feed
- జ్ఞాపకం- 99 – అంగులూరి అంజనీదేవి 01/10/2024సంలేఖ ఎన్నో జీవితాలను పాత్రలుగా మలచి రాయడం వల్లనో, నడుస్తున్న చరిత్రను చూస్తున్నందువల్లనో తెలియదు కాని మౌనంగా వుంది. సులోచనమ్మ మానసిక స్థితి అయితే అగమ్యగోచరంగా వుంది. … Continue reading →అంగులూరి అంజనీదేవి
- ప్రశ్నించే స్త్రీల అనుభవాల కథనాల వ్యధలు ట్రోల్స్ (వ్యాసం) – వెంకట్ కట్టూరి 01/10/2024“నువ్వు నాలో సగ భాగమేమిటి? నేనే నీ అర్ధాన్ని. నువ్వొక్కతివే పూర్ణాకాశానివి నేను నీ ఛాయాచిత్రాన్ని మాత్రమే”. ఇది అక్షర సత్యం.ప్రతీ మగాడి విజయం వెనుక ఒక … Continue reading →వెంకట్ కట్టూరి
- పాలపిట్ట (గేయం) -బొబ్బిలి శ్రీధర్ 01/10/2024పాలపిట్టా, పాలపిట్టా పండుగ వొచ్చిందే కళ్ళముందే సూడగానే పేనం వొచ్చిందే అలాకాలొద్దు, అలసాటొద్దు సెలకలోన సేదదీరవే పొలములోని సెట్టుపైన పదిలంగుండు సుట్టానివై యేటిలోన నీరు … Continue reading →విహంగ మహిళా పత్రిక
- చెట్టు జ్ఞాపకం (కవిత)- కొలిపాక శోభారాణి 01/10/2024పచ్చని కలలతో తరువులా ఆమె అతని వేళు పట్టుకుని అడుగులో అడుగైన జ్ఞాపకం….. మూడు పదుల జీవన సౌరభం అడుగడుగునా చిచ్చైపొడుచు కు తింటుంది..మోడైన జీవితo క్షణo..క్షణం.. … Continue reading →విహంగ మహిళా పత్రిక
- కృషీవలుడు (కవిత) – పాలేటి శ్రావణ్ కుమార్ 01/10/2024ఒళ్ళంతా బక్కచిక్కిపోయింది ఉదయాన్నే పలకరించే ఆ సూరీడు నడినెత్తిమీదికి వచ్చేసరికి ఒంట్లోని సత్తువనంతా పీల్చేసాడు కనుకనేమో ఒళ్ళంతా బక్కచిక్కిపోయింది మెత్తగా గ్రీన్ కార్పెటులా పరిచినట్లు ఉన్నంత మాత్రాన, … Continue reading →విహంగ మహిళా పత్రిక
- జ్ఞాపకం- 99 – అంగులూరి అంజనీదేవి 01/10/2024
పేజీలు
లాగిన్
వర్గాలు
వివిధ ప్రాంతాలలో సంక్రాంతి
సంక్రాంతిని ఆంధ్రదేశంలో అత్యంత వైభవోపేతంగా, పెద్ద పండుగగా జరుపుకుంటారు. దేశంలోని యితర ప్రాంతాలలో కూడ ఈ సంక్రాంతిని రకరకాల పద్ధతులలో జరుపుకుంటారు. ఇది మన భారతావనిలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా సంప్రదాయాలలో ఉన్న ఏకానుబంధాన్ని అంతర్హితంగా ప్రతిబింబిస్తూ వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా రూపుదాల్చి సాక్షాత్కరిస్తుంది.
దేశానికి మంచుకిరీటంగా భాసిల్లే ‘హిమాలయ’ ప్రాంతంలోని గ్రామాలలో ప్రజలు అనేక రకాలైన పంటలు పండిస్తూ, జీవయాత్ర సాగిస్తుంటారు. వీరికి ఈ సంక్రాంతి దినాలలో పంటలు కోతకు వచ్చి ఫలసాయం చేతికందుతుంది. ఈ సమయంలో వీరు జరుపుకునే పండుగ వైవిధ్యభరితంగా ఉంటుంది. వీరు దున్నడం, విత్తనాలు నాటడం, కలుపు తీయడం, కోతలు ఇలాంటి పనులన్ని ఆడుతూ పాడుతూ ఒక పండుగ లాగ స్త్రీ పురుష వయోభేదాలు లేకుండా సంబరాలు చేసుకుంటారు. ఈ సమయంలో వారు పాడుకునే పాటలు హృదయాహ్లాదకారకాలై వారి సంతోషాన్ని, సంతృప్తిని ప్రతిబింబించేవిగా ఉంటాయి.
ఉత్తరప్రదేశ్
వీరు సంక్రాంతికి తప్పనిసరిగా సజ్జరొట్టెలు చేసుకొని తింటారు. గొంగళ్ళను దానం చేస్తారు. సంక్రాంతి రోజున శివార్చనకు ఈ ప్రాంతంలో అధిక ప్రాధాన్యం ఇస్తారు. శివార్చనలో నువ్వుల నూనెకు అధిక ప్రాధాన్యం కనబడుతుంది. వస్త్ర, గోదానాలు విధిగా చేస్తారు. ఇంటింటికి నువ్వులు, బియ్యం పంచే ఆచారం ఇక్కడ కూడ కనబడుతుంది. త్రివేణి సంగమంలో స్నానమాచరించి సముద్రునికి సమర్పణలు చేస్తారు. పిన్నలు పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. దీని వలన ఈ పండుగకు మ్రొక్కుల పండుగ అని పేరు వచ్చింది. ఈ పండుగను వీరు ‘కిచిడి’ అని కూడ అంటారు. సంక్రాంతి నుంచి వీరికి పెళ్ళిళ్ళ సీజను ప్రారంభమవుతుంది.
పంజాబ్
పంజాబ్ ప్రాంతంలో గోధుమ విత్తనాలు జల్లడంతో భాంగ్రానృత్యం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వీరి వేషధారణ విలక్షణంగా ఉంటుంది. రంగు రంగుల లుంగీలు ఒకవైపు కుచ్చులు లాగ పైకివచ్చే విధంగా ధరిస్తారు. దానిపై కుర్తా, తలపై కుచ్చులు అమర్చినట్లుండే పాగా, కాళ్ళకు చడావులు, చేతిలో త్రికోణాకారంగా వ్రేలాడే రుమాలు, పూర్ణచంద్రుని వెన్నెలలో భేరి మ్రోగగానే నృత్యం చేసేవారంతా డోలు మెడకు తగిలించుకుని చేతులు చరుస్తూ కర్రలు ఆడిస్తూ హాయ్ హాయ్ అప్ అప్ అని అరుస్తూ తిరుగుతారు. మధ్యలో ఆపి ‘థోల్లా’ లేక ‘బోల్’ గీతం పాడుతారు. మళ్ళీ నృత్యం చేస్తారు. గోధుమలు కోయడం, గాదులు నింపడం అయ్యేక ‘ఘమర్’ నృత్యం చేస్తారు. మైదాన ప్రాంతంలో సాయంత్రం ‘కత్రే’ నృత్యం ప్రదర్శిస్తారు. డోలు, సన్నాయి వాయిస్తూ నర్తకులు చేయి చేయి పట్టుకుని వలయాకారంగా నర్తిస్తూ ముందు వెనుకలకు ఊగుతారు. ఈ నృత్య ప్రదర్శనలలోనే వారు వ్యవసాయ సంబంధమైన ప్రక్రియలన్నిటిని ప్రదర్శిస్తూ మధ్య మధ్యలో జిమ్‌నాస్టిక్స్‌ని కూడ చూపిస్తూ ‘బల్లే బల్లే’ అంటూ హుషారుగా చేసే ఈ నృత్యాలు ప్రేక్షకులకు అపారమైన ఉత్తేజాన్ని కలిగిస్తాయి.
అటుపైన సంగీత, నృత్య కార్యక్రమం జరుగుతుంది. ‘యా! యీ! యా!’ ‘రాంభ’ అనే పల్లవులతో మొదలయ్యే గీతాలు పాడుతారు. ఇవి ఎంతో కర్ణపేయంగా ఉండి ఉత్సాహం ఉరకలెత్తించేలా ఉంటాయి. చలి ప్రదేశమయిన ఆ ప్రాంతంలో చలికాలంలో ఈ విధమయిన నృత్య గీతాల వల్ల చలి దూరమై ఉత్తేజం కలుగుతుంది. ఈ నృత్యాలలో స్త్రీలు కూడ డోలు, ఢోలక్ వంటి వాయిద్యాలను పలికిస్తూ ఉత్సాహంగా అభినయం చేస్తారు. ఈ నృత్యరీతులన్ని ఎంతో ప్రఖ్యాతి వహించాయి. ఈ సమయంలో పాడే పాటలలో ఎక్కువగా ప్రేమికులు కలవడం విడిపోవడం వంటి విషయాలే ముఖ్యాంశాలు. వివాహానంతరం తొలి సంక్రాంతికి అమ్మాయి భర్తతో సహా పుట్టినింటికి రావడం క్రొత్త అల్లుడు అత్తవారింట్లో గడపడం మన సంప్రదాయం. అయితే దీనికి విరుద్ధంగా తొలి లోఢీని అత్తవారింట్లోనే జరుపుకోవడం పంజాబీ అమ్మాయిల సంప్రదాయం. తొలి సంతానం కలిగిన సంవత్సరం లోఢీ పండుగను అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారు. లోఢీ రోజున చెఱుకురసం, బియ్యం పాయసం త్రాగి మొక్కజొన్నలతో రొట్టెలు చేసుకుంటారు. ఇవి ఆరోగ్యరీత్యా ఏర్పడ్డ సంప్రదాయాలని వీరి విశ్వాసం. ‘లోఢీ’ పండుగ తోటే వీరికి నూతన సంవత్సరం ఆరంభమవుతుంది. చెఱుకురసం త్రాగి లోహ్రీదేవి సాన్నిథ్యంలో ‘యా! యీ! యా!’ అంటూ పాటలు పాడి నృత్యం చేయడంలో వీరికి అనన్యమైన తృప్తి లభిస్తుంది. ఆ మాధుర్యం చూపరులను కూడ ఆకట్టుకుని అలౌకికానందం కలుగజేస్తుంది.
సిక్కుల ‘గురుగ్రంథ సాహెబ్’లో ఈ పర్వాన్ని గురించిన వివరణ ఉంది. ఇది గొప్ప పర్వమని లోహ్రీ మంటల ఎదుట ప్రార్థనలు చేసినవారు భగవదనుగ్రహపాత్రులవుతారని చెప్పబడిరది. ఇది చలి అత్యధికంగా వుండే కాలంలో వచ్చే పర్వం గనుక ఈ సమయంలో నవజాత శిశువులను ఈ అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తే మంచిదని భావిస్తారు. నూతన వధూవరులకు కూడ ప్రాధాన్యం ఈయబడుతుంది. ఏ ఇంటిలో ఆ సంవత్సరం వివాహం జరగడం గాని, శిశువు (ఆడగాని మగగాని) జన్మించడం గాని జరిగితే ఆ సంవత్సరం జరిగే లోహ్రీ వేడుకలను ఆ యింటివారే నిర్వహించి విందు వినోదాలు చేసుకుంటారు.
ఇది ప్రధానంగా పంటల పండుగ కావడం వల్ల సమస్త జగతికి భుక్తిని ప్రసాదించే ప్రత్యక్ష నారాయణుని ఉత్తరాయణ పుణ్యకాల పర్వం గనుక ఈ పండుగకు వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన పంజాబ్‌లో అత్యధిక ప్రాధాన్యం ఈయబడిరది. లోహ్రీ సందర్భంగా రైతులు పండిన పంటను ఎవరిది వారు పంచుకుంటారు. దీనిని వారు ఆర్థిక సంవత్సర ప్రారంభంగా లెక్కకడతారు. మొత్తంమీద వీరికి ఈ పండుగ పరస్పర స్నేహబంధానికి, సోదరభావానికి, భగవంతుని ఎడ తమకు గల కృతజ్ఞతా భావాన్ని వెల్లడిరచడానికి, సంఫీుభావానికి ప్రతీకగా నిలుస్తోంది.
లోహ్రీ జరిగిన మరుసటి రోజును వీరు ‘మాఫీు’ అని వ్యవహరిస్తారు. ఈ రోజున పవిత్రస్నానం గావించి దానం చేయాలని వీరి విశ్వాసం. చెఱుకు రసంతో తయారుచేసిన ఖీర్ ఈ దినాన తప్పకుండా చేసుకుంటారు. మాఫీునే మకర సంక్రాంతి అని కూడ అంటారు.
క్రీ.శ. 1705 డిసెంబరు నెల 29 వ తేదీన పంజాబ్ లోని ముక్తసర్ లోనున్న ‘ఖిద్రానె`ది`ధాబ్’ అనే సరస్సులో గురుగోవిందసింగ్ శిష్యులు నలుబది మందిని అప్పటి ఇంపీరియల్ ఆర్మీ వారు గురుగోవింద్‌సింగ్ ఉనికిని తెలియజేయమని నిర్బంధించి చంపివేసారు. ఆ మరుసటి రోజు శవాలను ఖననం చేసారు. ఆరోజు వారి పంచాంగం ప్రకారం మాఘపాడ్యమి, తమ గురువు యొక్క రక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన ఆ మహనీయుల గౌరవార్థం ఆ రోజును అటు సంతోషకరంగాను (గురువు రక్షింపబడినందుకు) ఇటు విషాదసూచికగాను (శిష్యుల బలిదానంతో) ఈ పండుగను జరుపుకోవడం సిక్కు మతస్థులకు పరిపాటి అయింది. ఈ సందర్భంగా యాత్రికులు పావన సరోవరంలో స్నానమాచరించి ఊరేగింపుగా సాగి గురుద్వారాలో గురుగ్రంథ సాహెబ్ పఠనాన్ని విని భజనలు కీర్తనలతో మూడు రోజులు ఉత్సవాలు జరుపుతారు. అలనాడు సిక్కులకు ఇంపీరియల్ ఆర్మీకి జరిగిన యుద్ధం కారణంగానే ‘ముక్తసర్’కి ఆ పేరు వచ్చింది. ‘చాలిముక్తే’ అంటే నలువది మంది ముక్తులైన చోటు అని అర్థం. ఈ విధంగా సంక్రాంతి పంజాబ్‌లో ఇటు హిందువులకు, అటు సిక్కులకు కూడ పవిత్ర దినంగా పరిగణించబడుతోంది.
హర్యానాలో సంక్రాంతిని ‘మాగీ’ అంటారు. వీరికి ఇది ఒక్కరోజు పండుగ. సంక్రాంతి నాడు వీరు ‘చుర్మా’ తయారుచేసి దానిని అత్తగారికి బాయ్‌నా (వాయనం)గా ఇస్తారు. అలా వాయనం ఇచ్చే సమయంలో ఇరుగు పొరుగు ముత్తైదువలను తెలిసినవారిని పిలిచి పాటలు పాడి అత్తమామలను కూర్చుండబెట్టి బట్టలు పెడతారు. ఈ బట్టలు వారు అప్పటికప్పుడు కట్టుకోవాలి. సంక్రాంతినాడు ప్రాతఃకాలంలో తిలస్నానం చేసి తిలలు దానం ఇస్తారు. నువ్వుండలు చేసి గుప్తదానం చేస్తారు. గుప్తదానం అంటే నువ్వుండలు చేసేటప్పుడు ఆ వుండల మధ్యలో ధనంగాని, బంగారు వస్తువులు, ముక్కుపుడక లాంటివి గాని చిన్నకాసు గాని, ఉంగరం, దుద్దులు గాని ఏదో ఒకటి పెట్టి పైకి ఏమి కనబడకుండా వుండ చేసేస్తారు. కొందరు వెండి వస్తువులు కూడ పెడతారు. ఈ విధంగా తయారుచేసిన నువ్వు వుండలను దానం చేస్తారు. ఈ దానం కేవలం బ్రాహ్మణులకే గాక తమ బంధుమిత్రులకు ఇరుగు పొరుగులకు కూడ చేస్తారు. పుచ్చుకొన్నవాళ్ళు ఆ వుండ తింటుంటే అందులో పెట్టిన వస్తువు చూసి తమను ధనలక్ష్మి కటాక్షించిందని అత్యంత ఆనందాశ్చర్యాలను పొంది ఇచ్చిన వారికి దువా (ఆశీస్సులు, శుభకామనలు) ఇస్తారు. గుప్తదానం చేస్తే గుప్తనిధులు దొరుకుతాయని వీరి నమ్మకం. క్రొత్తగా వివాహమయిన కుమార్తెకు సంక్రాంతి సందర్భంగా ఆమెకు ఆమె భర్తకు అత్తమామలకు ఇంటిలో ఉన్న ఇతర కుటుంబ సభ్యులందరికి మామగారి అన్నదమ్ములకు అందరికి బట్టలు, మిఠాయిలు, పళ్ళు వగైరా వారిళ్ళకి పంపిస్తారు. మనం ఇంటికి పిల్చి పెడితే వీరు వియ్యాల వారి ఇంటికి పంపిస్తారు. క్రొత్త కోడలు తన పుట్టింటివారు పంపిన ఆ బట్టలను అత్తమామలకి, బావ బావమరదులకి, ఆడబిడ్డలకు పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటుంది. పళ్ళు, మిఠాయిలు ఇస్తుంది. మరిదికి మాత్రం ‘ఘేవర్’ తప్పనిసరిగా ఇచ్చితీరాలి. ఘేవర్ అంటే మైదాతో బూంది లాగ తయారుచేసి దాన్ని పంచదారపాకంలో వేస్తారు. తీపిబూంది అవుతుంది. దానిని ఒక పళ్ళెంలో పోసి పైన జీడిపప్పు, బాదంపప్పు, డ్రై ఫ్రూట్స్ వేసి అలంకరించి దానిని మరిదికి ఇస్తారు.
అరుణాచల్‌ప్రదేశ్
అరుణాచల్‌ప్రదేశ్‌లో ‘షెర్‌దుక్ పెన్నుల’ జాతివారు జనవరి నెలను పెళ్ళిళ్ళ నెలగా పరిగణిస్తారు. వివాహానంతరం పది రోజుల వరకు వధువు మొహం వరునికి చూపరు. నాగాలు కూడ ఈ నెలను వివాహాలకు ప్రశస్తంగా తలుస్తారు. వివాహం చేసుకోదలచిన జంటయొక్క భవిష్యత్తుని ఏదో అదృశ్యశక్తి తెలియజేస్తుందని వీరి నమ్మిక. గూడెం పెద్దకు అదృశ్యశక్తి ఏదైనా చెడు చెబితే పెళ్ళికూతుర్ని ఆ శక్తికి బలియిస్తారు. పెళ్ళి కుమారునికి వేరొక బాలికతో వివాహం జరిపిస్తారు. తరువాత విందు వినోదాలతో పిన్నలు పెద్దలు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటారు.
మేఘాలయకు చెందిన ‘గారో’లు సంక్రాంతిని పంటల పండుగగా జరుపుకుంటారు. వీరు సూర్యుణ్ణి ‘సాల్‌జోంగ్’ అని వ్యవహరిస్తారు. సంక్రాంతిని ‘హంగాలా’ అంటారు. ఈ పండుగ ఫలానా రోజునే జరపాలనే నియమం ఏమీ లేదు. వ్యవసాయ పనులన్ని ముగిసి ధనధాన్యాదులు ఇంటికి చేరగానే ప్రజలంతా ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకుంటారు. ఇవి నెల రోజుల పాటు సాగుతాయి. గారో జాతిలో మాతృస్వామ్య వ్యవస్థ అమలులో ఉంది. తెగలుగా చీలిపోయిన ఈ జాతిలో తల్లే ఇంటి పెద్ద. ఆస్తిపాస్తులు తల్లినుండే బిడ్డలకు సంక్రమిస్తాయి. ఇందులో ప్రతి తెగకు ఉపతెగకు ‘నోక్మా’ అనే పేరుతో కులపెద్ద ఉంటాడు (ఉంటుంది). నోక్మా అంటే గృహమాత అని అర్థం. అంటే తెగ మొత్తానికి తల్లిలాంటిది అని అర్థం. ఈ పదవిలో స్త్రీలే కాక అప్పుడప్పుడు పురుషులు కూడ నియమితులవుతుంటారు. హంగాలా పండుగనాడు వేకువజామునే ‘నోక్మా’ ఇంటివద్ద కొమ్ముబూరలు మ్రోగుతాయి. అలా మ్రోగాయి అంటే అది గ్రామస్థులందరు నోక్మా ఇంటిముందు హాజరు కావాలని సంకేతం. ఆ శబ్దం వినగానే గ్రామస్థులంతా నోక్మా ఇంటిముందు గుమిగూడతారు. వారంతా కలిసి సూర్యభగవానునికి పూజలు సలిపి ప్రణతులర్పించి క్రొత్త ధాన్యం పళ్ళు నైవేద్యం పెడతారు.
అస్సాం
మణిపూర్
బెంగాల్ (వంగదేశం)
బెంగాల్‌లోని సుందరబన్స్ అడవుల పరిసర ప్రాంతాలలోని కన్నింగ్, అమ్‌తోలా, నోర్‌పూర్, బద్దీపూర్, శుక్నామరీ, కుల్ఫు, సాగర్‌లలో కొందరు పాములు పట్టడమే వృత్తిగా జీవిస్తారు. వీరు ఈ జనవరి నెలని పాములు పట్టే పండుగగా పరిగణించి సూర్యోదయాత్పూర్వమే పాములు ఎక్కువగా సంచరించే ప్రాంతాలకు వెళ్ళి తెల్లవారేలోపు తమ పని పూర్తిచేసుకుంటారు. వంగదేశంలో సంక్రాంతి పండుగను ‘తిలప్రా సంక్రాంతి’ అంటారు. ఈ పండుగకు వీరు బియ్యంపిండి వంటకాలనే ఎక్కువగా చేసుకుంటారు. పంచదారతో చక్రాలు తయారుచేసి దండలుగా గ్రుచ్చి పిల్లల మెడలో వేస్తారు. తరువాత ఆ దండలను తీసి కోళ్ళకు ఆహారంగా వేస్తారు.
వ్యాసాలుఅటుకులు, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, ఆంధ్రదేశం, ఉత్తరప్రదేశ్, ఖంబాలిం, గురుగ్రంథ సాహెబ్, గోదానాలు, జిమ్నాస్టిక్స్, జీడిపప్పు, డోలు, ధాన్యాలు, నువ్వుల నూనె, నువ్వులు, నూనె, నృత్య, పంజాబ్, పిడకలు, పైచల్, బియ్యం, బెంగాల్, భారతావని, భోగి పండుగ, మణిపూర్, మేఘాలయ, మొక్కజొన్న, లోహ్రీ, వంగదేశం, వస్త్ర, వేరశనగ పప్పు, వ్యాసాలు, సంక్రాంతి, సంగీత, సన్నాయి, సిక్కు, సుబ్బలక్ష్మి మర్ల, స్రూయ్‌రాలిం, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్Permalink