నూర్జహాన్

1
ఉన్మాద ప్రణయ ఇతిహాసానికి తొలి పలుకు నేను-
మర్మ సౌందర్యానికి చిరునామా నేను-
అహంకారం నాకు అలంకారం-

2
జగద్విఖ్యాతమైన  నాప్రేమ కథనంలో
ఎవరూ తొంగి చూడలేని అర పేరు బీభత్సం –
గాఢ నిదురలోంచి  ఆకస్మికంగా మేల్కొని
తప్పనిసరి నడుస్తున్నప్పుడు
జలదరిస్తున్న దేహంలా
సౌభాగ్యం నౌకను దౌర్భాగ్యం తుఫాను నడిపిస్తుంది

3
అంతః పురం  పూతోట దీపాన్ని ముట్టించిన నేను
లోక దివ్వేనైనాను-
నే పాడిన భ్రమర గీతాలన్నీ భ్రమలేనా?
నా కలలు యవ్వనం శిల్పీకరించిన
విలాస మోహాల్ని
కోట గోడలు చెరిపేసాయి –
నా యవ్వనం,
నెత్తురు  రుచి మరిగిన బెబ్బులి బాహువుల్లో
దాచిన గులాబి.
లోక దివ్వెలోని ప్రేమ తైలం
ఇంకి పోతుంటే
ఇక  నుండి రుధిరంతో వెలగమని
విధాత ఎందుకు రాశాడో గాని
స్వార్ధం
నా మనోగాయాలకు మందు
-పులిమి కసిరేపింది.

4
నా వొక్కొక్క వైఫల్యం
నా లోలోన నిద్రిస్తున్న వొక్కొక్క
శాంతి మందిరాన్ని  ధ్వంసం చేసి
పరిహసిస్తుంటే

‘యాసిన్ ‘ ను చదువుకొని
నిప్పుపై నివురుని కప్పుకొన్నాను
కాలం కోసం పొంచి చూస్తూ –

అహం ఆకలి తీర్చడానికి అందం వల పరిచాను
ఇక నేనో మంత్రగత్తెను ,

నా సౌందర్యపు బానిసే
నాకు మంత్రదండం
ఈ లోకం నా చేతిలోని ఆట బొమ్మ-

5
బహుశ
రేపటి కాలానికి
వొక స్మృ తి  గీతమై మిగులుతాను,
కాకపోతే –
చిర్నవ్వుల నా తైల వర్ణ
చిత్రాలు
వొక పంట చేను రూపంలో
నిర్జీవంగా గోడలకు వేలాడుతుంటాయి –
వృద్ధ రసికులు
చిత్తరువుల్లోని  నా నిడు సిరి బుగ్గల్ని
రహస్యంగా తడిమి తమకమవుతారు –
చంచలమతి యువకులు దొంగచాటుగా
నా పెదాలపై తమ పెదాల్ని ఆనించి మెరుపు తీగలౌతారు.
గడప దాటలేని విరహకన్యలు
దారి తప్పి సంచరిస్తున్న నేను విడిచిన మదన నిట్టూర్పుల్ని
చలిమంటగా   రగుల్చుకొని ప్రేమ చలిని కాగుతుంటారు .
మరో సూఫీ
మింగుతున్న నల్ల మందులో నా వెలుగును స్వప్నిస్తాడు
ఇంకో కవి
తాను తాగుతున్న మధుపాత్రకు
నాపేరుతో  పిలుచుకొంటాడు
చివరికి నన్ను తాకక తప్పదని తెలుసుకొని
మృత్యువు రోదిస్తుంది-

నేను మాత్రం రోదసీ మండలంలో
కాటుక వర్ణం మేలిముసుగు ధరించి
ఇంకా దొరకని దాని కోసం వెతుకుతూ
పిచ్చి గాలినై  వీస్తూంటాను-

6
నేనొక నిప్పుని –
ఆరిపోయిందాక
నన్ను తాకిన ప్రతిదాన్ని రగిల్చాను-

 – ఇక్బాల్ చంద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

3 Responses to నూర్జహాన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో