కౌమార బాలికల ఆరోగ్యం

ట్రాఫికింగ్‌ జరిగే పద్ధతి

–    నిరుపేద తల్లిదండ్రులు తమ కూతుళ్ళను అమ్మేయడం, దత్తత పేరుతో ట్రాఫికింగ్‌ నేర ముఠాలు కొనడం.

–    అబద్ధపు పెళ్ళిళ్ళు చేసుకుని తరువాత వ్యభిచార గృహాలకు అమ్మేయడం.

–    మంచి వేతనాలు లభించే పనుల ప్రలోభంతో పట్టణాలకు, నగరాలకు, ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించి వ్యభిచార గృహాలకు అమ్మేయడం.

భారతదేశానికి నేపాల్‌, బంగ్లాదేశ్‌లకు మధ్య వున్న విశాలమైన సరిహద్దులగుండా ఆ దేశాల బాలికల్ని ట్రాఫికింగ్‌ చేయడం జరుగుతోంది. గ్రామాల్లోని పేద కుటుంబాలు, బాలికలతో పరిచయాల్ని నేర్పుగా పెంచుకుని, వారి నమ్మకాన్ని పొంది, వలవేసి, డబ్బిచ్చి కొనో, ప్రలోభపెట్టో బాలికల్ని తరలిస్తారు. ట్రాఫికర్స్‌, పింప్స్‌, పోలీసుల నెట్‌వర్క్‌ దీనిని సులభతరం చేస్తూంది. భారతదేశం నుండి గల్ఫ్‌ దేశాలకు, యూరప్‌ దేశాలకు, అమెరికాకు బాలికలు అక్రమంగా తరలించబడుతున్నారు.

ఈ నేరాల్ని అరికట్టవలసిన పోలీసులకు వ్యభిచార గృహాల యజమానులు లంచాలివ్వడం వల్ల వారు పట్టించుకోరు.

ట్రాఫికింగ్‌కి గురయిన బాలికల పరిస్థితి ఎలా ఉంటుంది?

–    రోజుల తరబడి గదిలో నిర్బంధించి, తిండి పెట్టకుండా మాడ్చి, వ్యభిచార వృత్తిలోకి దిగేందుకు ఒప్పించడానికి ప్రయత్నిస్తారు.

–    అంగీకరించకపోతే చావబాదుతారు, రకరకాల చిత్రహింసలు పెడతారు.

–    వ్యభిచారంలోకి దింపేముందు కొంతమంది బాలికలకు శిక్షణనిస్తారు. అదేపనిగా నీలి చిత్రాలను

చూపిస్తారు.

కష్టమర్లను ఎలా సంతోషపెట్టాలి అనే విషయంపై బోధన చేస్తారు. రోజుకు అనేకసార్లు మానభంగం చేసి

ప్రతిరోజు అనేకసార్లు సెక్స్‌లో పాల్గొనడాన్ని అలవాటు చేస్తారు.

బొంబాయిలోని వ్యభిచార గృహాల్లో సగటున ఒక్కొక్క బాలిక రోజుకు 6 గురు విటులకు లైంగిక సేవల్ని

అందిస్తే అందుకు ఒక్కొక్కరు 50 నుంచి 90 రూపాయలు చెల్లిస్తారు. ఈ పైకాన్ని వ్యభిచార గృహ

యజమానురాలు ముందుగానే విటులనుంచి తీసేసుకుంటుంది. బాలికలు సినిమాలకు, బట్టలకు, మేకప్‌

సామాగ్రికి, మందులకు, మామూలుగా వారికి పెట్టే పప్పు, అన్నానికి తోడు మరేదైనా అదనంగా

కొనుక్కుని తింటే ఆ తిండికి కనీసం నెలకు 100కు 5 రూ వడ్డీ చొప్పున అప్పు చేయాల్సిందే. దీనికితోడు

వ్యభిచార గృహాల యజమానులు బాలికను కొనడం కోసం ఇచ్చిన డబ్బు బాకీ తీరేదాకా, తీరినాక కూడా

ఆమెను నిర్బంధించే వుంచుతారు. అందుచేత బాలిక అప్పు ఊబిలో నానాటికీ కూరుకుపోవడమే తప్ప

బయటపడే మార్గం వుండదు. ఈలోపు ఆమెకు హెచ్‌.ఐ.వి., క్షయ లాంటి వ్యాధులు సోకుతాయి, లేక

పిల్లలు పుడతారు. బొంబాయి వ్యభిచార గృహాల్లో వున్న సుమారు లక్ష మంది పైగా స్త్రీలు, బాలికలలో 60

శాతం మందికి లైంగిక వ్యాధులు వున్నాయి.

నగరాలలోనూ, హైవే రోడ్ల పక్క ధాబాల్లోనూ నిర్వహించే వ్యభిచార కూపాల్లో కూరుకుపోయి హెచ్‌.ఐ.వి. ఇన్ఫెక్షన్‌కు గురయిన బాలికలు, స్త్రీలు ఒక్కొక్కరు రోజుకు 10-25 మంది పురుషులకు లైంగిక సేవల్ని అందిస్తున్నారు. అందులో కొంతమంది పురుషులకు వ్యాధి సోకవచ్చు. హెచ్‌..ఐ.వి. సోకిన బాలికలకు ఇంకా లైంగిక సేవల్ని అందించలేనంతగా ఆరోగ్యం పాడయితే, వారి పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుంది. కొన్ని హైవేల పక్కన పొలాల్లో జంతువులు సగం సగం తినగా మిగిలిన మృత కళేబరాలు ఈ ఘోర పరిస్థితికి నిదర్శనం.
ఒకవేళ ఆ జీవితాన్ని భరించలేక తప్పించుకు పారిపోతే వ్యభిచార గృహానికి సంబంధించిన ముఠాలు గాలించి పట్టుకుని మరిన్ని దారుణ హింసలకు గురిచేస్తారు. ఎలాగో తప్పించుకునో, ప్రభుత్వం లేక స్వచ్ఛంద సంస్థల చొరవ వల్ల విముక్తి పొందో స్వగ్రామం చేరిన బాలికలకు అక్కడ కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎదురయేది నిరాదరణ, అవమానం, హేళన. చిట్టచివరికి గత్యంతరం లేని పరిస్థితిలో మళ్ళీ ఆ వ్యభిచారం రొంపిలోకే దిగుతారు. మరీ చిన్న వయసులో ఇంటిని వదిలిన బాలికలు తమ స్వగ్రామం గురించి వివరాలు కూడా చెప్పలేని పరిస్థితి వుంటుంది.

ట్రాఫికింగ్‌ని నిరోధించడం :

 *      నిఘా బృందాల ఏర్పాటు – బాలికా సంఘాలు

 *      కమ్యూనిటీని ఈ అంశంపై చైతన్య పరచడం

 *      బాలికల అక్రమ రవాణాని ఎవరైనా గుర్తిస్తే ప్రభుత్వాధికారులకు రిపోర్టు చేయడానికి         ప్రోత్సహించడం.

 *      పకడ్బందీగా చట్టాలు అమలు.

పోలీసులు చేయవలసినవి :

 *      గ్రామాల్లోకి వచ్చిపోయే అపరిచితులపై నిఘా వుంచాలి.

*      హైవేలు, ధాబాలు, రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్ల వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న

వ్యక్తులు, బాలికలపై నిఘా వుంచాలి.

 *      అవసరమైతే అరెస్ట్‌ చేసి, విచారించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

కుటుంబాలు :

 * ఉద్యోగాలిపిస్తామని, పెళ్ళి సంబంధాలు కుదురుస్తామని, ఏదో రకంగా లాభాలు చేకూరుస్తామని వచ్చే వారి

పూర్వాపరాల్ని తెలుసుకోవాలి.

 * పిల్లల్ని సక్రమంగా సంరక్షించుకోవాలి. వారి ఆహారం, దుస్తులు, చదువు గురించి శ్రద్ధ వహించాలి. వారి

ఆలోచనల్ని,అభిప్రాయాల్ని తెలుసుకుని, వారి కోణంనుండి చూచి సబబైన వాటిని గౌరవించాలి.

 * కుటుంబాలు తమ బాలికల భద్రతపై శ్రద్ధ పెట్టి ట్రాఫికర్స్‌ బారిన పడకుండా కాపాడుకోవాలి.

 *     గ్రామంలోని వివాహాలన్నిటినీ రిజిస్టర్‌ చేసి, వధూవరుల ఫోటోలను జాగ్రత్త పెట్టాలి. వరుడి కరెక్ట్‌

అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌ మొదలైన వాటిని జాగ్రత్తగా సేకరించి, భద్రంగా ఉంచాలి.

*     ప్రతి ఒక్కరూ ఆడపిల్లల అమ్మకాన్ని ప్రతిఘటించాలి. అనుమానం కలిగినప్పుడు చైల్డ్‌లైన్‌,

హెల్ప్‌లైన్‌, పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారాన్ని అందించాలి.

 * బాలికలు జాగరూకతతో, చైతన్యంతో వ్యవహరించేలాగా శిక్షణనివ్వాలి.

కమ్యూనిటీ :

   *     గ్రామ పంచాయితీ నిఘా బృందాల్ని ఏర్పాటు చెయ్యాలి.

  *     గ్రామంలోకి వచ్చి వెళ్తున్న అపరిచిత వ్యక్తులు, వారి రాకకు కారణం, ఎంత తరచుగా వస్తున్నారు, ఏ ఇళ్ళకు వారు వెళ్తున్నారు లాంటి విషయాల్ని గమనించే బాధ్యతను స్వయంసహాయక బృందాల ప్రతినిధులకు అప్పగించవచ్చు.

 *     బయటివారితో, తెలియని వారితో జరుగుతున్న వివాహాల గురించి ఆరా తీసి వారు ట్రాఫికర్స్‌ కారని నిర్ధారించాలి.

  *     గ్రామంలోని బాలికలు, యువతుల కదలికల్ని జాగ్రత్తగా గమనించాలి.

   *     గ్రామంలో ప్రత్యేకంగా ఒక ఇంటికి తరచుగా వచ్చే అపరిచితులపై నిఘా ఉంచాలి.

కమ్యూనిటీని చైతన్య పరచడం :

  *     కరపత్రాలు, కళాజాతాలు, సదస్సులు, సభలు, సమావేశాల ద్వారా ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలి.

  *     ట్రాఫికింగ్‌, మానవ హక్కులు, లైంగిక వ్యాపార దోపిడి, బాలల హక్కులు, చట్టాలు,

ట్రాఫికింగ్‌ ఫలితంగా వేగంగా ప్రబలుతున్న హెచ్‌.ఐ.వి. /ఎయిడ్స్‌, తదితర పరిణామాల గురించి కమ్యూనిటీకి సమాచారాన్ని అందించాలి.

 *     ట్రాఫికింగ్‌ని నిరోధించే నైపుణ్యాలు, రిపోర్టు చేసే నైపుణ్యాలు, పోలీసు వ్యవస్థను ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉపయోగించుకోవడం మొదలైన వాటిపై అవగాహనను పెంపొందించుకోవాలి.

బాలికలకు శిక్షణ : 

  *     సామాజిక, జెండర్‌ అంశాలు

  *     బాలికల హక్కులు

 *     ట్రాఫికింగ్‌, లైంగిక వ్యాపార దోపిడి తీవ్రత, పరిణామాలు

  *     కమ్యూనిటీ స్థాయిలో సమస్యను పరిష్కరించుకునే నైపుణ్యాలు

 *    ట్రాఫికర్స్‌ నుండి, ట్రాఫికింగ్‌ నుండి ఆత్మ రక్షణ నైపుణ్యాలు

*     జీవన నైపుణ్యాలు

– డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gy)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో