెట్లా బాధ్యులమవు తాము. అట్లా వ్రాసి యివ్వం.”
”అయితే అమ్మాయి పెండ్లిలో మేమిచ్చిన కట్నం డబ్బులు మాకు ఇవ్వండి” గోవిందయ్య కొంచెం గట్టిగానే అడిగాడు.
డబ్బుల ప్రసక్తి వచ్చే సరికే రమేష్‌ తల్లిదండ్రులు మౌనం వహించారు. వాళ్ళు అసలు రాజీ పేరుతో వచ్చింది వనజను తీసి కెళ్ళి ముందు తర్వాత ఆ అమ్మాయి ద్వారా కొంత డబ్బు డిమాండ్‌ చేద్దామనే ఉద్ధేశ్యంతోనే అందుకే మరేమిమాట్లాడలేక పోయారు.
విషయాన్ని ఎటు తేల్చలేక పోయారు. డబ్బులేకుండా వనజని తమతో తీసుకెళ్ళటం దండగ అనుకొన్నారు. ఈ అమ్మాయి ఇంట్లో ఉన్న దగ్గర నుంచి కొడుకు కోడల పోట్లాటలు ఏడుపులు ఆ గందరగోళం భరించే కంటే అసలు తీసికెళ్ళక పోవటమే మంచిది. వాడు ఏక్లబ్బులల్లోనో పడ ిఏడుస్తాడు అనుకొన్నారు. కూతురిని తమతో ఎప్పడెపుడు పంపాలా అని అనుకొంటున్నారే తప్ప ఇటువంటి ప్రసక్తి వస్తుందని ఊహించలేదు. అందుకనే మరేం సమాధానం ఇవ్వలేక ”మంచి రోజు చూడండి అబ్బాయి వచ్చితీసుకువస్తాడు” అని అన్నారు.
”మీరు మా అమ్మాయి ప్రాణాలకెటువంటి ముప్పురాదని రాసివ్వాలి” అన్నారు గోవిందయ్య వెంకయ్యలు.
ఇదంతా చూస్తున్న వనజకు చాలా భయంమేసింది. తనని పంపుతారేమోనని తనక్కడకి వెళ్ళకుండా ఉండాలని వేయిదేవుళ్ళకు మ్రొక్కుకుంది. ఎట్లా వచ్చారో అత్త మామలు అట్లా వెళ్ళిపోయారు.

 – విజయ బక్ష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సుకన్య, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో