వాళ్ళిద్దరూ…

వాళ్ళిద్దరూ
ఒక్కరుగా
గుండెల్లో దాచిన
ఊసులన్ని
ఊపిర్లుగా మార్చి
గుసగుసలుగా పోసి,
నేలకు తాపడమై
నిలిచి చూసే నెరిసిన తలల్ని
నది వయసు రక్తాన్ని
ఉరకలెత్తిస్తున్నారు
జాలీ ప్రయాణం లో
ఎగిరి పడే స్పీడ్ బ్రేకర్లకు
వెనకవాలే
ప్రియురాలి హత్తుకోవడాలకో,
చెవులు కోరికే గిలిగింతలకో
రోడ్డు కరిగి ప్రవహిస్తోంది
గాలి కూడా
ఆగి, చూసి, వేడెక్కి
ఉస్సురంటూ,
తోడుకోసం పరుగులు తీస్తుంది
వేసవి ఎండ
ఎర్రగా నిలిచి
వాళ్ళ పెదాల తాంబూలమై పండి
ఆమె కర్ణాభరణమై ఊగుతుంది
ఆటోలు, మోటార్ సైకిళ్ళు,బస్సులు, కార్లు,
పరుగులు పెట్టి
అందని
వారి ఆనందానికి
పొగలు పొగలుగా
కుళ్ళుకుంటాయి.
ముక్కుపై
వేళ్ళు వేసుకుంటాయి
చూస్తున్న నా కళ్ళ ముందొక
కమనీయ చిత్రపటం
కాలానికి ఎదురీదే
ప్రవాహ జలం
వసివాడని ఈ పసిదానాల జంట
ఎప్పుడూ ఇలాగే ఉంటే ఎంత బాగుండు!

-సుందరం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Comments are closed.