కవయిత్రి మొల్ల పద్యాలలో సౌందర్య వర్ణన

మొల్ల రామాయణం నుండి ఒక అందమైన పద్యం.

శూర్పణఖ రావణాసురునితో సీత దేవి యొక్క  లోకొత్తర సౌందర్యాన్ని  వర్ణించిన ఘట్టం లోనిది ఈ పద్యం.

షట్పదంబులపైకి  సంపంగి  పువ్వుల
జలజాతముల పైకి జందమామ

గిసలయంబులపైకి వెస  గలకంఠముల్

       సింధురంబులపైకి సింగములను

దొండ పండుల పైకి  దొడ్డరాచిలుకల
నలరు తూడుల పైకి నంచపిండు
బండు వెన్నెల నిగ్గు పైకి   చకోరముల్
పవనంబు మీదికి పాపఱేని

మరుడు వైరంబు జేసిన మాడ్కి  – నలక

 నాసికా కరానన చరణ స్వనములు
వర పయోధర మధ్యోష్ఠ వచన బాహు
గమన హాసాక్షు లూర్పారు రమణి కమరె..

ఇది క్రమాలంకారం.  ఉపమేయాల్నీ, ఉపమానాల్నీ క్రమంగా తీసుకోవాలి.

తమలో తమకు పరస్పర శత్రుత్వం ఉన్న వస్తువుల్ని అదే క్రమంలో వీటికి ఉపమానాలుగా కూర్చింది కయిత్రి మొల్ల.

ముంగురులు – తుమ్మెదలు, ముక్కు – సంపెంగ ఇలా క్రమం చూడాలి.  వాటికి శత్రుత్వాన్ని మన్మథుడు కల్పించినట్టు –  అంది  (మరుడు వైరంబు చేసిన మాడ్కి).

ముంగురులు (అలకలు), ముక్కు (నాసిక), చేతులు (కర), ముఖం (ఆననము), పాదాలు (చరణ), కంఠధ్వని (స్వనము), గొప్పవైన వక్షోజాలు (వర పయోధర), నడుము (మధ్య), పెదవులు (ఓష్ఠ), మాటలు (వచన), చేతులు (బాహు), నడక (గమన), నవ్వు (హాస), కన్నులు (అక్షు), నిట్టూర్పులు, నూగారు (ఆరు) – వీటిని వర్ణించింది.    

తుమ్మెదలు సంపెంగ పువ్వుల మీద వాలవు. (దీనిమీద అధారపడే “నానాసూన వితాన వాసనల…” అనే పద్యం ఆవిర్భవించింది – వసుచరిత్ర.).

సీతాదేవి ముంగురులు తుమ్మెదల్లా (షట్పదాలు)  ఉంటే, ముక్కు సంపెంగ పువ్వులా ఉంది.  

చేతులు పద్మాల్లా ఉంటే, ముఖం చందమామలా ఉంది.  చంద్రోదయం అయ్యేసరికి జలజాతాలు ముకుళించుకుపోతాయిగా.  కనక వీటికి వైరం.  పాదాలు చిగురాకులు, కంఠధ్వని కోకిలను గుర్తుకు తెస్తుంది.  కలకంఠకంఠి. కోకిల చిగురాకుల్ని మేస్తుంది కనుక వైరం.

గజకుంభాల వంటి ఆమె పయోధరాలు సింధురాలు.  నడుము సింహం నడుములాగా సన్నగా ఉంటుంది.  గజ-సింహాల వైరం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కదా.

పెదవి దొండపండులా ఉంటుంది.  మాటలు చిలక పలుకుల్లా ఉంటాయి.  చిలకలు దొండపండుల్ని తింటాయి – కనుక వైరం.

బాహువులు తామరతూడుల్లాగా ఉంటాయి.  నడక హంస గమనం. హంసలు (అంచపిండు – హంసల సమూహం) తామర తూడుల్ని తింటాయిట. అందుకని వైరం.

సీతాదేవి నవ్వు పండువెన్నెల్లాగా ఉంటుంది. తెల్లగా చల్లగా  ఆహ్లాదకరంగా ఉంటుందని.  ఆమె చూపులు చకోరల్లా ఉంటాయి.  స్వచ్చమైన చూపుల్ని వెన్నెలపిట్టలతో పోలుస్తారు.  చకోరాలు వెన్నెలను త్రాగుతాయంటారు.  అంచేత వైరం.

ఆమె ఉచ్చ్వాస నిశ్వాసాలు పవనం.  నూగారు కృష్ణసర్పంలా (పాపఱేడు – నాగారాజు) ఉంది.  సర్పం వాయుభక్షణ చేస్తుంది కనక వైరం.

ఇలా పరస్పర శత్రుత్వం కలిగిన ఉపమానాలతో ఉపమేయ వస్తువుల్లోని సౌందర్యాతిశయాన్ని ధ్వనింపజేసింది మొల్ల.  *

 

రమణ బాలాంత్రపు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

   

పురుషుల కోసం ప్రత్యేకం, , , , , , , , , , , , , Permalink

2 Responses to కవయిత్రి మొల్ల పద్యాలలో సౌందర్య వర్ణన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో