ప్రాథమిక పాఠశాల నాటికలు -పాటలు


నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుతూండగా స్కూల్లో ఆగష్టు 15 , గాంధీ జయంతి లాంటి ఉత్సవాలకు చిన్న చిన్న నాటికలు మాచేత వేయించేవారు ఉపాధ్యాయులు.తరగతి గదుల్లో పౌడర్లు ,అలంకరణలు చేసేసి ,మండువానే స్టేజిగా,దీపాలు అవసరం లేకుండా పగలే కార్యక్రమాలు నడిపించేవారు .ప్రార్దనా గీతం ,జాతీయగీతాలు అన్నీ మరో డివిజన్లో ఉన్న మీనాక్షి , నేను కలిసి పాడేలా నేర్పించారు .ఆ బడిలో చదివిన అయిదేళ్ళు మేమే అన్ని   సందర్భాలలో గాయకులం ,నాగొంతు బాగా డామినేట్ చేసేంత ఖంగున మోగడం వలన పక్కన ఎవరు పాడినా వాళ్ళగొంతు ప్రత్యేకంగా విన్పించేది కాదట.
నేను మొదటసారిగా ఒకటో తరగతిలో స్కూలు స్టేజి  మీద నటించిన ఏక పాత్ర శబరి,టీచర్ ఒకసారి చెప్పగానే సంభాషణలు నాకు కంఠోపాఠం అయ్యేవని నన్ను ఎంపిక చేసే వారనుకుంటాను.నాజుట్టు మొత్తం పైకి దువ్వి నడినెత్తిన ముడిపెట్టి ,ఆ ముడిచుట్టూ పూలుచుట్టి ,కళ్ళకు కాటుకదిద్ది,నిలువునామం తీర్చి చెవులకు,చేతులకు ,మెడకు పూలదండలు అలంకరించి భలే అందంగా తయారుచేసారు.అద్దంలో చూసుకుంటే నాకు నేనే నచ్చేసాను.
రెండో తరగతిలో వేసిన నాటిక సిండ్రిల్లా . దాంట్లో   సిండ్రిల్లా పాత్ర నాది.అవన్నీ మా పాఠ్య పుస్తకాలలోవే.నేను బాగానటించానని మా టీచర్స్ అందరూమెచ్చుకున్నారు.ముఖ్యంగా మామిడాడ మాస్టారు మెచ్చుకోవడం చాలా ఆనందం కలిగింది.వరసగా మూడేళ్ళు అదే నాటికలో అదే కేరెక్టర్ ,రాజకుమారి వేషంలో రథంలో ప్రయాణిస్తున్నట్టు కలలు కూడా వచ్చేసేవి .ఐదో తరగతిలో గోపికల మద్య మురళీ కృష్ణుడి వేషంతో నాట్యం.ఇక మా స్కూల్లో ఎవరింటి కెళ్ళినా రామాంజనేయ యుద్దంలో నారదుడి పద్యాలతో బాటు శబరి పద్యాలు , సిండ్రిల్లా పాటలు పాడమని అడిగి పాడించుకుని నా గౌను జేబులో అటుకులు ,పప్పులు ,జంతికలు లాంటివి పోసి పంపించేవారు . ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఇవి తినొద్దు ,అవి తినొద్దు అని హద్దులు పెట్టేవారుకాదు . మా పిల్లలదే ఇష్టారాజ్యంగా ఉండేది.
మావీధిలో చాలా మంది పాటలు చక్కగా పాడే పెద్ద వాళ్ళుండేవారు.ఆ రోజుల్లో ఏ పండగైనా,  పేరంటమైనా పాటలతోనే నడిచేది.మా గేటుపక్క ఇంట్లో ఉండే  గొడుగోరత్త ( గొడుగువారి అత్త,ఆవిడపేరు గొడుగు బుచ్చిరాజు )చక్కని హారతి పాటలు పాడేది.ఆవిడ వాళ్ళాయనకి మూడో పెళ్ళాం.అతనేమో పండు ముసలి . కళ్ళు సరిగా కన్పించక తడుముకుంటూ  ఉండేవాడు. ఆవిడ రోజూ మొహంనిండా పసుపు పూసుకుని ,రూపాయి కాసంత బొట్టుపెట్టుకుని పూజలు పునస్కారాల్లో మునిగి  తేలుతుండేది.
ఇంకో పక్క సిద్ది తాత -సిద్ది మామ్మ (సిద్ది వాళ్ళింటిపేరు )మందులు కల్వంలో నూరుతూ చక్కటి పాటలు మంచి గొంతులతో రాగయుక్తంగా పాడుతుండేవారు.వాళ్ళు ఆయుర్వేదం గుళికలు చేసేవారు. రాత్రిలో ఎప్పుడు మెలకువ వచ్చినా  శివుని రాణి – మధుర వాణి అనో శివ శివ మూర్తివి గణ నాథ అనో లేకపోతే మరోటో పాటలు వినిపించేవి. వాళ్ళు మందుల్లో నారింజ రసం వేసి నూరుతుండేవారు. ఆ రోజుల్లో ఏ వేళప్పుడు వాళ్ళింటికి వెళ్లినా  రసం వడకట్టిన నారింజ ముత్యాలు ఒక గుడ్డలో మూటకట్టి ఉంచి మా పిల్లలందరికీ అర చేతినిండా పెట్టేవారు. ఆ పుల పుల్లని రుచి ఇప్పటికీ  మరుపురాదు.

కేవలం ఐదు అడుగుల పుంత కాలి బాట కవతల మాల పల్లె. మా ఇంటి ఉత్తరపు వాకిట్లో నిల్వ్హుంటే వాళ్ళ గొంతెమ్మ గద్దె వినిపించేది.గద్దె అంటే  నిలువెత్తు కంబం లాంటి దానిపైన ఒక కుండ బోర్లించి ఉండేది.గొంతెమ్మ పండగ రోజు వీలైన మట్టుకు అందరు క్రొత్త బట్టలు కట్టుకొని,కోళ్ళు కోసి  నైవేద్యాలు పెట్టుకుని,ఆగద్దె  దగ్గరకొచ్చి మొక్కు కునే వారు.మాల పల్లెలో కిన్నెర కంఠాలతో పల్లె పదాలు ,గొంతెమ్మ పాటలు పాడే ఆడవాళ్లుండేవారు,నేనెప్పుడు వాళ్ళ పాటలు వింటూ  ఆ ఇళ్ళ  మధ్యలో తిరుగుతూ ఉండేదాన్ని ,అందుకే మా అమ్మతోబాటు మావీధిలో అత్తలందరూ చదవమని తెచ్చిన ద్విపదకావ్యాన్ని రాగ భావ యుక్తంగా చదివి వాళ్ళ మెప్పు పొందేదాన్ని .నేను చదువుతూ ఉండగా వాళ్ళు ఆయా పాత్రలకి కష్టాలోస్తే కన్నీళ్లు పెట్టుకుని ,వాళ్ళు ఆనందిస్తే వీళ్ళు ఆనందించి రక రకాల అనుభూతుల్లో మునిగిపోయేవారు నా ఐదో తరగతి చదువునాటికి పెద్ద చెల్లి కృష్ణవేణి ,తర్వాత తమ్ముడు ఇంకో తమ్ముడు కృష్ణ పుట్టేరు.ఆందరూ నన్ను పెద్దక్క అనే పిలుస్తారు ఇప్పటికీ నావెంట వెంటే తిరుగుతూ నన్ను వదలకుండా ఉండేవారు .బడినుంచి ఇంటికోచ్చేక ఆ నలుగురికీ నేనే టీచర్ని ,సంగీతం మాస్టార్ని ,అన్నీ ,చిన్ని చిన్ని లేత గొంతులతో బుల్లిబుల్లి పాటలు ,పద్యాలు నేర్చుకుని పాడుతూ ఉండేవాళ్ళు .

– కె.వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

3 Responses to ప్రాథమిక పాఠశాల నాటికలు -పాటలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో