జలగామి సిల్వియా ఎర్లీ

 

          అంతరిక్ష శకటాలలో అంతరిక్షాన్ని పరిశోధించే వారిని వ్యోమ గాములు  – ఆస్ట్రో నాట్లు అంటారు .సముద్రాల వంటి జలాలపైనా ,లోపలా పరిశోధించే వారిని జలగాములు లేక ఆక్వా నాట్లు అంటారు .సముద్రాన్వేషణ  లో అనేక సాహసాలు చేసి,అరుదైన రికార్డులు సాధించి ,ఎన్నో అవార్డులు ,రివార్డులు అందుకొన్నఆక్వానాట్, అమెరికా  మహిళా మాణిక్యం సిల్వియా ఎర్లీ  జీవితం ఎందరికో ఆదర్శం ,ప్రేరణ .
                              

  బాల్యం -విద్యాభ్యాసం 

             సిల్వియా ఆలిస్ ఎర్లీ అమెరికా లోని న్యూ జెర్సీ రాష్ట్రం లో గిబ్బన్ టౌన్ లో 30-8-1935 న జన్మించింది .అమెరికన్ ఒషనోగ్రాఫర్ గా ,ఆక్వా నాట్ గా ,రచయిత గా ఆమె చిర కీర్తినార్జించింది .1955 లో ఫ్లారిడా  యూనివర్సిటీ  నుండి డిగ్రీ పొందింది .మరుసటి ఏడాది ఎం.ఎస్.సాధించింది .1966 లో డ్యూక్ వర్సిటి లో పి.హెచ్.డి. చేసింది .1979-86 మధ్య కాలం లో కాలి  ఫోర్నియా అకాడెమి ఆఫ్ సైన్సెస్ లో క్యూరేటర్ ఫర్ పైకాలజి గా పని చేసింది .తరువాత కాలి  ఫోర్నియా లోని బెర్కిలీ వర్సిటి లో రిసెర్చ్ అసోసియేట్ గా 1969-81లో ఉద్యోగం చేసింది .రాడిఫ్ ఇన్స్టిట్యుట్ లో స్కాలర్ గా కొంత కాలం ఉంది .1967-81మధ్య కాలం లో హార్వర్డ్ యూనివర్సిటీ  లో రిసెర్చ్ ఫెలో ఆఫ్ అసోసియేట్ గా వరుస క్రమం లో ఎదుగుతూ తన విద్యకు తగిన ప్రతిఫలాన్ని పొందుతూ రాణించింది .
                                                       

అన్వేషణ 
                

                 సిల్వియా కు మొదటి నుంచి సముద్రం లో ఈదటం ,అక్కడి జలచరాల విషయం తెలుసు కోవటం సరదా . 1970లో ఆమె అభిరుచికి తగిన పని కలిగింది .ఆమె లోని ప్రతిభా పాటవాలకు గుర్తింపు లభించింది .చాలా మంది మగ వారితో ఈమెను సముద్రాన్వేషణ కు ఒక షిప్ లో పంపారు .అందులోని మగ వారంతా షిప్ లో ఆడది ఉంటే  ”బాడ్ లక్” అని ఈసడించారు .పేపరు వాళ్ళు కూడా పెదవి విరిచి ఏదేదో రాశారు .ఆయాత్ర ను దిగ్విజయం చేసింది సిల్వియా .అప్పుడు పత్రికలూ అదే నోటితో ఆమెను ”ship’s social ambassador ”అని కీర్తించాయి .మాటలతో కాక చేతలతో జనం నోరు మూయించిన సాహసి ఆమె .ఆమె ఆ యాత్ర లో కనుగొన్న” రెడ్ ఆల్గాను   ”హంబ్రేల్లా హైడ్రా ”అనే  పేరు తో పిలిచింది . ఆది గొడుగు ఆకారం లో ఉంటుంది .అందుకని కొంచెం మార్చి హంబ్రేల్లాఅని పేరు  పెట్టింది. .దీనిలో ఆమె గురువైన” హమ్”అనే శాస్త్ర వేత్త పేరు కూడా కలిసి ఉండటం విశేషం .
                 ఆ కాలం లో ”షార్క్లే లేడీ”అని పేరు పొందిన డాక్టర్ క్లార్క్ తో ఆమె కు మంచి పరిచయమేర్పడింది .1970లో ”నాసా ”సంస్థ ఏర్పాటు చేసిన మొత్తం ఆడ వాళ్ళే అన్వేషకులు గా ఉన్నమొట్టమొదటి  టీం కి    నాయకత్వం వహించే బాధ్యత సిల్వియా కు దక్కింది . అప్పుడు ”ఓపెన్ ఓషన్ జిం సూట్” తో సముద్ర గర్భాన ఈది అరుదైన రికార్డు సాధించింది .లోతు సముద్రం లో” oahu ” ప్రాంతం లో సముద్ర జీవులను అన్వేషించింది .తన పరిశోధనలను రికార్డు చేసింది .ఈ పరిశోధన లో అంతా ”ఫ్రోజెన్ మీల్ ”మాత్రమె తిన్నారు .సముద్రం లో 381 మీటర్ల లోతున ఆమె అన్వేషణ సాగించి రికార్డు నెలకొల్పింది .ఇదే అప్పటి మహిళా రికార్డు . ఆ తర్వాత ఒంటరిగా సబ్ మెరీన్ లో 3,300 అడుగుల లోతు లో విహరించి రికార్డు సాధించింది  సముద్రాలలో లోతు జలాలో ఆక్టోపస్ లు చీకటి లో మాత్రమే బయటకు వస్తాయి .ఏదైనా దానికి ఆహారం అయ్యే జీవి దాని దగ్గరకు వచ్చి నపుడు ఆక్టోపస్ రంగు బ్రౌన్ కలర్ నుండి ”బ్లూగ్రీన్ ”కు మారటాన్ని గుర్తించింది ..
                                              

  నిర్మాణాత్మక కార్య క్రమాలు 

                       1980-84 మధ్య ” National  advisory committee on oceans and Atmosphere ”లో పని చేసింది .1982లో భర్త గ్రాహం హాకేన్ తో కలిసి దీప ఓషన్ ఇంజినీరింగ్ ను డిజైన్ చేసి నిర్వహించి ,కావాల్సిన వారికి ఆసరా గా నిలిచి ,సలహాలను ఇచ్చింది .దీన్ని భార్యా భర్తలు లాభాపేక్ష లేకుండా చేసిన గొప్ప కార్యక్రమం .ఆమె నిరంతర   పరిశోధకు రాలు .సముద్ర జలాలలో లోతుగా తిరిగే వారికి అవసర మైన ఆధునిక సూట్లను తయారు చేసింది .డీప్ ఓషన్  రోవేర్ రిసెర్చ్ సబ్ మరీన్ ”నిర్మించింది .దీనితో సముద్రం లో 3,300అడుగుల లోటున పరిశోధించ వచ్చు .”ఫాంటం”అనే రిమోటింగ్ ఆపరేటేడ్ వెహికల్  ”తయారు చేసింది . దీన్ని30 దేశాలు కొని చక్కగా ఉపయోగించు కొన్నాయి .
                                              

ప్రతిభా పురస్కారాలు    

1990లో అమెరికా అధ్యక్షుడు జార్జి. w. బుష్ సిల్వియా ను ”national oceanic and atmospheric  administration ”చీఫ్ కెమిస్ట్  గా నియమించి అత్యంత విలువైన గౌరవాన్ని కల్పించాడు .ఒక మహిళ ఆ పదవిని నిర్వహించటం సిల్వియా తోనే ప్రారంభ మైంది .అయితే అందులో ఆమె చేయాల్సిన దేమీ కనీ పించ లేదు .ప్రభుత్వం రిసెర్చ్ చేయటానికి తగిన ఫండు ను ఇవ్వలేదు.సిల్వియా కు కోపం వచ్చి బుష్ కు జాబు రాస్తూ ”స్పేస్ షటిల్ లో టాయిలెట్ల కు  పెట్టె ఖర్చు కూడా” అండర్ వాటర్ రిసెర్చ్” కు ఇవ్వటం లేదని నిందించింది .
             ఎన్నో టి.వి.ప్రోగ్రాములు చేసింది .వాటిల్లో సైన్స్ ,టెక్నాలజీ ,సాధారణ అంశాల పై గొప్ప ఉపన్యాసాలిచ్చి యువకులకు ,చిన్నారులకు ప్రేరణ గా నిలిచింది .అత్యంత ప్రసిద్ధి పొందిన ”టైం మాగజైన్ ” 1998లో ప్రత్యేక సంచిక వేసి ఆమె ను ”first hero for the planet ”అని ప్రశంసించింది .నెదర్లాండ్ ప్రభుత్వం ”ఆర్డర్ అఫ్ ది గోల్డెన్ ఆర్క్” తో ”knight ”బిరుదు నిచ్చి సత్కరించింది .google earth లో అయిదవ వెర్షన్ లో సముద్రాల పై కొత్త ఫీచర్లను ప్రవేశ పెట్టింది .
                        marine conservetive biology institute వంటి  ఎన్నో బోర్డులు ఆమెకు గౌరవ స్థానాన్నిచ్చి  గౌరవించాయి .united nations conference లో  3500 మంది ,ప్రపంచ రాయబారులు ,డెలిగేట్లు ,మొదలైన విశిష్ట వ్యక్తులున్నసభలో 14 నిముషాలు మాట్లాడి తన దేశానికి ప్రాతినిధ్యం వహించి  సాహస మహిళా మణి అనిపించుకొన్నది . under water laboratory కి నాయకత్వం వహించిన ధీర వనిత సిల్వియా .ఆమె గౌరవార్ధం ఫ్లారిడా లో ఆమె యాభై ఏళ్ళ లోతు సముద్ర జలాల అన్వేషణ ను సగౌరవం గా నిర్వహించి సత్కరించింది .2009 లో ”tedd prize ”ను అందుకొంది .వీరి ఆసరాతో , marine protected areas around the globe ” కోసం ”మిషన్ బ్లూ ”అనే యాత్ర చే బట్టి క్యూబా ,బెల్జి ,గాలపెగాస్ దీవులను చుట్టి వచ్చింది .ఆమె ఎక్క డ ఉంటే  అక్కడ సముద్ర జీవులకు రక్షణ అనే భావం ఏర్పడింది .sustainable sea expeditions కు అయిదేళ్ళు పని చేసింది .అందులో అమెరికా లోని సముద్రాల రక్షణ విషయం కోసం ఎంతో కృషి చేసింది .గల్ఫ్ యుద్ధం లో సహాయం చేసింది .అనేక రిసెర్చి ట్రిప్పులను నిర్వ హించింది .1998 లో ”explorer in residence at national geo phisicssociety ”లో గౌరవ స్థానాన్ని పొందింది .2011లో స్మిత్ కాలేజి ,సిల్వియా ను గౌరవ డాక్ట రేట్   తో సత్కరించింది .harte research institute for the gulf of mexico studies at texas కు చైర్మన్ పదవి పొంది రాణించింది .deep  search foundation కు వ్యవస్థాపక అధ్యక్షురాలైంది . advisory council for the ocean in google earth కు చైర్మన్ గా ఉంది .
                                                                          

రచనలు 

               సిల్వియా ఎర్లీ సుమారు 125పుస్తకాలు రాసింది . సముద్ర విషయాలు ,సైన్స్ ,సముద్రాన్వేషణలు తో వాటిని తీర్చి దిద్దింది .the atlas of the ocean ,wild ocean america;s parks under the sea ,the atlas of the ocean మొదలైన ఆమె పుస్తకాలు ఎంతో విలువైనవి .భవిష్యత్త్ తరాలకు కర దీపికలని పించేవి .అరవైదేశాలు పర్యటించి ఉపన్యాసాలిచ్చింది .చిన్న పిల్లల కోసం coral reefs ,hello fish ,devil పుస్తకాలను ఆకర్షణీయం గా రాసింది .sea change -a message of the ocean అని ఆమె 1995లో రాసిన పుస్తకం చాలా విలువైనది గా భావిస్తారు .
                1992లో  deep ocean exploration and re search అనే సంస్థ ను ఏర్పరచి మరిన్ ఇంజినీరింగ్ లో మరింత ముందుకు సాగింది .ఇప్పుడు ఆ సంస్థ ను ఆమె కుమార్తె నిర్వహిస్తోంది .ఇలా నిరంతరం ఆమె కృషి చేస్తూనే ఉంది .ఎందరికో ఆదర్శం గా ,ప్రేరణ గా నిలిచింది .ఆమె జీవితం మొత్తం మీద 60కి పైగా అన్వేషణా కార్య క్రమాలను చేసింది 6000.గంటలు సముద్ర జలాల లోపల   గడిపి పరిశోధన చేసింది .మూడు కంపెనీలు పెట్టి సముద్ర జలాన్వేషణ లో ఎంతో సేవ చేస్తోంది ”.diadema sylvia ”అనే” సముద్ర ఆర్చిన్” ”,pilina earlie ”అనే రెడ్ ఆల్గే స్పెసిమెన్ లకు  సిల్వియా పేరు పెట్టి అరుదైన గౌరవాన్ని కల్పించారు .ఆమె  భూమి ,సముద్రాలలో ఉన్న జీవు లన్నిటిని ”marine world ”అని ముద్దు గా పిల్చింది .అందుకే 1998 సంవత్సరాన్ని అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ”యియర్ ఆఫ్ ది ఓషన్స్ ”అని గుర్తింపు తెచ్చాడు .నిత్యాన్వేషి సిల్వియా పెర్లీ ని ”ocean Everest ”ఎక్కిన వీర వనిత  గా భావిస్తారు .*
                     

– గబ్బిట దుర్గా ప్రసాద్ 

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

 

పురుషుల కోసం ప్రత్యేకం, వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో