ఆమె అమెరికా లో చిన్న పిల్లలకోసం మొదటి పత్రికను నడిపిన తొలి మహిళ,సాధారణ ఆదాయం ఉన్న కుటుంబ మహిళల కోసం ఇంటింటివిషయాలను రాసిన ప్రధమ మహిళ ,బానిసత్వాన్ని సమూలం గా అధ్యయనం చేసి చరిత్రనంతా రాసిన మొదటి మహిళ ,నగర ప్రజల కోసం పత్రికలో సిటీ కాలం ప్రారంభించిన మొదటి రచయిత్రి ,అమెరికాలో చారిత్రిక నవలలురాసిన అతి కొద్ది మందిలో ఒకరు గానిలిచిన మహిళోద్యమ నాయకు రాలు –ఆమెయె -లిడియా మెరియా చైల్డ్ .ఆమె సృజనాత్మ క శక్తి ఉన్న రచయిత .భర్త ఆదాయం అంతంత మాత్రమె అయినా ,తన రచన ల ద్వారా సంపాదించుకొన్న డబ్బు తోనే కుటుంబాన్ని అంటే తనను, భర్తను పోషించుకొన్న ఆదర్శ స్త్రీ .భర్త తో కాపురం అంతంత మాత్రం గానే ఉన్నా ,కడ దాకా అతని తో సాహచర్యం చేసి ఓర్పు కు ఉదాహరణ గా నిలిచింది .అంత మాత్రం చేత ఆమె అసాధారణ స్త్రీలేక సూపర్ హ్యూమన్ అను కొంటె పోరబాటే .ఆమె సాధారణ మధ్య తరగతి గృహిణి .పిల్లల కోసం పరితపించింది .పిల్లలు కలగక పోయినా జనం లో తన పిల్లలను చూసుకోన్నది .స్వేచ్చ ,న్యాయాలకోసం ఆహరహం శ్రమించింది .ఆమె జీవితం అను క్షణ పోరాటమే .డిప్రెషన్ కు లోనైనా ,మళ్ళీ తనను తను సరి దిద్దు కొని జీవనయానం సాగించింది .
లిడియా భర్త అనేక వ్యాపారాలు చేశాడు .అన్నిట్లోనూ నష్ట పోయాడు .ఈమె తన సంపాదన అంతా అతని బాగు కోసం ,అభివృద్ధి కోసం ఖర్చు చేసింది .అయినా ఫలితం లేదు .అతనిది నిలకడ లేని జీవితం నష్ట జాతకుడు .అతనూ పత్రికా సంపాదకుడిగా పని చేశాడు . ఆర్ధిక విషయాలలో భర్తను కొద్దిగా దూరం గానే ఉంచాల్సి వచ్చిన్దామెకు .అయినా భర్త పై ఆమె కు ప్రేమానురాగాలేమాత్రమూ తగ్గలేదు .అతని బాగు కోసమే ఆ పని చేసింది .ప్రతి గాయం ,ప్రతి వెనుకడుగు ,ప్రతి నిరాశను ఆమె కప్పి పుచ్చుకొని ,రెట్టింపు ధైర్యం తో ముందుకు సాగింది .మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది అనుకొన్న లక్ష్యాన్ని సాధించిన ధీర వంత మేరియా .
మేరియా గొప్ప రచయిత్రి .ఆమె ఏది రాసినా చదువరుల హృదయాలకు చేరు వయ్యేది అందుకే పెద్ద పెద్ద పత్రికలన్నీ ఆమెను బ్రతిమాలి రాయించుకొనేవి .బానిసత్వ నిర్మూలనపోరాటం లో ఆమెది అలుపెరగని పాత్ర .ఆ విషయం పై ఆమె రాసింది అంతా సాదికారమే నని చరిత్ర కారులు తేల్చారు .అంత అధ్యయన శీలి ఆమె .డెబ్భై ఏళ్ళు ఆరోగ్యం గా జీవించింది .కాని ఆమె కూడ బెట్టుకొన్న ఆస్తి ఏమీ లేదు .సంపాదన పై ఆమెకు శ్రద్ధ తక్కువ .సేవా భావమే ఆమె ఆస్తి .ఆ వయసులో ప్రజలు ఇచ్చిన కానుకలు ,తాను రాసిన పుస్తకాలపై వచ్చే రాయల్టీ యే ఆమె కు ఆర్ధికం గా ఆసరా .అయినా కుంగి పోలేదు .అదే ఉత్సాహం తో ఆపని చేసింది తన దగ్గర చేరిన ధనాన్ని బానిసత్వం నుండి విముక్తి పొందిన వారి సంక్షేమం కోసం ఖర్చు చేసిన పెద్ద మనసు చైల్డ్ ది. తన సంపాదన ఈ రకం గా ఉప యోగపడుతున్నందుకు ఆమె ఎంతో సంతృప్తి చెందింది .చివరి రోజుల్లో బౌద్ధ ధర్మానికి చేరువ అయింది .బౌద్ధానికి చెందిన ఎన్నో పుస్తకాలను కొని ,చదివి లోతులను పార జూసింది .ఆమె రాసిన ‘’Progress of religious ideas’’పుస్తకానికి ఇది బాగా ఉపయోగ పడిందని చెప్పింది .ఇరవై ఏళ్లకే ఆమె గొప్ప అధ్యన శీలి గా పేరు పొందింది .బైబుల్ లోని ముఖ్య విషయాలనన్నిటిని చేర్చి Electic Bible అనే స్వంత పుస్తకాన్ని తయారు చేసుకోవాలనే ఆమె తీవ్ర సంకల్పం నేర వెర కుండానే మరణించింది .’’Aspiration of the world ‘’,’’A chain of opals ‘’అనేవి ఆమె రాసిన చివరి పుస్తకాలు .ఇందులో గ్రీక్ ,రోమన్ ,బుద్ధిజం ,జ్యూయిజం ,క్రిస్తియన్ ,,చైనాయిజం ,పెర్షియన్ ,హిందూ మతాలకు ఆధునిక రచయితలు ఎందరో రాసిన రచనలను పొందు పరచింది .ఇవన్నీ’’ క్రోన లాజికల్ ఆర్డర్ ‘’లో రాయటం ఆమె గొప్పతనం .ఆమె ‘’Anti Asian Racism ‘’పుస్తకాన్ని రాయాలని అన్నీ సేకరించుకోన్నది కాని రాయలేక పోయింది .అన్ని కాలాలు ,దేశాలు ,పవిత్ర మైన ఆశయాలతో నే ఉన్నాయి అన్నది ఆమె నిశ్చితాభిప్రాయం .
లిడియా మెరియా చైల్డ్ 1802 ఫిబ్రవరి పద కొండున అమెరికా లోని మాసా చూస్త్స్ రాష్ట్రం లో మేడ్ ఫీల్డ్ అనే చోట జన్మించింది .చిన్నప్పుడే నేటివ్ అమెరికన్ ల తో స్నేహం చేసి ,వారి జీవిత విధానాలను తెలుసుకొన్నది .అప్పుడే ప్రఖ్యాత తత్వ వేత్త ,మహా రచయితా అయిన ఎమర్సన్ హార్వర్డ్ లో విద్యార్ధి గా ఉండే వాడు .Hobonok ,a tale of early times ‘’నవలను చిన్నతమ లోనే రాసి ,అందరి దృష్టి ఆకర్శించింది . .అందులో నేటివ్ ఇండియన్ ల సంస్కృతి ,తో బాటు అమెరికన్ ,ఇండియన్ వర్ణాంతర వివాహం కూడా రాసి ,ఆమె కాలాని కంటే,ముందుగా నిలిచి ,మార్గ దర్శి అని పించుకోంది .అప్పటికి అమెరికా సాహిత్యం లో ఈ భావ వ్యాప్తి జరగ లేదు .ఆ బీజం వేసింది ఈమెయే.ఆమె రెండో పుస్తకం చిన్న పిల్లల కోసం రాసిన కదా సంపుటి ‘’ .evenings in New England’’ఆమె రాసిన ‘’ది రెబెల్స్’’ చారిత్రాత్మక నవల .ఇందులో అమెరికా విప్లవ యుద్ధం లోను , ,దేశం స్వతంత్రం సంపాదించిన మొదటి దశలోను , స్త్రీల పాత్ర ను వివరించింది .
ఇండియన్ అమెరికన్లు అయిన చేరోకీల ను వారి స్థావరాల నుండిప్రభుత్వం ఖాళీ చేయిస్తే,వారి పునరావాసానికి ఉద్యమం నడిపింది .స్త్రీల కోసం ఎన్నో రాసింది .వంటింటి చిట్కాలు చెప్పింది .సంపాదనా మార్గాలు సూచించింది .పరిమిత ఆదాయం తో ఎలా జీవించా వచ్చో రచనల ద్వారా తెలియ జేసింది .’’కాలమే ధనం ‘’అన్నది ఆమె నినాదం .1829 లో మహిళల కోసం ‘’The frugal house wife ‘’రచన చేసింది .బానిసలను వారి యజమానులే విద్యా వంతుల్ని చేయాలని సూచించింది .బానిస నిర్మూలన ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నది .ఎందరో ఆఫ్రికన్ అమెరికన్ నాయకులు ఆమె సలహాలను స్వీక రించే వారు .బానిసత్వ వ్యతిరేక సభలను నిర్వ హించింది .వారి ఆర్ధిక సాయం కోసం విరాళాలు వసూలు చేసి అంద జేసింది .లిడియా చేసిన ముప్ఫై ఏళ్ళ సుదీర్ఘ పోరాటం తర్వాత బానిసలకు విముక్తి లభించింది .
మేరియా చివరి రోజులను బోస్టన్ బోర్డింగ్ హౌస్ లో ఒంటరిగా ఒక గది లో గడిపింది .డబ్బును చాలా జాగ్రత్తగా క్షర్చు చేస్తూ ,నీతికి నిజాయితీకి ,వ్యక్తిత్వానికి ప్రాధాన్యత నిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోంది .తన గది లో కిటికీ లో ఒక ‘’ప్రిజం ‘’అంటే’’ పట్టకం’’ ను పెట్టు కొని ,దాని ద్వారా ఇంద్ర ధనుస్సు రంగులను తన గది గోడల మీద పడేట్లు చేసుకొని ఆనందాన్ని అనుభవించేది .1880 అక్టోబర్ ఇరవై న ఆమె గుండె పోటు తో మరణించింది .ఆమె ను సమాధి చేసిన రోజున ఆకాశం లో అంతకు ముందెన్నడూ కనీ పించని అతి పెద్ద అద్భుత మైన ఇంద్ర ధనుస్సు కనీ పించి,అందర్నీ ఆశ్చర్యం లో ముంచింది .ఈ ఇంద్ర ధనుస్సు అందమైన భిన్నత్వం లో ఏకత్వానికి ప్రతీక అని అందరు భావించారు .ఈ ఇంద్ర ధనుస్సు ఆమె సేవా తత్వానికి ఘన మైన నివాళి అన్నారు .లిడియా మేరియా చైల్డ్ నిజం గా నే పేద ప్రజల ఆశల ఇంద్ర ధనుస్సు .
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
One Response to అన్నిటా ముందున్న అమెరికన్ మహిళ – లిడియా మేరియా చైల్డ్