నా జీవన యానంలో…

చిట్టి మరచెంబు

 మా అమ్మ పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఇత్తడి సామాను ఓ గది నిండా వుండేది .పెద్ద పెద్ద గాబులు,గంగాళాల నుంచి బుల్లి బుల్లి గ్లాసులు ,చెంబులు వరకూబోలెడన్ని  ఉండేవి . మా బడిలో పిల్లల్ని పిలుచుకొచ్చే అప్పలమ్మ రోజు ఉదయాన్నే పెద్దక్లాసుల కొకటి ,చిన్న క్లాసుల కొకటి రెండు కుండల్లో మంచి నీళ్ళు నింపి పెట్టేది . కాని ,అవుట్ బెల్( ఇంటర్వెల్ ) టైంకి ఆకుండలు ఖాళీ   అయిపోయేవి ,పిల్లలం దాహంతో మంచి నీళ్ళ కోసం చుట్టూ పక్కల ఇళ్ళ మీద పడేవాళ్ళం .
           
     మా  బడి చుట్టుపక్కల న్ని  బ్రాహ్మలు ,కోమట్ల ఇళ్ళే  ఉండేవి .బ్రాహ్మలు  అసలు నీళ్ళే లేవు పొమ్మనే వాళ్ళు .చెరువు నుంచి మోసి తెచ్చుకోవాలి మరి .దానికి తోడు మడులూ తడులూను .
కోమట్లు కొందరు నీళ్ళిస్తే పుణ్యమని వాళ్ళ పెరటి నూతి లోని ఉప్పు నీళ్ళు పోసేవాళ్ళు .జగ్గంపేట లో ఎక్కడ తవ్వినా ఉప్పు నీళ్ళే పడతాయిమరి .దాని కోసం రెండు గ్లాసులు ప్రత్యేకంగా పెట్టుకొనేవారు .అగ్రకులాల పిల్లల కోసం సొట్టలు పడిందే అయినా ఇత్తడి గ్లాసు ;నాలాంటి వెనుకబడిన కులాల పిల్లలకోసం సొట్టలు పడి  నల్లగా మురికి పట్టిన అల్యూమినియం గ్లాసు ,నీళ్ళు అడగ గానే ముందు కులం అడిగే వారు .ఇత్తడి గ్లాసు తో  తాగే పిల్లలు కొంచెం నీళ్ళతో తోలిచేస్తే చాలు ,మేం మాత్రం నీళ్ళు తాగేక మట్టితో గ్లాసు తోమి ,వాళ్ళు పోసే నీళ్ళతో కడగాలి .నేను గ్లాసు నిండా మట్టి మెత్తేసే దాన్ని కాని శుభ్రంగా కడగడం వచ్చేదికాదు .మా నాన్నమ్మ ,అమ్మ ఇంట్లో ఏ పని చెప్పేవారుకాదు .గ్లాసు శుభ్రంగా కడగలేక పోతున్నానని ఒకోసారి అవతలి వాళ్ళు విసుక్కొని ,దోసిలిపట్టమని పైకెత్తి పోసేవారు .నా గౌను మొత్తం తడిసి పోయేది .
           ఈ మాట ఇంట్లో చెప్తే మా అమ్మ నా కోసం సామాన్ల బల్లమీది నుంచి ఓ బుల్లి ఇత్తడి మరచెంబు తీసింది.చింతపండు  తో తళ తళా మెరిసేలా తోమింది .దానికి చక్కని స్క్రూమూత ,దాని కింద బుల్లి గ్లాసు వుంటాయి .ఆ మరచెంబు లో ఓ చెంబుడు నీళ్ళేమో పట్టేవి .
                      నేను ఎంత అర్భకంగా ఉండేదాన్నoటే పుస్తకాలసంచి (ఈ  రోజుల్లా  బండెడు పుస్తకాలూ ఉండేవి కావు .)తప్ప అదనంగా మరచెంబు మొయ్యలేక పోయేదాన్ని .అందుకని మా అమ్మ ,అప్పలమ్మకు పాలు,పెరుగు లాంటివి ఇచ్చి మంచి చేసుకొని మరచెంబు బాధ్యత తనకి అప్పగించింది .స్కూలుకి నీళ్ళతో తేవడం వరకే తన బాధ్యత .ఖాళీ మరచెంబుని తిరిగి ఇంటికి నేనే పట్టుకెళ్ళాలి .కాని ,తరచుగా మరచిపోయి ఇంటికోచ్చేసేదాన్ని ,మా నాన్నమ్మో,చెల్లో, తమ్ముడో వెళ్లి తెచ్చేవారు .ఆ రోజుల్లో కాబట్టి అది ఎక్కడ పెట్టింది అక్కడే వుండేది .  
           ఆ రోజుల్లో పిల్లలకు మెడబోసిగా ఉంచేవారుకాదు ,నాకూ మొదట్లో నల్లతాడుతో గుచ్చిన బంగారు ఆంజనేయ బిళ్ళ వుండేది .తర్వాత సన్నజాజుల నెక్లెస్ ,చెవులకు జూకాలు,జడ గంటలు వగైరాలు అలంకరించి బడికి పంపేవారు .ఎవరైనా తిసేసుకుంటారనే ఊహా మాకూ వుండేది కాదు ,పెద్దవాళ్ళకి వుండేది కాదు .
            ఇక పోతే ,ప్లాస్టిక్ కవర్లతోను ,సీసాల్తోను నీళ్ళు తాగే రోజులొస్తాయని అప్పటి వాళ్ళకి బహుశా ఊహలో కూడా తెలిదు .  సాధారణంగా కోమట్లు ,రాజులు ,రెడ్లు ,వెలమదొరల ఇళ్ళకి పెద్ద పెద్ద పెరడులు ఉండేవి .వాట్లల్లో ఉసిరి ,రేగు ,జామ లాంటి చెట్లు ఉండేవి .వాళ్ళందరి పిల్లలు మా స్కూల్లో చదువుతూండడం వలన ఆకాయలు కోసుకోడానికి రమ్మని పిలిచే వాళ్ళు .పొలోమని అందరం ఎండా కొండా చూసుకోకుండా స్కూలు విడిచి పెట్టేక వెళ్లిపోయేవళ్ళo .ఒక్కసారి మా దండు వెళ్లిందంటే పచ్చిపిందెలు కూడా మిగిలేవి కావు .నాకు చేతకాలేదు కాని మా గుంపులో అమ్మాయిలు చాలామంది చెట్లెక్కగలిగేవాళ్ళు .అప్పుడప్పుడు మరచెంబును బడి నుంచి మరచిపోకుండా పట్టుకెళ్తే ఆ చెట్ల కింద మరచిపోయేదాన్ని .ఆ మరచెంబు అలా ఎన్నిసార్లో పోయి మళ్లీదొరికింది .అది ఇప్పటికి నా దగ్గర వుంది .
 స్క్రూ మూత,గ్లాసు తీసి దాచిపెట్టి ,దాంట్లో ఫ్లవర్స్ పెట్టి  టి .వి మీదపెట్టేను .అలా దాన్ని చూస్తూ వుంటే చిన్నప్పటి జ్ఞాపకాలెన్నో చుట్టుముడుతూ వుంటాయి .
                నా పెళ్ళయ్యాక తన ఇత్తడి సామానులో నాకేం కావాలో తీసుకోమంది మా అమ్మ .నేను ముందుగా  చిట్టి మరచెంబు నే తీసుకొన్నాను .బుల్లి బుల్లి గ్లాసులు ,చిన్న కూజా బిందెలాంటివి  చాలా కొంచెం తీసుకున్నాను .అప్పుడు మా అమ్మ నా వంక జాలిగా చూస్తూ “నీకు చదువు తెలివి తప్ప మామూలు లోకానికి సంబంధించిన తెలివి లేదు ” అంది .
          బి .సి కులాల్లో ఇత్తడి మీద డబ్బును మదుపు చేసుకోవడం ఇప్పటికి ఉంది. పెళ్ళిళ్ళలో బంధువులు ఇత్తడి బిందెల్లాంటివి చదివిస్తారందుకే .పుత్తడంత విలువైనది కాకపోయినా ఇత్తడిని అమ్మితే ఎప్పటికైనా డబ్బులొస్తాయనే ఓ నమ్మకం.పుత్తడి కొనుక్కోవడం ఎవరికోగాని సాధ్యమయ్యేది కాదు ఆ రోజుల్లోనే .ఇప్పుడిక చెప్పనక్కర్లేదు బంగారం ధర ఎలా మండిపోతుందో !.
           ఆ రోజుల్లో ఇత్తడి సామాన్ల వాడకం ఎక్కువగానే ఉండేది.ఇంటికేవరైనా బంధువులోస్తే బరువైన ఇత్తడి గ్లాసుతో మంచినీళ్ళు ఇవ్వడం ,అడుగున సాసరుకి బదులుగా చిన్న ఇత్తడి గిన్నె ,దాంట్లో కొంత తేలికగా ఉండే గ్లాసులో కాఫీ ,టీలు ఇవ్వడం చేసేవారు .కంచు,తగరం గిన్నెల్లో ,కంచాల్లో (అగ్రకులాల్లో వెండి కంచాలు వాడినట్టు )అన్నం వడ్డించడం  కూడా గొప్పగా అనుకునేవారు .
             మా నాన్నతో వెళ్ళినప్పుడు చూసేదాన్ని – హోటల్స్ లో కూడా ఇత్తడి గిన్నెలు ,గ్లాసులు ఉండేవి .క్రమంగా స్టెయిన్ లెస్ స్టీలు వచ్చి ఇత్తడిని వెనక్కి నెట్టేసింది .*

– కె.వరలక్ష్మి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఆత్మ కథలు, వ్యాసాలు, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

6 Responses to నా జీవన యానంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో