సుకన్య

(14 వ భాగం)

”చందు! నాకు కూడ నీతోపాటు ఢిల్లీలో ఏదైనా ఉద్యోగం చూడు. నిన్ను చూడకుండ ఉండగలనా అనిపిస్తుంది” వివేక్‌ చిన్న పిల్లాడిలా మారాం చేస్తున్నట్లు అన్నాడు.
చందు గబగబా వివేక్‌ వైపు నడచి అతని రెండుచేతులను తన నడుము చుట్టు బిగించుకుంటూ ”నాకు అలాగే ఉన్నది… దప్పిగొన్న వాడికి అమృతం దొరికినట్లు… మలమల మాడే ఎండలో చెట్టు నీడలోకి వెళ్ళినట్లు నీస్నేహం పన్నీటిజల్లులా, సుగంధపరిమళ భరితంగా అనిపిస్తున్నది…”
”నీ ప్రయాణం ఎపుడు?”
రేపే! నేను ఢిల్లీ వెళ్ళిన వెంటనే నీకు అక్కడి పరిస్థితులు చూచుకొని లేటర్‌ వ్రాస్తాను. నీవు వచ్చే ప్రయత్నంలో ఉండాలి సూమా!”
ఇద్దరు మిత్రులు ఒకరి నుండి ఒకరు బరువెక్కిన గుండెలతో వీడుకోలు తీసుకొన్నారు.

కాలం చాలా గమ్మత్తయినది. విచిత్రమైనది, బలమైనదీను. అసలు కాలానికున్న శక్తి భూమిమీద మరి దేనికి లేదేమోననిపిస్తోంది. దూరాలను దగ్గర చేస్తుంది. దగ్గరలను దూరాలుగా విసిరి కొడుతుంది. ఊహించలేని లోతైన గాయాలను చేస్తుంది.  ఆ గాయాలను పూడుస్తుంది. ఇవాళ ఒకరులేనిదే ఒకరం జీవించలేం అనుకొనే వారిని మరి కొన్నాళ్ళకే మరచిపోయేలా చేస్తుంది. అందుకే చాలా గంభీరంగా పెద్దలు, కాలమే కొన్ని సమస్యలను పరిష్కరిస్తుంది అని అంటారు. ఆ శక్తి ఏదో కాలానికి మాత్రమే వున్నట్లు. కాలం అనంతమైంది. నేడు నిన్నగా, రేపు నేడుగా మారేలోగా  ఎన్నెన్ని వింత పరిణామాలు… ఎన్ని అనుకోని సంఘటనలు… అయితే కొన్ని సంఘటనలే చరిత్ర కెక్కుతాయి. చరిత్రలో మంచో చెడో ఏదో ఒక స్థానాన్ని చిక్కించుకొంటాయి. సామాన్యుల జీవితాలు సంఘటనలు కాల ప్రవాహంలో కలసి పోతే ప్రముఖులు జీవిత ఘట్టాలు కాల ప్రవాహానికి ఎదురీది నిలబడతాయి.
సుకన్య-చందులు సామాన్య జీవులు… వారి ప్రేమ ఎడబాటు వారి ఇద్దరి జీవితాలనే కాక ఆ రెండు కుటుంబాల మీద కూడ కొంత ప్రభావాన్ని చూపింది. కొడుకు పెండ్లి కళ్ళారా చూడాలనుకొన్న  సాయమ్మ, కనకయ్యల ఆశ నిరాశగా మిగిలిపోయింది. వెంకయ్య ఈ ఆర్నెల్ల కాలంలో రెండు మూడుసార్లు తాను చేసింది తప్పా? ఒప్పా? అనే నీమాంసకు గురి అయ్యాడు. సుకన్య తల్లికి మాత్రం తన భర్త తీసుకొన్న నిర్ణయం చాలా అమానుషమైనది అనిపించింది. అమెకెందుకో ఆయన పట్ల ఆ రోజు నుండి తెలీకుండానే ద్వేషభావం పెరగసాగింది.
సుకన్యకు కూడా ఆశ్రమ పరిస్ధితులు క్రమంగా అవగతం కాసాగాయి. సేవాభావం కంటే ఆశ్రమంలో వ్యాపార దృష్టే ఎక్కువగా ఉన్నట్లు అర్ధం అయింది. ఇట్లా స్కూలు హాస్టలు నడపటంలో బాబాకు చాలా లాభం ఉందన్న సంగతి ఆ అమ్మాయికి తెలిసింది. అదెంతో సీక్రెట్‌గా జరిగే వ్యవహారమైనా ఆమెకు తెలీకుండా నడపటం సాధ్యం కాలేదు. బాబా భక్తులకు తన పేరు మీదగా నడుపుతున్న పాఠశాల కాబట్టి తన ఆధ్వర్యంలో నడుస్తున్నది. కాబట్టి తనకు  ఏడాదికి రెండు లక్షల రూపాయలు ముట్ట చెప్పాలని బాబా ఆజ్ఞాపించాడు. మళ్ళీ అవన్నీ సేవా కార్యక్రమాలకు వినియోగిద్దామని చెప్పాడు. భక్తులంతా ఒప్పుకొన్నారు. అందుకే ఇంటింటికి తిరిగి పిల్లలను పాఠశాలలో చేర్పించటం-ఫీజులు మస్తుగా వసూలు చేయటం, బీదబిక్కిని కూడా వదలకుండా డబ్బు ఎలాగోలా పోగుబెట్టి బాబాకివ్వవలసింది ఇచ్చి మిగతాది ట్రస్టులో మెంబర్లు పంచుకొనేవారు. ఇదంతా చూచిన సుకన్యకు తండ్రితో ఈ విషయం చెప్పాలనిపించింది. కాని ఆయన తనని మరోలా అర్ధంచేసుకొంటాడేమో… కొన్ని రోజులు ఆగి చెప్పవచ్చని నిరీక్షించసాగింది.
ఈలోగా గ్రామమంతా విస్తుబోయే సంఘటన జరిగింది. వెంకయ్య కొడుకు  నిరంజన్‌ అమెరికా నుంచి వచ్చాడు. అతడు వస్తే అదేమి వింతకాదు. అతను తనతో పాటు ‘జిమ్మి’ అనే  అమెరికా అమ్మాయిని తెచ్చాడు. ఊరికే కాదు పెండ్లి చేసుకొని మరీ తెచ్చాడు.
ముందుగా ఉత్తరం అయినా వ్రాయకుండా, టెలిగ్రాం అయినా ఇవ్వకుండా, ఫోన్‌ అయినా చేయకుండా సడన్‌గా వచ్చి అందర్ని ఆశ్చర్చచకితుల్ని చేయాలని అతని ఉద్దేశం. అందుకే  ఏకంగా పెండ్లి చేసుకొని మరీ వచ్చాడు. నిరంజన్‌ బోస్టన్‌ యూనివర్సిటీిలో ఫిజిక్సు ప్రొఫెసర్‌గా చేస్తున్నాడు. అక్కడే చదువుతున్న విద్యార్ధిని ‘జిమ్మి’ తో పరిచయం ప్రేమగా ప్రేమ పరిణయంగా మారింది. ఇంటినుండి ఎప్పడు చదువు మిషతో తల్లిదండ్రులకు దూరంగా గడిపిన నిరంజన్‌కి పెద్దగా సెంటిమెంట్లు ఏమిలేవు. తనకు ఏది నచ్చితే, ఏం బాగుంటుందనిపిస్తే అది చేసేవాడు. అందుకే అతను అమెరికన్‌ సొసైటీలో వలెనే తన పెండ్లి గురించి తల్లిదండ్రులకు ముందుగా తెలియజేయాలని అనుమతి తీసుకోవాలని ఎంత మాత్రం అనుకోలేదు. జిమ్మి కూడా తన పూర్తి అంగీకారాన్ని తెలియచేయటంతో పెండ్లి-పార్టీ కూడ నాలుగు రోజుల్లో అయిపోయినాయి. హనీమూన్‌ ట్రిప్పు ముగించుకొని ఇండియాలో జాలీ ట్రిప్పు నిమిత్తం ఇద్దరు వచ్చారు.
వెంకయ్యకు సీతమ్మకే కాదు ఈ విషయం ఎవరికీ మింగుడు పడలేదు. పైగా జిమ్మి ధరించే డ్రస్సు అందరికి వింతగా అనిపించింది. ఇంచుమించు నిరంజన్‌ అంతెత్తుంది. పైగా చాల పెద్ద హీల్స్‌ కాళ్ళకి, చిన్న గౌను, తెల్లటి ముఖం, ఎఱ్ఱటి జుట్టు… ఆ అమ్మాయి వస్తూనే అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉండాలని, ప్రతి ఒక్కరిని ‘హాయ్‌’ అని పలకరిస్త్తూ చేయి ముందుకు చాస్తున్నది. సీతమ్మ, వెంకయ్యలతో కూడా అట్లాగే చేయి ముందుకు చాచింది. కానీ నిరంజన్‌ ఏదో చెప్పిన తర్వాత ”నమస్కారం” అని అతి కష్టంమీద అన్నది.
అసలు నిరంజన్‌కి తల్లిదండ్రులు తన పెండ్లిని ఆమోదించరనే అనుమానమే రాలేదు. అతనిదంతా స్వేచ్ఛా ప్రవృత్తి. ఒకవేళ వారు ఆమోదించకపోయినా జరిగే నష్టము లేదు. తాను తిరిగి అమెరికా వెళ్తాడు.
సీతమ్మ గుడ్లు నీలుక్కుంటూ ‘ఇదేం పనిరా! కనీసం మాతో ఒక మాటయినా అనవలసిన  పనిలేదా! పెండ్లంటే సామాన్యమైన విషయమా? మన కులం జాతీ మతం ఏమి చూడకండా ఈ పనేమిటి?”
నిరంజన్‌ బిగ్గరగా నవ్వాడు ”అమ్మా! పిచ్చిదానివా ఏమిటి! ఇంకా క్రీస్తు పూర్వపు మాటలన్ని మాట్లాడతావేం? ఎవరికి ఇష్టమయిన పని వాళ్ళు చేసే స్వేచ్ఛ కూడా లేకపోతే ఎట్లా! మేం ఇద్దరం ఒకరికొకరం నచ్చాం. హాయిగా కలిసి జీవించాలనుకున్నాం. దానికి కావలసింది పెళ్ళనే లైసెన్సు. అది  తీసుకున్నాం… ఇష్టం తగ్గిపోయిందనుకో ఒకరికొకరం కష్టం కలిగించామనుకో విడిపోతాం అంతే…”
”మరి ఆ అమ్మాయికి తాళి కట్టావా? ఇట్లా అన్నీ లేకుండా పెళ్ళి చేసుకుంటే అది పాపం కాదా?” అమాయకంగా అడిగింది సీతమ్మ. నిరంజన్‌ తల్లిని ఒక్కసారి చేతులతో పైకెత్తి దించుతు నవ్వుతూ అన్నాడు ”పిచ్చమ్మా! మన దేశంలో జరిగినట్లే అన్ని దేశాల్లోను పెండ్లి  తంతు జరుగుతుందని అనుకొంటున్నావా? మన దేశంలోనే ఎన్నో పద్ధతులున్నాయి… అయినా మనసులు కలవకుండా ఎన్ని మంత్రాలతో దీవెనెలతో ముడి వేసినా అది వేస్ట్‌… మనసులు కలిస్తే ఇవన్నీ అనవసరం. అయినా పాపం, పుణ్యం మనం పెట్టుకున్న పేర్లేనమ్మా… నీవేం భయపడకు…”
సీతమ్మ భర్త లేకుండా చూచి సుకన్య విషయమంతా నిరంజన్‌కి చెప్పింది… అతను తండ్రి చేసిన పనికి చాలా బాధ పడ్డాడు.
జిమ్మి కారు డ్రైవ్‌ చేస్తుంటే ప్రక్కనే కూర్చుని అన్ని ప్రదేశాలు గురించి చెబుతున్నాడు నిరంజన్‌. ఓ అరగంటలో ఇద్దరు ఆశ్రమాన్ని చేరుకొన్నారు. ఆశ్రమంలో పిల్లలకి ఈ తెలదొరసాని ప్రత్యేకాకర్షణ అంతా కళ్ళప్పగించి ఆ అమ్మాయినే చూన్తున్నారు. దానికి తగ్గట్టు జిమ్మి కూడ అందరిని పలకరింపుగా ‘హాయ్‌’ ‘హలో’ అంటున్నది.
రామేశం బాబా వద్దకు వెళ్ళి వార్త అందించాడు. అతను సుకన్యను తీసుకు వెళ్తానంటున్నాడనని.
మరు నిముషంలో సుకన్య అన్న ముందుది.
‘హాయ్‌’ అంటూ నిరంజన్‌ చెప్పిదాన్ని బట్టి రెండుచేతులు చాచి సుకన్య రెండుచేతులు పట్టుకొని ఊపేసింది జిమ్మి.
”జిమ్మి నా భార్య… నీ వదిన… మిసెస్‌ నిరంజన్‌ అంటే నేను చేసిన పని నీకర్ధ కాదని ఇట్లా చెప్పాను” నిరంజన్‌ ఎంతో ఉల్లాసంగా అన్నాడు.
”అన్నయ్య! ఎప్పుడు పెండ్లి చేసుకొన్నావ్‌? ఎవరికీ తెలియకుండా ఎందుకు చేసుకొన్నావ్‌”?
”దీంట్లో తెలిపేందుకేముంది ఇష్టపడ్డాం. పెండ్లి చేసుకొన్నాం… నీవు ఇక్కడున్న రెండు రోజులు మాతో గడపాలి. అందుకే నిన్ను తీసుకు వెళ్దామని వచ్చాను”
”రెండు రోజులా! ఇక్కడ నేను లేకుంటే చాలా ఇబ్బంది…”
”ఏమిటి? నీవు లేకముందు నడవలేదా? ఆపైనడవదా? ఇట్లా అనుకోవటం శుద్ధ అవివేకం రా” అన్నాడు నిరంజన్‌ కోపం ప్రదర్శిస్తూ.
రామేశం అక్కడికి వచ్చి ”వెళ్ళండి బాబాగారు అనుమతిచ్చారు” అన్నాడు.
సుకన్య వాళ్ళని ఆశ్రమం చూస్తుండమని చెప్పి ఆఫీసులోకి వెళ్ళి పదినిముషాల్లో వచ్చింది.
జిమ్మికి సుకన్యని చూస్తుంటే ‘ఏంజల్‌’ ఏమో అనిపించింది. ఎంతో వినయ విధేయతలతో ఆ అమ్మాయి మాట్లాడే తీరు మరింత నచ్చింది.
ఈ సారి డ్రైవింగ్‌ నిరంజన్‌ తీసుకోన్నాడు వెనుకసీట్‌లో జిమ్మి సుకన్య కూర్చున్నారు. సంభాషణంతా ఇంగ్లీషులోను.
”ఏం జరిగింది సుకన్యా! చదువు ఉద్యోగం పెండ్లి ఏమి లేకుండా నీవు ఈ ఆశ్రమంలో ఉండవలసిన అవసరం ఏమొచ్చింది”
”అమ్మ నీకు కొంత చెప్పే ఉంటుంది. నేను చందు అనే అతన్ని ప్రేమించాను అన్ని విధాల యోగ్యుడు. అతను కర్మకాలి కుమ్మరి కులంలో పట్టాడు. అదీ మన ఊరి కుమ్మరి కనకయ్య కొడుకుగా! నాన్నకు అది ఎక్కడలేని అభ్యంతరమయింది. ఈ పెండ్లి తనను కాదని చేసుకొంటే చచ్చిపోతానని అన్నాడు. అన్నయ్య! నీకు ఇదంతా ట్రాష్‌ అనిపించవచ్చు. నేను అతన్ని తప్పమరొకర్ని భర్తగా ఊహించుకోలేను. అందుకే ఈ సంకటస్థితి నుండి నన్ను నేను కాపాడుకునే ఉద్దేశ్యంతో ఈ ఆశ్రమంలో చేరాను.”
”అంటే సమస్యల నుండి పారిపోదామని నీ అభిప్రాయం… అయినా సుకన్య నీకు నీవు అనుకున్న మనశ్శాంతి లభించిందా. మన మనస్సు మనతోనే ఉన్నప్పడు అదెక్కడి నుంచి వస్తుందమ్మా! నీ మనసుని తీసి ఏ చెట్టుకొమ్మకో తగిలిస్తే అన్ని మరచిపోయి హాయిగా ఉండవచ్చు అట్లా చేయగలవా?”
”అన్నయ్య! అట్లా అనకు తాత్కాలికంగా కొంచెం తట్టుకొనే శక్తివచ్చింది.”
”ఏమిటి? అమ్మనాన్న కాదంటే నీవింత త్యాగం చేయాలా? అతనిపై నీకేమాత్రం విశ్వాసమున్నా అతనితో వెళ్ళిపోయేదానివే… అయినా నీకు ఈ ఆశ్రమంలో అంత పవిత్రత మనశాంతి లభించాయా?
”నీవన్నట్లు అతనితో వెళ్ళిపోవచ్చు కాని ఈ దేశంలో పుట్టి ఆడపిల్లగా ఆ పని చేయలేకపోయాను. తల్లిదండ్రులను బాధించే పని వల్ల నాకు సుఖం ఉండదని నమ్మాను. ఇక ఆశ్రమంలో మాత్రం అవినీతి లేదని ఎట్లా అనగలను.”
”అంటే అవినీతిపరులకు సేవ చేస్త్తూ నీ జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటావన్న మాట. ఏమయినా ఈ విషయం ఏమిటో నేను నాన్ననడిగే తేల్చుకొంటాను”
కొడుకు కోడలు వెళ్ళి సుకన్యను వెంటబెట్టుకొని తీసుకురావటం సీతమ్మ కెంతో ఆనందం కలిగించింది. కూతురు చిక్కిపోయింది. సీతమ్మ కళ్ళల్లో నీళ్ళు… అన్నీసవ్యంగా జరిగితే అల్లుడు కూడా వచ్చేవాడు. ఇల్లంతా సందడిగా కళకళలాడి పోయేది.
వెంకయ్య కొడుకు చేసిన పనికి బాధపడినట్లులేదు. సీమదొరసాని తన కొడుకుని వరించి వచ్చిందని మురిసిపోయాడు. ఆ అమ్మాయి తీరు తెన్నులు మాట్లాడే భాష అంత వింతగా తమాషాగా అనిపించింది. తమ కుటుంబాన్ని అంతా ఎంతో గౌరవిస్తున్నట్లుగా గొప్పగా పరిగణిస్తున్నట్లుగా అనుకున్నాడు. అందుకే అప్పటికప్పుడే కొడుకు జంటగా వచ్చిన సందర్భంగా పెద్ద విందు ఏర్పాటు చేసాడు. ఉన్న కొద్ది సమయంలోనే బంధువులను, స్నేహితులను అందర్ని ఆహ్వానించాడు.
విందు సమయంలో కోడలు కట్టుకోవాలని పట్నం నుంచి ఖరీదయిన పట్టు చీరె తెప్పించాడు. సీతమ్మ గాజులు మెడలోకి ఓ చైను ఆచీరతో బాటుగా జిమ్మి కిచ్చింది. సుకన్య, వనజ కలసి ఆ అమ్మాయిని చీర కట్టి నగలతో అలంకరించారు… నాజూకైన జిమ్మి శరీరానికి చీర కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది.
ఇదంతా చూస్తున్న నిరంజన్‌కి తండ్రిని ఎట్లా అర్ధం చేసుకోవాలో తెలీలేదు. ‘పొరుగింటి పుల్ల కూర రుచి’ అని ఎక్కడినుంచో వచ్చిన ‘జిమ్మి’ని  కోడలుగా అంగీకరించటానికి యిష్టమయిందా? తమ ఊళ్ళో తమ కండ్ల ఎదుటనే ఓ కుమ్మరి నీతిగా కష్టపడి జీవిస్తూ కొడుకునంత పెద్ద చదువులు చదివిస్తే అతని కులం కారణంగా అయోగ్యుడయినాడా! ఏమి వింత ఇది!
సుకన్యకు కూడా అట్లాటి ఆలోచనలే కలిగాయి. కేవలం కులం, హోదాలు అడ్డు పెట్టుకొని తను చందుని పెండ్లాడనీయకుండా చేసిన ఆ తండ్రే ‘జిమ్మి’ ఎవరో తల్లిదండ్రులెవరో ఏమిటో తెలియకుండానే ఆ పెండ్లి నంగీకరించాడు. అతడు కొడుకు కాబట్టా? లేక జిమ్మి దొరసాని కాబట్టా?
విందు చాలా అట్టహాసంగా జరిగింది… నిరంజన్‌ ఆ మర్నాడు అంతా వెళ్ళి పోయాక తండ్రిని కూర్చోబెట్టి తన అనుమాన నివృత్తికై ప్రశ్నించటం మొదలెట్టాడు.
”నాన్నా! సుకన్య జీవితాన్ని ఎందుకు అట్లా ఆశ్రమాలకు సేవలకు అంటూ వ్యర్ధం చేస్తున్నారు?”
”తప్పేముందిరా! దాని వల్ల ఆశ్రమానికి ఎంతమంచి పేరొచ్చిందో తెలుసా? బాబాగారు మొన్న వెళ్ళితే ఎంత మెచ్చుకున్నారో దానిని”
”దానివల్ల ఎవరికి లాభం? వారికి వారి ఆశ్రమానికి. కాని దాని జీవితంలో అనుభవించవలసిన వయసులో మిగిలింది శూన్యం. మీ నిర్ణయం చాలా తప్పు అది ఎవరిని కోరుకుంటే వారికిచ్చి దాని పెండ్లి జరిపించండి.”
”అది కష్టం రా”
”మరి నేను ఈ అమెరికన్‌ పిల్లను పెండ్లాడితే ఎందుకంగీకరించారు? ఎందుకీ విందులు గిందులు యిచ్చారు?”
”ఆ అమ్మాయి దొరసాని రా! మననల్ల వాళ్ళను తెల్లవాళ్ళు యిష్లపడ్డారంటే ఎంతగొప్ప!”
”ఇంకా మీరు స్వాతంత్య్రం రాక ముందు రోజుల్లో ఉన్నారు…”
”అయినా మరీ మన ఊరిలో తనముందు కుండలు చేసుకొని బతికే కుమ్మరోడి కొడుకుని ఇచ్చి ఎట్లా పెండ్లి చేయమంటావ్‌ చెప్పు”
”అయితే నేను వీళ్ళని అమెరికా తీసుకువెళ్తా! అక్కడ పెండ్లి చేస్తా”
”చేసుకోండిరా! మీ యిష్టం! అంతా కులభ్రష్టులయిపోండి… మేమెందుకింకా బతికి పెద్దవాళ్ళం… నీదారి నీవు చూచుకోన్నావ్‌! ఇకదాని క్కూడా నేర్పు…” గట్టిగా మాట్లాడుతూ ఊపిరందక ఉక్కిరి బిక్కిరయ్యాడు వెంకయ్య.
అంతవరకు ఉత్సాహంగా సాగిన విందుతాలూక ఆనందం కూడా మిగలలేదు. అందరి ముఖాల్లో ఆతురత… కొద్దిసేపటికి తేరుకొన్నాడు వెంకయ్య.

– విజయ బక్ష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
76

సుకన్య, , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో