తేనె లొలుకు పలుకులు….

(అమ్మ మాటలు సూక్తులే)

 

ముద్ధబంతంటి ముగ్దవే

ముచ్చటైన నెలవంకవే

మొండితనం ఎక్కువే

ఎదురు తిరగడం మక్కువే

 

జలతారు వోణీల రాణివే

అందాల మరుమల్లెవే

అమ్మ మాటలు సూక్తులే

అయినా చెవొగ్గి వినవలె

 

అహంకారాలు పెంచి

మంచి చెడులు మరిచి

మనుగడ సాగించరాదు

 

వాదించడం, వేధించడం

నిలకడ లేని వాలకం

ముక్కు మీదే కోపం

కాకూడదు కన్నె అభిమతం

 

ఇలాగైతే ఎలా వేగడం

నీ మంచికే చెప్పడం

విద్యల్లో భాసిల్లు

శాంతి  సహనాల విలసిల్లు

 

భూదేవంతటి ఓర్పువై

మెచ్చిన కోడలివై                    

భర్తకి అనురాగవల్లివై

జీవనం సాగించాలే తల్లీ

 

మగవాడితో సమానత్వం

అంటూ  పోరాట మెందుకో?

స్త్రీ  సృష్టికి మూలం కాదా?

నీ అస్థిత్వము సుస్థిరం కాదా?

నీ ప్రేమా వాత్సల్యాలేగా

జగతికి జీవ నాడులు…

 

 

అబధ్రతా భావం వదులుకో

పదిలంగా నిబ్బరాన్ని పెంచుకో

నీ లోని శక్తిని గుర్తించుకో

ఎల్లలు లేని విహంగంలా ఎగిసిపో!

 

                                           – కోసూరి ఉమాభారతి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 

కవితలు, , , , , , , , , Permalink

One Response to తేనె లొలుకు పలుకులు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో