అభిలాష అక్షర అక్షయ పాత్ర- ‘పుష్పక’ యాత్ర!

‘అభిలాష అక్షర అక్షయ పాత్ర’ కవితా సంకలనం చదువుదామని ముందు మాటలు వ్రాసిన ప్రముఖుల ఛాయాచిత్రాలను చూస్తూ ఒక్కొక్క పేజీ త్రిప్పుతుంటే నా కనిపించింది. ఈ కవయిత్రి సామాన్యు రాలిగా కనబడే మాన్యురాలని.
‘‘సాధించే సత్తా నీలో ఉంది చూసుకో’’
అందులో నన్నాకర్షించిన నిప్పులాంటి నిజాల వరుసలు… నిజంగా ముత్యాల పదాలు.
‘‘నిప్పుతోటి ఆటటాడి ధైర్యం తెచ్చుకో…
ఉప్పెన పై చెలరేగే నైజం నేర్చుకో..’’
‘‘విధాత ఎవ్వడు రా నీ రాత నువ్వే రాసుకుంటే
`    ఏ బ్రహ్మ నీగీత మార్చునురా నీచేయి  నీ చేతిలోనే ఉంటే.’’
ఇలా సాగి పోతుంది ఆమె కవితా స్రవంతి. అలజడి తో ఆడుకో అనే క్రొత్త రకమైన ఆలోచనకు అంకురార్పణ చేసింది అభిలాష. వంట వార్పుకు మాత్రమే పరిమితమైందనుకునే వారికి అలాకాదని ఆడపిల్ల అంటే నిప్పు తునక అని ఈ కవితలో చాటడం  జరిగింది.
[captionpix align=”right” theme=”crystal” width=”160″ imgsrc=” http://vihanga.com/wp-content/uploads/2012/08/Abhilasha.jpg” captiontext=”Abhilasha”]‘‘ధర్మానికి కాళ్ళెక్కడివి, నిజాయితీ కుంటిదైనపుడు
ఏ మోము ముసుగు వెనక ఏ కపటం దాగుందో
ఏనవ్వు వెనకాల ఏ వెక్కిరింత తొంగిచూస్తుందో.
ఇలాంటి వాక్యాలు అభిలాష హృదయాన్ని అద్దంలా చూపెడతాయి. తాను ఎంత ఆవేదనతో లోకాన్ని పరిశీలించి రాస్తుందో తెలియజేస్తాయి.
ఇంక ‘మనుషులంటే మానవత్వం అని  చాటుదాం
కవితలో కలసికట్టుగా ‘‘ దేశ పురోగతికి మైత్రి మనోహారానికి
ఆగమనం పలుకు దాం’’ అంటూ ద్వేషభావాన్ని నిర్మూలిద్దామని చెపుతుంది కవయిత్రి.
దైవం అంటే తెలుసుకో కవితలో పువ్వు ఇచ్చి నవ్వు కొనగలవా? ’’ అని ఈమె ప్రశ్నిస్తుంది.
జాగృతి అవుతుంది వికృతిరీతి కవితలో………..
‘‘ఎవరి నడిగినా నా, నేను అన్న ఏకైక నినాదం
ఎవరి నుండి విన్నా నేనే మిన్న అన్న అహంకార గర్వం
నిరాడంబరత్వంలేని వ్యక్తులు కో కొల్లలు గా ఉన్నారని, ఎప్పుడు స్వఛ్ఛమైన నవ్వులు పూచే తరుణం వస్తుందని కవయిత్రి తన సహజమైన ఆవేదనతో తన భావాలను సాక్షాత్కరింపజేశారు.
ఏడి…………. ఎక్కడ …. నిజమైన నాయకుడు
ఈ కవితలో వాడి చొక్కా రవ్వంతైనా నలగదు, కానీ ఉద్యమాలు చేయమని ఉసిగొల్పుతాడు……. అని
నేటి రాజకీయ నాయకులు మనస్తత్వాన్ని నిప్పులు గ్రక్కే అక్షర  తూటాలతో బట్టబయలు చేస్తుంది కవయిత్రి అభిలాష
అవును నేనింతే లో తన వ్యక్తిత్వం ఎలాంటిదో తాను ఎంత పారదర్శకంగా ఉంటుందో కవితాత్మకంగా వివరించారు. ఇంకా జీవ హింసను భక్తి పేరుతో చేయకూడదని చెంగు చెంగున ఎగిరే ప్రాణాలను తీయకూడదని చెప్పారు. ఆడపిల్ల అంటే…………ఆడపిల్ల గురించి చెబుతూ తన కవితలో మచ్చలేని స్వచ్చం ‘అని పుత్తడి తేజస్సుల సౌందర్యం అని వివరించారు.
పగ`ద్వేషం
అ కవితలో పగ అనేది మనిషిలోని రాక్షసుడిని నిద్రలేపు తుంది అని…. అమ్మను కూడా నమ్మలేని నయవంచన’ ను తోడు చేసుకుని విజృంభిస్తుందని చెబుతారు. ఈమె జీవితాన్ని పరిశోధించి, తన కవితలను పేర్చిందని కనిపిస్తుంది. ఇంత చిన్న వయస్సులో మానసిక పరిపక్వతకు కారణమైన పరిస్థితులను దర్శించి వ్రాసిందని మనకు అనిపిస్తుంది.

ఇదా దేశ సౌభాగ్యం లో లంచాలు, కుమ్ములాటలు అరాచకాలలో మునిగి కూడా ఈ గుడ్డి స్వాతంత్య్ర నినాదాలు ఎందుకు? అని ఆవేశంగా ప్రశ్నిస్తారు. ఇంకా ‘‘ఎవరా శాంతవీరుడు?’’ అనే కవితలో గాంధీ మహాత్ముని, మహోత్తమునిగా వీరునిగా, మనోబలశాలి, ధీరశాలి, ప్రసన్నశాలి, దీక్షాశీలి ఆవేశపరుడు, మొండివాడు. అంగరక్షకుడు, అపరబ్రహ్మ లాంటి పదాలతో హృద్యంగా చిత్రించారు.
వెనకడుగు వేయకు, వెను తిరగిచూడకు
సోమరితనాన్ని తెగ నరకమని, పట్టుదల, గుండె ధైర్యాలను నిద్రలేపమని అప్పుడే ఉన్నత శిఖరాలధిరోహించగలరని స్ఫూరిదాయకమైన మాటలతో ప్రభావితం చేస్తారు కవయిత్రి.
నిజాన్ని చూస్తున్నా! ఈ కవితలో వాక్యాలు చూడండి. అబద్ధాన్నే నిజమని భావించలేక
నిజమైన స్వచ్ఛత కోసం తపించాను అంటారు ఈమె.
వెలిగించలేను నీటిలో వెలిగే ప్రమిద దీపం!
ఆర్పుకోలేను స్వచ్ఛతలో ప్రకాశించే అమరదీపం
నిజంగా ఎంత భావగర్భితంగా ఉన్న ఈ వాక్యాలు. ఇలా చెప్పకుంటే పోతే లక్షణమైన అక్షర లక్షలు అద్భుతాలు ఆవిష్కరిస్తాయి.
బాధకు విలువ వ్యక్తం అది నీనీడలా వెంటాడే యమపాశం.
‘‘మర్చిపో నీలో వున్న దు:ఖ దుష్టక్షద్రం చూసుకో వెలుగు రేఖలు నీకై వేచి ఉన్నాయన్న నిజాన్నీ ఈ కవితలలో ఆణిముత్యాలుగా మనం భావించవచ్చు. నవ యువతీ యువకులకు శతక సాహిత్యం చదవకపోయిన వారికి జాగ్రత్తలు చెప్పి, జాగృతిని కలిగించే అనేకానేక సూక్తులు ఈమె  కవిత్వంలో  అనేకం  ఉన్నాయి. ఇవి చదివిన వ్యక్తి అగ్నిస్నాతమై స్వచ్ఛమైన ప్రకాశంతో జీవన పోరాటంలో విజయం సాధించటం తధ్యం.
‘‘దైవమే ప్రణమిల్లే రూపం ‘మగువ’.
దీనిలో మగువకు అందమైన రూపంతో పాటు గుండె నిబ్బరం కూడా ఉండాలని తెలియజేస్తారు. అభిలాష ఇంకా మనిషి మానవత్వం గురించి, తెలుగు లోని తీయదనం గురించి, స్నేహ మాధుర్యం గురించి అమరవీరులు, సమరయోధుల త్యాగఫలం, నేటి స్వాతంత్య్ర అని అద్భుతమైన వాక్యాలతో తన కవిత్వాన్ని సుసంపన్న చేశారీమె.
ఓటమి రుచి చూస్తే ఏమిరా? అది గెలుపుకి పిలుపే కదరా…… అని పిరికితనం తో విధికి తలవంచక తల ఎత్తుకుని కీర్తి శిఖరాలపై మనోహారంగా నిలబడాలని చెప్తారు. అణువంత కష్టానికి ఆకాశమంత నిరాశకూడదని ఉద్భోధిస్తారీ కవయిత్రి.
అభిలాష ప్రేమ గురించి వ్రాస్తు……………
‘‘ భాషకే అందని కమ్మని భావం
ఉహలు వల వేసే అమృత కావ్యం
అని ప్రేమను గురించి తన అద్భుత వాక్యాలెన్నో వ్రాశారు. మళ్ళీ ఆమె మగువల గురించి  బానిసలవ్వవద్దని సూచిస్తారు. ఇల్లాలు పడే శ్రమని అక్షరీకరించటంలో తగు నైపుణ్యాన్ని చూపిస్తారు. నటరత్న నందమూరి తారకరామారావుని వర్ణించినా, రౖెెతన్న గురించి నీవే రాజు వని వివరించినా., హిందూ ముస్లింలకు ఐకమత్యాన్ని ప్రబోధించినా., గుండె ఘోషను వినిపించినా, మహానటి సావిత్రి గురించి ప్రస్తుతించినా అమ్మా నాన్నల ఆప్యాయతను స్పృశించినా 300 పై చిలుకు కవితలను అక్షర తూణీిరాలను పాఠకులపై సందించికవితా వర్షం కురిపించినా అది అభిలాషకే సాధ్యం. ‘‘అనితర సాధ్యం ఆమె మార్గం’’ అందుకే ఈ చిరంజీవని పదికాలాలపాటు సాహితీ సేద్యం చేస్తూ వర్ధిల్లాలని ఆశిస్తూ, అభినందిస్తూ………..

–  బి.హెచ్‌.వి. రమాదేవి,ఎం.ఏ., ఎం.ఎ., ఎం.ఫిల్‌

తెలుగు లెక్చరర్‌ ,

ఆదిత్య డిగ్రీ కళాశాల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలు, , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో