కౌమార బాలికల ఆరోగ్యం

13. బాల్య వివాహాలు

                   యూనిసెఫ్‌ 18 సంవత్సరాల వయసు లోపు బాలికల వివాహాన్ని బాల్యవివాహంగా నిర్వచించింది. బాల్యవివాహం మానవ హక్కుల ఉల్లంఘన. చంద్రయానం చేస్తున్న కాలంలో బాల్య వివాహాలు కొనసాగడం మానవజాతికి కళంకం. భారతదేశంలో బాల్యవివాహాల శాతం తగ్గినప్పటికీ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగానే వుంది. భారతదేశమంతటా, ముఖ్యంగా మధ్య, తూర్పు రాష్ట్రాల్లోని పెద్దగా చదువుకోని పేద బాలికలు బాల్యవివాహాల్ని చేసుకుంటున్నారు.
భారతదేశం చట్టపరంగా వివాహ వయసును 1978లో 18 సంవత్సరాలుగా నిర్వచించింది. 2.6 శాతం బాలికలు 13 సంవత్సరాలు నిండకుండానే, 22.6 శాతం మంది 16 సంవత్సరాలలోపు, 44.5 శాతం మంది 16-17 సంవత్సరాల వయసుకు వివాహం చేసుకుంటున్నారని 2005-2006 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా జరిపిన ఒక అధ్యయనం తెలియజేసింది.
పూర్వం జాతులు, కుటుంబాల మధ్య భద్రమైన సామాజిక, ఆర్ధిక, రాజకీయ సంబంధాల్ని పెంపొందించుకోవడానకి బాల్యవివాహాల్ని ఉపయోగించుకునేవారు.
ప్రస్తుతం పేదరికం, పోషకాహార లోపం, తక్కువ విద్యావకాశాలు, ఆర్ధిక అవకాశాల వలన, కన్యలపై జరగగల లైంగిక హింసనుండి రక్షణకోసం బాల్యవివాహాలు జరుగుతున్నాయి.
సంప్రదాయాలు, సాంస్కృతిక ఆచారాలు బాల్యవివాహాల దురాచారాన్ని పటిష్టం చేస్తున్నాయి. కొన్ని పాంతాల్లో, కొన్ని కులాల్లో బాల్యవివాహాలు ఒక సంప్రదాయంగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.
ఆర్ధిక రంగంలో, మహిళల అభివృద్ధిలో వచ్చిన ప్రగతిగాని, బాల్య వివాహాల్ని అరికట్టడానికి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వపరంగా చేస్తున్న కృషిగాని బాల్యవివాహాల్ని అరికట్టలేక పోతున్నాయి.
దేశ ఆర్ధిక ప్రగతి ఫలాలు గ్రామీణ నిరుపేదలకు చేరకపోవడం వలన ఇంకా ఆ వర్గాలలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

బాల్యవివాహాలు – పరిణామాలు :

 *       జనాభాలో గణనీయ సంఖ్యలో వున్న బాలికలు చదువు, నైపుణ్యాల పెంపుదల అవకాశాల్ని కోల్పోయిన కారణంచేత దేశ అభివృద్ధి కుంటుపడుతోంది.

 *       బాలికలు ఆరోగ్య సేవల్ని పొందలేక పోతున్నారు, విద్య, ఆర్ధిక, సామాజిక అవకాశాల్ని పొందలేక పోతున్నారు.

 *       బాల్యవివాహాలు భారతీయ స్త్రీలకు తీవ్రమైన సామాజిక, ఆరోగ్యపరమైన నష్టాల్ని కలగజేస్తున్నాయి. జనాభా సమస్యను తీవ్రం చేస్తున్నాయి.

 *       బాల్యవివాహాల వల్ల బాలికలు ఈ క్రింది ప్రమాదాలకు గురవుతున్నారు.
        – త్వరగా లైంగిక జీవితాన్ని ప్రారంభించడం – గర్భం, హెచ్‌.ఐ.వి. / ఎయిడ్స్‌,
        –  జెండర్‌ ఆధారిత హింస.

 *       చిన్న వయసులోనే గర్భం, ప్రసవం, వాటి సంబంధిత తీవ్ర అనారోగ్యాలు, మాతా శిశు మరణాలు ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి. 48.4 శాతం మందికి మొదటి బిడ్డ 18 ఏళ్ళలోపు పుడుతూంది.

 *       సంతాన నిరోధక పద్ధతుల్ని ఉపయోగించడం మీద, సంతానోత్పత్తి మీద, బాలికలకు కంట్రోలు లేకపోవడం వలన కోరుకోని గర్భాలు, అవాంఛిత గర్భస్రావాల సంఖ్య ఎక్కువగా వుటూంది. సుమారు 50శాతం మంది. ఒక్క గర్భస్రావాన్నయినా చేయించు కుంటున్నారు, చిన్న వయసులో స్టెరిలైజేషన్‌ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు.

 *       చిన్న వయసులోనే స్టెరిలైజేషన్‌ చేయించుకున్నవారు, గర్భ నిరోధక పద్ధతిని ఉపయోగించే అవసరం వుండదు. ముఖ్యంగా కాండమ్‌ని ఉపయోగించకపోవడం వలన సుఖవ్యాధులు, హెచ్‌.ఐ.వి ఇన్ఫెక్షన్‌ ప్రమాదం ఎక్కువ వుంటుంది.

 *       18 సంవత్సరాల వయసులోపు తల్లులకు పుట్టిన బిడ్డలకు పోషకాహారలోపం ఎక్కువగా వుంటుంది. వారి బరువు తక్కువగా ఉంటుంది. వారి ఎదుగుదల మందకొడిగా వుంటుంది. కుటుంబ వనరుల మీద కంట్రోలు లేని ఈ బాలికలకు తమ బిడ్డలకు మంచి పోషకాహారాన్ని పెట్టగల ఆర్ధిక శక్తిగాని, అవగాహన గాని ఉండదు.

బాల్యవివాహాల్ని నిరోధించడం ఎలా?

బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద వర్గాల్ని, సామాజికంగా తక్కువ స్థాయిలో వున్నవారికి చైతన్యపరచాలి.
చట్టాల్ని పటిష్టంగా అమలు చెయ్యాలి.
బాలికల విద్య బాల్యవివాహాల్ని అరికట్టడానికి సమర్ధమైన సాధనం. విద్య అంటే కేవలం చదవడం, రాయడం, లెక్కలు చెయ్యడం కాదు. బాలికలకు పునరుత్పత్తి, గర్భ నిరోధక పద్ధతులు, జీవన నైపుణ్యాలు, మొదలైనవి నేర్పడం ద్వారా బాలికల జీవితాల్ని, వారి భవిష్యత్తును సానుకూలంగా ప్రభావితం చెయ్యొచ్చునని అనుభవాలు తెలుపుతున్నాయి. అందుచేత విద్యావకాశాల్ని పెంచడం మీద దృష్టి పెట్టాలి. ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసిన బాలికలు ఆలస్యంగా పెళ్ళి చేసుకుంటున్నారని, తక్కువ మంది పిల్లల్ని కంటున్నారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

14. బాలికల అపహరణ/అక్రమ తరలింపు/అమ్మకం (ట్రాఫికింగ్‌)

మహిళల బాలికల అపహరణ/అక్రమ తరలింపు/అమ్మకం అతి దారుణమైన మానవ హక్కుల ఉల్లంఘన. మానవ హక్కులు, మౌలిక స్వాతంత్య్రాల గురించి ఘోషిస్తున్న మానవ సమాజపు ముఖంపై వున్న అతి పెద్ద కళంకం. గ్లోబల్‌ ట్రాఫికింగ్‌ పరిశ్రమ ఈ ”మానవ దుఃఖం” మీద సంపాదించే వార్షిక ఆదాయం 8 బిలియన్ల అమెరికన్‌ డాలర్లు అని International organisation for Migration అంచనా వేసింది.

ట్రాఫికింగ్‌ అంటే ఏమిటి ?

1994లో జరిగిన ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ ‘రహస్యంగా, చట్ట విరుద్ధంగా, స్త్రీలను, బాలికలను లైంగిక దోపిడికి అనుకూలమైన పరిస్థితుల్లోని బలవంతంగా నెట్టే అంతిమ లక్ష్యంతో తరలించడాన్ని’ ట్రాఫికింగ్‌గా నిర్వచించింది. కాని ప్రస్తుతం దీని అర్థం మరింత విస్తృతమయింది. అపహరణ, అపరిచిత ప్రదేశాలకు ఎక్కువ వేతనాలతో కూడిన పని అవకాశాల ఆకర్షణతో తరలించడం కూడా ట్రాఫికింగ్‌లో భాగమయింది.

సమస్య తీవ్రత :

ఆందోళన కలిగించే అంశమేమిటంటే అనేక అంతర్జాతీయ, జాతీయ చట్టాల్ని ట్రాఫికింగ్‌ని నివారించే, నియంత్రించే లక్ష్యంతో చేసినప్పటికీ నానాటికి ఈ బెడద మరింత ఎక్కువవడం. భారతదేశంలో మహిళలు, కౌమార బాలికల ట్రాఫికింగ్‌ ఎక్కువ భాగం వ్యభిచారం నిమిత్తమే జరుగుతూంది. మరింత ఆందోళన కలిగించే విషయమేమిటంటే ఒకప్పుడు ట్రాఫికింగ్‌కి గురయే బాలికల సగటు వయసు 12-16 సంవత్సరాలు వుండగా, 1990లో ఈ వయసు 10-14 సంవత్సరాలవడం. భారతదేశం మానవ రవాణాకు అతి పెద్ద ఎగుమతి, దిగుమతి, తాత్కాలిక స్థావరంగా ఉంది.
భారతదేశపు వ్యభిచార గృహాల్లో 1,60,000 మంది నేపాలీ స్త్రీలు వున్నారు. ఇందులో 35 శాతంమంది వివాహం, లేదా, మంచి ఉద్యోగం పేరుతో మోసగించి తీసుకురాబడిన వారే. సగటున 5000- 7000 మంది నేపాలీ బాలికలు ఏటా భారతదేశానికి తరలింప బడుతున్నారు.

కారణాలు :

1.    మహిళల నిరక్షరాస్యత, అజ్ఞానం 

 2. స్త్రీ ముఖంతో వున్న పేదరికం

3.    గ్లోబలైజేషన్‌ 

4.    ట్రాఫికింగ్‌ సిండికేట్లు ఒక భారీ పరిశ్రమగా విస్తరించడం

5.    మైనర్‌ బాలికలు, స్త్రీల అక్రమ రవాణా, వలసలు, అప్పులు, ఈ అంశాల్ని పెద్దగా పట్టించుకోని లేక సహించే సమాజ

సంస్కృతి కారణంగా కూడా ట్రాఫికింగ్‌ జరుగుతోంది.

6. ఆర్ధికంగా, సామాజికంగా క్రింది స్థాయిలో వున్న వారికీ ప్రమాదం మరింత ఎక్కువ వుంది.

 

 – డా. ఆలూరి విజయ లక్ష్మి,M.S.(Ob./Gy)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Uncategorized, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో