గిడుగు రాజేశ్వర రావు గారి’ సృష్టి లో మధురిమలు (సప్తవర్ణ దృశ్యకావ్యం) ‘ డిసెంబరు 21 2012 న రాజమండ్రి , గౌతమీ గ్రంధాలయం లో ఘనంగా జరిగింది. సాహితీ గౌతమీ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
సాహితీవేత్త ఎర్రాప్రగడ రామకృష్ణ అధ్యక్షత వహించారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పీఠాథిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ‘ సృష్టి లో మధురిమలు (సప్తవర్ణ దృశ్యకావ్యం) ‘ పుస్తకాన్ని ఆవిష్కరించారు.తమ అమూల్యమైన సందేశాన్ని అందించారు. గిడుగు వారిని చూడలేక పోయినా ఆయన మనవడిని చూడగలగడం , ఈ కార్యక్రమంలో పాల్గొని వారి పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా వుంది అన్నారు.ప్రకృతికి కవిత్వానికి వున్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తూ ఆ కవిత్వాన్ని విశ్లేషించారు.
రచయితలు తల్లావజ్జల పతంజలి శాస్త్రి ,విశ్రాంతాచార్యులు తంగిరాల వెంకట సుబ్బారావు,బెంగళూరు . గంగి రెడ్డి, పార్వతి,డా.పుట్ల హేమలత ,ఎమ్మెస్సెన్, సాహితీ గౌతమీ అధ్యక్షులు పి. విజయకుమార్ ,తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~