మళ్ళీ మాట్లాడుకుందాం….

                   ఈ మధ్య నేను వింటూ వస్తున్న కొన్ని ఉదంతాలు ఇక్కడ చెప్పాలని ఉంది. స్త్రీ వాదమంతా పెళ్ళిలో ఉండే హింస గురించి, అణిచివేత గురించి చెప్పుకుంటూ వచ్చింది. అందులోంచి బయటకు రావడానికి ఆడవాళ్లకు దారులు తెరిచి ఉండాలని ఆశించింది. దాని కోసం సహజీవనం అనే కొత్త వ్యవస్థ కావాలనుకుంది. ఆ వ్యవస్థ ఏర్పడింది. దానికి న్యాయస్థానం తాలుకు ఆమోద ముద్ర కూడా దొరికింది.

               ఇవాళ సమాజం ఎంతో మారింది. ప్రేమించి కుల, మత బేధాలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. లేదా కలిసి జీవిస్తున్నారు. పెళ్లి చేసుకున్నా వద్దనుకుంటే విడిపోగల స్వేచ్చ, ఆర్ధిక స్తోమత కూడా ఆడవాళ్ళూ సంపాదించ గలిగారు ఎంతో కొంత.

             కానీ ఇంత అభివృద్దిలో ఇంత స్వేచ్ఛలో స్త్రీలు ఎంతో కొంత శాతం సంతోషంగా లేరని ఆ ఉదంతాలు చెప్తున్నాయి. ఎక్కువ శాతం అని నేను చెప్పలేక పోవడానికి నాకు ఆ సర్వేలు లెక్కలు అందుబాటులో లేవు.

           ఒక స్నేహితురాలి కూతురి విషయం ఆమె చెప్తూ వచ్చినపుడు , మరి కొంత మంది అమ్మాయిల సంగతులు విన్నప్పుడు మనం ఇంకా ఎంతో వెనకబడే ఉన్నామనిపించింది.

                నా మిత్రురాలి కూతురు అందగత్తె, విద్యావంతురాలు, ఆర్ధిక స్వతంత్రం సంపాదించింది. చాలా ఏళ్లుగా ప్రేమించి ఇంట్లో వాళ్ళని కాదని మరీ పెళ్లి చేసుకుంది. రెండేళ్లు గడవకుండానే అతను నువ్వు నాకు వద్దు వెళ్ళిపో అంటున్నాడు. కారణం నేను మరొకరిని ఇష్టపడుతున్నాను, నీ మీద నాకు ఇష్టం పోయింది అని. పూర్వం భర్తలు ఇంత ధైర్యంగా చెప్పగాలిగే వారా ? ఇప్పటి యువకులకు అధిక ధనార్జన ఇచ్చిన స్వేచ్చా అది ? ?

               అయితే ఆ పిల్ల అందుకు సిద్దంగా లేదు. కారణం అతన్ని వదిలి ఉండలేక పోవడం. అతను ఇంట్లోంచి పొమ్మని రొజూ వేధిస్తున్నా ఆమె అక్కడే పడి ఉంటోంది. కారణం ఆమెకు ఇంకా అతని మీద ఇష్టం. ఇది నేటి పెళ్ళిళ్ళ తాలుకు భద్రత.

                ఇక సహజీవనం దగ్గిరికి వస్తే అందులో ఎప్పుడు కావాలంటే అప్పుడు విడిపోయే స్వేచ్చ ఉంటుంది. అలాంటి సహ జీవనంలో ఉన్న అబ్బాయికి తొందరగానే తన సహచరి మీద ఇష్టం పోయింది. మనం విడిపోదాం అంటున్నాడు. కానీ ఆమెకు పోలేదు. ఆమె అతను లేకుండా బతక లేనంటోంది. అతను మనసూ ఇల్లూ కూడా తలుపులు మూసి ఉంచుతున్నాడు. ఆమె ఇంటి తలుపులు తెరిపిస్తోంది. కాని మనసులోకి ప్రవేశించలేక పోతోంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడికి మరొకరు వచ్చి చేరేసారు కనుక.

                ఎటు చూసినా ఆడవాళ్ళకే నష్టం కలుగుతోంది. పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఇంకా ఎంతో కొంత లీగల్ సపోర్టు ఉంది. సహజీవనంలో ఉన్న అమ్మాయికి అదీ లేదు.

పూర్వం పెళ్ళిలో హింస ఒకరకమైతే ఇప్పుడు మరో రకం.

                అసలు ఏ హింస నుంచి అయినా బయటికి రావడానికి, ఏ అణిచి వేత నుంచయినా ఎదురు తిరిగి స్వేచ్చ సంపాదించడానికి ఇంత కన్నా అంటే ఇప్పుడు సంపాదించినా అర్హతల కన్నా కొత్తవి, గొప్పవి ఏమైనా ఉన్నాయా ? అని మళ్ళీ వెతకవలసి వస్తోంది.

                అందమూ, తెలివి, చదువు, డబ్బు ఉన్నా కూడా ఆ మగవాళ్ళు మరొకరి వేపు ఆకర్షితులవుతున్నారంటే కారణం ఏమై ఉంటుంది. ఏదయినా కావచ్చు. నిజానికి అదేమిటో తెలుసుకుని దాన్ని సంపాదించడానికి మళ్ళి రంగంలో దూకి నిర్విరామ కృషితో సంపాదించినా అక్కడితో సంతృప్తి పడతారా ?

ఇలాంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు నాకు శరత్ ‘శేష ప్రశ్న’ నవలలోని నాయిక కమల గుర్తొచ్చింది.

                  కమల శివనాధునితో కలిసి ఉండడాన్ని సమకాలికులంతా వింతగా చెప్పుకుని ఆమెను వెలివేసినట్లు చూడబోయిన రోజు ఆమె నిబ్బరంగానే ఉంది. కానీ ఆ శివనాధుడే ఆమెను వదిలేసాడు. అప్పుడు ఆమె చింతించ కుండా అతనికి వీడ్కోలు చెప్పింది. పైగా ఇలా అంటుంది “నిష్పల హృదయ దాహంతో అతన్ని మాడ్చి మసి చెయ్యడం తప్ప ఆ పోయిన ప్రేమను తిరిగి తెప్పించలేను” అంటుంది. ప్రేమ పోయిన తర్వాత అక్కడే ఉండి ఆ పాత ప్రేమ కోసం పాకులాడడం ఆత్మ గౌరవం కాదని కమల ఉద్దేశం. ఎదుటి వారి ప్రేమలో కాక ప్రపంచంలోని మరొక జీవిత విధానంలో తమని వెతుక్కోమని ఆమె చెప్తుంది. అలాగే చేసి చూపిస్తుంది కూడా. అలా మారగలేగేదాక స్త్రీలకూ ఈమానసిక హింసలు తప్పవు.

                      ఇలాంటి ఆలోచనల ద్వారా స్తీవాదం సిద్ధాంత స్థాయి నుంచి తాత్విక స్థాయికి వెడుతోంది

– వాడ్రేవు వీర లక్ష్మీ దేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to మళ్ళీ మాట్లాడుకుందాం….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో