చక్కిలాల లెక్క

అల్లసాని వారికి కావ్యం వ్రాయడానికి ఎన్ని కావాలో చూడండి

నిరుపహతి స్థలంబు, రమణీ ప్రియ దూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడె, మాత్మ కింపయిన భోజన, మూయల మంచ, మొప్పు త
ప్పరయు రసజ్ఞు, లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్,
దొరకిన కాక, యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!

ఆయన ఆంద్ర కవితా పితామహులు కాబట్టి తప్పకుండా వ్రాయడానికి ఆ మాత్రం సరంజామా కావాల్సిందే.

ఆ పద్యం స్పూర్తితో  చదవడానికి నాకేం కావాలో నేనూ ఒక లిస్టు తయారుచేసుకున్నాను.

ఒకానొక శీతాకాలపు మంచు కురిసిన మధ్యాహ్నం

భోజనం చేసి siesta కై పడక గదికి తరలిన శ్రీవారు

బొజ్జలు నిండి పుస్తకాలు చదువుతూ, బొమ్మలతో ఆడుకుంటూ వుండే పిల్లలు

ఏటవాలుగా ఎండ పడుతూ వున్న కిటికీ ప్రక్కనున్న, కాళ్ళు చాపుకునే వీలుగల రిక్లైనర్ సోఫా

ప్రక్కనే పళ్ళెంలో కరకరలాడే జంతికలో, చక్కిలాలో

అన్నిటినీ మించి ఒక మాంచి తెలుగో, ఇంగ్లిషో పుస్తకం …

అదిగో …ఆ చక్కిలాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా నా చిన్నప్పటి ఒక తమాషా లెక్కల చమత్కారపు కథ ఒకటి గుర్తుకొస్తుంది. అదేంటో చెప్పేస్తాను. మీరు మాత్రం చివర నేను ఇచ్చే సమాధానం చూడకుండా మీరు దీనిని విప్పగలరేమో చూడండి. ఇంకో విషయం “చక్కిలం” అంటే ఏంటో తెలియకపోతే కథలో దాని బదులు “మురుకు” ప్రతిక్షేపించేసుకోండి.

అసలు కథ మొదలు.

పూర్వం ఒక రాజు తన కోశాగారానికి  ఒక నమ్మకమైన కోశాధికారిని  (అంటే treasurer) నియమించే బాధ్యతని తన మంత్రికి అప్పగించారు. మంత్రి “కోశాధికారి కావలెను” అని ప్రకటించగానే బోల్డన్ని దరఖాస్తులు వచ్చాయి –  ధనాగారంలో ఉద్యోగం మరి. అన్ని రకాల పరీక్షలు, వడపోతలు అయ్యాక ఇద్దరు మిగిలారు. వాళ్లని రామయ్య, సోమయ్య అనేద్దాము.

    మంత్రి వాళ్ళిద్దరినీ పిలిచి ఇద్దరికీ చెరో పాతిక చక్కిలాలు, ఒక ఉత్తరం  ఇచ్చి అడవికి అవతల వున్న రాజుగారి బావమరిదికి అవి ఇచ్చి, బదులుగా ఆయన దగ్గరనుంచి తను పంపుతున్న లేఖకి సమాధానం తీసుకురమ్మనాడు. ఉత్తరాలు రెండూ పెట్టెలలో పెట్టి తాళం వేసి ఇచ్చాడు – దారిలో ఎవరూ తెరిచి చదవకుండా. ఆ పెట్టెలని తెరవగల తాళాలు రాజు గారు మరియు ఆయన బావమరిది మాత్రమే వుంటాయి అని కూడా చెప్పాడు. వీటన్నిటికీ తోడు ఇంకో షరతు – రామయ్య, సోమయ్య దారిలో తినడానికి ఏమీ తీసుకెళ్లకూడదు. ఇంకా రామయ్య, సోమయ్య విడివిడిగా బయలుదేరాలి; ప్రయాణంలో ఒకరికి ఒకరు తారసపడకూడదు.

మంత్రి ఇచ్చినవన్నీ తీసుకుని, నియమాలన్నీ మననం చేసుకుంటూ రెండో రోజు ప్రోదున్నే బయల్దేరారు రామయ్య, సోమయ్యలు. చెప్పినట్టే ఎవరికి  వారు ప్రయాణం చేసి వెళ్లి రాజుగారి బావమరిదిని విడివిడిగా కలిసి  మంత్రి ఇచ్చిన చక్కిలాలు, ఉత్తరం పెట్టె ఇచ్చారు. ఆ బావమరిది పెట్టెలోని ఉత్తరం చదువుకుని, చక్కిలాలు ఎలా వున్నాయో చూసుకుని, తెచ్చిన వారిని ఒకటి రెండు కుశల ప్రశ్నలు వేసి, ఆ ఉత్తరానికి సమాధానం వ్రాసి అదే పెట్టెలో పెట్టి తాళం వేసి రామయ్య సోమయ్యలని సాగనంపాడు.

మంత్రి రామయ్య, సోమయ్యలు తెచ్చిన సమాధానపు లేఖలని రాజుగారికి చదివి వినిపించాడు.

రామయ్య  తెచ్చిన లేఖ:

బావ గారికి నమస్కారాలు. ఉభయ కుశలోపరి. ఈ రామయ్య తెచ్చిన పెట్టెలో 21 చక్కిలాలు వున్నాయి. మాటల సందర్భంలో ఆకలేసి ఆగలేక చక్కిలాలు తిన్నానని, నన్ను ఏమీ అనుకోవద్దని చెప్పాడు.

సోమయ్య తెచ్చిన లేఖ:

బావ గారికి నమస్కారాలు. ఉభయ కుశలోపరి. సోమయ్య తెచ్చిన పెట్టెలో 25 చక్కిలాలు వున్నాయి. మనిషి మంచి మాటకారిలా వున్నాడు. అతను వున్న కాసేపు కబుర్లతో కాలమే తెలియలేదు.

ఆ లేఖల సారాంశం వినగానే రాజుగారికి రామయ్య మీద చాలా కోపం వచ్చేసింది. వెంటనే మంత్రి వైపు తిరిగి సోమయ్యని వేరే ఆలోచన లేకుండా కోశాధికారిని చేయమని ఆదేశించారు.

మంత్రి చిరునవ్వు నవ్వి  ఆలేఖలలో ఆంతర్యం విప్పి చెప్పి,  రామయ్యే కోశాధికారి పదవికి తగినవాడు అనగానే రాజు మంత్రి తెలివితేటలను మెచ్చుకుని రామయ్యనే తన కోశాగారానికి అధికారిని చేశాడు.

ఇంతకీ మంత్రి ఏం చెప్పాడో మీరు కనుక్కోగలరా? క్రింది చుక్కలగీత దాటి మీ చూపు వెళ్ళేలోగా ఆలోచించండి. ఈలోగా మీకొక అనుమానం రావొచ్చు – అల్లసాని వారి పద్యానికి, ఈ చక్కిలాల లెక్కకి సంబంధమేంటీ అని. అస్సలేమీ లేదు – ఏదో బోడిగుండుకి, మోకాటికీ ముడెయ్యాలనే ఆత్రం తప్ప.

ఇంతకీ జవాబు తెలిసిందా ?లేదా….అయితే చూపుని కొంచెం ఆ చుక్కల క్రిందికి జరపండి మరి!

……………………………………………………………………………….

సరే మంత్రి రాజుకి చెప్పినది ఇదీ…..!!!

“సోమయ్య ఆకలి వేయగానే మూట విప్పి ఏదో నాలుగో, ఐదో చక్కిలాలు తినకుండా తను తిన్న విషయం బయట పడకుండా వుండాలని ప్రతీ చక్కిలానికి బయట చుట్టుని తినేశాడు. రాజుగారి బావమరిది అది ఎక్కడ కనిపెడతాడో అని మాటల గారడీ చేశాడు. రామయ్య అలా కాకుండా లెక్క తెలిసేలాగా ఒక నాలుగు తిన్నాడు – లెక్క పెట్టుకుంటారని తెలిసి కూడా. కోశాగారానికి అందుకే రామయ్యే తగిన వాడు.”

………………………………………………………………………………

 మన దేశంలో ప్రస్తుతానికి చక్కిలాల సోమయ్య వారసులు చాలా మందే వున్నారని మీకనిపించట్లేదూ ? 😉

– లలితా TS

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

UncategorizedPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో