సమకాలీనం- పార్లమెంటుకో లేఖ రాద్దాం

ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికీ తెలియజేయునదేమనగా…..

ఇహ ఆగేది లేదు…ఈ రోజో, రేపో పార్లమెంటు సమావేశాలపై రిట్టో,సిట్టో ఏదొకటి వెయ్యబోతున్నాను నేను. కాదూ కూడదూ అంటే, సమాచార చట్టంతోనైనా కొట్టబోతున్నాను. నాతో ఎవరు రాబోతున్నారోచ్?

పార్లమెంటు సమావేశాలా?వాటంత కంపు వేసాలు ఉండనే ఉండవంటున్నారా?
ఒకప్పుడు పార్లమెంటు సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారని మొదటిసారి ప్రకటించినపుడు, ఆఫీసులకి సెలవు పెట్టి మరీ టివి ముందు కూచున్నా! రెండురోజులకు జ్వరం, వాంతులు పట్టుకున్నాయని గుర్తొచ్చిందా? 
పోపుల డబ్బాలో పదో, వందో తాగుబోతు మొగుడు పట్టుకుపోయి తాగొస్తే పెళ్ళానికెంత ఒళ్ళు మండుతుంది?
నెలంతా కష్టపడి సంపాదించిన జీతాన్ని ఎవడో జేబు కొట్టేస్తే ఎలా ఉంటుంది?
ఇదీ అంతే!
ఆ మధ్యెపుడో మా పని అమ్మాయి తన కొడుక్కి అక్షరం ముక్క కూడా రావట్లేదని నా దగ్గరే ఒకటే గోల! నీ కొడుకు ఏం చదువుతున్నాడని అడిగితే తెల్ల మొహం వేసింది. రెండో, మూడో సదువుతున్నాడండీ అని నసిగింది. నాకు ఒళ్ళు మండింది. నీ కొడుకు ఏ క్లాసు చదువుతున్నాడో తెలీదు….మాస్టారు పాఠాలు చెప్పకపోతే వెళ్ళి అడిగింది లేదు. పిల్లాడికి చదువు రాలేదని అడిగే హక్కే లేదు నీకు అంటూ చెవులు వాచిపోయేలాగా చీవాట్లు పెట్టాను. కానీ ఈ సిద్ధాంతం నాకు కూడా వర్తిస్తుంది కదా? చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా….సిద్ధాంతం సిద్ధాంతమే కదా! ఆచరణలేని అభిప్రాయాలేల? అక్కడా ఇక్కడా దేశం భ్రష్టుపట్టిపోతోందనీ, ఇదంతా మన ఖర్మనీ నా ఉపన్యాసాలేల? తప్పు జరిగేచోటే కదా నిలిదీయాలి?!
                   పార్లమెంటు సమావేశాలు ఎందుకు జరుగుతాయి? ఇది మొదటి ప్రశ్న! జరిగితే జరిగాయి! అక్కడ చర్చించాల్సిన అంశాలేమిటి? ఒక్కో సభకు అయ్యే ఖర్చెంత? ఆ ఖర్చు ఎవడబ్బ సొమ్ము? ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఒళ్ళు మండిపోతోంది! రక్తం సల సల మరిగిపోతోంది. ఆ డబ్బు నాది! అవును! ఖచ్చితంగా నాదే! మీ అందరిదీ కూడా! కార్లిచ్చి, ఖర్చులిచ్చి, జీతాలిచ్చి, అన్ని సౌకర్యాలు అమర్చి, దేశ భవిష్యత్తును బాగా తీర్చిదిద్దండయ్యా, సమస్యలను తీర్చే మార్గం చూడండమ్మా అంటే,….ఈ తన్నులాటలేమిటి? నచ్చినట్టల్లా సభలను వాయిదాలు వెయ్యడం ఏమిటి? తలాతోకా లేకుండా కుళాయిల దగ్గర జగడమాడుకునే మహిళలు బెటర్ కాదూ మన శాశనసభా సమావేశాల్లో ఖద్దరు బట్టలు తొడిగి చిందులేసే ప్రజాప్రతినిధులకన్నా?!
                   సి సి కేమెరాలు ఉన్నాయని భయమే లేదు! ఉంటే మాత్రం! ఆ వీడియోలు మనం చూస్తే మాత్రం ఏం పీకుతామని?? ఏమీ చెయ్యలేం. బూతులొస్తే మన నోటికి కాస్త పని కల్పిస్తాం. రాని పక్షంలో మనదైన క్లాసు భాషలో దేశం…దేశ పరిస్థితులు….మన ఖర్మం…అంటూ కనబడిన వాడికీ, కనబడని వాడికీ ఒకటే క్లాసు పీకుతాం. ఇంకా ఇలా ఉంటే లాభం లేదు. అందుకే తప్పు జరిగే చోటే నిలదీద్దాం. పార్లమెంటుకో లేఖ రాద్దాం! 
  క్రింది లింక్ లను తప్పకుండా క్లిక్ చేసి చదవగలరు మరి!!!!

http://www.parliamentofindia.nic.in/ls/intro/p8.htm

– విజయ భాను కోటే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , Permalink

One Response to సమకాలీనం- పార్లమెంటుకో లేఖ రాద్దాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో