సమకాలీనం-జోగినుల పిల్లలకు తల్లిపేరు చాలు- ప్రభుత్వ జీవో 139

జోగిని పిల్లలకు తల్లి పేరు చాలట. సర్టిఫికేట్లలో తండ్రిపేరు అవసరంలేదట. రెండేళ్ళ క్రితం వచ్చిన ఈ వార్త తండ్రి పేరు లేనందువల్ల పరీక్షలురాయడానికీ, పాఠశాలలో లేదా కాలేజీలో చేరడానికి అర్హత కోల్పోయిన ఎందరో జోగినుల పిల్లలకు ఊరట కలిగిస్తుంది. అనాదిగా జోగినుల కుటుంబాలకు చెందిన పిల్లలు విద్యకు దూరమౌతూనే ఉన్నారు.

అధికారిక అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పదిహేడువేల మంది జోగినులు ఉన్నారు. అత్యధికంగా కరీంనగర్లో పదివేల మంది ఉన్నట్లు అంచనా!  ఆచారం పేరుతోనో, ఊరికి, దేవునికి సేవ పేరుతోనో ఆరంభమయ్యే ఈ వివక్షపూరిత జీవితాలు ఎక్కడ అంతమౌతాయి?
ఆచారం ముసుగులో జరిగే వ్యభిచారంతోనే కథ ఆగిపోతుందా? ఆడపిల్ల పుడితే జోగినిగా, మగపిల్లాడు పుడితే కూలీగా మారాల్సిందేనా? తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి వెనుకాడే జోగినులు చెప్పే కారణాలు కన్నీళ్ళు రప్పించకమానవు.
మేము సమాజంలో అత్యంత హీనులం. మనుషులమైనా, ఆ విధంగా బ్రతికే అర్హత లేనివాళ్ళం. ఆర్థికంగా స్తోమత లేనివాళ్ళం. కుటుంబ వ్యవస్థకు అనర్హులం. మా పిల్లలను పాఠశాలకు పంపాలంటే, పుస్తకాలు, పెన్నులు, యూనిఫారాలు మొదలైనవి సమకూర్చాలన్నా ఇబ్బందే! పాఠశాలలో చేర్చాలంటే, దరఖాస్తులో తండ్రి పేరు తప్పనిసరి. జోగిని పిల్లలుగా పాఠశాలలోని పిల్లలు, గ్రామస్థుల నుండి అవహేళనకు గురౌతారని భయం కూడా ఎక్కువ. మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నో చోట్ల జోగినుల పిల్లలను వేరుగా కూర్చోబెట్టడమో, వెనుక వరుసల్లో కూర్చోబెట్టడమో, వారి విద్యాభివృద్ధి పట్ల పూర్తి అనాసక్తత చూపించడమో జరుగుతుంది.
తమ పిల్లలను పాఠశాలకు పంపాలని, వారి జీవితాలు తమ జీవితాల్లా కాకూడదని యోచించే జోగినుల సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. సమాజ వివక్షకు ఎదురొడ్డి, తమ పిల్లల భవిష్యత్తును నిర్మించాలన్న ఆలోచన పురుడుపోసుకున్నా, ఎన్నో అడ్డంకులు వారిని ఎదిరిస్తూనే ఉన్నాయి. 2009లో పదో తరగతి పరీక్షలు రాసిన ఐదువందల మంది జోగినుల పిల్లలకు తల్లి పేరు మాత్రమే ఉండేట్టు సర్టిఫికేట్లు ఇమ్మంటే ఇవ్వలేదు. ఫలితంగా ఆ విద్యార్థులందరూ పై చదువులకు వెళ్ళలేకపోయారు.
తండ్రి పేరు బజారులో దొరికే వస్తువు కాదుగా కొనుక్కోవడానికి! జోగిని అంటే ఊరికి దాసి. ఊర్లోని ఏ వ్యక్తి అయినా ఉపయోగించుకోవచ్చు. “నా బిడ్డకు నీవే తండ్రివని ఒప్పుకో” అని నిజమైన తండ్రిని అడిగినా, జోగినిని ఉపయోగించుకోవడానికి అడ్డు రాని కట్టుబాట్లు, సమస్యలు అన్నీ ఏకరువు పెడ్తాడు ఆ సదరు వ్యక్తి లేదా “నా బిడ్డేనని సాక్ష్యం ఏమిటని” ఎగతాళి చేస్తాడు. బాధ్యత లేని, కమిట్మెంట్ లేని సంబంధం మరి అది! మరి దరఖాస్తులో, సర్టిఫికెట్లలో ఎవరి పేరు రాయించగలదు ఆ జోగిని తల్లి?
జోగిని వ్యవస్థను 1988లోనే ప్రభుత్వం నిషేధించింది. జోగిని వ్యవస్థ నిషేధ చట్టం ఎంత విఫలమైందో ఆంధ్రప్రదేశ్లో ఇంకా పదిహేడు వేల మంది జోగినులు ఉండడాన్ని చూస్తే తెలుస్తుంది. నిషేధించిన ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఆ వ్యవస్థ కోసం, జోగినుల పిల్లల విద్యకోసం ఒక జీవో విడుదల కావడం….ఆలోచిస్తే ఒక ప్రక్క జోగినుల పిల్లలు విద్యాభివృద్ధికి మార్గం సుగమం అవుతుందనిపించినా….నిషేధం, పునరావాసం, సంస్కరణ, జన జీవన స్రవంతిలో  జోగినులను భాగస్తులను చేయడంలో ప్రభుత్వం విఫలమై, చేతులెత్తేసిందని తేటతెల్లమౌతుంది. ఇది సిగ్గుచేటే కదా!
జోగిని కుటుంబాలకు చేయూతనిస్తూ, వారి సమస్యల గూర్చి పోరాడుతూ, ప్రభుత్వానికి వారి వెతలను చేరవేస్తున్న స్వచ్చంధ సంస్థలను వేనోళ్ళ పొగడొచ్చు. జోగినీ వ్యవస్థ ఇంకా రహస్యంగా అమలుపర్చబడుతున్న మహబూబ్ నగర్, నిజామాబాద్, శ్రీకాకుళం, కర్నూలు, అనంతపురం, రంగారెడ్డి జిల్లాల్లో ఈ స్వచ్చంధ సంస్థలు చేస్తున్న కృషి హర్షనీయం. ఐదు వందల సంవత్సరాల నుండి ఆచరిస్తూ వస్తున్న కిరాతకమైన పోలేపల్లి జాతర పద్ధతిని మార్చిన ఘనత వారికే దక్కుతుంది.
పోలేపల్లి జాతరలో ఒక క్రేనుకు వేళాడదీసిన ఉయ్యాలలో కూర్చున్న జోగిని, క్రిందున్న గ్రామస్థుల పై పూలు, పసుపు చల్లుతుంది. ఇందులో కిరాతకమేముంది? అనుకుంటే పొరపాటే! ఎత్తున ఉన్న ఆ ఉయ్యాల ఎంత వేగంగా తురుగుతూ ఉంటుందంటే, అందులో కూర్చున్న జోగిని ప్రక్కటెముకలు విరిగిపోతాయి. ఆ ఆచార నిర్వహణలో ఆమె మరణించవచ్చు కూడా! స్వచ్చంధ సంస్థల పుణ్యమా అని, ఇప్పుడు ఆ ఉయ్యాలలో జోగిని చిత్రపటం పెట్టి జాతర జరిపిస్తున్నారు.
జోగినుల పిల్లల విద్య గూర్చి ఈ సంస్థలు చేస్తున్న పోరాటంపై ప్రభుత్వం ఎట్టకేలకు 2009లో స్పందించింది. జోగిని కుటుంబాలకు చెందిన పిల్లలకు సర్టిఫికెట్లలో తల్లి పేరు పెట్టుకోవచ్చని పేర్కొంటూ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో విడుదలై రెండేళ్ళు గడిచాయి.ఎస్సెస్సీ సర్టిఫికెట్లలో, పాఠశాలల్లో, కళాశాలల్లో చేరేటపుడు దరఖాస్తుల్లో తల్లి పేరును పెట్టుకునేందుకు ఈ జీఓ ద్వారా అవకాశం కల్పించింది. ఇది రాష్ట్రంలో జోగినులకు చెందిన దాదాపు పదివేల మంది పిల్లలకు ఊరటేనని ఆంధ్రప్రదేశ్ జోగినీ వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘటన ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేసారు.
ఈ స్వచ్చంధ సంస్థ జోగినుల పిల్లలకు కులం, ఆదాయం, నివాసం తదితర సర్టిఫికెట్లను కూడా తల్లి పేరుతో ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టలని, రేషన్ కార్డుల జారీకి దీనిని వర్తింపచేయాలని కోరుతోంది. వీటి అమలుకు, వీరి పోరాటానికి ఇంకెన్నాళ్ళకు ప్రభుత్వం స్పందిస్తుందో వేచి చూడాలి. ఇప్పటికైతే సర్టిఫికేట్లు విషయంలో వచ్చిన వెసులుబాటు వల్ల పిల్లలు విద్యా పరంగా ముందుకు అడుగులు వేయగలరు. కానీ సామాజిక చట్రంలో రావాల్సిన మార్పులు చాలానే ఉన్నాయి. వరకట్న నిషేధం, గృహహింస నిషేధ చట్టాల్లానే జోగినీ నిషేధ చట్టం కూడా సమాజంలో నిజ రూపం దాల్చలేకపోవడానికి కారణం ఏమిటి???
మరి వారి జీవితాలను మార్చడానికి పునరావాస కార్యక్రమాలు ఎప్పటికి అమలు అవుతాయో, జన జీవన స్రవంతిలో, వివక్ష రహిత సమాజంలో ఊపిరి పీల్చుకోవడానికి ఎన్నేళ్ళు పడుతుందో, జోగినులకు సామాన్య వనితల్లా పెళ్ళిళ్ళు ఎప్పుడు జరుగుతాయో, జోగినుల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి గౌరవప్రదమైన జీవితాలను ఎప్పటికి జీవించగలరో, సమూలంగా జోగినీ వ్యవస్థ ఎప్పటికి రూపుమాపబడుతుందో! అన్నీ ప్రశ్నలే!!

– విజయభాను కోటే

Uncategorized, , , , , , , , , , , , , , , , , , , , , , , Permalink

2 Responses to సమకాలీనం-జోగినుల పిల్లలకు తల్లిపేరు చాలు- ప్రభుత్వ జీవో 139

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో