స్త్రీ యాత్రికులు

తీరా బయలుదేరబోయిన రోజే భారీ వర్షాలు మొదలై నదులు పొంగటం ప్రారంభిస్తాయి. కొత్త నీరు గిట్టకపోవటంతో పాటుగా ఈగలు, దోమలు పెరగటం వలన బేకర్‌ దంపతులిద్దరికీ జ్వరాలు పట్టుకొంటాయి. రెండువారాల వరకూ తగ్గదు. వారి వద్ద ఉన్న క్వినైన్‌ అయిపోతుంది. సామానులు మోసే ఒంటెలు, గాడిదలు మరణిస్తాయి. ఆహార నిల్వలు తగ్గిపోగా అందరూ భిక్షం ఎత్తుకునే పరిస్థితికి వస్తారు. ఇది చాలదన్నట్లు చెదలు, పురుగులు, గుడారాల్లో కాపురాలు చేస్తుంటాయి.
బేకర్‌ దంపతుల ఆరోగ్యం కుదుటపడి ప్రయాణం మొదలు పెట్ట బోయేసరికి, స్థానికులు అందరూ ఒక్కటై బానిస వ్యాపారం చేసేవారినీ, వారికి తోడుగా వెళ్ళే వారిని కూడా అసహ్యించుకొంటూ గొడవలకి దిగటం ప్రారంభిస్తారు. బేకర్‌ ‘నేను బానిసల వ్యాపారిని కాదు’ అంటే ఎవరూ నమ్మరు. ‘నేను నది కోసం వెతుకుతున్నాను’ అని చెప్పగానే, ‘అక్కడ నీకేం పని?’, ‘ఆ నది ఎక్కడ మొదలయ్యిందో నీకెందుకు?’ ‘దాని వలన మీకు లాభం ఏమిటి?’, ‘అంత డబ్బు వృధా చేయటం ఎందుకు?’ అంటూ బోలెడు ప్రశ్నలు అడుగుతారు.
ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణంలో ఒక సంవత్సరం పాటు ప్రయాణం చేసినా వారి గమ్యం ఇంకా 240 కి.మీ. దూరంలోనే ఉంది. బిడారు వర్తకులతోనే పోవాలి కాబట్టి వారు ఆగినప్పుడల్లా ఆగాలి. వారి వ్యాపారం అంతా పూర్తి చేసుకున్నాక మరలా వారితోపాటే కదలాలి. ఇది బేకర్‌ బృందానికి నిత్యం అలవాటైంది. అందుకే ఇంత ఆలస్యంగా ప్రయా ణించవలసి వచ్చింది.
ఎలాగైతేనేం బేకర్‌ దంపతులు 1864 వ సం|| జనవరిలో బ్లూ నైలు చేరుకొంటారు. స్పీక్‌-గ్రాంట్‌లు ఈ బ్లూ నైలు నది మూలాలు తెలుసుకొని, ఆ సరస్సుకి విక్టోరియా అని నామకరణం చేస్తారు. ఈ నదికి అవతలివైపునే బున్యూరో వారి నివాసాలు కనిపిస్తాయి. ‘కొత్తవాళ్ళంటే స్థానికులు చాలా కంగారుపడతారు కాబట్టి మిమ్మల్ని స్పీక్‌ అన్నయ్యగా వారికి పరిచయం చేస్తాను’ అని తన దుబాసీ చెప్పటంతో, స్పీక్‌ వేసుకొన్న కోటు, ప్యాంటు లాంటివి ధరిస్తాడు బేకర్‌. ఇద్దరికీ దట్టమైన గడ్డాలు ఎలాగూ ఉన్నాయి కాబట్టి బేకర్‌ని చూపించి, ‘ఈయన స్పీక్‌ అన్నయ్య’ అనగానే సులభంగా నమ్మేశారు. దాంతో బున్యూరో జాతి వారందరూ ఆ సందర్భంగా పండుగ చేసుకొని బేకర్‌ దంపతులని విందు వినోదాలతో ముంచెత్తుతారు. అందరినీ అలరించిన దృశ్యం మాత్రం ఫ్లారెన్స్‌ బంగారు కేశాలే. జలపాతం మాదిరిగా జలజలా ప్రవహించే ఆ కేశాల్ని చూడటానికి ఊరంతా కదిలివస్తుంది. ఆఫ్రికావారి పొట్టి, నల్లని జుట్టుకి చాలా భిన్నంగా ఉన్న ఈ బంగారు రంగు కేశాలు వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. అందుకని వారు ఫ్లారెన్స్‌ని ‘మార్నింగ్‌ స్టార్‌’ అనే అర్ధం వచ్చేలా పిలుచుకొంటారు.
బున్యూరో నుండి ముందుకి వెళ్ళాలంటే చాలా మంది పనివాళ్ళు, ఆహారం, ఇంకా ఎన్నెన్నో పరికరాలు కావాలి. ఇవన్నీ బేకర్‌కి సరఫరా చేసే ఏకైక వ్యక్తి కామ్‌రాసి ముగాంబి. ఇతడే బున్యూరో రాజ్యానికి రాజు. చిరుతపులి తోళ్ళమీద ఉన్న రాగిబల్లపై కూర్చొన్న ముగాంబి వద్దకి బేకర్‌ దంపతులు వెళ్ళి, బున్యూరోకి పడమరగా ఉన్న ఆ సరస్సు వద్దకి వెళ్ళటానికి కూలీలని, ఆహారాన్ని సరఫరా చేయమని అడుగుతారు. కానీ ముగాంబీ చాలా బహుమతులు కోరతాడు. స్పీక్‌ చెప్పినట్లుగా ముగాంబి అంత దురాశాజీవి మరొకరు ఉండరు అనిపించింది బేకర్‌కి. వారి వద్ద ఉన్న పూసల బూట్లు, తుపాకి, ఆభరణాలు, కత్తి, కాశ్మీర్‌ షాల్‌, పర్షియన్‌ తివాచీ అన్నీ తీసుకొని ‘ఇక మీరు వెళ్ళవచ్చు, అన్నీ ఏర్పాట్లు చేస్తాను’ అంటాడు. బేకర్‌ ఆనందంగా బయలుదేరబోయే సరికి ముగాంబి లేచి నిలబడి ‘కానీ, ఒక షరతు…’ అంటూ వారిని ఆగమంటాడు.
‘ఏంటది?’ విసుగ్గా అడిగాడు బేకర్‌.
‘నీ భార్యని నాతో వదిలిపెట్టాలి’ అంటాడు ముగాంబ్ష్మి వంకరగా నవ్వుతూ.
బేకర్‌ రక్తం మరిగి పోతూ ఉంటుంది. తుపాకి ట్రిగ్గర్‌ మీదకి వేళ్ళు పోతాయి.
ఇంతలోనే ముగాంబి ‘కోప్పడొద్దు. ఆవిడకి బదులుగా నా భార్యను తీసుకెళ్ళు. ఇదొక భార్యల మారకం’. అంటూ సర్దిచెప్పబోతాడు.
బేకర్‌కి ఇంతకంటే అవమానం లేదు. తన ప్రయాణం ఆగిపోయినా ఫరవాలేదు అనుకొంటూ తన పిస్టల్‌ని ముగాంబి గుండెలమీద ఆనించి ‘ఈ ట్రిగ్గర్‌ నొక్కానంటే చచ్చిపోతావ్‌. తర్వాత నీ సేవకులు ఎవ్వరూ నిన్ను కాపాడలేరు!’ అని కోపంగా అరుస్తాడు. వెంటనే ఫ్లారెన్స్‌ లేచి అరబిక్‌ భాషలో ముగాంబీని తెగ తిడుతుంది. ఆమె భాష అర్ధం కాకపోయినా ముగాంబీకి ప్రాణభయం పట్టుకొంది. ఆ దెబ్బకి భయపడిన ముగాంబీ తక్షణమే బేకర్‌ యాత్రకి కావాల్సిన సమస్త సామగ్రినీ అవసరానికంటే ఎక్కువ మోతాదులో ఇచ్చి పంపుతాడు. బేకర్‌కీ ఫ్లారెన్స్‌కీ చెరొక ఎద్దు వాహనం కూడా ఏర్పాటు చేస్తాడు. వారి ప్రయాణం మరలా మొదలైంది.
ఆ దారిలో వచ్చిన కఫూ నది చాలా ప్రమాదకరంగా ఉంటుంది. నదిలో పాచి రెండు అడుగుల మందంగా తయారై, పడవల్ని కూడా పోనీయకుండా అడ్డుకొంటుంది. కూలీలు ఫ్లారెన్స్‌ని పెద్ద బుట్టలో మోసుకువెళ్ళాల్సి వచ్చింది. అలా రెండు రోజులపాటు ఎండలో, నదీ తీరంలో ప్రయాణించాక ఫ్లారెన్స్‌ స్పృహ తప్పి పడిపోతుంది. మూడు రోజులు వరకూ ఆమె కళ్ళు తెరవలేదు. అందరూ ఆమె మరణించినట్లే భావించారు. కానీ బేకర్‌ ఆ మూడు రోజులూ నిద్రాహారాలు మాని, ఆమె పక్కనే ఉండి ఎంతో జాగ్రత్తగా మందులు ఇస్తూ ఉంటాడు. ఫ్లారెన్స్‌కి నాలుగో రోజున స్పృహ వస్తుంది. కానీ ఈసారి బేకర్‌కి ఆరోగ్యం పాడయిపోయి, కోమాలోకి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. మూడురోజులు అయినా బేకర్‌ కన్ను తెరవక పోయేసరికి ఖచ్చితంగా మరణించి ఉంటాడు అనుకొన్న కూలీలు బేకర్‌ని పూడ్చివేయటానికి తగిన ప్రదేశాన్ని వెతికే పనిలో ఉంటారు. విచిత్రంగా అదే సమయానికి బేకర్‌ కళ్ళు తెరుస్తాడు. ఈ విధంగా ఒకరి తరువాత ఒకరికి మృత్యుగండం తప్పిపోతుంది. ఆఫ్రికాలో ప్రయాణంచేసిన ప్రతివారూ ఈ విషజ్వరం బారిన పడినవారే.
ఆరోగ్యం కుదుటపడ్డాక ప్రయాణం మరలా మొదలైంది. ముందుకి వెళ్ళే కొద్దీ అన్నీ కొండలవరుసలే. ఆ కొండల్ని దాటటం ఎలాగా అని ఆలోచిస్తున్న బేకర్‌కి, ఆ కొండలన్నీ తాము మరుసటిరోజు చేరాల్సిన ‘వైట్‌ నైలు’ సరస్సుకి అవతలి అంచున ఉన్నాయని తెలుస్తుంది.
ఆ రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటారు అందరూ. తెల్లవారింది. అది మార్చి పధ్నాలుగవ తేది, 1864 వ సంవత్సరం. ఫ్లారెన్స్‌ని ఎద్దుమీద కూర్చోబెట్టి, బేకర్‌ పక్కనే నడుస్తుంటాడు. బృందం అంతా ముందు, వెనుక ఉంటారు. రెండు మూడు చిన్న కొండలు దాటాక ఒక కిలోమీటరు దూరాన పెద్ద నీటి మడుగు కనిపిస్తుంది. వెండిలా మెరిసిపోతున్న ఆ జలాశయాన్ని చూడగానే వారి ఆనందానికి అంతులేదు. ఆ సరస్సుని చేరుకొని ఎంతో సంతోషంతో ఆ నీళ్ళు కడుపునిండా తాగుతారు. పవిత్రమైన వైట్‌ నైలు నదికి ఇదే మూలం. సరస్సు నిండా నీటి ఏనుగులు, మొసళ్ళు ఉంటాయి. ఇది నైలుకి రెండవ ముఖ్యమైన నీటి ఒడి. బేకర్‌ దానికి వఉబిదిలి జుజిలీలిజీశివ అని పేరుపెడతాడు. ఈ ఆల్బర్ట్‌ విక్టోరియా రాణి భర్త. మొదటి పెద్ద సరస్సుకి స్పీక్‌-గ్రాంట్‌లు బ్రిటీషు రాణి పేరుమీద వఉబిదిలి ఙరిబీశిళిజీరిబివ అని పెట్టారు. ఈ విధంగా బ్రిటీషువారు తమ రాణిని, రాజుని నైలునదీ మూలాధార సరస్సుల వద్దకి తీసుకుపోయారు.
ఇంత గొప్ప సాహసయాత్ర చేయటం వలన ఫ్లారెన్స్‌, బేకర్‌ దంప తులు చరిత్రలో నిలిచిపోయారు.
తిరుగుప్రయాణంలో ఇంకోసారి కామ్‌రాసిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈసారి బేకర్‌ వద్ద మిగిలిన వస్తువులన్నీ లాక్కుంటాడు. బున్యూరో నుండి బానిసల కారవాన్‌ రాగానే వారితో పాటుగా బేకర్‌ దంపతులు గోండోకోరోకి క్షేమంగా చేరుకొంటారు. తమ యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా స్థానిక ప్రజలు బేకర్‌ దంపతులకి ఘనంగా స్వాగతం పలుకు తారు. 1865 వ సం|| ఫిబ్రవరిలో అంటే, బయలుదేరిన ఒక సంవత్సరం తరువాత తాము గోండోకోరో చేరుకుంటారు. బేకర్‌ దంపతులు మరణిం చారనే వార్త పరిసరాల్లోకి పాకిపోయింది. గోండోకోరో నుండి వారు పడవమీద ఖోర్టమ్‌ చేరుకొని, తర్వాత కెయిరో మీదుగా ఇంగ్లండు చేరు కొంటారు.
1862 వ సం|| డిసెంబరులో మొదలైన వారి ఆఫ్రికా ప్రయాణం 1865 వ సం|| అక్టోబరులో ఇంగ్లండు చేరటంతో పూర్తవుతుంది. ఫ్లారెన్స్‌, బేకర్‌లు వైట్‌ నైలుకు మూలమైన సరస్సుని తెలుసుకోవటంవలన, వారి సాహసాలని మెచ్చుకుంటూ రాయల్‌ జాగ్రఫికల్‌ సొసైటీవారు గోల్డ్‌మెడల్‌ ఇస్తారు. శామ్యూల్‌ బేకర్‌ తన జన్మ ధన్యమైందని భావించాడు. బేకర్‌ తన యాత్రానుభవాల్ని “The Albert-N-Yanza” అనే పుస్తకంలో రాసాడు .

– ప్రొ .ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 140
పురుషుల కోసం ప్రత్యేకం, యాత్రా సాహిత్యం, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో