లాటరీ టిక్కెట్

ఈ కధ ఇంతకుముందే విన్నారా?ఫర్లేదు,నేను మళ్ళీ చెపుతాను,ఎందుకంటే, ఇందులో ఒక నీతి ఉంది,దానికంటే ఒకరకమైన మానసిక స్థితిని వివరిస్తుంది.ఇవ్వాళకూడా ఈ కధ ఆసక్తికరంగానే ఉంటుంది.

                     పదిహేనేళ్ళక్రితం ఒక నర్తకి,సౌందర్యరసాధిదేవత వీనస్ లా ఉండేది.ఆమెను ‘సీలిటో’అందాం.ఆకాశంలోకి వేలు చూయిస్తూ సీలిటో ‘రంబ’ డాన్సు చేస్తుంటే జనం ఇంకోసారి,ఇంకోసారంటూ అరుస్తూ ఎంతగగ్గోలు పెట్టేవారో!ఒక్కక్షణం ఎలా నవ్వేదంటే,నరకంలో దేవతపడినట్టు.నర్తించేటప్పుడు ఉద్దేశ్యపూర్వకంగానే మనలో కామాన్ని రెచ్చగొట్టి వదిలేది.అరేబియా సీతాకోకచిలుకలా ఆమె ఎప్పుడూ నిప్పుతో ఆడుకునేది,కానీ అగ్నిమాత్రం ఆమెను అంటదు.

                      వెస్ట్ ఇండీస్ లో ఆమె డాన్సు నేర్చుకుంది మనకధ జరిగిందికూడా అక్కడే.కాసేపు సీలిటోతోమాట్లాడితే మతిపోవాల్సిందే.ప్రపంచంలో ఏ స్త్రీకి మగాడిగురించి ఆమెకు తెలిసినంతగా తెలియదు.ఒకసారి,క్యూబాలో ఆమె కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రేక్షకులు ఎంతపిచ్చివాళ్ళయ్యారంటే,సీలిటో కోసం లాటరీటిక్కెట్టు పెట్టారు.విచిత్రంగా ఉండొచ్చు.కానీ దక్షిణఅమెరికాలో ఇదేం కొత్తకాదు.ఇక్కడమేము అన్నిటినీ ‘అవకాశానికి’ వదులుతాం,అందగత్తెలతో సహా.ఒకఊరిలో,బాగా డబ్బున్న ఊరు,సీలిటోను,ఆమె డాన్సు ముగిసాక తమతో తీసుకెళ్ళి అనుభవించటానికి లాటరీ పెట్టారు.అయితే ఒక్కరే గెలుస్తారనుకోండి.అయితే,బుకింగ్ కౌంటర్ దగ్గరమాత్రం ప్రతివాడూ పక్కవాడిని ప్రత్యర్ధిగా చూస్తున్నాడు.

                           ఆరోజు సాయంత్రం అవుతుండగా సీలిటో కూడా కొంచెం చలించింది.డాన్సు పూర్తయ్యింది.వేదికమీదే లాటరీ తంతు మొదలయ్యింది.టిక్కెట్లన్నీ ఒకటోపీలో పోసారు.‘డ్రా’ తీసేది థియేటర్ మేనేజర్.మనిషి తెల్లగా పాలిపోయి,సన్నగా వణుకుతున్నాడు.ఏమాత్రం పొరబాటు జరిగినా అక్కడికక్కడే ప్రాణాలు తీస్తారు,పైగా ఒక్క స్త్రీకోసం ఇంతమంది మందగా ఎగబడుతున్నప్పుడు,ఎప్పుడు ఏంజరుగుతుందో ఏం చెప్పగలం? ప్రజల ఆతృతలో ఉంది పచ్చికామం అనుకోకూడదు.కారణం ఫ్రెంచి స్త్రీ అయితే ఆమె వారికి పారిస్,అలాగా యూరోపియన్ స్త్రీలంటే అంత మక్కువ వాళ్లకు.

                        సరిగ్గా అర్ధరాత్రి 213 నంబరుటిక్కెట్టు తాలూకా యజమాని లాటరీలో గెలిచినట్లు ప్రకటించారు.అక్కడ గుమికూడిన జనమంతా విజేతకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.’సీలిటోను తీసుకువెళ్ళేలోపు ఒక సారి రావయ్యా మేము చూస్తాం నిన్నంటూ’ఎవరో అరిచారు.

                       ఎవరూ ముందుకు రాలేదు.హాలంతా ఒక్కసారి నిశ్శబ్దమయిపోయింది.ఎట్టకేలకు ఒక నీగ్రో(అప్పటికీ,ఇప్పటికీ కొందరువాళ్ళను నీగ్రోలనే అంటున్నారు)మంచిఅందగాడు పైకిలేచాడు.రకరకాల భావాలతో అతన్ని చూస్తున్న వారందరికీ చిరునవ్వే సమాధానం.మెల్లగా పర్సు తీసి,బాగా నలిగిపోయిన టిక్కెట్టు తీసి,చించి గాలిలోకి విసిరేసాడు.

                       ‘నాకు సీలిటో వద్దు’అనేందుకు అంతకన్నా నిదర్శనం ఏముంది?స్పెయిన్ దేశం మొత్తానికి అందగత్తె అయిన సీలిటోను తిరస్కరించటాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు.తననిరాకరణ వల్ల వారిలో కలుగుతున్న ఉద్వేగాలను అతడు ఆనందిస్తున్నట్టే కనిపిస్తుంది.

                      బానిసజాతులన్నిటిలో ఉండే బాధ అతనిలో ఉంది,బానిసలుగా మరణించిన అతని పూర్వీకులు అనుభవించిన యాతనలు ఎందరో తెల్లతోలు మగవాళ్ళు కలలుగనే అందాన్ని తోసిపుచ్చటంతో అతని నల్లని ముఖంలో ప్రతీకారం ఎర్రగా,బొగ్గులా కాలుతోంది.ఒక్కసారి,హూందాగాభుజాలు ఎగరేసి అక్కడినుండి బయటకు బయలుదేరాడు.స్టేజీమీద సీలిటొ అవమానం ,సిగ్గుతో తుపుక్కున ఉమ్మేసింది.

ఆమె మాట్లాడాల్సిన అవసరం లేదు.మొత్తం ప్రేక్షకులు ఒక్కసారి అతనిమీద పడి కొట్టటం ప్రారంభించారు.అంతచక్కని చుక్కను కాదంటాడా?అలాంటి అందం మళ్ళీమళ్ళీ దొరుకుతుందా?స్పానిష్ సౌందర్యాన్ని వద్దంటాడా?చూపిస్తాం,వీడి సంగతి తేలుస్తాం,కధ ముగిస్తాం.అరగంట తర్వాత అతన్ని ఆసుపత్రికి పంపారు.ఇక లాటరీ లేదు.అయితే ఆ థియేటరు పేరు మాత్రం చెప్పను.

ఫ్రెంచి మూలం:వెంచురా గార్షియా కాల్టరన్

ఇంగ్లీషుఅనువాదం:రిచర్డ్ ఫిబ్స్

తెలుగుసేత:రాజేంద్రకుమార్ దేవరపల్లి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో