నర్తన కేళి -1

     

                 కళలు  అరవై  నాలుగు. వాటిలో లలిత కళలు చిత్రం.శిల్పం,సంగీతం,నాట్యం, కవిత్వం.  అన్నింటి కంటే నాట్యానికే   ఉన్నత స్థానం ఉందని భావించవచ్చు. ఎందుకంటే   నాట్యం సర్వ కళల  సమాహారం కాబట్టి. ఋగ్వేదం  నుండి వాక్యం , సామవేదం  నుండి గీతం, యజుర్వేదం  నుండిఅభినయం, అధర్వణ వేదం  నుండి  రసాలను గ్రహించి పంచమ వేదంగా బ్రహ్మ  నాట్య వేదం సృష్టించాడని నాట్యశాస్త్రం  చెబుతుంది. ఈ భారతావనిలో ఏడు ప్రముఖ శాస్త్రీయ నృత్యాలున్నాయి . కూచిపూడి,భరత నాట్యం,ఒడిస్సీ, మోహిని అట్టం, కథాకళి, కథక్ , మణిపురి, మొదలైనవి.ఈ శాస్త్రీయ నాట్యాలన్నింటికి  భరతుని నాట్యశాస్త్రం,నందికేశ్వరుని అభినయదర్పణం శాస్త్రీయ ఆధారాలుగా  ఉన్నాయి.
  

                శాస్త్రీయ నాట్యంలో నాట్య  మేళము, నట్టువ  మేళము సంప్రదాయాలు, తాండవ,లాస్య రీతులు కన్పిస్తాయి. నాట్య మేళములో పురుషులు  నాట్యం చేసే వారు. స్త్రీ  పాత్రలు పురుషులే ధరించే  సంప్రదాయం నాట్యం మేళంలో ఉంది.నట్టువ మేళం దైవం కోసం  ఆలయాలలో స్త్రీలు నాట్యమాడతారు. తాండవ రీతి గంభీరంగా రౌద్ర, వీర రసాలచే జతులకు నృత్యం  చేస్తారు. లాస్య  రీతిలో నర్తకి నిలబడి కాని, కూర్చోని  కాని శ్లోకాలకి , పదములకి   రస భావ అభినయం   చేయడం ‘లాస్యము’ అంటారు.
                 ఈ శాస్త్రీయ నృత్యాలలో కాలక్రమేణా  మార్పులు చోటు చేసుకున్నాయి.కొన్ని నృత్యాలలో  స్త్రీ పాత్రలు పురుషులు ధరించి ప్రదర్శించే  సాంప్రదాయం నుండి, నేడు స్త్రీ పాత్రలే  కాకుండా పురుష  పాత్రలు కూడా స్త్రీలే ధరించి నర్తిస్తున్నారు, ప్రస్తుత  కాలంలో  ఎంతో మంది మహిళలు శాస్త్రీయ నృత్యాలలో తమ  ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు.  మరి కొంత  మందికి ఈ కళను అందిస్తున్నారు. 

                                           శాస్త్రీయ నాట్యరంగంలో విశేష ప్రతిభని కనబరుస్తూ , తాము నేర్చుకున్న విద్యని తమలోనే దాచుకోకుండా ఇతరులకు పంచుతూ , నిస్వార్ధంగా నాట్య కళకి సేవ చేస్తున్న నృత్య కళాకారిణులని   ‘ విహంగ  ‘  పాఠకులకు  పరిచయం చేయడమే    ఈ  నర్తన కేళి  ఉద్దేశ్యం . * 

         

           కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యం సంపాదిస్తూ,ప్రదర్శనలిస్తూనే, ప్రస్తుతం ఆలయ నృత్యాన్ని సాధన చేస్తున్న ‘అరసి’  

నిర్వహించిన  ముఖాముఖి  ఇక నుంచీ ప్రతి నెలా  మీ కోసం ….    

‘ఉత్తమ నాట్యాచారిణి’  లక్ష్మి జ్యోతి తో  ముఖాముఖి

             మత సంప్రదాయాలకు భిన్నంగా కళని అంకిత భావంతో స్వీకరించి తాను నేర్చుకోవటమే కాకుండా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి,తరవాత గురువుగా కూడా ఎందరికో కూచిపూడి నృత్యం లో శిక్షణ ఇస్తున్న,యునెస్కో  నుండి  ‘ఉత్తమ నాట్యాచారిణి’పురస్కారం పొందిన  శ్రీమతి మద్దనాల లక్ష్మి జ్యోతిగారి  కళా జీవితం ఒకింత ఆశ్చర్యం కల్గిస్తుంది . పుట్టుకతో వచ్చిన మతం క్రైస్తవం. అయినా మత విశ్వాసాలు  ,కట్టు బాట్లు ఆమె కళాతృష్ణ కి  ఏ మాత్రం అడ్డంకి కాలేదు. పైగా మరి కొత్త మందికి ఆ విద్యని నేర్పే దిశగా  తాను మార్గాన్ని నిర్దేశించుకుంది.

        నా అడుగులకు తొలి నాట్య శిక్షకురాలు కూడా  మద్దనాల లక్ష్మి జ్యోతిగారే! వారితో తొలి ముఖాముఖి నిర్వహించడం నాకూ కొంత ఆనందంగానూ , ఉత్సుకతగానూ ఉంది.మీరూ నాతో రండి కలిసి కబుర్లు చెప్పుకుందాం…     

 

* నమస్కారం అమ్మా!  ఎలా ఉన్నారు ? 

  చాలా  బాగున్నాను.

విహంగ పాఠకుల కోసం మీ పూర్తి పేరు చెప్తారా ?

వీర వెంకట లక్ష్మి జ్యోతి.

* మీ తల్లిదండ్రుల పేరు చెప్పండి.

మా నాన్న పేరు బాతు  అచ్చన్న, అమ్మ  మహాలక్ష్మి . నేను వారికి  మూడవ సంతానం.

మీరు ఎప్పుడు , ఎక్కడ పుట్టారు  ?

* మీ స్వస్థలం ?

రాజమండ్రి .

* మీకు నాట్యం పై ఆసక్తి ఎలా కలిగింది?

సప్పా సత్యనారాయణగారి ఆధ్వర్యంలో వారి శిష్యులు అప్సర హోటల్ లో చేసిన నృత్య ప్రదర్శన  చూడటం జరిగింది . నేను వాళ్ళలానే  చేయాలనీ, ఆ డాన్సు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది.
* అప్పటికి మీ వయసెంత ?

 అయిదేళ్ళు ఉంటాయి .

అప్పటినుంచే నేర్చుకోవటం మొదలు పెట్టారా?
లేదు కానీ,నాకు  ఆరు  సంవత్సరాలు ఉండగా నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను.

మీ మత సంప్రదాయాలకు విరుద్ధం అని మీ ఇంట్లో ఏమైనా అభ్యంతరాలు  చెప్పారా?
మొదట మా ఇంటిలో అభ్యంతరం చెప్పినా కూడా  మా బావగారు కొల్లాపు సూర్యరావుగారు నా ఆసక్తిని గమనించి నాట్య శిక్షణలో  చేర్పించారు. మా పెద్దమ్మ కప్పల వీర  రాఘవమ్మ గారి ప్రోత్సాహంతో గజ్జెల  పూజ  జరిగింది.

*  మీ తొలి గురువు ఎవరు ? వారి గురించి చెప్పండి ?
మా గురువుగారి పేరు  సప్పా  సత్యనారాయణగారు. ఆయన ఎంత కష్టమైన విషయాన్నయినా చాలా సులువుగా వివరించే వారు.ఇప్పటికీ ఆయన్ని తలచుకుంటే  నాకు మా గురువు  చెప్పిన బోధనే గుర్తుకొస్తుంది.
ఆయన వద్ద  కూచిపూడి , భరత నాట్యం, జానపదం  నృత్యాలలో శిక్షణ పొందాను.

 *కూచిపూడి , భరత నాట్యం, జానపదం నృత్యాలతో పాటు మీరు ఇంకా ఏమైనా శాస్త్రీయ నృత్య పద్ధతులు  నేర్చుకున్నారా?
ఆ( అవును. నేను ఆలయ నృత్యం కూడా నేర్చుకున్నాను.

*అలాగా!  ఎవరి దగ్గర నేర్చుకున్నారు?
ఆలయ నృత్యం సప్పా దుర్గా  ప్రసాద్ గారి వద్ద నేర్చుకున్నాను.

 

మీ తొలి ప్రదర్శన ఎప్పుడు జరిగింది ?
a .c.y  రెడ్డి గారికి  సన్మానం  పేపరు మిల్లు వారి ఆధ్వర్యంలో   ఆనం కళా కేంద్రం,రాజమండ్రి లో  జరిగింది. ఆ సభలో తొలి ప్రదర్శన  ఇచ్చాను. సం//

* మీరు ఎంత  వరకు చదువుకున్నారు ?
నేను షాడే బాలికల పాఠశాలలో పదవ తరగతి వరకు చదివాను. షాడే పాఠశాలలో చదువుతున్న రోజులలో పలు కార్యక్రమాలలో నృత్య ప్రదర్శనలు ఇచ్చాను.

* మీరు పాఠశాలలో  చదువుతున్నప్పుడు చాలా  ప్రదర్శనలు  ఇచ్చాను అన్నారుగా? మీకు బాగా గుర్తున్న ప్రదర్శన ఏమిటి?
విశ్వామిత్ర – మేనక నృత్య ప్రదర్శన ఇచ్చాను. ఆ ప్రదర్శనకు  మంచి పేరు వచ్చింది.
మీ కళాశాల చదువు గురించి? అక్కడ యిచ్చిన ప్రదర్శనలు ?
కందుకూరి రాజ్యలక్మి కళాశాలలో చదివాను.    ప్రిన్సిపాల్ బుచ్చి సుందరి   ఆధ్వర్యంలో జరిగిన ఒక సభకి  సబ్ కలెక్టర్ ముఖ్య అతిథి గా వచ్చారు. ఆ రోజు  నెమలి నృత్యం ప్రదర్శించాను.

* మీరు ఇచ్చిన ప్రదర్శనల్లో   మీకు బాగా నచ్చినవి కొన్ని చెప్పండి.
బొంబాయిలో  యిచ్చిన ప్రదర్శనలో రాజ నర్తకిగా, కాకినాడలో శ్రీ కృష్ణ దేవరాయ నృత్య రూపకంలో తిరుమలాంబగాను చేసినవి బాగా నచ్చాయి. ఏలూరు, హైదరాబాద్  మొదలైన ప్రాంతాలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాను.

*మీరు గురువుగా ఎప్పటి నుండి నృత్య శిక్షణ  ఇస్తున్నారు?
1987   నుండి గురువుగా నృత్య శిక్షణ  ఇస్తున్నాను. అప్పటిలో  మేము రంపచోడవరంలో  ఉండేవాళ్ళం. ఏమిటి దగ్గర కొంతమంది పిల్లలకి  నాట్యంలో శిక్షణనివ్వడం ప్రారంభించాను. ఆ తరవాత పూర్తి స్థాయిలో నృత్య శిక్షణాలయం స్థాపించాను.

*మీ నృత్య శిక్షణాలయం పేరు, ఎపుడు ప్రారంభించారు ?
“జ్యోతినృత్య కళానికేతన్” . దీనికి  సప్పా దుర్గా  ప్రసాద్ గారే నామకరణం చేశారు. 1996  లో ప్రారంభించాను.అప్పటి  నుండి పూర్తి స్థాయి లో నృత్య శిక్షణ  ఇస్తున్నాను.

* మీ కుటుంబం  గురించి కొన్ని విషయాలు చెప్పండి?
మావారి పేరు మద్దనాల ప్రసాద్,  వివాహం జరిగిన తరువాత మా వారి ఉద్యోగ రీత్యా  కొంతకాలం  రంపచోడవరంలో   ఉన్నాము, గత ఇరవై సంవత్సరాలుగా  కాకినాడలో  ఉంటున్నాం. మాకు  ఇద్దరు పిల్లలు, అబ్బాయి పేరు దీపక్ , అమ్మాయి పేరు దీప్తి .

*మీ  నృత్య   కళానికేతన్  ద్వారా ఇప్పటి వరకు  ఏయే కార్యక్రమాలు చేసారు  ?
కళానికేతన్ ద్వారా మా గురువు గారి సమక్షంలో అయిదు సార్లు వార్షికోత్సవాలు, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది.హైదరాబాదులో శత రూప దినోత్సవం, ఘంటశాల  వేదిక పై ప్రదర్శన, విశాఖలో గురజాడ కళా క్షేత్రంలో ఉడా వారి అద్వర్యంలో నృత్య ప్రదర్శన  ఈ విధంగా కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చాము.

*మీరు ప్రతి సంవత్సరం  మీ కళానికేతన్ ద్వారా  ఎలాంటి  నృత్య ప్రదర్శనలు  ఇస్తుంటారు?
ధనుర్మాసంలో సత్కళావాహినిలో  సుమారుగా పద్నాలగు సంవత్సరాలు  నుండి ప్రదర్శనలు ఇస్తున్నాం. దసరా ఉత్సవాలకి బాల త్రిపుర సుందరి  అమ్మ వారి ఆలయంలో 2004 నుండి ప్రదర్శనలు ఇస్తూ వున్నాం . కాకినాడ జగన్నాధపురంలోని  వెంకటేశ్వర ఆలయంలో కళ్యాణోత్సవం   సమయంలో ప్రతి సంవత్సరం  ప్రదర్శన ఇస్తున్నాం, అలాగే గత ఆరు సంవత్సరాల  నుండి వరసగా వేసవి కూచిపూడి నృత్య శిక్షణ శిబిరం నిర్వహించడం  జరుగుతుంది.

*మీ విద్యార్దులు మీ కార్యక్రమాలలో కాకుండా  ఇతర  ప్రదర్శనలలో కూడా పాల్గొంటూ  ఉంటారా ?
అవును. మా గురువు గారు సప్పా దుర్గా ప్రసాద్ గారు  హైదరాబాదు శిల్పారామంలో,రాజమండ్రి  ఆనం కళా కేంద్రంలో,తిరుమల  తిరుపతి దేవస్థానం  కళ్యాణమండపంలో నిర్వహించిన మూడు  నర్తన యజ్ఞాలలో  మా విద్యార్దులు పాల్గొని ఆ యజ్ఞాలలో పాల్గొన్నాం.2010 లో హైదరాబాదులో జరిగిన కూచిపూడి అంతర్జాతీయ  సిలికానాంధ్ర   నాట్య సమ్మేళనం లో పాల్గొన్నాం. 2011లో  సప్పా దుర్గా ప్రసాద్ గారు నిర్వహించిన శాస్త్రీయ నృత్య కళోత్సవం  మొదలైన కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇచ్చాము.

* మీరు ఏయే  పురస్కారాలు అందుకున్నారు ?
యునెస్కో వారు  ‘ఉత్తమ నాట్యాచారిణి ‘ అవార్డు ని బహూకరించారు,    సన్మానాలు పొందాను , అవార్డు లు  అందుకున్నాను  కానీ వీటి  కంటే  మనకు   తెలియని వారు వచ్చి  అమ్మా! మొన్న మీ పిల్లలు  చేసిన  ప్రదర్శన చూసాము , చాలా బాగా చేయించారు అని చెబుతుంటే   ఆ ఆనందమే వేరు. అంతకు మించి  పురస్కారాలు ఏముంటాయి.

* మీ నాట్య ప్రభావం మీ కుటుంబ వ్యక్తుల పై ఎంత  వరకు ఉంది?
మా అమ్మాయి పేరు దీప్తి , తను  కూచిపూడి లో సర్టిఫికేట్ కోర్సు, డిప్లమో  కోర్సు  పూర్తి చేసింది. తను గురువుగా పిల్లలకి నాట్య   శిక్షణ  ఇస్తుంది.
* ఇప్పుడు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించే వారికి మీరిచ్చే  సందేశం ?
ఈ మధ్య కాలంలో  శాస్త్రీయ  నృత్యం అంటే పిల్లలు  ఆసక్తి  చూపిస్తున్నారు   కానీ వారు ఒకసారి ప్రదర్శన ఇస్తే చాలు అనుకుంటున్నారు.   ప్రదర్శన తరవాత అంతగా ఆసక్తి  ఉండడంలేదు. తల్లి దండ్రులు పిల్లలని  ప్రోత్సహించాలి .మన సంస్కృతి గురించి వారికి తెలియజేయాలి .అప్పుడే పిల్లలుమరింత  శ్రద్ధ గా నృత్యాన్ని  అభ్యసిస్తారు.నేర్చుకునే  విషయం పై దృష్టి, శ్రద్ధ  ఉంటేనే  ఆ విద్య మనకు వస్తుంది.

*మీ నృత్య కళాకేతన్ నుండి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఉంది?
నాట్య గురువులందరినీ ఒకే వేదిక పై కి తీసుకురావాలనే ఆలోచన ఉంది, దానికి ఇంకా  ప్రణాళిక  తయారు చేసే ఆలోచనలో ఉన్నాను . ఇంకా  కొన్ని  కార్యక్రమాలైతే ఆలోచనలో  ఉన్నాయి . వాటికి  కార్య రూపం దాల్చినప్పుడు  మీకే తెలుస్తుంది.*
మీ ఆలోచనలు,ఆశయాలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.మీ అభిప్రాయాలను  మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు .

– ‘అరసి’

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

21 Responses to నర్తన కేళి -1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో