పెళ్లి చూపులు

                      బంగారు పళ్ళానికైనా కూడా  చుట్టూ అంచు అవసరం .మల్లె తీగ బాగా ఎగబ్రాకి వికసించాలంటే తీగెకు పందిరి అవసరం . అలాగే మనిషికి   తోడు అవసరం అంటారు. అది మగువైనా ,మగాడైనా ఇద్దరికీ  పెళ్లి అవసరమే కదా ! అయితే ఆ పెళ్ళికి ముందు అసలైనది పెళ్లి చూపుల తతంగం ఉంటుంది కదా

నేటి కాలంలో డేటింగులంటూ అమ్మాయి ,అబ్బాయి కలిసి తిరిగి అభిప్రాయాలు ,ఇష్టాలు వగైరా అన్నీ తెలుసుకొని నచ్చితే పెళ్ళాడడం ,లేకపోతే  ఫ్రెండ్స్ లా  ఉండటం జరుగుతుంది .పెళ్లి చూపులు జరుగుతున్నాయి  అయితే అందులో మంచి చెడు ఉందనుకోండి .సరే అదలా ఉంచితే ,  ఇంకా మద్య తరగతి కుటుంబాల్లో తల ,నోరు  రెండూ ఎత్తకుండా పెళ్లి చూపులు చూసుకుని  పెళ్లి చేసుకున్నవారు  ఉన్నారు .

ఒకవేళ అబ్బాయి గురించి మాట్లాడి వివరాలు కనుక్కునే అమ్మాయిని చూసి భాద్యత తెలిసి మసలుతోందిలే  అనుకుంటున్నతల్లి దండ్రులను  చూసి  ప్రక్కనున్న తోటివారు ,చుట్టాలు మీ పెంపకం తప్పు అని, ఎలా మాట్లాడాలో తెలియకుండా పెంచారు అంటూ హెచ్చరిస్తారు  ఆ అమ్మాయి తల్లి దండ్రుల్ని.

వారు రెండో పెళ్లివాడ్ని తెచ్చినా ముందు భార్య ఏమైంది లాంటి ప్రశ్నలు అడగకూడదు. యెన్ .ఆర్ .ఐ . సంబంధం తెస్తే పూర్తి వివరాలు తెలుసుకోకూడదు . నేటి మనుగడకు భయం వేసి హెచ్ .ఐ .వి . గురించి భయం ఉన్నా  పెదవి విప్పగూడదు. ఇలాంటి  విషయాలలో  పెదవి విప్పితే సంబంధం తప్పి పోతుందేమోనన్న  భయం.

వాళ్ళు తెచ్చింది నల్లవాడైనా, తెల్లవాడైనా ,పొట్టి వాడైనా ,పొడుగువాడైనా  ,ఎలాంటివాడైనా  పెళ్లి చూపులు జరుగుతాయి . ఎందుకంటే అవి “చూపులే “కదా ! అది నిజంగా వట్టిచూపులే కదా !మరి మాటలంటే కట్న కానుకలు నచ్చాలి కదా !
ఇప్పుడు  మీడియాలో  కూడా ప్రకటిస్తున్నారు. విదేశీ పెళ్లి కొడుకుల పట్ల వారి సంబంధాల  పట్ల  జాగ్రత్త  వహించమని.  పెళ్లి చూపులలో అడిగి తెలుసుకోవలిసిన ముఖ్య మైన  విషయాల దగ్గర మొహమాట పడితే జీవిత కాలం అటు  వరుడైనా.ఇటు వధువైనా భాద పడక తప్పదు. పెళ్లి కొడుకు  నిజంగా తాను చెప్పిన చదువులన్నీ  చదివాడో లేదో  విని, నమ్మటం,  ఆ తరవాత  పదవ తరగతి కూడా చదవలేదని  తెలుసుకుని  బాధ  పడటం చాలా సార్లు చూస్తూనే వున్నాం. దీనిని  నివారించటానికి  కనీసం  పెళ్ళికి ముందు వాళ్ళ సర్టిఫికెట్లు పరిశీలిస్తే  ఇంత బాధ ఉండదుకదా! పెళ్ళిళ్ళు  కుదిర్చే  మధ్యవర్తులే చొరవ తీసుకొని  జీతం, విద్యార్హతలు, ఉద్యోగ వివరాలు  ఆధారాలతో సహా  ముందుగానే తెలియజేస్తే మోస పోయే అవకాశాలు  బాగా తగ్గుతాయి.   అదే విధంగా అమ్మాయిలకు కూడా నచ్చిన వరుడినే ఎంచుకునే  అవకాశాన్ని  తల్లిదండ్రులు  కల్పించాలి. ఉద్యోగం చేస్తూ ఆర్దిక స్వతంత్రత ఉన్న  అమ్మాయిలు  ఈ విషయాన్ని అధిగమించారని  చెప్పుకోవచ్చు. అమ్మాయి ఎక్కువ  చదువుకోకపోయినా , ఉద్యోగం చేయకపోయినా, ఆర్దికంగా తక్కువ స్థాయి లో ఉన్నాకూడా   నచ్చిన  వరుడిని ఎంచుకునే అవకాశాలు తగ్గి పోతూ ఉన్నాయి .
నాకు తెలిసిన ఒక పెద్దమనిషి  పెళ్లి  చూపులంటే ఇలా వివరించాడు .

      ఎ———ఏజ్

      బి ——–బ్యూటీ

      సి ——–కేస్ట్

      డి———డౌరీ

      ఇ———ఎడ్యుకేషన్

      ఎఫ్ ——-ఫైనాన్స్

      జి ———గాడ్

               నిజమే అందం ,చదువు ,కులం ,కట్నం , అన్నివుండాలి .భక్తిగా అది దేవుని యందే కాదు సుమా !. అత్తా మామలు వారి కుటుంబ సభ్యులందరి పట్లా. నిజమే ఇది అత్తమామల పట్ల అల్లుడికి కూడా ఉంటే బాగుంటుంది  కదా!మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్ళే కదా !మరి  అక్కడ్నుంచే ఆడదాని స్వేచ్చా  జీవితానికి నాంది పలికి  ఈ వ్యవస్థ లో మార్పు వచ్చి వరకట్న పిశాచిని రూపు మాపి అమ్మా   యి ,అబ్బాయి పూర్తి అవగాహనతో” పెళ్లి “తో నూతన జీవితం లోనికి అడుగుపెట్టాలని కోరుకుంటున్నాను .                                      

-వనజ ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో