ఆకాశంలో సగం నీవు
అనంతకోటి నక్షత్రాల్లో
సగం నీవూ సగం నేను
తూరుపుపవన సంగీతంలో
రాగం నీవు తానం నేను
మనిద్దరం కలసి
ఉద్యమిస్తే ఉప్పెన
మనిద్దరం కలసి
విప్లవిస్తే విజయం
విప్లవపథంలో మనిద్దరం
ఒకరికొకరం బాస చేసుకునే వేళ
విప్లవపథానికి మనిద్దరం
కలిసికట్టుగా బాసచేసిన వేళ
త్యాగం మన పేరు
పోరాటం మన ఊరు
ఆకాశంలో సగం నీవు
అనంతకోటి నక్షత్రాల్లో
సగం నీవూ సగం నేను
విప్లవాకాశంలో.
– శివసాగర్
(ఈ కవిత 1974 డిసెంబరులో సత్యమూర్తిగారు రాసారు. )
పంపింది: డా. బండి సత్యనారాయణ.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
3 Responses to ఆకాశంలో సగం నీవు