మళ్ళీ మాట్లాడుకుందాం


          దమయంతి కూతురు కథని సత్యవతి గారు చదువుతూ ఉండగా మొదటి సారి కాకినాడలో జరిగిన కేంద్ర సాహిత్య అకాడెమీ సభలలో విన్నాను.  ఇంకా అది ప్రింట్ మీడియాలోకి రాకుండానే చర్చల్లోకి వెళ్ళిపోయింది.  ఆ కథ చదివిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడకుండా ఉండలేక పోతున్నారు.  చివరికి సత్యవతిగారు ‘తాంబూలలిచ్చేసేమ్ తన్నుకు చావండి’ అన్నట్లు గడుసయిన పని చేసారు అనిపిస్తోంది చర్చలు వింటుంటే.

             భర్తనూ పిల్లల్ని వదిలి ఎవరితోనో వెళ్ళిపోయిన దమయంతి వెనక ఉన్న సమాజం ఎన్ని విధాలుగా మాట్లాడుతుందో అన్ని మాటలూ  తన పాఠకుల చేత మాట్లాడించేలా  కథ రాసారు ఆమె . తల్లి లేకుండా పెరిగిన ఆడపిల్ల వేపునించి కథ చెప్తూనే ఏ వేపూ  మొగ్గకుండా కథ నడపడం కత్తిమీద సామే.  ఆ సాము ఆవిడ అవలీలగా చేసారు.

            ఐతే ఇష్టంలేని వివాహ బంధం నుంచి బయటికి వెళ్ళగలిగే దార్లు స్త్రీలకూ ఉండాలని, మరొక అనుబంధంలోకి వెళ్ళగల ఆమె స్వేచ్చని సమాజం ఆమోదించాలని చెప్పిన స్త్రీ వాద భావజాలాలను ఈ కథలో ఆమె పునరాలోచించారు.  పిల్లలు ముఖ్యంగా తండ్రి మీద కన్నా తల్లి మీదే ఎక్కువ ఆధారపడతారని, కాబట్టి తల్లుల స్వేచ్చకు ఆ పరిమితులు ఉన్నాయని చెప్పకనే చెప్పేరు.కథంతా దమయంతి కూతురుదే. రచయిత్రి సున్నితమైన స్వరంతో వినిపించే ఆ పిల్ల వేదన మనని ఎంతో కలత పెడుతుంది.  కొడుకు అర్థం చేసుకున్నట్టు చివరికి భర్త కూడా అర్థం చేసుకుంటున్నట్టు (ఆమె ఊర్ద్వ లోకపు మనిషి లాంటి మాటతో) కూతురు అర్థం చేసుకోలేదు.  చివరి ముగింపు వాక్యంలో కూడా తల్లి వెళ్లిపోవడం వల్ల కూతురు వ్యధ అనుభవిస్తోంది కాని వెళ్ళకపోతే తల్లి ఎంతటి వ్యధ అనుభవించ వలసి వచ్చేదో అంటారు రచయిత్రి.  ఏం జరిగినా ఎవరో ఒక స్త్రీయే బాధపడుతోందని ఆ ముగింపు.  ఇందులో మగవాళ్ళు నష్టపోయినా బాధపడిన వైనం తక్కువ.

          పి.సత్యవతి గారి ఏ కథ మీదా జరగనంత చర్చ ఈ కథమీద జరగడం చూస్తుంటే తల్లి కోసం కూతురు పడిన వేదనే మనని ఎక్కువగా కదిలిస్తోందా ? అన్న అనుమానం వస్తోంది.  అదే నిజమైతే  మనం స్త్రీ పురుషులం ఇంకా ఇక్కడే ఉన్నామా ?మన ఆలోచనలలో ఇంకా పెద్దగామార్పు రాలేదా? ఆమె భర్తా, కొడుకుల వాదనల వైపు మొగ్గలేక పోతున్నామా ? అని అనుమానం వస్తోంది.

ఇది ఇలా ఉండగా ఇంకా మెతక కంపు కొట్టే భావాల వాళ్ళు దమయంతి లేచిపోడాన్ని సమర్దించిన కథగా దీన్ని బహిష్కరించడానికి సిద్దమవుతునే ఉన్నారు.

తండ్రి వెళ్ళిపోతే అప్పుడు కూడా కూతురి భావాలు ఏమిటి ? అన్న ప్రశ్నకి సమాజంలో తావే లేదు.  సాధారణంగా తండ్రి వెళ్ళడు.  ఇద్దరితోనూ అక్కడే ఉంటాడు.  కాని పిల్లలు అప్పుడుకూడా సామాజికమైన అవమానాలకి గురి అవుతూనే ఉంటారు.  అది వింటే కూడా మన మనసులు ఎంతో కొంత కలత చెందకమానవు.

     అందుకని శరత్, చలం లాంటి వాళ్ళు వాళ్ళ నాయికల చేత స్వేచ్చా ప్రణయాల కోసం పోరాటాలు చేయించినప్పుడువాళ్లకి  పిల్లలు లేకుండా జాగ్రత్త పడ్డారు.  జాగ్రత్త వాళ్ళకోసం కాదు పిల్లల కోసం.  పిల్లల్ని ఈ ప్రపంచలోకి తెచ్చాక ఇక మీ స్వేచ్చకు పరిమితి ఏర్పరుచు కోవాలి.  లేకపోతే పిల్లల్నికనే ఆలోచనే చెయ్యవద్దని చలం బిడ్డల శిక్షణలో చెప్పనే చెప్పాడు.

     స్త్రీలకోసం  దళితులకోసం మైనారిటీలకోసఆలోచించే వాళ్ళు ఉన్నారు కానీ చూపు  కాత్యాయని చెప్పినట్టు పిల్లల కోసం కూడా ఆలోచించేవాళ్ళు అవసరం కాదా!

       కానీ దమయంతిలాగా పిల్లల్ని వదిలేసి వెళ్ళే స్త్రీలు అరుదుగానే ఉంటారు.  వెళ్ళినా వాళ్ళ ప్రాణం పిల్లలకోసం కొట్టుకుంటూనే ఉంటుంది.  రచయిత్రి కె.గీత అడిగిందని సత్యవతి గారు చెప్పినట్టు ఒక వేళ ఆమె పిల్లల కోసం వెనక్కి వద్దామనుకున్నా  మనం రానివ్వం.  వచ్చినా సవ్యంగా బతకనివ్వం.

          ఈ కథ ప్రింట్లో వచ్చినపుడు నేను నలుగురు మిత్రులను కూర్చోపెట్టి చదివి వినిపించాను.  అప్పుడు ఒక యువ మిత్రుడు మంచి విమర్శ చేసాడు.  అతను ప్రతి విషయంలోనూ ఒక ఆరోగ్యవంతమైన కోణాన్ని పట్టుకోగలడు.  అతనన్నాడు కదా “మనం మన దేశంలో పిల్లల్ని ఎంత వయసు వచ్చినా మన మీద ఆధారపడేలా పెంచుతాం.  అది ప్రేమ అని మనం భావిస్తాం, వాళ్ళని సెల్ఫ్ సఫిషిఎంట్ చెయ్యం.  అదే విదేశాల్లో అయితో చిన్నప్పటి నుంచి వాళ్ళ బతుకు వాళ్ళు బతికేలా తయారు చేస్తారు.  పిల్లలు స్వయం శక్తితో పెరుగుతారు.  మరీ మన తల్లులు తమ  పిల్లల్ని వాళ్ళ బతుకు వాళ్ళని బతక నివ్వరు.  ఈ పద్దతిలో మార్పు వస్తే తప్ప ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఉండదు. 

          నిజమే మనం లేకపోతే బతకలేకుండా అయిపోతున్నారు వాళ్ళు . పనులకి,అవసరాలకి గుర్తింపుకి అన్నిటికీ .ఒక వేల బతక గలిగినా తల్లులు తట్టుకోలేరు.పిల్లలు దూరం ఐపోతున్నారని బెంగ పెట్టుకుంటారు.  ఇది పెంచే విధానంలో లోపం.  దీన్ని ప్రశ్నించవలసిన అవసరం నాకు అతని మాటల్లో కనిపించింది.  ఈ వైపు ఆలోచించాలి కదా !

                                                                                                      -వాడ్రేవు వీరలక్ష్మీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to మళ్ళీ మాట్లాడుకుందాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో