సుకన్య

(10వ భాగం)

– డా.కనుపర్తి విజయ బక్ష్

           ”ఆ బాగున్నారమ్మ. నేనే నాన్నతో అన్ని మాట్లాడాను. నన్ను ఒక్కసారి బాబా ఆశ్రమానికి వెళ్ళి రమ్మన్నారు.

వెళ్ళిరానా” ”వెళ్ళమ్మ ఆశ్రమానికి వెళ్ళటానికి అనుమతి ఎందుకు?” తల్లి సంతోషంగా అంది. సుకన్య కారులో

కూర్చుని డ్రైవర్‌తో ఆశ్రమానికి పోనియ్యంది. కారుపరిగెడుతున్నంత వేగంగా ఆలోచనలు పరుగెత్తుతున్నాయి.

చందు తనని ‘ మోసగత్తె ‘ అనుకుంటాడేమో! తన పిరికితనానికి ఎద్దెవా చేస్తాడేమో! నమ్మించి ఇప్పుడు ఇట్లా

మోసం చేసానని అంటాడేమో!

ఊహుఁ తన చందు తనని అట్లా అనడు. అసలు తనని అపార్ధం చేసుకోడు. తనకంటే తన గురించి బాగా

ఆలోచించగల వివేకి అతను. అయినా ఎట్లా చెప్పాలి ఈ విషయాన్ని!

తాను పెండ్లి వద్దంది. తల్లిదండ్రులు ఇది కొన్నాళ్ళవరకే, అని అనుకొంటున్నా రేమో! తనకు జీవితంలో ఇక పెండ్లి

అన్న మాట తల పెట్టవద్దని, ఇది తన దృఢ నిర్ణయమని వారు అనుకోవటం లేదు. పెండ్లయినా లేకుండా తాను

సన్యాసినిలా జీవితం గడపటం వారికి ఇష్టమే. కాని చందుని మాత్రం చేసుకోకూడదు. అమ్మా! ఆశ్రమం వచ్చింది.

దిగండి అంటూ డోర్‌ తీసాడు డ్రైవర్‌.

సుకన్య గబగబా బాబా కుటీరం వైపు వెళ్తుంది. ఈలోగా పిల్లలంత ఏమిటో రణగొణ ధ్వనిగా అరుస్తున్నారు. స్కూల్‌

వైపునుంచి ఒకపిల్లాడు మెట్ల మీదనుంచి పడిపోయాడు. ముక్కులో నుంచి, నోట్లో నుంచి రక్తం వస్తుంది. సృహ

తప్పిపోయాడు. టీచర్లు పిల్లలు అంతా గుమిగుడారు. ఆశ్రమానికి సంబంధించిన వ్యాన్‌కి రిపేరట. ఎట్లా వాడిని

ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి! పోని డాక్టర్‌ని పిలిస్తేనో! సుకన్య గబగబా వెళ్ళి ఆ పిల్లవాడ్ని తన భుజం మీదకు

ఎత్తుకుంది… కారువైపు వేగంగా నడిచింది. మిగతా వారు ఆమెను అనుసరించారు. ఆ పిల్లాడ్ని తాను ఒళ్ళో

వేసుకుంది. కారులో మరో ముగ్గురు టిచర్లు ఎక్కారు. ”ఆసుపత్రికి కారు పోనియ్యి. వీలయినంత వేగంగా

పోనియ్యి” అంది మరో గంటలో చిన్న ట్రిట్‌మెంట్‌తో పిల్లాడు లేచి చక్కగా నడిచి వచ్చాడు. సుకన్య టీిచర్లు

ఆశ్రమానికి చేరారు. ఈలోగా  యీ విషయం అంతా బాబా దాక  వెళ్ళింది. ఆయన ఆమ్మాయి రాగానే తన వద్దకు

తీసుకురావాలని ఆదేశించాడు. ”మిమ్మల్ని బాబాగారు రమ్మన్నారు.” రామేశం కారుదిగిన సుకన్యతో అంటూ

ఆశ్రమం వైపు దారి తీసాడు. అతని వెంటనే లోపలకు నడచింది సుకన్య. బాబా ప్రశాంతంగా పీఠం మీద ఆసీనుడై

ఉన్నాడు. లోపలకు ప్రవేశిస్తూను ”నమస్కారం” అన్నది సుకన్య. ”రామ్మా! కూర్చో” సాదరంగా ఆహ్వానించాడు

బాబా. అయితే సుకన్య వక్ష  స్థలం వైపు చూసాడు నిశితంగా. అప్పుడు గాని సుకన్య చూసుకోలేదు. తన తెల్లటి

చీర మీద పిల్లాడి నోట్లోనుండి కారిన రక్తం అంటుకుపోయి ఉంది.

 “నీవు వేరేపని మీద వచ్చావు కదా! పిల్లాడి విషయంలో అంత శ్రద్ధ ఎందుకు కనబరిచావమ్మా!  ” బాబా

ప్రశ్నించాడు.

“ఎవరనేది, ఎందుకు వచ్చాననేది నేను ఆ క్షణంలో  ఆలోచించలేదు. ప్రమాదంలో వున్న పిల్లవాణ్ణి

ఆదుకుందామన్న  ఆలోచన తప్ప మరొకటి ఏది గుర్తుకు రాలేదు.”

”  నీలాటి సేవా తత్పరులే ఇట్లాంటి ఆశ్రమానికి కావలిసింది.ఇంతకీ నీవు ఎందుకు వచ్చావమ్మా  !”

“నాన్నకు గుండెనొప్పి వచ్చింది.ఇప్పుడు నిమ్మళించినది .మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నారు

అందుకని …”

“అంతే కదమ్మా !నా భక్తులకు నా దీవెనలు ఎప్పుడూ వుంటాయి.ఆయన ఏమీ ఆందోళన పడాల్సిన వసరం

ఏమీ లేదు అన్నాడు బాబా.సుకన్య మాట్లాడకుండా కూర్చుంది.

“నీవు ఇష్టం వచ్చినప్పుడల్లా ఇక్కడికి రావచ్చు.నీకు సెలవులే కాబట్టి మా ఆశ్రమం లో గడపొచ్చు”అన్నాడు

బాబా.

సుకన్య తల ఊపింది.లేచి నిలబడింది “సెలవు” అంటూ . 

బాబాకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇక్కడికొచ్చే ప్రతి వారూ  తనకి వంగి వంగి దండాలు పెడతారు.తనేం చెప్పినా

మహా ప్రసాదం అని భక్తితో స్వీకరిస్తారు.అట్లాంటిది ఈ పిల్ల ఎంత ధీమాగా ప్రవర్తిస్తున్నది?సుకన్య వెళ్ళిన వైపే

చూస్తూ అనుకున్నాడు.మరో వారం రోజుల్లో వెంకయ్య లేచి తిరుగుతున్నాడు మామూలుగా . 

సుకన్య అందరితో మామూలుగా మాట్లాడుతున్నది కానీ ఏదో పోగొట్టుకున్నట్లు ,ఏదో శూన్యంలోకి చూస్తూ

వుండేది. తల్లిదండ్రులు గమనించినా ,గమనించనట్లు ఉండిపోయారు.  మళ్ళీ  ఆ  అమ్మాయి ముందు వెంకయ్య

తన సమస్యనంతా బాబాకు చెప్పుకుందామని ఆశ్రమానికి వెళ్ళాడు  .మనిషిలో వున్న బలహీనత ఏమిటంటే

తన బాధలను ఎవరో ఒకరితో చెప్పుకోవాలి.అవి తీరినా తీరకున్నా తాత్కాలిక ఉపశమనం.

ఒకరి బాధలు ఒకరికి చాలా తేలికగా అంత పట్టించు కోవలిసినవిగా అనిపించవు  .  మరికొందరి సమస్యలు

ఇంకొందరికి కథలు కథలుగా చెప్పుకొని ఆనందించటానికి ఉపయోగపడతాయి.మొత్తం మీద తనకొచ్చిన ఈ పెద్ద

సమస్యను బాబాకు నివేదించుకోవాలి.అందుకే వెంకయ్య ఆశ్రమానికి బయలుదేరాడు. వెంటనే   బాబా దర్శనం

కూడా అయింది.బాబాను చూసీ చూడగానే వెంకయ్యకి ఎక్కడలేని దుఃఖం ముంచుకొచ్చింది.తనను తాను

సంభాళించుకోవటం  కష్టమైంది.ఆయన పాదాల మీద సాష్ట్రాంగ పడ్డాడు.

“బాబా మీదయవల్లనే నేను బతికి బయట పడ్డాను. నాకు పుణ్యం ఉండబట్టే మీవంటి మహాత్ముని దీవెనలు

నాకు లభించాయి.” బాబా చిరునవ్వులు చిందిస్తూ అతన్ని మళ్ళీ దీవించాడు.”మీ అమ్మాయి చాలా

బుద్ధిమంతురాలు తెలివైనది. ఆ అమ్మాయిలో సేవాగుణం చాలా ఉంది” బాబా అన్నాడు వెంకయ్యవైపు చూస్తూ

”ఏమిటి! స్వామివారి కరుణ మా అమ్మాయి మీద సోకిందా!  నిజమేనా ఇదంతా! మీ దయగల దృష్టిలో మా

అమ్మడు పడటం నిజంగా అది చేసుకున్న పుణ్యం” వెంకయ్య సంతోషానికి మేరలేదు. ” ఆ అమ్మాయికి సెలవలే

కదా! మన ఆశ్రమ కార్యకలాపాలు చూస్తూ ఉండిపోవచ్చుకదా!” ”స్వామి వారి ఆదరణకు నాకు మాటలు కూడా

రావటం లేదు. నాకింతకంటే కావలసిందేమి లేదు. అమ్మాయిని తక్షణం తెచ్చి మీపాదల సన్నిధిలో ఉంచుతాను.

అసలు నేను అమ్మాయి విషయం మాట్లాడుదామనే వచ్చాను. కాని నా మనసులో ఏముందో తమరే గ్రహించి

ఇట్లా సెలవిచ్చారు. రేపే అమాయిని మీవద్దకు పంపుతాను” పొంగిపోతున్నాడు వెంకయ్య. 

”అమ్మాయి పెండ్లికేమైనా పేచీలు పెట్టిందా?” బాబా తెలిసిన విషయాన్ని తెలియనట్లు ప్రశ్నిస్తూ

తెలుసుకుంటున్నాడు.

”ఔను స్వామి! తమరెట్లా కనిపెట్టారు. అది ఒక సమస్య తెచ్చిపెట్టింది. వేరే కులం అబ్బాయిని ప్రేమించింది.

పెండ్లికి మేము ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అంతే ఇక పెండ్లి చేసుకోనని భీష్మించుకుంది. ఇంట్లో ఈ విషయమై

గొడవలు చెలరేగాయి.”

”ప్రస్తుతానికి ఆశ్రమంలో వదిలివేయండి. ఆపై మనసు మారవచ్చు. అపుడే పెండ్లి ప్రయత్నాలు చేయవచ్చు.

ఇక్కడ ఉన్నంతకాలం మీరు నిశ్చింతగా ఉండండి” బాబా భరోసా ఇచ్చాడు.

ఆ మర్నాడు ఆశ్రమానికి వెళ్ళి ఉండటానికి సిద్ధం కమ్మని వీరయ్య కూతురిని ఆదేశించాడు. ఆ అమ్మాయి ఏ

విధమైన ప్రశ్నలు వేయకుండా పెట్టె బేడా సర్దుకోవడం మొదలు పెట్టింది. సీతమ్మకు ఈ వ్యవహారం బొత్తిగా

నచ్చలేదు. పిల్లనిచూస్తే చాలా  రోజుల నుండి తిండి సరిగా తినటం లేదు. ఎవ్వరితోను గల గలా మాట్లాడటం

లేదు. చాల మౌనంగా ఉంటున్నది. ఆ వయస్సులో ఉండవలసిన చలాకీతనానికి బదులు గంభీ రంగా ఉండటం

సీతమ్మ తల్లిమనసుకి కొంచెం బాధ కలిగింది. అందుకే వెంకయ్య తీసుకొన్న నిర్ణయానికి ఆమె అభ్యంతరం

లేవదీసింది.

”ఏమిటి అమ్మాయిని ఆశ్రమానికి పంపుతున్నారా?” భర్తని అడిగింది.

”ఔను! బాబా గారి దృష్టి అమ్మాయి మీద పడింది. ఆయన చల్లని చూపులు పడటం ఎంత అదృష్టమో తెలుసా!”

”ఏమిటి అదృష్టం దీన్ని మీరు సన్యాసిగా తయారు చేయదలచుకున్నానని చెప్పండి. అంత క్రితం ఇట్లాగే

ఎవరయినా ఆశ్రమంలో ఆడపిల్లల్ని, పెండ్లికాని పిల్లల్ని అప్పచెప్పారా, మీరు తప్ప పైగా అక్కడ ఉండవలసిన

అవసరం దీనికేమొచ్చింది. లక్షణంగా వయసులో ఉన్న పిల్లకు పెండ్లి చేసి పంపాలా? లేకుంటే ఇట్లా ఆశ్రమాలకు,

పీఠాలకు అప్పచెబుతారా? ఇదేమైనా న్యాయంగా ఉందా? దీనికంటే ఆ కుర్రాడి దగ్గరకు పంపితే మేలు.”

నిష్టూరంగా అంది సీతమ్మ.

”ఏమిటే నోటికొచ్చినట్లు వాగుతున్నావ్‌? పిచ్చివాగుడు కట్టిపెట్టి లోపలకి తగలడు. నా మాటకు ఎదురు చెప్పే

ధైర్యం వచ్చిందా! నీకు పెండ్లి పెటాకులు లేకుండా ఇంట్లో కూర్చుని అది ఏడ్చి ఏడ్చి ఏ అఘాయిత్యం చేయకుండా

అక్కడ బాబా గారి సన్నిధిలో నాలుగు మంచి మాటలు వింటూ, పిల్లా జెల్లాతో కాలం గడుపుతూ, పూజలు,

భజనలు ఆ గొడవలో పడి అన్నీ మరచిపోతుంది.”

”మీరు చెప్పింది బాగానే ఉంది. కాని ఇక ఎప్పటికీ పెండ్లి చేసుకోకుండా అక్కడే ఉండి పోతానంటే” సీతమ్మ అంది.

”ఏం అంటే ఏమయిందేం? కులం తక్కువ వాడిని చేసుకొని తరతరాలకు చెడ్డ పేరు తెచ్చేకంటే పెళ్ళి సంసారం

త్యజించి సన్యాసి అయిందనే గొప్ప పేరు వస్తుంది.”

ఈ చివరి మాటలు విన్న సుకన్యకు తండ్రి అభిప్రాయం అవగతం అయింది. తను కులం కాని వాడ్ని పెండ్లి

చేసుకోకూడదు. కాని ఆశ్రమంలో ఎట్లాగయినా ఉన్నా ఫర్వాలేదు. నవ్వు వచ్చింది వీళ్ళ అమాయకత్వానికి.

మనలో చాలామంది పెద్దమనుషులుగా చలామణి అయ్యేవారంతా అంతే! తాము రెండో కంటెకి తెలియకుండ

తప్పులు చేయవచ్చు. తమ ఊళ్ళో కాకుండా తప్పులు చేయవచ్చు. నలుగురు చూచేటపుడు ఒక విధమైన

ప్రవర్తన. ఒంటరిగా ఉన్నపుడు మరొక విధమైనప్రవర్తనతో మెలుగుతుంటారు. వారికి ఆత్మసాక్షి కంటే అందరు

తమ గురించి ఏమనుకుంటారో దానికే ప్రాముఖ్యంఎక్కువ. ఆత్మను నిద్ర పుచ్చటానికి మళ్ళీ రకరకాల వ్యసనాల

బారిన పడుతుంటారు. వీళ్ళంతా భగవంతునిగాఢంగా నమ్మేవాళ్ళే! ఏ పని మొదలుపెట్టినా ఏం చేసినా

భగవన్నామస్మరణ లేకుండా చేయరు. వీళ్ళేసమాజంలో పెద్దమనుషులు, దైవభక్తి కలవారు.

సుకన్య తండ్రి అట్లాటివాడే! తన బంధువర్గం ఊరి వాళ్ళు తనను గురించి గొప్పగా చెప్పుకోవాలి. తన

వంశసంప్రదాయం చాలా గొప్పదని అంతా అనుకోవాలి. అందుకు తన కూతురి జీవితాన్ని అయినా సరే పణంగా

పెట్టాలనుకున్నాడు. సుకన్య తనకున్న స్వతంత్రభావాలకు అసలు తల్లిదండ్రులతోనయినా సరే చెప్పకుండా

చందూని పెండ్లాడవచ్చు. కాని ఆ అమ్మాయి ఈ కులాల మతాల అడ్డుగోడలు మనిషి కల్పించుకొన్నవే కాబట్టి

వాటిని ఆమోదించాల్సిన అవసరం లేదని గట్టిగా నమ్మటం చేత తల్లిదండ్రులు చేత కూడా తాను చేసేది

తప్పుకాదని ఒప్పించాలనే ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే తన పెండ్లికి వాళ్ళ ఆమోదముద్రను ఆశించింది.

అయితే అది అసాధ్యం అని, తన తల్లిదండ్రులు  కూడా గుడ్డిగా సంప్రదాయాన్ని అనుసరించే వారేనని

అర్ధమయింది. వాళ్ళు తమంత తాముగా మనసు మార్చుకొని తన పెండ్లికి అనుమతి ఇచ్చేవరకు తాను వేచి

చూస్తుంది.

వెంకయ్య మర్నాడు ఉదయమే మంచి రోజని కుమార్తెను ఆశ్రమంలో వదిలి పెడతానని సీతమ్మతో మరోసారి

చెప్పాడు.
**                                 **                                 **                                       **                                  **
ఉదయభానుని లేతకిరణాలు ఆకాశంలో అన్ని వైపుల చేతులు చాచినట్టు పరచుకొన్నాయి. ఆవరించిన

చీకటినంతా ఆ కిరణాలు ఒక్కసారిగా ఊడ్చి పారవేసాయి. అప్పటి వరకు తమ ఉనికిని తెల్పకుండా చేసినందుకు

చీకటికి వీడ్కోలు చెబుతూ వెలుతురును ఆహ్వానిస్తూ పకక్షులు కిలకిలారావాలతో ఆహ్వాన గీతికలను

ఆలపిస్తున్నాయి. దేవాలయం నుండి వినిపించే వేంకటేశ్వర సుప్రభాతాన్ని గాలి మోసుకువచ్చింది ధ్వజ స్తంభం

దాక.

(ఇంకా వుంది)

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

సుకన్య, Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో