దేశం మనదే


దేశం మనదే మనదే
దోపిడీలకు,దౌర్జన్యాలకు,దుష్టత్వాలకు నిలయమై
దీనులపై దండయాత్ర చేస్తుంది

ఉగ్రవాదం అంటే ఊచకోతేనా?
నక్సలిజం అంటే నాటుబాంబేనా?
నేటి నడి బజారు దారుణాలు ఏమిటో?
నమ్మకాల మన  అమ్మదేశంలో
విలువలు వరసలు మారుతున్నాయి
విషయం చిన్నదైనా వింత ధోరణి ఎదురవుతంది
విష సంస్కృతి విలయ తాండవం చేస్తుంది
వందేమాతరం కాస్తా వంద ఏ మాతరం లా మారింది
విచారమే అడుగడుగునా ఎదురవుతుంది 

సమాజమా ఇది సమస్యల వలయమా?
స్వాతంత్ర్యం,స్వేచ్ఛ,సహనం అవధులు దాటి
సవాలుగా మారుతున్నాయి నవ సమాజానికి

రాజకీయమా ఇది రక్త కూపమా ఇది
రౌద్ర వీణయ మ్రోగిస్తుంది
రానీ లంచం రానీ అంటుంది

దయ,జాలి,కరుణ,ప్రేమ,దానం,ధర్మం
దాచేస్తావెందుకు మదిలో
దేశం మనదే ఓ నేస్తం

సాహసాల యువత
స్వేచ్ఛకు అవధులు పెట్టుకొని
స్వార్ధం విడిచి సమాజ శ్రేయస్సు కోసం
సాగితే శాంతం తాండవిస్తుంది
సమాజం పరవశిస్తుంది
సమయస్ఫూర్తితో తెలివితేటలే పెట్టుబడులుగా పెట్టిన రోజున
రమణీయ రాగాలు పలికే  రాజ్యం వస్తుంది
భారతావని ఒక బంగరు కుసుమమై వికసిస్తుంది
మమతల కోవెల మన దేశం
ధీర గాధల పుణ్య చరితల మన దేశం
మహనీయుల త్యాగఫలం మన దేశం
అమృత భారతావని మన దేశం
అదే అదే మన దేశం
భారతావని ముద్దు బిడ్డని అయ్యినందుకు నాకు చాలా గర్వం ……

ధనలక్ష్మి బూర్లగడ్డ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలు, , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

25 Responses to దేశం మనదే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో