స్త్రీ యాత్రికులు

             సైడామ్‌ నుండి సుసీ వాళ్ళు బయలుదేరిన ఒక నెలకి చార్లీ పుట్టిన రోజు పండుగ జరుపుకొన్నారు. వారు చేరుకొన్న గ్రామంలోని ముఖ్యమైన పెద్దల్ని విందుకి పిలిచి వారితో తమ సంతోషాన్ని పంచుకొన్నారు. ఆ రోజు ఛార్లెస్‌ కేరింతలతో వారి గుడారం ఆనంమందిరమైంది.

ఆ మరుసటి వారం అంతా సంతోషంగానే సాగిపోయింది. ‘లాసాకి తప్పకుండా చేరగలం, మనకి ఎలాంటి అవాంతరాలురావు’ అనుకొంటూ ఉన్న సమయంలో హఠాత్తుగా వారికి ఇబ్బందుల వరుస ఎదురౌతుంది. మొదటగా ఇద్దరు సేవకులు పారిపోతారు. తరవాత ఎదురైన చిన్న తుఫాన్‌లో ఐదుగుర్రాలు దొంగిలించబడ్డాయి. ఈ కష్టాలకి తోడు అన్నట్లుగా ఛార్లెస్‌కిమెడమీద ఒక నరం ఉబ్బింది.
ఆగస్టు చివరికల్లా కనుమల్ని చాలామటుకి దటారు. దాంతో వారు లాసాకి 200 మైళ్ళ దూరంవరకూ చేరుకోగలిగారు. వారి బాధలు ఎలా ఉన్నా, గమ్యం దగ్గిరగా వస్తుండేసరికి సంతోషంగానే గడుపుతుంటారు. ఆదారి పొడుగుతా వచ్చే రకరకాల పూలు కోసుకొంటూ, ఛార్లెస్‌కి కథలు చెబుతూ, వాడి కేరింతల్లో ఆనందిస్తూ యాత్ర సాగించారు.
ఈసారి సుసీ దంపతులు మరొక విషాదంలోకి వెళ్ళాల్సి వచ్చింది. బుజ్జి ఛార్లెస్‌ ఒకరోజున ఉదయం నిద్రలేవలేదు. అలా అపస్మారకంగానే ఉండపోయాడు. విపరీతమైన చలివల్లనో, మరి ఎందుకో తెలియలేదు. వెంటనే బట్టల్ని వదులుచేసి వొళ్ళంతా మర్దనచేశారుతల్లితండ్రులు. సుసీ ఐతే హైపోడెర్మిక్‌ సిరంజి సిద్ధంచేసింది. నోట్లో నోరుపెట్టి కృత్రిమంగా ప్రాణవాయువు కూడా ఊదారు. అయినా బాబులో ఎలాంటి చలనం లేదు. సుసీకి కంగారుపుట్టింది. దైవాన్ని ప్రార్ధించారు. భయంతో పెద్దగా ఏడ్చారు. ఏమి జరుగుతుందో తెలియకుండా పోయింది. ఎంతచేసినా వారిబిడ్డ వారికి దక్కలేదు.
ఏదో తెలియని జబ్బు ఆ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. వారి బాధని ఎవరితో చెప్పుకుంటారు? వారు ఎన్నో కష్టాలు పడుతున్నా బాబుని చూస్తూ ఆ బాధల్నిమరిచేవారు. వారి కష్టాల్ని కొంచెమన్నా తగ్గించగలిగింది ఆ చిన్నారి నవ్వులే. పాపం! సుసీ దంపతుల సంతోషం అంతా ఆ మంచు దిబ్బల్లో కలిసిపోయింది. టిబెట్‌ వారి దెయ్యాలు, భూతాలు కలిసి చేసిన కుట్ర ఇది అనుకొన్నారు.   

             ఆ చిన్నారి ఛార్లీ పుట్టి పదమూడు నెలలా ఇరవైరెండు రోజులు మాత్రమే. అయిందేదో అయింది. కానీ ఈ విషాదం గురించి స్థానికులకి తెలియజేయటం వారికి ఇష్టంలేదు. ఎందుకంటే స్థానికుల సాంప్రదాయం ప్రకారం శవాన్ని ముక్కలుగా నరికి పకక్షులకి ఆహారంగా వేస్తారు. అది భరించలేని దృశ్యం. అందుకని త్వరత్వరగా తమ నమ్మకమైన సేవకుల సహాయంతో ఛార్లీని గుడారంలోకి తీసుకెళ్ళి ఒక మందులపెట్టెను ఖాళీచేసి దానిలో మెత్తని గుడ్డలువేసి ఛార్లీని పడుకోబెట్టి, కొండల పక్కకి తీసుకెళ్ళి అక్కడ ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్తగా పూడ్చివేస్తారు. నక్కలు గోతిమీదకి రాకుండా, దానిమీదకి పెద్ద బండను దొర్లిస్తారు. అక్కడ శవాన్ని పాతిపెట్టి నట్లుగా ఎలాంటి జాడలులేకుండా జాగ్రత్తలు తీసుకొంటారు. లాసా యాత్రకి బయలుదేరిన అతి తక్కువ వయస్సు కలవాడిగా చరిత్రలోకి చేరిపోయాడు ఛార్లీ.

ఇలాంటి విషాదకరమైన పరిస్థితుల్లో సుసీకి, రీన్‌హార్ట్‌కి తోడుగా నిలిచిన సేవకుడు రహీమ్‌ ఎంతో విశ్వాసంతో వారి ప్రతి బాధలోనూ పాలుపంచుకొన్నాడు. లిటిల్‌ ఛార్లీకి సమాధి జరిగింది ఈ రహీమ్‌ చేతుల మీదుగానే. ఆ రాత్రికి పెద్ద వర్షం వచ్చి సమాధి పరిసరాల్ని శుభ్రం చేయ టంతో అక్కడ ఎలాంటి ఆచూకీ లేకుండాపోయింది. సుసీ దంపతులు ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచారు.
తెల్లవారగానే మరల అందరూ బయలుదేరారు. బాబులేకుండా బయలుదేరటం అంటే సుసీకి కొండంత వెలితి కనిపించింది, కానీ తప్పదు. మరికొన్ని రోజులు ప్రయాణించాక వారికి టిబెట్‌ సిపాయిల గుడారాలు ఎదురయ్యాయి. వాటిని జాగ్రత్తగా తప్పించుకొని ఇంకా ముందుకి వెళ్ళారు. కానీ అక్కడ వేరే ఆఫీసరు వారిని ఆపేస్తాడు. వారి పెద్ద ఆఫీసరు (పాంబో) వచ్చి ‘మీరు ఏదారిన ఇక్కడికి వచ్చారో అదేదారిన వెనక్కి వెళ్ళటం మంచిది’ అని చాలా గౌరవంగా చెబుతాడ్ష్ము క్రితంలో అన్నీ టేలర్‌కి చెప్పినట్లుగా.

‘ఇంతకష్టపడి ఇక్కడివరకూ వచ్చింది తిరిగి వెళ్ళటానికి కాదు’ అనుకొని సుసీవారు ‘మేము లాసా జోలికి వెళ్ళం. సరిహద్దు ప్రాంతాల్లో మత ప్రచారం చేసుకుంటాం’ అని ఆఫీసర్లని మెప్పించటానికి ప్రయత్నం చేస్తారు. క్రిష్టియన్‌ మతానికి టిబెట్‌వారికీ పడదని, అలాంటివారిని క్రితంలో కూడా టిబెట్‌ వారు వెనక్కి పంపిన విషయం సుసీకి తెలియదు.
‘పరిసరాల్లోని ప్రజలకి వైద్యం చేస్తాం, చిన్న ఆసుపత్రి తెరుస్తాం మాకు కాస్తనీడనివ్వండి’ అంటూ వారిని బ్రతిమలాడుకొంటారు. టిబెట్‌ సిపాయిలు కొంచెం ఆలోచనలో పడి ‘సరే రెండురోజులు ఇక్కడే ఉండండి’ అనటంతో సుసీవాళ్ళకి మరలా ఆశలుపుడతాయి. కానీ మూడవ రోజున ఆ ఆఫీసర్లు మరలా పాతపద్ధతికే వచ్చారు. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెనక్కి వెళ్ళాలి’ అనగానే స్వప్నభంగం అయినట్లుగా బాధపడ్డారు డాక్టర్‌ సుసీ రీన్‌హార్ట్‌ దంపతులు.
               వారి ఆశలు అడియాసలైపోగా, తూర్పు దిక్కుగా వెనక్కితిరిగి చైనాలోకి వెళ్ళటానికి నిశ్చయించుకోక తప్పలేదు. అయితే టిబెట్‌ ఆఫీసర్లు సుసీవారికి కొత్త గుర్రాలు, వారి సేవకులకి ఆహారం, ఇతర ఏర్పాట్లు చేసి ‘తాషిగోంఫా’ వరకూ తోడుగా వచ్చేందుకు సిపాయిల్ని కూడా ఇచ్చి పంపుతారు.
వెనక్కి తిరిగి వెళ్ళటం ఇష్టంలేకపోయినా, ఇది తమ మంచికే అనుకొన్నారు. తాషిగోంఫాకి వెళ్ళిన తరవాత అక్కడ కొంతకాలం ఉండి ఆ మత గురువులతో స్నేహంచేసుకొని, కొంతకాలం పాటు రోగులకి మందులు ఇచ్చి, క్రితంలో కుంబుం మోనాష్టరీలో ఉన్నట్లుగా అక్కడే ఉండి, మరో అవకాశం చూసుకుని తమ లాసా యాత్రని కొనసాగించవచ్చు అనే ఆశాభావంతోనే వెనక్కి తిరుగుతారు.

టిబెట్‌ సిపాయిలు ఎలాగూ తాషిగోంఫా వరకూ తోడుగా వస్తారు కాబట్టి, ఇక్కడివరకూ సుసీ దంపతులకి తోడుగా వచ్చిన వారి ముఖ్య సేవకుడు రహీమ్‌ని అతని సొంత ఊరు లఢాక్‌కి పంపే ఏర్పాట్లు చేశారు. అలాగే ఇతర సేవకులకి కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. రహీంకి అయితే దారిలో రక్షణ కోసం ఒక తుపాకీ, గుర్రం, తాను మోయగలిగినంత ఆహారం ఇచ్చి, అతనికి తోడుగా కొంతదూరం వరకూ వెళ్ళి, ప్రార్థనచేసి, వీడ్కోలు చెబుతారు కొండంత దిగులుతో. అతడు గుర్రం మీద వెళ్ళిపోతూ ఉంటే సుసీకి ఎంతో బాధవేసింది.
ఇక డాక్టర్‌ సుసీ, రీన్‌హార్ట్‌, టిబెట్‌ సిపాయిలు, కొంతమంది పనివాళ్ళు అందరూ కలిసి తాషిగోంఫా వెళ్ళేదారికి చేరుకొంటారు. ఈ దారి అంతా టీ వర్తకుల సామాన్లు మోసే బళ్ళతో నిండిపోతుంది. ఒకరోజున సామానులు మోసుకుపోతున్న రెండు వేల జడలబర్రెల బిడారుని చూసి చాలా సంతోషపడతారు.
దారిలో ముందుకి వెళ్ళేకొద్దీ మంచు తుఫానులు మొదలయ్యాయి. దానికితోడు వర్షాలు, పక్క మనిషి కనిపించనంత మందాన పొగమంచు  పడేది. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ కూడా దారిలో వచ్చే గ్రామాల్లో సువార్త కాగితాలని పంచి పెడుతూనే ఉన్నారు. వారి సేవాగుణానికి అందరూ మెచ్చుకునేవారు.

‘మీరు వెళ్ళే దారిలో దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్త’ అని చాలా మంది చెబుతూనే ఉంటారు. అయినా వారికి రక్షణగా సిపాయిలు ఉన్నారు కాబట్టి ప్రమాదాలు ఉంటాయని ఊహించలేదు. కానీ ఆ దొంగలు మామూలు వాళ్ళు కాదనీ, యాభై, అరవై మంది గుంపులుగా వచ్చి మీదపడి అంతా దోచుకుపోతారని వారికి తెలియదు. ‘మనల్ని లాసా వెళ్ళకుండా ఆపేశారు’ అనే కోపంతో ‘ఇంతకంటే మనం కోల్పోయేది ఏమిటి?’ అని తెగించి ముందుకుపోతూనే ఉన్నారు. త్వరగా తాషీగోంఫా చేరుకుంటే అక్కడనుండి తమ ‘కొత్త ప్రణాళికలు’ సిద్ధం చేసుకోవచ్చు అనుకొన్నారు.
1898 వ సం|| సెప్టెంబరు పదిహేనవ తేదీన సుసీ దంపతులు వారి నాలుగవ పెళ్ళి సంవత్సరాది జరుపుకొన్నారు. ఆ ఒక్క రోజుకి దొంగల భయం మర్చిపోయి హాయిగా తమతో వచ్చిన టిబెట్‌ సిపాయిలతోనూ, సేవకులతోనూ, తమ సంతోషాన్ని పంచుకొని కొన్ని గంటలసేపు తమ సాహసయాత్ర గురించి చాలా విషయాలు మాట్లాడుకొన్నారు. తాము ఎలా బయలుదేరిందీ, ఈ నాలుగు సంవత్సరాల్లో ఎన్ని కష్టాలుపడిందీ అన్నీ సింహావలోకనం చేసుకొంటారు.
ఆ దారిలో మరో రెండువారాలు ప్రయాణించిన తరువాత తాషీ గోంఫా పరిసరాలకి చేరుకొంటారు, కానీ గోంఫా ఏ కొండపైన ఉందో సరిగ్గా తెలియటంలేదు. ఎంత వెదికినా కనిపించదు. గ్రామాల్లో అడగ్గా, అది మెకాంగ్‌ నది ఒడ్డునే పోతే కనిపిస్తుంది అని చెబుతారు. ఆ మరసటి ఉదయానికల్లా గోంఫా చేరుకోగలం అని ఆలోచించి ఆ రాత్రికి అందరూ కలిసి నది ఒడ్డున గుడారాలు వేసుకొంటారు.

– ప్రొ.ఆదినారాయణ

(ఇంకావుంది)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

యాత్రా సాహిత్యం, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో