పిల్లల పండుగ

పిల్లలూ! మీకుప్రత్యేకించిన పండుగ ఈనెల్లో వస్తున్నది.అదేంటో మీకు తెల్సే ఉంటుంది ,అసలు ఈ నెలే   మీకోసం సుమా ! నవంబర్ మొదటి తేదీ మన ఆంధ్రరాష్ట్రఅవతరణ దినోత్సవం ,ఎంతోమంది మహామహులు మనకోసం ప్రాణత్యాగాలు చేసి సంపాదించిన మన రాష్ట్రం మనకోసం వచ్చిన పండుగరోజు!, దీన్ని సంపాదించడం కోసం దీక్షవహించి ప్రాణత్యాగం చేసిన శ్రీపొట్టిశ్రీరాములు వంటి త్యాగధనుల పుట్టిన నేల మనది!

       ఆరోజంతా మీదేగాకోలాహలం !ఆరోజునుండీ ‘ పిల్లలపండుగకోసం ‘ ప్రతిరోజూ ఒక పోటీ!, వ్యాసరచన, ఉపన్యాస, పద్య పఠనం, డ్రాయింగ్, పెయింటింగ్,పాటలపోటిలు, నృత్య పోటీలు,లిరిక్ రైటింగ్  ఇలా ఎన్నెన్నో! చివరి రోజున అంటే నవంబర్ 14వ తేదీన ‘ పిల్లల పండుగ’రోజున ,డ్రామాలూ,ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించి  పోటీలలో గెలుపొందిన వారితో పాటుగా  పాల్గొన్న వారికీ పార్టిసిపేషన్  బహుమతులు ఇస్తారు కదా! ఐతే ఈపిలల్ల పండుగను  ఎందుకోసం జరుపుకుంటున్నాం? అనే విషయం మీకు తెల్సినా మరోమారు చెప్పుకుందామేం! మన స్వతంత్ర్య భారతదేశమొట్టమొదటి ప్రధానమంత్రి అయిన  ‘ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పుట్టిన రోజన్నమాట! ఐతేమాకేం!ఆయనపుట్టినరోజు మాపండగెలా అవుతుందని అంటున్నారా!! అనుకుంటు న్నారా! అదే చెప్తున్నానోయ్! మీరంతా’ చాచా నెహ్రూ ‘అనిపిల్చే మననేత ఎంతమంచివారో ! ఆయన్ని కొందరు స్నేహితులు వేటకు రమ్మనగా ఆయన “అడవి మృగాల నుతుపాకీతో షూట్చేయడం కంటే  కెమెరాతో షూట్ చేయటమే నాకిష్టం ” అనిచెప్పారు . ఆయన మనస్సు అలాంటిది. జీవకారుణ్యం  చాచాకెంతో ఇష్టం!

           అంతేకాక  ఆయన మహా మేధావి.ఎంతటి జటిల సమస్యనైనా ఇట్టే సులువుగా పరిష్కరించగల మేధావి. చిన్నతనం నుండే ఆయన సమస్యని ఎంతోతెలివిగా పరిష్కరించేవారు. ఒక చిన్న సంఘటన చెప్తాను ,వింటారా పిల్లలూ!

                ఒక రోజు సాయంకాలం మీవంటి తొమ్మిది పదేళ్ళ పిల్లలు కొందరు చక్కని వాతావరణంలో ఒక తోటలో ఆడుకుంటున్నారు. ఒక బంతి తీసుకుని దాన్ని ఒకరివైపు ఒకరు విసరుతూ ,పట్టుకుం టూఆడుతుండగా ,ఇంతలో టెండూల్కర్ లా ఒకడు బంతిని విసరగా అది ఒక పెద్ద వటవృక్షం మొదలుకున్న ఒక తొర్ర లో పడింది, అంతా వెళ్ళి ఆ చెట్టు చుట్టూ చేరి ఆ బంతి విసిరిన వాడ్ని తిట్టారు .ఆ బంతినెలా తీయాలో వారికి తెలీక , లోపల ఏవైనా  పాములో, చీమలో ఉంటాయని భయపడి  లోపల చేయి పెట్టడానికి  ఎవ్వరూ ధైర్యం చేయలేదు. అంతా దిక్కు తోచక బంతి విసిరిన వాడితో పోట్లాడుతున్నారు .వాడి  ఏడుపు  లంకించుకున్నాడు. అక్కడంతా  గోలగోలగా  ఉంది. ఇంతలో ఒక పది పన్నెండేళ్ళ పిల్లవాడు అక్కడికి విహారార్ధం వచ్చాడు.అతడు అక్కడ చెట్టు చుట్టూ చేరి ఉన్న వారిని చూచి ” తమ్ముళ్ళూ ఏమైంది ? ఎందుకంతా ఈ చెట్టు చుట్టూ చేరి కూర్చున్నారు ఆడుకోకుండా? అంతా కుశలమేనా! ఏదైనా సాయంకావాలా?” అని అడిగాడు. వారంతా ” అన్నా! వీడు మా బంతిని ఈ చెట్టు తొర్రలో వేశాడు. దాన్ని ఎలా తీయాలో తెలీక అంతా చూస్తున్నాం ” అన్నారు, బంతి విసరినవాడు ” అన్నా! నేనేం చేయను ? నేను నా చేతి కొచ్చిన బంతిని విసరాను,అది వెళ్ళి చెట్టు తొర్రలో పడుతుందని నాకేంతెల్సు ?వీళ్ళంతానన్నుతిడుతున్నారన్నా!” అనిఏడ్వడం మొదలు పెట్టాడు . దానికతడు ” మీరేం బాధపడకండి నేను దాన్ని తీసే మార్గం ఆలోచిస్తాను ” అని ఒక్క క్షణం  ఆలోచించి, ఆ తోటలో ఉన్న బావివద్దకెళ్ళి, చేదతో నీరు తోడి ఒక పెద్దబొక్కెన నిండా తెచ్చిఆ చెట్టు తోర్రలో పోశాడు. నీరంతా లోనికిపోయి ఆ రంధ్రం నిండగానే బంతి బయటికి వచ్చిపడింది. అంతా బంతి తీసుకుని ” అన్నా థాంక్స్ , యూ ఆర్ గ్రేట్! ” అని చెప్పిఅక్కడ నుండి  వెళ్ళిపోయారు..

         ఆబాలు డెవరో కాదు .మన జవహర్ లాలే! చిన్నతనంలోనే ఆయన బుధ్ధికంతపదును. అందుకే చాక చక్యంగా రాజ్యపాలన చేసి మనదేశాన్నిప్రగతిపధం వైపునడిపాడు, జీవించి ఉన్నంత కాలం మన ప్రధానిగా ఉన్న ఏకైక నాయకుడు మన జవహర్ లాల్ , అదే చాచా నెహ్రూ! అంతేకాదు ఆయన ఒక ఉత్తమ పితరులు.! ఆయన స్వతంత్య్ర సమరంలో చెఱసాలలో ఉన్నపుడు తనకుమార్తె అయిన ఇందిరా ప్రియదర్శిని’ కి రాసిన ఉత్తరాలు ఆమెను తిరుగులేని పెద్ద నాయకురాలిని చేశాయి, తండ్రి తర్వాత మన దేశ ‘ప్రధమ మహిళా ప్రధాని’ని చేశాయి.

             చూశారా! ఏం చేసినా ,ఏం వ్రాసినా అవి మన పిల్లలకు ఆదర్శంగా , వారి పురోగతికి నిచ్చెనమెట్లలా పనికివచ్చేలా ఉండాలని ఆయన్నిచూసి తల్లిదండ్రులంతా నేర్చుకోవాలి !   ఆయన” నాకు పిల్లలంటే చాలా ఇష్టం.ఎందుకంటే వారికి కల్లాకపటాలు తెలియవు. వారి హృదయం స్వఛ్ఛంగా గులాబీపూలవలె ఉంటుంది ” అనేవారు! అందుకే బాలలన్నా, గులాబీలలన్నా నెహ్రూ గారికి ఇష్టం గనుకే ఆయన తన కోటు జేబుకు ప్రతిరోజూ ఒకఎర్ర గులాబీ ధరించేవారు, ఆయన పుట్టినరోజే మీకు పండుగరోజు, అదే ‘పిల్లల పండు’గన్నమాట. ఈరోజునుండీ మీరూ మీ ప్రతి పుట్టినరోజునాడూ ఒక మంచిపని , అంటే  పేదపిల్లలకు  ఒక జత బట్టలో, పండ్లో ఇచ్చి మీ శక్తికొలదీ సేవచేసి మంచి భారతీయ భావిభారత పౌరులనిపించుకోవాలని నా ఆకాంక్ష. మీకోసం ఈ కధ చెప్పాలనిపించి ఇదిమీకోసం అంకితంచేస్తున్నానోచ్!

ఆదూరి.హైమవతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో