వ్యక్తిత్వ వికాసమే కవితకి రూపం

 

     కవి అక్షరాలతో ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కలిగించగలడు. పాఠకుల హృదయాలను ఊహాలోకాల్లో విహరింపజేయగలడు.ఆర్తితో అక్కున చేర్చుకున్న భావనను, స్ఫూర్తితో జీవనసరళిని తీర్చిదిద్దే చేవను అందివ్వగలడు. అందుకే లలిత కళలలో ప్రత్యేక స్థానం కవిత్వానికి ఇవ్వడం జరిగింది.అయితే ‘‘కవే వ్యక్విత్వ వికాస నిపుణుడైతే ‘‘ ఇక చెప్పనవసరంలేదు. పటిష్టమైన పునాదిని వేసి జీవనసౌధాన్ని నిర్మించడానికి తోడ్పడతాడు. వారితో అద్భుతాలను చేయిస్తాడు. ప్రస్తుతం మన అలజంగి ఉదయ్‌కుమార్‌ గారు చేసేది అదే. స్ఫురద్రూపిగా చాలా మృదువుగా, మితభాషిలా కనిపిస్తారు. కాని ఆయన స్మితభాషి అనీ ప్రవహించే వాగ్ఘరి అని ఆయన మాటలు విన్న తరువాత మనకు తెలుస్తుంది.
ప్రస్తుత విషయానికి వస్తే ఈ ‘‘ఉదయించు ఉద్యమించు’’ పుస్తకానికి విహంగ ఇంటెర్‌నెట్‌  పత్రిక సంపాదకురాలు శ్రీమతి పుట్ల హేమలత నన్ను అభిప్రాయం వ్రాయమని కోరితే గాని ఆయన కవి అనే విషయం నాకు తెలియలేదు. ఆయన రెజ్యూమ్‌ చూస్తేగానీ రచయిత అని తెలియదు. మా ఆదిత్యలో వ్యక్తిత్వ శిక్షణాతరగతులకు వక్తగా మాత్రమే తెలిసిన నాకు మరోకోణం నుంచి ఆయనను పరిశీలించే అవకాశం కలిగింది. ఆయన మాట్లాడే తీరుకు ప్రశంసాపూర్వకంగా ప్రతిసారి నేనో కవిత వ్రాసి ఇవ్వడం ఆనవాయితీ. తొలి కవిత ‘‘ఉదయించు ఉద్యమించు’’ లో ప్రబంధకవుల లాగా అమ్మాయిల అంగాంగ సోయగాలను వర్ణించటం కన్నా, అభాగ్యుల జీవితాలను తీర్చిదిద్దడం వారికి చేయూత నివ్వడం అవసరమని చెబుతారు కవి. రెండవ కవితలో కొన్ని వరుసలు… పైసా జేబులో కరువైనా కోట్లకు మించిన
ఆత్మ స్థైర్యాన్ని అప్పుగా ఇచ్చేవాడు
చితిలో బూదిగా మారేవరకూ
తోడుగా నీడా నీతో సాగేవాడు
భవిత అంధకార బంధురమైనపుడు
వేగుచుక్కలా మార్గదర్శకం చేసేవాడు!
కావాలటునంటు ‘ఆరుద్ర’ గారి లా మామూలు మాటలలో ఎంత హృదయంగా చెప్పారో కవిచూడండి.
ఇక ‘‘జయకేతనాలను’’ ఎగిరించు,కవితలో
‘‘ఎదుటి వాళ్ళు ఎదిగితే
ఎసిడిటీ ప్రాబ్లమ్‌తో వెర్రికేకలు వేసేవారు.
అని చెప్పడం ఎంత బాగుందో చూడండి.
అంతేకాదు. అనంతంవైపు కవితలో
ఒక గాయం మానేసరికి
మరొకటి సిద్థంగా ఉంటుంది.
ఇందులో ఎంత వాస్తవం ఉందో గమనించండి. అంతేగాక ఆ గాయం మనిషికి పరివర్తన కలింగించేదని చెప్తారు ఉదయ్‌కుమార్‌
‘‘అస్తిత్వం లేని వాడికెవడు’’
వ్యక్తిత్వం అనేది ఎవరికి వారు నిలుపుకోవలసినదని అవసరమైనదని నొక్కి చెప్పారు కవి.
లాల్‌సలాం.
లాల్‌ సలాం      కవితలో………….
సమాజానికి రెండు నాల్కలని తేల్చిచెప్పారు.
మచ్చుకి  ఈ లైన్లు
‘‘హేతుబద్ద ఆలోచన చెయ్యమన్న సోక్రటీస్‌ కు
విషమిచ్చిందీ సమాజమే
నూతన ఆలోచనకు పితామహుడని
పట్టంకట్టింది ఈ సమాజమే’’
ప్రముఖ సేల్స్‌ మరియు వ్యక్తిత్వ వికాస శిక్షకుడు రఫీ అన్నట్లు ఈ పుస్తకాలు మనసుల్లో చలనం మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తుందనేది నిజం. నేనేమంటానంటే ఇది పుస్తకం కాదు కవితాపుష్పకం అని ఎన్నిసార్లు చదివినా క్రొత్తకోణంలో మనకి అనేకానేక విషయాలు గోచరించి స్థైర్యాన్ని, స్ఫూర్తిని ఇస్తాయి.
కేరింతల తుళ్ళింతలతో అమ్మబడే స్వర్గంగా
ఆటపాటలతో అలరించిన బాల్యం
చివరివరకు చప్పరించిన
ఐసుపుల్లలా కనుమరుగైపోయింది!
ఇది ఒక అద్భుతమైన ఆలోచన బాల్యంను ఇంతవరకూ ఇలాపోల్చిన వారెవరూ లేరు. వ్యక్తిత్వ వికాసకునిగా తన శైలీ ప్రతి వాక్యంలో కనిపిస్తూ ఉంటుంది. కవితలో మెరుపు, విరుపు, చురుకులతో పాటు యువతకు ఓ చరపు కూడా అంతర్లీనమై ఉంటుంది.
‘‘వ్యధితుని స్వగతం’’లో భార్యా భర్తలు ఒక చోటలేకపోతే వారి జీవితాలు ఎంత చిందర వందరగా తయారవుతాయో, కుటుంబం ఎలా నైతికంగా పతనమవుతందో, క్రమ శిక్షణా రాహిత్యంతో ఎంత అశాంతిగా మారుతుందో ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఇవి నిజంగా శిలాక్షరాలు నేటి ఆధునిక జనారణ్యంలో ప్రేమలు, అభిమానాలు,ఆదరణలు మనిషి కనుమరుగైతే అవి కనుమరుగవుతాయి అనడానికి ఈ కవితే ఉదాహరణ. జీవితం……  ఓ పులిస్వారీ లో జీవన ప్రవాహంలో వాలుకి కొట్టుకు పోయి అపహాస్యపు ఛీత్కారాలకు గురికాకుండా ఏటికెదురీది నిలబడాలని జ్ఞానోదయం కలిగిస్తారు. మౌనమే నీ ఆయుధం లో విమర్శించే వారి కోరిక ప్రకారం నీవు దిగాలు పడకూడదని ధైర్యంగా ముందుకు నడవాలని అంటారు. అంతేగాక ‘‘నీవు ఎదుగుతున్నా వనేందుకే’’ వారే కదా నిలువెత్తు సాక్ష్యం. అని సగర్వంగా చెబుతారు. రాళ్ళు విరిసిన వారితోనే పూలు చల్లించుకోవాలని మౌనంగా చూస్తూ ఉంటే విమర్శించినవారే  వారికే సలాం కొట్టి గులామౌతారనే జీవిత సత్యం చెబుతారు.
‘కంఫర్ట్‌ జోన్‌ సంకెళ్ళు’ లో
ఎవరెస్టులపై ఎగురుతున్న పతాకాలు గమనించి

మూడడుగుల గుట్టపై…..
నీ విన్యాసం గుర్తించు
అని ఎదుగుదలను సోమరితనంతో ఆపవద్దని చెబుతారు. అత్యున్నత స్దాయిలో గౌరవంగా నలుగురి ముందు నడవాలని ఆకాంక్షిస్తారు కవి!
‘చిరునవ్వులతో బ్రతకాలి’ లో
మాడిపోయిన ఆముదం తాగే ముఖంతో
అయోమయంగా లేకుండా నవ్వుతూ బ్రతకాలని,
నవ్వడం ఒక యోగం అని నవ్వించడం భోగమని
నవ్వక పోవడం ఒక రోగం అనే జంధ్యాల గారి మాటలను గుర్తుచేస్తారు.
రూపాయిని కర్మయోగిగా భావిస్తూ అడుక్కునే వారితోనూ, అంబానీ లోను ఒకే బంధం ఉంటుందని అంటారు.ఇంకా ‘‘అమ్మా మాట్లాడమ్మా’’… ప్లీజ్‌ అనే కవితలో మార్కులు తక్కువచ్చాయని వేధించే తల్లిదండ్రుల వద్ద పువ్వుల్లాంటి పిల్లలు ఎంత వ్యధకు గురౌతారో కరుణ రసాత్మకంగా తెలియజేశారు. ‘‘ద్వంద్వ వైఖరి ధోరణులు’’లో ఏసుక్రీస్తు చెప్పిన ‘‘నీవలే నీ పొరుగువారిని ప్రేమించు’’అనే సూక్తి మనకు కనబడుతుంది.‘ఎవడు మానవుడు’ లో అంతిమ విజయం అందేవరకు విశ్రాంతి ఊసెత్తకుండా, అశ్రద్ధకు అణు మాత్రంచోటివ్వక తుదికంటూ పోరాటం కొనసాగించాలని చెప్తారు ఈ కవి. ఇక ‘గెలుపంటే’ కవితలో
‘‘నాకైతే గెలుపంటే
కు బుద్ది తో విమర్శకుడు విసిరినరాయి
నీ భవితకు పునాదిగా మార్చుకోవడం’’
ఎంత చక్కగా చెప్పారు ఉదయ్‌, ఇల్లా ఈ కవితలలో మనస్తత్వపు విశ్లేషణయే గాక ప్రతి కవితలో   ఓ పరిష్కారం సూచించడం అతని గొప్పతనం. ఓ తాత్వికత ఓ మానసిక పరిపక్వత ఈ కవిత్యంలో మనం చూస్తాం. కసిగా ఇష్టపడి ఏ రంగంలో నయినా, పైకి రావాలనేది ఈ కవి కవిత్యంలో ద్యోతకమౌతుంది అక్షరాలను అమృత జల్లులుగా చేసి అందరి మేధలపై కురిపిస్తే ప్రగతి పంచకళ్యాణి గుర్రమై పరుగుతీస్తుంది.అందుకే ఈ కవితా సంకలనాన్ని మనందరం తనివితీరా చదువుదాం! మహాత్ముని చేతిలో భగవద్గీతలా, మనో ధైర్యానికి మందులా మనముందుంచుకుందాం.!
ఇంత మంచి పుస్తకాన్ని  అందించిన శ్రీ.ఉదయకుమార్‌ గారిని అభినందిస్తూ………….

శుభాభినందనలతో………….

                                                          – బి.హెచ్‌.వి. రమాదేవి,ఎం.ఏ., ఎం.ఎ., ఎం.ఫిల్‌

                                                                           తెలుగు లెక్చరర్‌

                                                                            ఆదిత్య డిగ్రీ కళాశాల

చదవండి ! ఉదయ కుమార్ అలజంగి మరొక రచన :

Learning For Earning

విహంగ గ్లోబల్ మాగజైన్ లో….

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక సమీక్షలుPermalink

One Response to వ్యక్తిత్వ వికాసమే కవితకి రూపం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో